Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం: అమెరికా

Published Tue, Apr 16 2024 7:15 AM

US Says India Is Worlds Largest Democracy Important Strategic Partner - Sakshi

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని కలిగిన ఉన్న దేశం భారత్‌ అని అగ్రరాజ్యం అమెరికా పేర్కొంది. భారత్‌ ఎల్లప్పుడు తమకు ప్రాముఖ్యతతో కూడిన వ్యూహాత్మక భాగస్వామి అని తెలిపింది. భారత్‌-అమెరికా సంబంధాలపై యూఎస్‌ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ సోమవారం మీడియాతో మాట్లాడారు. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల వేళ అమెరికా పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజాగా మిల్లర్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రాధాన్యత సంతరించుకుంది.

భారత్‌లో ప్రజాస్వామ్యం వెనకబాటు తనం, ప్రతిపక్షాలపై అణిచివేత దోరణీకి సంబంధించి అమెరికా కీలక వ్యాఖ్యలను ప్రస్తావిస్త్ను మీడియా అడిగిన ప్రశ్నకు మిల్లర్‌ సమాధానం చెప్పారు. ‘భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అమెరికాకు భారత్‌ చాలా ప్రాముఖ్యతతో కూడిన వ్యూహాత్మకమైన భాగస్వామి.  ఇరు దేశాల బంధం సత్యమని నేను ఆశిస్తున్నా’అని మిల్లర్‌ పేర్కొన్నారు. ఇటీవల కూడా భారత సంబంధాలపై మిల్లర్‌ స్పందిస్తూ.. భారత్‌ తమకు(అమెరికా) చాలా ముఖ్యమైన భాగస్వామని పేర్కొన్న విషయం తెలిసిందే. అదేవిధంగా భారత్‌, అమెరికాల సంబంధాలు ఎప్పడూ వృద్ధి చెందాలని కోరుకుంటున్నామని తెలిపింది. 

ఇటీవల సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈడీ అరెస్ట్‌, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు నిష్పక్షపాతంగా ఓటు వేయడానికి భారత్‌లో సరైన పరిస్థితులు ఉంటాయని ఆశిస్తున్నామని అమెరికా వ్యాఖానించిన విషయం తెలిసిందే. అమెరికా చేసిన వ్యాఖ్యలను భారత్‌ ఖండించిన సంగతి విదితమే.

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250