Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Dubai Floods: భారీ వర్షాల ఎఫెక్ట్‌.. 28 విమానాల రద్దు

Published Wed, Apr 17 2024 5:27 PM

Dubai Floods: 28 Indian flights cancelled after heavy rains - Sakshi

పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన దుబాయ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన కుండపోత వర్షాలతో నగరం అల్లకల్లోలంగా మారింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి.  నివాస స్థలాలు, రోడ్లు, రైల్వే స్టేషన్‌లు, విమానాశ్రయాలు.. ఇలా ప్రతి చోట వరద బీభత్సం సృష్టించింది. ఆ దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభవృష్టి అని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

వరద నీరు భారీగా చేరడంతో రోడ్లపై కార్లు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. కార్లు సగం నీటితో మునిగిపోయిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్‌  ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో వరద చేరి విమానాలరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై మోకాలిలోతు నీరు ఉండటంతో ఇక్కడికి వచ్చే విమానాలనుని దారిమళ్లిస్తున్నారు.

వర్షాల కారణంగా దుబాయ్‌ నుంచి వచ్చేవి, వేళ్లే విమానాలు మిఒత్తం 500కి పైగా రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లీంచారు. అత్యవసరమైతే తప్ప విమానాశ్రయానికి రావద్దని ప్రయాణికులను అధికారులు హెచ్చరించారు కఠిన సవాళ్లను ఎదుర్కొంటూ వీలైనంత త్వరగా ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను పునరుద్ధరించడానికి తాము ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్‌ విమానాశ్రయ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. 

భారత్‌-దుబాయ్‌ మధ్య 28 విమానాలు రద్దయ్యాయి. ఈ మేరకు భార పౌర విమానాయనశాఖ తెలిపింది.వీటిలో భారత్‌ నుంచి దుబాయ్‌ వెళ్లేవి 15 కాగా, అక్కడి నుంచి వచ్చే 13 విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని వెల్లడించారు.  దీనిపై ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.  

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250