breaking news
-
యూఏఈలో అనూహ్య వర్షాలు
దుబాయ్: మాడ పగిలిపోయే ఎండ వేడికి, ఎడారులకు నిలయమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను భారీ వర్షాలు పలకరించాయి. బుధవారం కుండపోత వర్షాలతో యూఏఈ తడిసి ముద్దయింది. భారీ వర్షాలను తట్టుకునే ఏర్పాట్లేవీ పెద్దగా లేకపోవడంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే మొత్తం నీట మునిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్‌పోర్ట్‌గా ఖ్యాతికెక్కిన దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ పార్కింగ్ ప్రాంతంలోని కార్లు మునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకటిన్నర సంవత్సరంలో పడాల్సిన వర్షపాతం బుధవారం ఒక్కరోజే నమోదైందని సిటీ వాతావరణ శాఖ వెల్లడించిన గణాంకాల్లో తేలింది. 14.2 సెంటీమీటర్లమేర వర్షపాత నమోదైందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా స్కూళ్లు మూసేశారు. సమీప బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాల్లోనూ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా జరిగిన ఆస్తినష్టాల వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. వర్షాల కారణంగా భారత్ నుంచి దుబాయ్‌కు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మేఘమథనం వల్లే ఈ వర్షాలు కురిశాయని నిపుణుల అంచనా. -
Dubai Floods: భారీ వర్షాల ఎఫెక్ట్.. 28 విమానాల రద్దు
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన దుబాయ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన కుండపోత వర్షాలతో నగరం అల్లకల్లోలంగా మారింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. నివాస స్థలాలు, రోడ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు.. ఇలా ప్రతి చోట వరద బీభత్సం సృష్టించింది. ఆ దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభవృష్టి అని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. వరద నీరు భారీగా చేరడంతో రోడ్లపై కార్లు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. కార్లు సగం నీటితో మునిగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో వరద చేరి విమానాలరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై మోకాలిలోతు నీరు ఉండటంతో ఇక్కడికి వచ్చే విమానాలనుని దారిమళ్లిస్తున్నారు. వర్షాల కారణంగా దుబాయ్ నుంచి వచ్చేవి, వేళ్లే విమానాలు మిఒత్తం 500కి పైగా రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లీంచారు. అత్యవసరమైతే తప్ప విమానాశ్రయానికి రావద్దని ప్రయాణికులను అధికారులు హెచ్చరించారు కఠిన సవాళ్లను ఎదుర్కొంటూ వీలైనంత త్వరగా ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను పునరుద్ధరించడానికి తాము ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్ విమానాశ్రయ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. భారత్-దుబాయ్ మధ్య 28 విమానాలు రద్దయ్యాయి. ఈ మేరకు భార పౌర విమానాయనశాఖ తెలిపింది.వీటిలో భారత్ నుంచి దుబాయ్ వెళ్లేవి 15 కాగా, అక్కడి నుంచి వచ్చే 13 విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని వెల్లడించారు. దీనిపై ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఢిల్లీని వణికిస్తున్న చలిగాలులు
ఢిల్లీ: దేశ రాజధానిని చలి, పొగమంచు వణికిస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పడిపోయాయి. చలిగాలులు వీస్తుండటంతో గురువారం ఢిల్లీ, పరిసర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. ఈ రోజు ఉదయం 5.30 గంటలకు పంజాబ్, హర్యానా, పశ్చిమ రాజస్థాన్, బిహార్‌లోని పలు ప్రాంతాల్లో చాలా దట్టమైన పొగమంచు కనిపించింది. దేశ రాజధాని గత నెల రోజులుగా తీవ్రమైన చలిగాలులతో అల్లాడిపోతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో దృశ్యమానత(విజిబిలిటీ) 50 మీటర్లకు పడిపోయింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, అస్సాంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు పొగమంచు కనిపించిందని ఐఎండీ తెలిపింది. ఇదీ చదవండి: ఆ రోజు కోర్టులకు సెలవు ఇవ్వండి.. సీజేఐకి లేఖ -
Vishaka: విమానాలు రద్దు.. ప్రయాణికుల ఆందోళన
సాక్షి, విశాఖపట్నం: ప్రతికూల వాతావరణం కారణంగా విశాఖ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విశాఖకు వచ్చేవి, విశాఖ నుంచి వెళ్లే సర్వీసులు రద్దు కావడంతో పండగపూట గమ్యస్థానానికి చేరుకోలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో, ఢిల్లీ ఎయిర్ఇండియా, విజయవాడ ముంబయి,హైదరాబాద్, చెన్నై,ఇండిగో, ఎయిర్ఇండియా,విమానాలు రద్దయ్యాయి. ఒక్కసారిగా వాతావరణం మారి పొగ మంచు ఏర్పడటం వల్లే విమానాలు రద్దు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పండగ రోజు తమను గమ్యస్థానాలకు వెళ్లకుండా చేశారని ప్రయాణికులు ఇండిగో, ఎయిర్ఇండియా విమాన సంస్థల అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఇదీచదవండి.. చెన్నై వెళ్లే విమానాల దారి మళ్లింపు -
London: లూటన్ ఎయిర్‌పోర్టులో భారీ అగ్ని ప్రమాదం
లండన్: లండన్‌లోని ఎయిర్‌పోర్టులో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లండన్‌లోని లూటన్ విమానాశ్రయంలో ఉన్న కారు పార్కింగ్ ఏరియాలో మంటలు పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తించాయి. దీంతో, అప్రమత్తమైన అధికారులు.. విమానాశ్రయంలో రాకపోకలను నిలివేశారు. ఈ మేరకు ప్రయాణికులకు సమాచారం అందించినట్టు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. లండన్‌లోని లూటన్ విమానాశ్రయంలో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్టులోని కారు పార్కింగ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి వేళ మంటల కారణంగా విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, దట్టమైన పొగను పీల్చుకున్న కొందరు ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. Flight operations suspended at London Luton Airport due to fire, passengers asked to stay away. All flights have been suspended until Wednesday afternoon. #khaleejtimes #fire #london #lutonairport https://t.co/XChyrDTHhZ pic.twitter.com/AqgDUlBdMv — Khaleej Times (@khaleejtimes) October 11, 2023 ఇక, అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పార్కింగ్ ఏరియాలో దాదాపు 1200 వాహనాలు నిలిచి ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ఈవీ కార్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పార్కింగ్ భవనం దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ప్రయాణికులు, సిబ్బంది భద్రత మేరకు నేటి (అక్టోబరు 11) నుంచి రేపు(అక్టోబర్ 12) మధ్యాహ్నం వరకు విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. కాగా, విమానాలను నిలిపివేయడంతో ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ❗️Massive fire breaks out at London’s Luton Airport, dozens of cars destroyed. pic.twitter.com/qtBrKOQjJT — Action And Laughs 🚀 (@Drawingart111) October 11, 2023 ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ వార్ వేళ పుతిన్ షాకింగ్ కామెంట్స్.. యూఎస్‌ను టార్గెట్ చేసి..
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019