Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..!

Published Fri, Apr 19 2024 12:37 PM

Fossil Of Largest Snake To Have Ever Existed Found In Gujarat - Sakshi

పాములకు సంబంధించిన వివిధ జాతులు, అతిపెద్ద పాములు గురించి విన్నాం. తాజాగా శాస్త్రవేత్తలు గుజరాత్‌లో అది పెద్ద పాము ఉనికికి సంబంధించిన శిలాజాన్ని గుర్తించారు. ఆ శిలాజంలో పాము వెన్నుపూస డైనోసర్‌ టీ రెక్స్‌(వెన్నుపూస) కంటే పొడవుగా ఉండే అతి పెద్ద పాము అవశేషాలని తెలిపారు. నిజానికి 2005ల ఐఐటీ రూర్కీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పాముని కనుగొనడం జరిగింది. అయితే ఇటీవలే దాన్ని ఒక పెద్ద పాముగా నిర్థారించారు. దీనికి "వాసుకి ఇండికస్‌" అని పేరు పెట్టారు. పరిశోధనలో ఈ పాములో దాదాపు 27 వెనుపూసలు ఉన్నట్లు గుర్తించారు.

అదిపెద్ద కొడచిలువ వలే కనిపించిందని, విషపూరితమైనది కాదని అన్నారు. ఈ పాము పొడవు సుమారు 50 అడుగులు ఉంటుందని అంచనా వేశారు. దీని బరువు సుమారు టన్ను ఉంటుందని చెబుతున్నారు. ఈ వాసుకి మెల్లగా కదిలే ఆకస్మిక ప్రెడేటర్‌గా అభివర్ణించారు. ఈ పాము చిత్తడి నేలలో నివిశించిందని ఐఐటీ రూర్కిలోని పాలియోంటాలిజీ పరిశోధకుడు దేబిజిత్‌ దత్తా అన్నారు. ఈ జాతుల మూలాలను అన్వేషించే క్రమంలో ఈ పాము శిలాజానికి శివుడితో సంబంధం ఉందని, అందువల్ల దీనికి వాసుకి అని పేరు పెట్టామని చెప్పారు.

ఈ భూమ్మీద ఇప్పటిదాకా అత్యంత పెద్ద పాముగా పేరుగాంచిన కొలంబోకి చెందిన టైటానోబావా పాముకి సరిసమానమైనదని అన్నారు. ఇక ఈ టైటానోబావా 43 అడుగుల పొడవుతో దాదాపు టన్నుకు పైగా బరువుతో ఉంది. ఇక్కడ ఈ వాసుకిమ పాము శరీర పొడవుని టైటానోబోవాతో పోల్చగా, టైటానోబోవా వెన్నుపూస వాసుకి కంటే కొంచెం పెద్దదిగా ఉంది. అంటే ఇక్కడ టైటానోబోవా కంటే వాసుకి సన్నగా ఉందా లేదా భారీగా ఉండేదా అనేద? చెప్పలేమని అన్నారు శాస్త్రవేత్తలు.

ప్రస్తుతం ఈ శిలాజం పొడిగ, ధూళిగా ఉన్న ప్రాంతంలో గుర్తించినప్పటికీ ఈ వాసుకి పాము సంచరించేటప్పుడు  ఆ  ప్రాంతంలోని భూమి చిత్తడిగా ఉందని శాస్త్రవేత్తలు అన్నారు. ఈ సరికొత్త ఆవిష్కరణ పాముల పరిమాణ పరంగా ఎలా ఉండేవి, కాలక్రమంలో ఎలా మారాయి? ప్రపంచవ్యాప్తంగా ఈ జాతులు ఎలా విస్తరించాయి అనే దానిపై పూర్తి అవగాహన అందిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా, ఇంతవరకు జీవించి ఉన్న అతిపెద్ద పాముగా ఆసియాలోని రెటిక్యులేటెడ్‌ అనే కొండ చిలువ(33 అడుగులు పొడవు)తో ఉంది. 

(చదవండి: రూ. 1500 చెల్లించి మరీ చెట్లను హగ్‌ చేసుకోవడమా?)

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250