breaking news
-
అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..!
పాములకు సంబంధించిన వివిధ జాతులు, అతిపెద్ద పాములు గురించి విన్నాం. తాజాగా శాస్త్రవేత్తలు గుజరాత్లో అది పెద్ద పాము ఉనికికి సంబంధించిన శిలాజాన్ని గుర్తించారు. ఆ శిలాజంలో పాము వెన్నుపూస డైనోసర్ టీ రెక్స్(వెన్నుపూస) కంటే పొడవుగా ఉండే అతి పెద్ద పాము అవశేషాలని తెలిపారు. నిజానికి 2005ల ఐఐటీ రూర్కీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పాముని కనుగొనడం జరిగింది. అయితే ఇటీవలే దాన్ని ఒక పెద్ద పాముగా నిర్థారించారు. దీనికి "వాసుకి ఇండికస్" అని పేరు పెట్టారు. పరిశోధనలో ఈ పాములో దాదాపు 27 వెనుపూసలు ఉన్నట్లు గుర్తించారు. అదిపెద్ద కొడచిలువ వలే కనిపించిందని, విషపూరితమైనది కాదని అన్నారు. ఈ పాము పొడవు సుమారు 50 అడుగులు ఉంటుందని అంచనా వేశారు. దీని బరువు సుమారు టన్ను ఉంటుందని చెబుతున్నారు. ఈ వాసుకి మెల్లగా కదిలే ఆకస్మిక ప్రెడేటర్‌గా అభివర్ణించారు. ఈ పాము చిత్తడి నేలలో నివిశించిందని ఐఐటీ రూర్కిలోని పాలియోంటాలిజీ పరిశోధకుడు దేబిజిత్ దత్తా అన్నారు. ఈ జాతుల మూలాలను అన్వేషించే క్రమంలో ఈ పాము శిలాజానికి శివుడితో సంబంధం ఉందని, అందువల్ల దీనికి వాసుకి అని పేరు పెట్టామని చెప్పారు. ఈ భూమ్మీద ఇప్పటిదాకా అత్యంత పెద్ద పాముగా పేరుగాంచిన కొలంబోకి చెందిన టైటానోబావా పాముకి సరిసమానమైనదని అన్నారు. ఇక ఈ టైటానోబావా 43 అడుగుల పొడవుతో దాదాపు టన్నుకు పైగా బరువుతో ఉంది. ఇక్కడ ఈ వాసుకిమ పాము శరీర పొడవుని టైటానోబోవాతో పోల్చగా, టైటానోబోవా వెన్నుపూస వాసుకి కంటే కొంచెం పెద్దదిగా ఉంది. అంటే ఇక్కడ టైటానోబోవా కంటే వాసుకి సన్నగా ఉందా లేదా భారీగా ఉండేదా అనేద? చెప్పలేమని అన్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ఈ శిలాజం పొడిగ, ధూళిగా ఉన్న ప్రాంతంలో గుర్తించినప్పటికీ ఈ వాసుకి పాము సంచరించేటప్పుడు ఆ ప్రాంతంలోని భూమి చిత్తడిగా ఉందని శాస్త్రవేత్తలు అన్నారు. ఈ సరికొత్త ఆవిష్కరణ పాముల పరిమాణ పరంగా ఎలా ఉండేవి, కాలక్రమంలో ఎలా మారాయి? ప్రపంచవ్యాప్తంగా ఈ జాతులు ఎలా విస్తరించాయి అనే దానిపై పూర్తి అవగాహన అందిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా, ఇంతవరకు జీవించి ఉన్న అతిపెద్ద పాముగా ఆసియాలోని రెటిక్యులేటెడ్ అనే కొండ చిలువ(33 అడుగులు పొడవు)తో ఉంది. (చదవండి: రూ. 1500 చెల్లించి మరీ చెట్లను హగ్ చేసుకోవడమా?) -
అయోధ్యకు అతిపెద్ద నగారా.. ప్రత్యేకతలివే!
ప్రపంచంలోనే అతిపెద్ద నగారాను మధ్యప్రదేశ్‌లోని రేవాలో తయారు చేశారు. దీనిని అయోధ్యలోని రామమందిరానికి తరలించనున్నారు. గత 40 ఏళ్లుగా ప్రతి ఏటా మహాశివరాత్రి రోజున రేవాలో ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. గత శివరాత్రినాడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎంబ్రాయిడరీ కళాకృతిని తయారు చేశారు. అలాగే 5,100 కిలోల మహాప్రసాదాన్ని తయారు చేశారు. ఈసారి ప్రపంచంలోనే అతిపెద్ద నగారాను తయారు చేశారు. జనవరి 22న అయోధ్యలో జరిగిన రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. అదిమొదలు ప్రపంచం నలుమూలల నుంచి అయోధ్యకు వివిధ కానుకలు అందుతున్నాయి. ఈ నేపధ్యంలోనే అయోధ్యకు కానుకగా పంపేందుకు రేవాలో ఆరు అడుగుల ఎత్తు , 11×11 వ్యాసం కలిగిన అతిపెద్ద నగారాను తయారు చేశారు. దీనిని మార్చి 12 నాటికి అయోధ్యకు తరలించనున్నారు. దీనిని మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా రేవా నగర వీధుల్లో ఊరేగించారు. ఈ నగారాను పరీక్షించేందుకు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ బృందం రేవాకు వచ్చింది. వారి పరిశీలన అనంతరం ఈ నగరాను రికార్డులలో నమోదు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద నగారా ఇదేనని ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ న్యాయనిర్ణేత డాక్టర్ ఏకే జైన్ తెలిపారు. -
విదేశాల్లో ‘మినీ ఇండియా’లు?
భారత్‌కు వెలుపల అత్యధిక భారతీయ జనాభా కలిగిన దేశాలు ఏవో మీకు తెలుసా? మారిషస్, యూకే, యూఏఈ, సింగపూర్‌తో సహా పలు దేశాల్లో భారతీయులు నివసిస్తున్నారు. కొన్ని దేశాల్లో ‘మినీ ఇండియా’లు కూడా ఉన్నాయి. ఇక్కడ భారతీయుల ఇళ్లను సులభంగా గుర్తించవచ్చు. అవి ఏఏ దేశాలో ఇప్పుడు తెలుసుకుందాం. మారిషస్ మారిషస్‌లో 70శాతం జనాభా భారతీయులని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఇది సాంస్కృతికరంగ స్వర్గధామం. ఇక్కడ భారతీయ ఆహార ఖజానా విరివిగా కనిపిస్తుంది. ఇది విదేశాల్లో స్థిరపడాలనుకున్న భారతీయుల ఉత్తమ ఎంపిక అని అంటారు. యూకే భారతదేశం- యునైటెడ్ కింగ్‌డమ్‌ల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. యూకేలో కనిపించే భారతీయ రెస్టారెంట్లు, దుకాణాలు దీనికి తార్కాణంగా నిలుస్తాయి. యూకేలో భారత సంస్కృతి కనిపిస్తుంది. యూకేలోని కొన్ని ప్రాంతాలు.. మనం భారత్‌లోనే ఉన్నామా అని అనిపించేలా ఉంటాయి. యూకేలోనూ భారతీయులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎమిరేట్స్‌లో ఎక్కడికి వెళ్లినా భారతీయులు తప్పనిసరిగా కనిపిస్తారు. ఇక్కడ ఉంటే ఇండియాలో ఉన్నట్టేనని చాలామంది అంటుంటారు. యూఏఈ మొత్తం జనాభాలో భారతీయులు 42 శాతం ఉన్నారు. సౌదీ అరేబియా సౌదీ అరేబియాలోని మొత్తం జనాభాలో 10 శాతం నుంచి 13 శాతం వరకూ భారతీయులు ఉన్నారు. ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్న దేశంగా సౌదీ అరేబియా గుర్తింపు పొందింది. కెనడా మెరుగైన ఉద్యోగావకాశాలు, ఉన్నత జీవన ప్రమాణాలు ఉచిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు తదితర అదనపు ప్రయోజనాలు భారతీయులను కెనడావైపు మళ్లేలా చేస్తున్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం కెనడాలో గణనీయ సంఖ్యలో భారతీయులున్నారు. ఒమన్ ఒమన్ మొత్తం జనాభాలో ప్రవాస భారతీయులు దాదాపు 20 శాతం ఉన్నారు. 2023 నాటికి ఒమన్‌లో దాదాపు తొమ్మది లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఒమన్‌లోని భారతీయులు అక్కడి సాంస్కృతిక వైభవానికి తోడ్పాటునందిస్తున్నారు. సింగపూర్ 2023లో సింగపూర్‌లో భారతీయుల జనాభా ఏడు లక్షలు. సింగపూర్ ప్రభుత్వం ‘లిటిల్ ఇండియా’ ప్రాంత అభివృద్ధికి చేయూతనందిస్తోంది. సింగపూర్ సాంస్కృతిక వైభవానికి అక్కడి భారతీయులు తోడ్పాటునందిస్తున్నారు. అమెరికా అమెరికాలో అత్యధిక సంఖ్యలో భారతీయులున్నారు. ప్రపంచంలో తమది రెండవ అతిపెద్ద భారతీయ ప్రవాసులు కలిగిన దేశమని యునైటెడ్ స్టేట్స్ పేర్కొంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు కెరీర్‌ను మెరుగుపరుచుకోవడంలో పాటు పలు వ్యాపారాలు చేపడుతున్నారు. -
అనకొండకి చెందిన మరో జాతి! వెలుగులోకి షాకింగ్ విషయాలు
అనకొండనే ప్రపంచంలో అతిపెద్ద పాము జాతి అని అనుకున్నాం. అదే జాతికి చెందిని మరో జాతి అనకొండను ఈ క్వెడార్‌లో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఎన్నో ఏళ్లుగా ఈ అనకొండకు సంబంధించి మరో జాతి గురించి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. శాస్త్రవేత్తల ఊహను నిజం చేస్తే మరో జాతి అనకొండ వాళ్ల కంటపడింది. ఇది 26 అడుగుల మరియు 200 కిలోల మేర బరువుంది. ఈ మేరకు శాస్త్రవేత్త విల్ స్మిత్‌ల బృందం రానున్న నాట్ జియాఓ సిరిస్ పోల్ టు పోల్ కోసం ఫోటో షూట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ క్కెడార్లోని అమెజాన్ నది అడుగు భాగంలో ఫోటోలు చిత్రిస్తుండగా ఈ అనకొండ కెమెరాకు చిక్కింది. ఆ సరికొత్త అనకొండను చూసి ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు ఇది ఇప్పటి వరకు చూసిన అనకొండ జాతులకు చెందిందా కాదా అనే దిశగా పరిశోధనలు చేశారు. దీన్ని చూసి ఇంతకుముందు కనిపెట్టిన ఆకుపచ్చ అనుకొండకు చెందిన మరోక జాతి ఏమో అనుకున్నారు. కానీ పరిశోధనలో వేర్వేరు జాతికి చెందినదని తేలింది. ఆక్కుపచ్చలో ఉండే అనకొండ జాతి ఎక్కువగా బ్రెటిజల్ , పెరూ, బొలీవియా, ఫ్రెంచ్ గయానాలలో నివశిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం గుర్తించిన ఈ కొత్తజాతి అనకొండ తొమ్మిది దక్షిణ అమెరికా దేశాలలో బోవా గ్రూప్ సేకరించిన మిగతా అనకొండాల రక్తం, కణజాల నమూనాలతో సరిపోలలేదన్నారు. ఇది అనకొండలో కొత్త జాతిని నిర్థారించారు. దీనికి జెయింట్ అనకొండగా నామకరణం చేశారు. ఈ అనకొండ మరింత ప్రమాదకరమైనదని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. The world's largest snake has been discovered in the Amazon Rainforest: The Northern Green Anaconda measures 26 feet long and weighs 440 lbs - and its head is the same size as a human's. pic.twitter.com/XlaDk0qVYt — Denn Dunham (@DennD68) February 21, 2024 (చదవండి: శునకాల మధ్య పెరిగి ఆమె ఓ శునకంలా..ఇప్పటికీ..! మరో టార్జాన్, మోగ్లీ లాంటి కథ!) -
ప్రపంచ నగరిగా అయోధ్య
సాక్షి, హైదరాబాద్: అయోధ్య.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు మారుమోగుతోంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపొందిన భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు ఆ ఆధ్యాత్మిక నగరి ముస్తాబైంది. సోమవారం జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పలు దేశాల్లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు కూడా. ప్రపంచవ్యాప్తంగా పేరున్న చారిత్రక కూడళ్లలో భారీ తెరలు ఏర్పాటు చేసి మరీ ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. ఈ ఘనత ఇక్కడికే పరిమితం కాకుండా.. అయోధ్యను ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. రూ.85 వేల కోట్లతో అభివృద్ధి పనులు కొత్త రామాలయ నిర్మాణ ప్రారంభానికి ముందు అయోధ్యకు నిత్యం సగటున 2వేల మంది భక్తులు వచ్చేవారు. పనులు ప్రారంభమయ్యాక ఆ సంఖ్య 50 వేలకు చేరింది. జనవరి ఒకటిన 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఆలయంలో దర్శనాలు మొదలయ్యాక నిత్యం లక్ష మంది వరకు వస్తారని.. క్రమంగా 3 లక్షల వరకు పెరగవచ్చని అంచనా. ఇప్పుడు ఇరుకుగా ఉన్న అయోధ్య అంత తాకిడిని తట్టుకోలేదని తేల్చిన ప్రభుత్వ యంత్రాంగం.. 2031 లక్ష్యంగా ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది. ఆర్కిటెక్ట్, అర్బన్ ప్లానర్ దీక్షు కుక్రేజా ఆధ్వర్యంలో దీనిపై విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేశారు. ప్రపంచస్థాయి నగరంగా అయోధ్యను రూపొందించటమే తమ లక్ష్యమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు కూడా. నగరాన్ని భారీగా విస్తరించి.. కొత్త మాస్టర్ ప్లాన్‌లో అయోధ్య పట్టణం, దానికి జంటగా ఉన్న ఫైజాబాద్‌తోపాటు సమీపంలోని దాదాపు 26 గ్రామాలను చేర్చి.. 875 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆధునిక అయోధ్యను తీర్చిదిద్దబోతున్నారు. ఇందులో భాగంగా 1,200 ఎకరాల్లో రూ.2,200 కోట్ల వ్యయంతో న్యూఅయోధ్య పేరుతో భారీ టౌన్షిప్ పనులను ఇప్పటికే మొదలుపెట్టారు. ఇది సరయూ నది కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. అందులో ఇటీవల హోటల్ కోసం ఓ ప్లాట్‌ను వేలం వేయగా చదరపు మీటరుకు రూ.1,09,000 చొప్పున ధర పలకడం గమనార్హం. ఇలాంటి మరికొన్ని టౌన్‌షిప్‌లకూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ► అయోధ్య పాత పట్టణంలో ఇప్పటికే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు పనులు ప్రారంభించారు. ప్రధాన రోడ్లను వెడల్పు చేస్తున్నారు. రామాలయానికి దారితీసే మూడు ప్రధాన మార్గాలను ఇప్పటికే విస్తరించారు. రూ.33 కోట్లతో ఓ మల్టీలెవల్ పార్కింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ► పట్టణంలో డీజిల్ ఆటోలకు బదులు 250 ఎలక్ట్రిక్ ఆటోలు తిప్పుతున్నారు. విమానాశ్రయం నుంచి పట్టణానికి, ఆలయం వద్దకు తిప్పేందుకు 250 ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేశారు. వాటి సంఖ్యను 500కు పెంచబోతున్నారు. ► అయోధ్య పట్టణం నుంచి వెలువడే మురికినీరు సరయూ నదిలోకి చేరుతోంది. దాన్ని పూర్తిగా నిరోధించి, మురికి నీటి శుద్ధికోసం ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీల)ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఒక ఎస్టీపీ అందుబాటులోకి రాగా.. మరో రెండింటి పనులు జరుగుతున్నాయి. సోలార్ సిటీగా అయోధ్య అయోధ్యలో సౌర విద్యుత్ వి్రస్తృత వినియోగం కోసం ఐదేళ్ల కాలపరిమితితో ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టారు. ఇళ్లు, వ్యాపార సముదాయాలు, పరిశ్రమల రూఫ్ టాప్‌పై సౌర ఫలకాలను అమరుస్తున్నారు. వీటితో 8.5 మెగావాట్ల విద్యుత్ సమకూరనుంది. ఇక సరయూ నది తీరంలో 40మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ఎనీ్టపీసీ ఏర్పాటు చేస్తోంది. ఇందులో 10 మెగావాట్ల ప్లాంటు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ► అయోధ్య శివార్లలో సరయూ తీరం వెంట 12.90 కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారిపై సోలార్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంత నిడివిలో సోలార్ లైట్లు ఉండటం రికార్డు అని, దీనికి గిన్నిస్‌బుక్‌లో చోటు దక్కనుందని యూపీ ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది. ► సౌర ఫలకాలతో కూడిన ‘సోలార్ ట్రీ’లను నగరవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. 1 కేవీ సామర్థ్యం ఉన్నవి 40.. 2.5 కేవీ సామర్థ్యం ఉన్నవి 18 సిద్ధమవుతున్నాయి. తాగునీటి కియోస్‌్కలు, మొబైల్‌ఫోన్ చార్జింగ్ పాయింట్లు ఈ విద్యుత్‌తోనే పనిచేయనున్నాయి. ► సరయూ నదిలో సౌర విద్యుత్‌తో పనిచేసే పవర్ బోట్లను అందుబాటులోకి తెస్తున్నారు. ప్లాస్టిక్ నుంచి ఇంధనం అయోధ్యలో ప్లాస్టిక్ వ్యర్ధాలను వాహనాల ఇంధనంగా మార్చే రీసైక్లింగ్ యూనిట్ త్వరలో అందుబాటులోకి రానుంది. అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్‌తో కుదిరిన ఒప్పందం మేరకు బెంగుళూరుకు చెందిన సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తోంది. ఇది ఏటా 7,300 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను ఇంధనంగా మార్చగలదు. ఉత్తర భారతంలో ఈ తరహా అతిపెద్ద ప్లాంటు ఇదే కానుంది. విస్తృతంగా వసతి సౌకర్యాలు అయోధ్యకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున హోటల్ పరిశ్రమ కూడా విస్తృతమవుతోంది. దేశవ్యాప్తంగా ఫైవ్‌స్టార్ హోటళ్లను నిర్వహిస్తున్న ఓ పెద్ద సంస్థ 120 గదులతో ఒకటి, 100 గదులతో మరోటి చొప్పున రెండు స్టార్ హోటళ్ల నిర్మాణ పనులు ప్రారంభించింది. చిన్న, మధ్యస్థాయి హోటళ్లు, భోజన వసతి ఇళ్లను నిర్వహించే మరో కంపెనీ.. వెయ్యి గదులతో కూడిన 50 హోటళ్లను, భోజన నివాసాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరికొన్ని సంస్థలు 1,100 గదులతో కూడిన హోటళ్లను నిర్మించనున్నాయి. దేశవ్యాప్తంగా ఆకాశహరŠామ్యలు నిర్మిస్తున్న బడా సంస్థ 51 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,500 కోట్లతో లగ్జరీ విల్లాలు, సాధారణ ఇళ్లు, హోటళ్లను నిర్మించేందుకు ఒప్పందాలు చేసుకుంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019