Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

 సీఐపై దాడికి టీడీపీ నేతల యత్నం

Published Wed, Apr 24 2024 5:42 AM

Attempt of TDP leaders to attack CI - Sakshi

ఆర్వో కార్యాలయంపై డ్రోన్‌ చిత్రాలు తీసి నిబంధనలు ఉల్లంఘన 

మందుకోసం కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు

గంగాధనెల్లూరు (చిత్తూరు జిల్లా): గంగాధరనెల్లూరు ఆర్వో కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తున్న సీఐ శంకర్‌పై శ్రీరంగరాజపురం టీడీపీ మండల అధ్యక్షుడు జయశంకర్‌నాయుడు, మరికొందరు నేతలు తీవ్రంగా దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించారు. గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్‌ నామినేషన్‌ దాఖలులో భాగంగా మంగళవారం ఆర్వో కార్యాలయంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు ప్రవేశించేందుకు ప్రయత్నం చేశారు.

ఆర్వో కార్యాలయం వద్ద ట్రాఫిక్‌ నియంత్రణ కోసం విధుల్లో ఉన్న సీఐ శంకర్‌ అలా వెళ్లకూడదని అడ్డుకునే యత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన  జయశంకర్‌నాయుడు ‘నన్నే అడ్డుకుంటావా.. వచ్చేది మా ప్రభుత్వం నీ అంతు చూస్తా నా..’ అంటూ సీఐపై బూతు పురాణంతో విరుచుకు పడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి దూషణకు దిగి సీఐ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలతో రోడ్డుపై బైఠాయించారు.  

తన్నుకున్న తమ్ముళ్లు.. 
ర్యాలీ కోసం 30 బస్సుల్లో జనాన్ని పోగుచేసి రూ.3 వందలు, మద్యం బాటిల్, బిర్యానీ ప్యాకెట్‌ పంపిణీ చేసినట్లు తెలిసింది. తీసుకొచ్చిన జనానికి మందుబాటిళ్ల పంపకాల్లో తేడా రావడంతో ఆర్వో కార్యాలయం ఎదుటే టీడీపీ కార్యకర్తలు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. కర్రలతో కొట్టుకున్నారు. అదేవిధంగా ఫొటోగ్రాఫర్లకు అనుమతి లేని రిటరి్నంగ్‌ కార్యాలయం ఆవరణంలో డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించి తెలుగు తమ్ముళ్లు పైశాచిక ఆనందాన్ని పొందారు. 

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250