Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

నిస్సహాయ స్థితిలో పెద్దదిక్కులా

Published Fri, Apr 19 2024 4:17 AM

Jagan Mohan Reddy is implementing the Navaratnalu Scheme in AP - Sakshi

సిఫార్సు లేకుండానే పింఛన్‌ మంజూరు 
ఆరు నెలల క్రితమే నా భర్త మృతి చెందారు. వలంటీర్‌ వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. ఎలాంటి సిఫార్సులు లేకుండానే పింఛన్‌ మంజూరైంది. ఎవరికీ రూపాయి లంచం ఇవ్వ­లేదు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్, పింఛన్‌ సొమ్ములతో బతుకుతున్నాను. మా లాంటి పేదోళ్లను ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోంది. – తిగిరిపల్లి దమయంతి, వీర్రాజు తల్లి, పెద్దేవం 

తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన తిగిరిపల్లి వీర్రాజు కుటుంబానిది అత్యంత దయనీయ గాథ.. వీర్రాజు, అతని భార్య ఇద్దరూ దివ్యాంగులే. ఇంతలో అతనికి పక్షవాతం రావడంతో కుటుంబం ఒక్కసారిగా ఉపాధి మార్గం కోల్పోయింది. ఆ తరుణంలో వారికి ఈ ప్రభుత్వం అందించిన నవరత్నాలు ఆదుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మోపెడ్‌పై ఆకుకూరలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడిని. దివ్యాంగుడినైన నాకు నాలుగేళ్ల క్రితం పక్షవాతం వచి్చంది. కుటుంబ పోషణ భారమైంది. నా భార్య బధిరురాలు.

ఇప్పుడు జగనన్న దయతో ఇద్దరికీ దివ్యాంగ పింఛన్‌ అందుతోంది. ఇంటి స్థలం కూడా మంజూరైంది’ అని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన తల్లికి రూ.3 వేలు వితంతు పింఛన్‌ ఇస్తున్నారు. ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించారు. కుమార్తె చదువుకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వచ్చాయి. అంతేగాకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో వారి పెద్దమ్మాయి దివ్యకు ఉద్యోగం లభించింది. దివ్య డిగ్రీ వరకు చదువుకుంది. ఆమెకు జీఎస్‌టీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా ఉద్యోగం ఇచ్చారు. నెలకు రూ.18 వేలు జీతం ఇస్తున్నారు. త్వరలో ఇంటి నిర్మాణం కూడా ప్రారంభిస్తాం అని వీర్రాజు ఆనందం చేస్తున్నారు.   –కొవ్వూరు
 

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250