breaking news
-
ఈసారి టైటిల్ సన్‌రైజర్స్‌దే!.. రిక్కీ పాంటింగ్ కామెంట్స్ వైరల్
ఐపీఎల్-2024లో చాంపియన్‌గా నిలవడానికి గల అర్హత ఇదేనంటూ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దూకుడైన బ్యాటింగ్‌తో ముందుకు సాగే జట్టే టైటిల్ సాధిస్తుందని అభిప్రాయపడ్డాడు. కాగా క్యాష్ రిచ్ తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు 31 మ్యాచ్‌లు జరుగగా.. తొమ్మిదికి పైగా మ్యాచ్‌లలో.. ఒక ఇన్నింగ్స్‌లో 200.. అంతకంటే పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. ఇక ఈ సీజన్లో కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ రోజుల వ్యవధిలోనే తమ రికార్డు తామే బద్దలు కొట్టింది. దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్ తొలుత ముంబై ఇండియన్స్‌పై 277 పరుగులు సాధించిన ఎస్ఆర్హెచ్.. ఆ తర్వాత ఆర్సీబీపై 287 పరుగులు స్కోరు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డులకెక్కింది. Captain Pat reflects on the game ➕ who clinched the dressing room awards? 👀🏅 Watch as we soak in the post match vibes from our strong win in #RCBvSRH 🧡 pic.twitter.com/Ey7VhksA6B — SunRisers Hyderabad (@SunRisers) April 16, 2024 తగ్గేదేలే అంటున్న కేకేఆర్ మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ సైతం ఢిల్లీ క్యాపిటల్స్‌పై 272 పరుగులతో సత్తా చాటింది. ఇక తాజాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, కేకేఆర్ వరుసగా 224, 223 పరుగులు స్కోరు చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇప్పటికే రెండుసార్లు భారీ స్కోరు చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ రికార్డులు సాధించింది. కేకేఆర్ కూడా మా జట్టు మీద 272 రన్స్ స్కోరు చేసింది. సన్‌రైజర్స్ సూపర్ ఫామ్ నాకు తెలిసి ఇంపాక్ట్ ప్లేయర్ కారణంగానే బ్యాటింగ్ జట్లకు ఈ మేరకు ప్రయోజనం చేకూరుతున్నట్లు అనిపిస్తోంది. ఆర్సీబీతో మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ ఎంతగా ప్రభావం చూపాడో చూశాం. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేగానీ ఆ మాదిరి షాట్లు ఆడలేరు. బ్యాటింగ్ ఆర్డర్లో డెప్త్ ఉన్న కారణంగా కూడా అతడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలిగాడు. ఐపీఎల్ వంటి మేజర్ టోర్నీల్లో లేదా బిగ్ బాష్ లీగ్‌లో.. ఇలా ఎక్కడ చూసినా సరే లక్ష్యాన్ని కాపాడుకోగలిగి జట్లే విజయం సాధించాయి. అయితే.. ఈసారి ఐపీఎల్ మాత్రం భిన్నంగా సాగుతోంది. ఆ జట్టుదే టైటిల్ బౌలర్లను చితక్కొడుతూ భారీ స్కోర్లు సాధించిన జట్లే టైటిల్ దిశగా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. డిఫెన్సివ్ బౌలింగ్‌పై ఆధారపడే జట్ల కంటే దూకుడుగా బ్యాటింగ్ చేసే జట్లకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి’’ అని రిక్కీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. అలా అయితే ఈసారి సన్‌రైజర్స్‌దే టైటిల్! ఇక పాంటింగ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే సీజన్ ఆరంభం(కేకేఆర్‌తో మ్యాచ్‌లో 204) నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న సన్‌రైజర్స్‌కే టైటిల్ విన్నర్‌గా నిలిచే ఛాన్స్ ఉందని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. పాంటింగ్ మార్గదర్శనంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం రెండే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక పంత్ సేన తమ తదుపరి మ్యాచ్‌లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్‌ను అహ్మదాబాద్‌లో ఢీకొట్టనుంది. చదవండి: #Pat Cummins: శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
SRH: ‘బాధితులు’ మరింత అసూయ పడేలా..
(43 X 4) + (38 X 6).. మొత్తం 81.. ఇదేంటి లెక్క తప్పు చెప్తున్నారు అనుకుంటున్నారా? కాదండీ.. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌లో నమోదైన ఫోర్లు, సిక్సర్లూనూ!! చిన్నస్వామి స్టేడియం బౌండరీ చిన్నదే కావొచ్చు.. అయినా.. ఇలా బ్యాట్ తాకించగానే అలా బంతి అవతల పడదు కదా.. ఫోర్స్‌గా కొడితేనే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంది. అలా తమ పవర్ హిట్టింగ్తో ప్రేక్షకులకు కనువిందు చేశారు ఇరు జట్ల బ్యాటర్లు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టులో అభిషేక్ శర్మ 2, ట్రావిస్ హెడ్ 8, హెన్రిచ్ క్లాసెన్ 7, ఐడెన్ మార్క్రమ్ 2, అబ్దుల్ సమద్ 3 సిక్స్‌లు బాదారు. The art 🎨 of nailing practice to execution for a record breaking total! 🧡 Travis Head 🤝 Heinrich Klaasen#TATAIPL | #RCBvSRH | @SunRisers pic.twitter.com/gA5HcYGwFM — IndianPremierLeague (@IPL) April 16, 2024 ఇలా ఓవరాల్‌గా ఎస్ఆర్హెచ్ ఖాతాలో 22 సిక్సర్లు నమోదు కాగా.. ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా రికార్డులకెక్కింది. మరోవైపు.. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి రెండు, ఫాఫ్ డుప్లెసిస్ 4, దినేశ్ కార్తిక్ 7, మహిపాల్ లామ్రోర్ రెండు సిక్స్‌లు బాదారు. తడిసి ముద్దైన చిన్నస్వామి స్టేడియం మ్యాచ్ ఆద్యంతం ఇలా సిక్సర్ల వర్షంలో చిన్నస్వామి స్టేడియం తడిసి ముద్దవుతుంటే టీ20 ప్రేమికులంతా కేరింతలు కొట్టారు. న భూతో న భవిష్యతి అన్నట్లుగా బ్యాటర్లు హిట్టింగ్ చేస్తుంటే ఇది కదా పొట్టి ఫార్మాట్ మజా అనుకుంటూ మురిసిపోయారు. బ్యాటర్‌ను అయినా బాగుండు ఫలితం ఎలా ఉన్నా మంచినీళ్ల ప్రాయంలా సన్‌రైజర్స్- ఆర్సీబీ బ్యాటర్లు చితక్కొట్టిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాదు.. ఈ మ్యాచ్‌లో బాధితులుగా మిగిలిపోయిన బౌలర్లు కూడా తాము కూడా అప్పటికప్పుడు బ్యాటర్ అయి పోయి ఉంటే బాగుండు అనుకునేంతగా అసూయ పడేలా చేశారు. విజయానంతరం సన్‌రైజర్స్ కెప్టెన్, మూడు వికెట్లు తీసిన పేసర్ ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘‘నేను బ్యాటర్‌ను అయినా బాగుండు. సూపర్ మ్యాచ్. అద్భుతమైన దృశ్యాలు. అంతకు మించిన వినోదం. చిన్నస్వామి స్టేడియం పిచ్ ఈరోజు పొడిగా ఉంది. దానిని మేము చక్కగా సద్వినియోగం చేసుకోగలిగాం’’ అని కమిన్స్ సంతోషం వ్యక్తం చేశాడు. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ సృష్టించిన అరుదైన రికార్డులు ►ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు- 22 ►టీ20 క్రికెట్లో నేపాల్(314) తర్వాత రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టు(287). ►ఐపీఎల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టు- 287/3. సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు: ►టాస్: ఆర్సీబీ.. బౌలింగ్ ►సన్‌రైజర్స్ స్కోరు: 287/3 (20) ►ఆర్సీబీ స్కోరు: 262/7 (20) ►ఫలితం: ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం చదవండి: #RCBvsSRH: ఏంట్రా ఈ బ్యాటింగ్?.. ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి.. వీడియో వైరల్ -
శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి..
SRH Fans Hails Pat Cummins Captaincy: ఐపీఎల్లో గత మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్-2023లో పద్నాలుగింట కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పట్టికలో అట్టడుగున పదోస్థానంలో నిలిచింది. ఫలితంగా ఇక ఈ జట్టు ఇంతే! ఊరించి ఉసూరుమనిపించడం.. గెలుస్తారనుకున్న మ్యాచ్‌లో కూడా ఓడిపోవడం.. అనే విమర్శలు ఎదుర్కొంది. సరైన కెప్టెన్, ఓపెనింగ్ జోడీ లేకపోవడం.. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ విఫలం కావడం వంటివి తీవ్ర ప్రభావం చూపాయి. భారీ ధరకు కొనుక్కున్న హ్యారీ బ్రూక్ రాణించకపోవడం.. హెన్రిచ్ క్లాసెన్‌తో పాటు గ్లెన్ ఫిలిప్స్‌ను బరిలోకి దింపినా అప్పటికే ఆలస్యం కావడం గతేడాది ఎస్ఆర్హెచ్ కొంపముంచింది. అయితే, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని.. లోపాలు సరిచేసుకుని ముందు సాగడం కూడా సన్‌రైజర్స్‌కు చేతకాదు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వన్డే వరల్డ్‌కప్-2023 విన్నింగ్ కెప్టెన్ కోసం 20 కోట్లు కానీ.. సన్‌రైజర్స్ యాజమాన్యం వ్యూహాత్మంగా అడుగులు వేసింది. ఐపీఎల్-2024 వేలంలో భాగంగా వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. అతడి కోసం ఏకంగా రూ. 20.50 కోట్లు వెచ్చించింది. అదే విధంగా వరల్డ్‌కప్ హీరో ట్రావిస్ హెడ్‌ను కూడా రూ. 6.80 కోట్లు పెట్టి కొనుక్కుంది. అయితే.. టీ20లలో అంతగా అనుభవం లేని కమిన్స్‌ను కెప్టెన్ చేయడం సన్‌రైజర్స్ పొరపాటేనని మరోసారి విమర్శలు వచ్చాయి. అతడి కోసం అంత ఖర్చు చేయడం అవసరమా అనే పెదవి విరుపులు కూడా! నమ్మకం నిలబెట్టుకుంటున్న కమిన్స్ కానీ మేనేజ్మెంట్ తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ సన్‌రైజర్స్‌ను విజయపథంలో నడుపుతున్నాడు కమిన్స్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, మార్క్రమ్ వంటి హిట్టర్లకు తోడు నితీశ్ కుమార్‌రెడ్డి, అబ్దుల్ సమద్ సేవలను సరైన సమయంలో సరిగ్గా ఉపయోగించుకుంటూ ఫలితాలు రాబడుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో ఈ స్టార్ పేసర్ తనతో పాటు భువీ, నటరాజన్, జయదేవ్ ఉనాద్కట్‌లతో పాటు స్పిన్నర్ మయాంక్ మార్కండేను కూడా అవసరమైన సమయంలో రంగంలోకి దించుతున్నాడు. మాస్టర్ మైండ్ ఆర్సీబీతో సోమవారం నాటి మ్యాచ్‌లో పిచ్‌ను సరిగ్గా రీడ్ చేసిన కమిన్స్ వన్‌డౌన్‌లో క్లాసెన్‌ను దింపి ఫలితం రాబట్టాడు. అందుకు తగ్గట్లే క్లాసెన్(31 బంతుల్లో 67) ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 102)కు సహకారం అందిస్తూనే.. ఆచితూచి ఆడుతూ వీలు చిక్కిన్నపుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. ఆఖర్లో మార్క్రమ్(17 బంతుల్లో 32), అబ్దుల్ సమద్(10 బంతుల్లో 37) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు(287) నమోదు చేసిన జట్టుగా ఆల్‌టైమ్ రికార్డు సృష్టించడంలో తమ వంతు పాత్ర పోషించారు. Abdul Samad in the house now 😎 Flurry of sixes at the Chinnaswamy 💥 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #RCBvSRH pic.twitter.com/eWFCtZ5Usq — IndianPremierLeague (@IPL) April 15, 2024 ఇక ఆర్సీబీ లక్ష్య ఛేదనలో ఆరంభంలో దూకుడుగా ఆడినా ప్యాట్ కమిన్స్ ముఖంపై నవ్వులు పూశాయే గానీ.. అతడు ఏమాత్రం తడబడలేదు. ముందుగా పార్ట్‌టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ చేతికి బంతినిచ్చాడు. ఐదో బంతికే క్యాచ్ డ్రాప్ చేయడంతో కోహ్లికి లైఫ్ లభించగా అతడు దూకుడు మరింత పెంచాడు. ఆ తర్వాత భువీని రంగంలోకి దింపాడు. అనంతరం మళ్లీ లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్..నటరాజన్ ఇలా ఒక్కో ఓవర్‌కు వైవిధ్యం చూపించాడు. పిచ్ పరిస్థితిని అంచనా వేస్తూ మరో స్పిన్నర్ మయాంక్‌తో బౌలింగ్ చేయించి ఫలితం రాబట్టాడు. ఆర్సీబీని దెబ్బకొట్టడంలో సఫలం మయాంక్ మార్కండే కోహ్లి(42) బౌల్డ్ కావడంతో అప్పటిదాకా ఆర్సీబీ విజయంపై ఆశలు పెట్టుకున్న అభిమానులు ఒక్కసారిగా నీరుగారిపోయారు. అయితే, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 62), దినేశ్ కార్తిక్(35 బంతుల్లో 83) ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. తన వ్యూహాలను పక్కాగా అమలు చేసిన ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయడంతో పాటు కెప్టెన్‌గానూ తానేంటో మరోసారి నిరూపించాడు. మిస్టర్ కూల్ ధోనిలా కూల్‌గా డీల్ చేస్తూ సన్‌రైజర్స్‌ను 25 పరుగుల తేడాతో గెలిపించాడు. తద్వారా రైజర్స్ ఖాతాలో నాలుగో(ఆరింట) విజయం చేరింది. ఇక కమిన్స్ చేరిక జట్టుకు నష్టం చేకూరుస్తుందే తప్ప లాభం ఉండదన్న విమర్శకులకు అద్బుత నైపుణ్యాలతో సమాధానమిస్తున్న ఈ పేస్ బౌలర్.. తొలుత ప్లే ఆఫ్స్‌నకు గురిపెట్టాడు. Nothing but bright smiles and 𝙜𝙤𝙤𝙤𝙤𝙤𝙤𝙙 vibes after a historic night of cricket 😁🔥#PlayWithFire #RCBvSRH pic.twitter.com/RXn6mb5pF1 — SunRisers Hyderabad (@SunRisers) April 16, 2024 అంతా సవ్యంగా సాగితే ఈసారి ఫైనల్లోనూ రైజర్స్‌ను చూస్తామంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్. డేవిడ్ వార్నర్ తర్వాత తమకు దొరికిన మరో ఆణిముత్యం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అంటూ కొనియాడుతున్నారు. విశ్లేషకులు సైతం కమిన్స్ కెప్టెన్సీకి మంచి మార్కులే వేస్తున్నారు. పనిలో పనిగా రిస్క్ తీసుకున్నా సరే అనుకున్న ఫలితాలు వస్తున్నాయి అంటూ సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: #T20WorldCup2024: రోహిత్‌తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! Captain Pat reflects on the game ➕ who clinched the dressing room awards? 👀🏅 Watch as we soak in the post match vibes from our strong win in #RCBvSRH 🧡 pic.twitter.com/Ey7VhksA6B — SunRisers Hyderabad (@SunRisers) April 16, 2024 -
ఏంట్రా ఈ బ్యాటింగ్?.. ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి.. రియాక్షన్ వైరల్
‘‘నేను కొడితే అదోలా ఉంటుందని..ఆళ్లూ.. ఈళ్లూ చెప్పడమే గానీ.. నాకు కూడా తెలియదు.. ఇప్పుడు మీకు తెలుస్తుంది’’.. బిజినెస్‌మేన్ సినిమాలో మహేశ్ బాబు చెప్పిన మాదిరే సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు కూడా ఆర్సీబీ బౌలింగ్‌ను చితక్కొట్టారు. ఏమాత్రం కనికరం లేకుండా బెంగళూరు బౌలర్లపై విరుచుపడుతూ చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించాడు. కో..డితే సిక్స్.. లేదంటే ఫోర్.. తగ్గేదేలే అన్నట్లు ట్రావిస్ హెడ్(41 బంతుల్లో 102) ఓవైపు ఊచకోత కోస్తుంటే మరోవైపు హెన్రిచ్ క్లాసెన్(31 బంతుల్లో 67) ఛాన్స్ వచ్చినప్పుడల్లా వీరబాదుడు బాదాడు. THE SHOOTING STAR...!!! 💫 - 106M monster by Heinrich Klaasen. 🥵 pic.twitter.com/raWQGOLOiM — Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2024 వీరిద్దరి తుఫాన్ ఇన్నింగ్స్ చూసి ఆరెంజ్ ఆర్మీ కేకలతో స్టేడియం హోరెత్తిపోగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం జరుగుతున్న పరుగుల విధ్వంసాన్ని చూడలేక తమలో తామే మదనపడిపోతూ సతమతమయ్యారు. అభిమానుల పరిస్థితే ఇలా ఉంటే.. మరి ఆర్సీబీ బౌలర్లు, ఫీల్డర్ల పరిస్థితి ఇంకెలా ఉంటుంది? వికెట్ తీయడం సంగతి దేవుడెరుగు.. ముందు పరుగుల ప్రవాహానికి కట్టడి చేయడం ఎలా అని తలలు పట్టుకున్నారంతా! కాలితో తంతూ ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి ఇక ఆర్సీబీ ముఖచిత్రంగా భావించే స్టార్ విరాట్ కోహ్లి అయితే తీవ్ర అసహానికి లోనయ్యాడు. రైజర్స్ బ్యాటర్లు తమ సొంత మైదానంలో దుమ్ములేపుతుంటే అస్సలు చూడలేకపోయాడు. ఏ దశలోనూ వారిని కట్టడి చేయలేక బౌలర్లు చేతులెత్తేస్తుంటే గాల్లోకి కాలితో పంచ్‌లు విసురుతూ కోపాన్ని వెళ్లగక్కాడు. అదే సమయంలో వికెట్ పడినప్పుడల్లా జట్టును ఉత్సాహపరుస్తూ.. చప్పట్లు కొడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. సన్‌రైజర్స్ బ్యాటింగ్ పూర్తయ్యేంత వరకు కోహ్లి ఇచ్చిన వైవిధ్యమైన ఎక్స్ప్రెషన్స్, రియాక్షన్స్ చూసి ఫ్యాన్స్.. ‘‘అయ్యో పాపం ఆర్సీబీ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Everyone's mental health after watching RCB bowlers #RCBvsSRH pic.twitter.com/dSy38RctKC — Rohan Naik (@RohanNaik_) April 15, 2024 ఆర్సీబీ బౌలర్లపై ఫ్యాన్స్ మండిపాటు ఇలాగే ఆడితే ఆర్సీబీ ఈసారి కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరదంటూ ఆర్సీబీ బౌలర్లను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. కాగా బెంగళూరులో సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. తద్వారా ఐపీఎల్ చరిత్రలో తమ రికార్డును తామే బ్రేక్ చేసి.. అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా చరిత్రకెక్కింది. ఇక లక్ష్య ఛేదనలో కోహ్లి(42), ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 62) శుభారంభం అందించినా.. మిడిలార్డర్ పూర్తిగా విఫలమైంది. ఇక ఆఖర్లో దినేశ్ కార్తిక్(35 బంతుల్లో 83) విధ్వంసకర అర్ధ శతకం బాదినా.. అనూజ్ రావత్(14 బంతుల్లో 25 నాటౌట్) మెరుపులు మెరిపించినా లక్ష్యాన్ని ఛేదించడంలో ఆర్సీబీ విఫలమైంది. ఫలితంగా 25 పరుగుల తేడాతో ఓడిపోయి వరుసగా ఐదో పరాజయం నమోదు చేసింది. చదవండి: #T20WorldCup2024: రోహిత్‌తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); A 1⃣0⃣8⃣m monster! 💥 The bowlers can finally breathe at the Chinnaswamy as the batting carnage comes to an end! 🥶 Recap the match on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RCBvSRH pic.twitter.com/lclY9rs2Kf — IndianPremierLeague (@IPL) April 15, 2024 -
IPL 2024 RCB VS SRH: ఓడినా ఆల్‌టైమ్ రికార్డు సెట్ చేసిన ఆర్సీబీ
ఐపీఎల్ 2024 సీజన్లో నిన్న (ఏప్రిల్ 15) అత్యంత రసవత్తరమైన సమరం జరిగింది. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మధ్య జరిగిన భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో ఎన్నో టీ20 రికార్డులు బద్దలయ్యాయి. ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్.. ఓ టీ20 మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి చేసిన అత్యధిక స్కోర్ (సన్‌రైజర్స్ 287 + ఆర్సీబీ 262 = 549 పరుగులు).. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు (ఆర్సీబీ-22).. ఓ టీ20 మ్యాచ్‌లో నమోదైన అత్యధిక బౌండరీలు (43 ఫోర్లు, 38 సిక్సర్లు= 81).. ఇలా ఈ మ్యాచ్‌లో చాలావరకు పొట్టి క్రికెట్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఇదే మ్యాచ్‌లో మరో భారీ రికార్డు కూడా నమోదైంది. ఆర్సీబీ మ్యాచ్ ఓడినప్పటికీ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ (262) చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉండేది. ముంబై ఇండియన్స్ ఇదే సీజన్లో సెకెండ్ బ్యాటింగ్ చేస్తూ (సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ) 246 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో సెకెండ్ బ్యాటింగ్ చేస్తూ అత్యధిక స్కోర్ నమోదు చేసిన ఆర్సీబీ.. మరో రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా డ్యూయల్ రికార్డు నమోదు చేసింది. 2017 సీజన్లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ.. 49 పరుగులకే ఆలౌటైంది. ఈ స్కోర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్‌గానూ రికార్డైంది. మ్యాచ్ విషయానికొస్తే.. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ.. సన్‌రైజర్స్ చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 288 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదిస్తూ ఆర్సీబీ 262 పరుగులకు పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఛేదనలో ఆర్సీబీ చివరి వరకు గెలుపు కోసం పోరాటం చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. విరాట్ కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), మహిపాల్ లోమ్రార్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్ రావత్ (14 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019