breaking news
-
వయస్సు 5 నెలలే.. కానీ ఇన్ఫోసిస్ ద్వారా 4.2 కోట్లు సంపాదించాడు
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి మనువడు ఏకాగ్రహ్ రోహన్ కేవలం ఐదు నెలల వయస్సులో ఇన్ఫోసిస్ నుంచి రూ.4.2 కోట్లు దక్కించుకున్నాడు. నారాయణ మూర్తి గత నెలలో తన మనవడు ఏకాగ్రహ్ రోహన్‌కు రూ. 240 కోట్ల కంటే ఎక్కువ విలువైన 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లను (0.04% వాటా) రాసిచ్చారు. ఈ తరుణంలో ఇన్ఫోసిస్ గురువారం క్యూ 4 ఫలిteతాలను ప్రకటించింది. క్యూ 4 ఫలితాలతో పాటు ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 28 డివిడెండ్‌ను కూడా ప్రకటించింది. దీంతో ఇన్ఫోసిస్‌లో తన పేరు మీద ఉన్న మొత్తం 15లక్షల షేర్ల ద్వారా డివిడెండ్ రూపంలో ఏకాగ్రహ్ రోహన్ ఇప్పుడు రూ.4.2 కోట్లు అర్జించాడు. నారాయణ్ మూర్తి, సుధా మూర్తి దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు అక్షతా మూర్తి, కొడుకు రోహన్ మూర్తి. అక్షతా మూర్తి, 2009లో రిషి సునాక్(ప్రస్తుత బ్రిటన్ ప్రధాని)ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుళ్లు. ఇక రోహన్ మూర్తికి 2011లో టీవీఎస్ కంపెనీ ఛైర్మన్ వేణుశ్రీనివాస్ కుమార్తె లక్ష్మితో వివాహం జరిగింది. ఈ జంట 2015లో విడిపోయారు. 2019లో అపర్ణ కృష్ణన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరి సంతానమే ఏకాగ్రహ్. -
ప్రపంచంలోనే తొలి ఏఐ అందాల పోటీలు!
ఎన్నో రకాల అందాల పోటీలను చూసి ఉంటారు. కానీ ఇలాంటి సాంకేతికతో కూడిన అందాల పోటీలను చూసి ఉండరు. ప్రపచంలోనే తొలిసారిగా ఏఐ అందాల పోటీలు వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్(WAICA) పిలుపునిచ్చింది. ఈ పోటీలో కృత్రిమ మేధస్సుతో రూపొందించిన మోడల్స్ పాల్గొంటారు. కోటి రూపాయల విలువ చేసే ప్రైజ్‌మనీలతో భారీ ఎత్తున ఈ ఏఐ అందాల పోటీలను నిర్వహిస్తోంది WAICA. ఈ ఐఏ మోడల్స్‌ని ప్రేక్షకుల్లో వాటికున్న ఆదరణ, ఫ్లాట్‌ఫామ్‌లో ఎక్కువగా వినియోగించగలిగేది, సోషల్ మీడియా క్రేజ్ వంటి వాటిని ఆధారంగా చేసుకుని న్యాయనిర్ణేతలు విజేతను ప్రకటిస్తారు. తొలిసారిగా కంప్యూటర్ సాంకేతికత సృష్టించిన మనుషుల అందాల పోటీ అనేది ఫ్యాషన్ వైవిధ్యానికి ఓ నిదర్శనం. వరల్డ్ AI క్రియేటర్ అవార్డ్స్ వర్చువల్ మోడల్స్‌ని సబ్స్క్రిప్షన్-ఆధారిత ప్లాట్‌ఫారమ్ అయిన ఫ్యాన్వ్యూని(Fanvue) కూడా కలిగి ఉంటుంది. ఇక్కడ సదరు వర్చువల్ మోడల్ ఫ్యాన్ వ్యూ, పీఆర్ మద్దతులను కూడా బేస్ చేసుకుని విజేతను ప్రకటించడం జరుగుతుంది. అలాగే రన్నరప్, మూడో స్థానంలో ఉన్న విజేతలకు కూడా నగదు బహుమతులు అందచేయడం జరుగుతుందని వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్ పేర్కొంది. ఈ పోటీలకు ఎంట్రీలు గత ఆదివారం(ఏప్రిల్ 14) నుంచే ప్రారంభమయ్యాయి. మే 10న విజేతలను ప్రకటిస్తారు. ఇక ఈ అందాల పోటీ ఈ నెలఖారులోపు జరగనుంది. ఇక ఈ పోటీలు నలుగురు సభ్యుల ఫ్యానెల్ సమక్లంలో జరుగుతుంది. ఆ ఫ్యానెల్లో ఇద్దరు ఏఐ ఇన్ఫ్లయోన్సర్ జడ్డిలు..ఒకరేమో మూడు లక్షల ఫ్యాన్‌ఫాలోయింగ్ కలిగిన స్పెయిన్‌కు చెందిన ఐతానా లోపెజ్, మరోకరు రెండు లక్షలకు పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎమిలీ పెల్లెగ్రిని జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఇక వారిలో మిగిలిన ఇద్దరు వ్యక్తులు..పీఆర్ సలహదారు, వ్యవస్థాపకుడు ఆండ్రూ బ్లాచ్, మరొకరు అందాల పోటీ చరిత్రకారుడు, బ్యూటీ క్వీన్ స్కాండల్స్ పుస్తక రచయిత అయిన సాలీ-ఆన్ ఫాసెట్ విజేతలను ప్రకటిస్తారు. ఇది ఏఐ సృష్టికర్తలలో దాగున్న ప్రతిభ సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు జరుగుతున్న అందాల పోటీ అని ఫ్యానల్ వ్యక్తులు చెబుతున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా 100 శాతం ఏఐ జనరేటేడ్ మోడల్స్‌నే క్రియేట్ చేయాలి. అందుకోసం ఎలాంటి టూల్స్ ఉపయోగిస్తారనేందుకు ఎలాంటి పరిమితులు లేవు. ఓన్లీ ఏఐ జెనరేటర్ క్రియేషన్స్ని స్వాగతిస్తుంది. అది డీప్ ఏఐ, లేదా వ్యకగత టూల్స్ వంటివి ఏదైనా కావొచ్చు. ఈ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నవారు దాదాపు రూ. 4 లక్షలపైనే నగదు బహుమతి అందజేస్తారు నిర్వాహకులు. ( చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
‘క్విక్’ డెలివరీతో పోటీ కిరాణా హైరానా
సాక్షి, హైదరాబాద్: బస్తీలు, కాలనీలు, సందుల్లో ఉండే కిరాణా దుకాణాలు తెరుచుకోకముందే పొద్దుపొద్దునే అవసరమయ్యే టూత్పేస్ట్లు, సబ్బులు, ఇతర చిన్నాచితకా సరుకు లు మొదలు నిత్యావసరాలు సైతం నిమిషాల్లోనే ఇళ్లకు చేరిపోతున్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఈ– కామర్స్, క్విక్ (క్యూ)–కామర్స్ ద్వారా ’ఆన్–డిమాండ్ డెలివరీ’’ఇ–కిరాణా’తో వంటి వాటితో నిమిషాల వ్యవధిలోనే వేగంగా సరుకులు వచ్చిపడుతున్నాయి. చిల్లర సామాన్లు మొదలు అన్నీ ఈ–కామర్స్ వ్యాప్తితో జెప్టో, బీబీ(బిగ్ బా స్కెట్), జొమాటో(బ్లింకిట్), ఇన్‌స్టా మార్ట్ (స్విగ్గీ) తదితరాలతో కిరాణా దుకాణాలకు పోటీ తప్పడం లేదు. నిమిషాల్లోనే డెలివరీ చేసే ఈ–కామర్స్ బిజినెస్ క్ర మంగా దేశంలో పుంజుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా చోటుచేసుకుంటున్న మార్పుచేర్పుల్లో భాగంగా ఫాస్ట్ ఫుడ్ నుంచి ఫాస్ట్ ఇంటర్నెట్ వరకు.. ఇన్స్టంట్ మెసేజింగ్ నుంచి ఆన్–డిమాండ్ స్ట్రీమింగ్ వరకు వివిధరకాల వినియోగదారులు వేగవంతమైన సేవలు కోరుకుంటున్నారు. ఈ–కామర్స్, క్యూ–కామర్స్ ద్వారా కిరాణా వస్తువులు మొదలు ఎల్రక్టానిక్ పరికరాలు, వస్తువులు, రెడిమేడ్ దుస్తులు, అత్యవసరమైన మందుల దాకా కొద్దినిమిషాల వ్యవధిలోనే డోర్ డెలివరీ కావాలని కస్టమర్లు ఆశిస్తున్నారు. దీంతో ఈ తరహా వేగవంతమైన డెలివరీ సిస్టమ్ అందిస్తున్న ఈ–కామర్స్ సంస్థల నుంచి ప్రధానంగా సంప్రదాయ కుటుంబపరమైన వ్యాపారంలో భాగంగా ఉన్న కిరాణా మర్చంట్స్, వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కోక తప్పడం లేదు. సాంకేతికత సాయంతో సత్వరమే... క్యూ–కామర్స్ ఆన్–డిమాండ్ విధాన వినియోగంతోపాటు కృత్రిమమేధ ఆధారంగా అల్గారిథమ్‌లు, ఇతర అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా అత్యంత వేగంగా వినియోగదారులకు ఆర్డర్లు చేరవేస్తున్నారు. స్థానిక మైక్రో– వేర్‌హౌస్‌లను ఉపయోగించడం ద్వారా రిటైలర్లు వేగంగా డె లివరీ చేయడంతోపాటు రవాణా ఖర్చులను తగ్గించేందుకు దోహదపడుతున్నారు. కస్టమర్ల నుంచి వచ్చే ఆర్డర్ల ప్రాసెసింగ్ వేగవంతం చేసి, లోటుపాట్లు, లోపాల తగ్గింపునకు ఈ విధానం రో»ొటిక్లను కూడా ఉపయోగిస్తున్నాయి, కచ్చితమైన డిమాండ్ అంచనా క్యూ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారు ప్రవర్తనను అంచనా వేయడానికి మెషీన్ లెరి్నంగ్ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తాయి. క్యూ–కామర్స్ డిమాండ్ రాబోయే రోజుల్లో మరింత వేగంగా పుంజుకుంటుందని మెకన్సీ 2020 నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం మొత్తం వినియోగదారుల రిటైల్ వ్యయంలో 10 శాతం వాటాను ఇది సాధించే అవకాశాలున్నాయని, ఈ మార్కెట్ 2025 నాటికి 5 బిలియన్ల విలువకు చేరుకుంటుందని అంచనా. ఆన్–డిమాండ్ ఎకానమీ పెరుగుదలతో సంప్రదాయ సరఫరా గొలుసు విధానాన్ని అనుసరించే బదులు, క్విక్ కామర్స్ కంపెనీలు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. క్విక్ కామర్స్ ఇప్పటికే ఉన్న పరిశ్రమలను విజయవంతంగా ఏకీకృతం చేశాయి. జనసాంద్రత అధికంగా ఉన్న నగరాల్లో వ్యూహాత్మక హైపర్–లోకల్ మైక్రో–ఫుల్ఫిల్మెంట్ సెంటర్ల నెట్‌వర్క్‌ను పెంచడం ద్వారా క్విక్ కామర్స్ సంప్రదాయ కిరాణా వ్యాపారాన్ని అధిగమిస్తోంది.క్యూ–కామర్స్ వారానికి ఏడురోజులు, 24 గంటలు పనిచేస్తుండడంతో ఆధునిక జీవనశైలి డిమాండ్లకు అనుగుణంగా వినియోగదారులు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా కొనుగోళ్లు చేసే సౌలభ్యం ఉంది. పోటీని తట్టుకునేలా ‘కిరాణా’ కొత్త ఆలోచనలు దేశవ్యాప్తంగా ఉన్న 1.20 కోట్ల సంప్రదాయ కిరాణాస్టోర్లలో సగం దాకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా క్యూ–కామర్స్ చురుగ్గా సాగుతున్న పది నగరాల్లో దాదాపు మూడోవంతు రిటైలర్ల వ్యాపారాలు 35 శాతం దాకా వీటి ద్వారా ప్రభావితమైనట్టు ఆన్లైన్ కమ్యూనిటీ నైబర్హుడ్షాప్స్ కిరణ్క్లబ్ నివేదిక తేల్చింది. ప్రస్తుతానికి కిరాణా వ్యాపారాలపై క్యూ–కామర్స్ ప్రభావం పరిమితంగా ఉన్న రానున్న రోజుల్లో ఇది పెరిగితే తట్టుకునేందుకు వీలుగా కిరాణా దుకాణదారులు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. క్యూ–కామర్స్, ఇతర డెలివరీ యాప్‌లను నియంత్రించేలా సిద్ధమయ్యారు. ► కస్టమర్లకు ఉచిత హోండెలివరీ సౌకర్యం పెంచడం, ఎక్కువ మంది పనివారిని నియమించుకొని వేగంగా వినియోగదారుల ఇళ్లకు (గంటలోపే) వస్తువుల చేరవేత వంటివాటిపై దృష్టిపెడుతున్నాయి. ► మరికొందరు తమ పాత కస్టమర్లతో వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకొని కొత్త వస్తువులు, ఉత్పత్తులకు సంబంధించిన అప్డేట్స్ పంపిస్తూ ఆఫర్లు, డిసౌంట్లు వంటివి అందుబాటులోకి తెస్తున్నారు. ► వాట్సాప్‌పైనే కస్టమర్లకు కావాల్సిన వస్తువుల ఆర్డర్లు స్వీకరించి వ్యాపారం కాపాడుకునే ప్రయత్నాల్లో కిరాణా షాప్ యాజమానులు నిమగ్నమయ్యారు. ► క్యూ–కామర్స్ ద్వారా అందించలేని కొత్త కొత్త ఉత్పత్తులు, విభిన్నరకాల వస్తువులు, ఫ్లేవర్లు అందించేందుకు, వీటికి సంబంధించిన సమాచారం కస్టమర్లకు చేరవేసి వారిని ఆకర్షించే ప్రయత్నాల్లో నిమగ్నమవుతున్నారు. -
యుద్ధరంగంలో సాంకేతికత – కొన్ని ప్రశ్నలు
యుద్ధం వల్ల సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతుందా? ఆ యా దేశాలు తమకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని సరికొత్త ఆవిష్క రణలకు సిద్ధం కావటం అనేది ప్రయోజనకరమైనఅంశమా? లేదా అది యుద్ధనీతిని తప్పటం, అనైతి కతను ప్రోత్సహించటం అవుతుందా అన్న ప్రశ్నలు ఇప్పడు తలెత్తుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) ప్రవేశించని రంగం అంటూ లేదు. యుద్ధరంగంలోకి అది తన బాహువులను చాస్తోంది. ఇజ్రాయెల్ రణ క్షేత్రంలోకి ఏఐ ప్రవేశించటం తాజాగా చర్చనీ యాంశంగా మారింది. ఇజ్రాయెల్ సైన్యం గాజాలో బాంబింగ్ చేపట్టటానికి ఇంతవరకూ పరిచయం లేని కృత్రిమమేధ ఆధారిత వ్యవస్థను ఉపయోగించింది. హమాస్‌కు సంబంధించి దాదాపు 37 వేలకు పైగా లక్ష్యాలను గుర్తించటానికి దీనిని ఉపయోగించారు. అలాగే దీని ఆధారంగానే పాలస్తీనియన్ పౌరులను కొందరిని గుర్తించి హతమార్చారు. ‘మిషన్ లెర్నింగ్ విధానాల ద్వారా యుద్ధ వ్యూహాలను అమలు చేశారు. ఇజ్రాయెల్ ఉపయోగించిన కృత్రిమమేధ వ్యవస్థకు ‘లావెండర్’ అని పేరు పెట్టారు. ఇక్కడ మనిషి పాత్ర పరిమితం. దానిని అమలు చేయాలా వద్దా అని నిర్ణయం తీసుకోవటమే. ‘ఊ’ అనుకున్న తర్వాత కొన్ని సెకండ్లలో పని పూర్తయిపోతుంది. ఇజ్రాయెల్ జర్నలిస్టు ఒకరు బాహ్య ప్రపంచానికి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆపరేషన్‌లో ఆరుగురు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అధికారులు పాల్గొన్నారని ప్రకటించారు.అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులకు నిరసనగా ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేష న్లో ఇంత వరకు 33 వేలమందికి పైగా పాలస్తీని యన్లు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో ఇజ్రా యెల్కి యుద్ధ సహాయాన్ని నిలిపివేయాలన్నడిమాండ్లు వస్తున్నాయి. ప్రధానంగా ఇజ్రాయెల్‌కు సహకారం అందిస్తున్న యూఎస్, బ్రిటన్లపై ఒత్తిడి పెరుగుతోంది. పాలస్తీనా పౌరుల మరణాల పట్ల సానుభూతిని ప్రకటిస్తూనే, బిలియన్ డాలర్ల విలు వైన బాంబులు, ఫైటర్ జెట్ల అందచేతను యూఎస్ సమర్థించుకుంటోంది. మరో వైపు బ్రిటిష్ ప్రధాని రుషి సునాక్ రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్ చేపట్టిన దాడిలో ఛారిటీ వరల్డ్ కిచెన్సెంటర్లో ఏడుగురు బ్రిటిష్ పనివాళ్లు చనిపోవటంతో ఈఅంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు రష్యా – ఉక్రెయిన్ల యుద్ధంలో ఉక్రె యిన్ కూడా ఏఐ ఆధారిత డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఇవి మానవ ప్రమేయం లేకుండా వాటంతటికవే లక్ష్యాలను గుర్తించటం, దాడులు చేయటం వంటివి చేస్తాయి. కృత్రిమ మేధ ద్వారా శాటిలైట్ చిత్రాలను, డ్రోన్ వీడియో ఫీడ్లను పొందటం వల్ల యుద్ధ భూమిలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసు కోవచ్చు. చకచకా నిర్ణయాలు తీసుకోవటానికి వీల వుతుంది. శత్రువును వేగంగా, కచ్చితంగా ఎదుర్కోవ టానికి వీలవుతుంది. పూర్తిగా స్వయంచాలిత ఆయుధాలను విని యోగించటం అనే అంశంపైన చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఒకరు ఒకరకమైన సాంకేతికత ఉపయో గిస్తే, దానిని ఎదుర్కోవటానికి మరో సాంకేతికత ముందుకొస్తుంది. ఇప్పుడు కొత్తగా ‘ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్స్’ వస్తున్నాయి. ఇవి డ్రోన్ ఆపరేటర్ పైన దాడులకు ఉపయోగపడతాయి. ఇది మరీ కొత్తది అని కూడా చెప్పలేం. ఐసిస్ కొన్నేళ్ల క్రితం అధునాతమైన డ్రోన్ సైన్యాన్ని వినియోగించేది. ఇరాకీ బృందాలపై దాడులు నిర్వహించింది. ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌ను కొన్నట్టు ఏఐని కొనటం సాధ్యం కాదు. స్వయం చాలిత ఆయుధాలతో యుద్ధనియమాలు అంటి పెట్టుకుని యుద్ధాలు చేయాలి. అమెరికా, రష్యాతో పాటు దాదాపు 30 దేశాలు ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. యుద్ధాల విషయానికొస్తే, మొదటి ప్రపంచ యుద్ధం (1914–1918)లో మెషిన్ గన్లు, గ్రెనేడ్లు ఇతర ఆయుధాలు... సబ్ మెరైన్లు, పాయిజనస్ గ్యాస్, వార్ ప్లేన్లు, ట్యాంకులు ఉపయోగించారు. రెండో ప్రపంచ యుద్ధం (1939–1945) వచ్చేనాటికి రాడార్ టెక్నాలజీ ప్రవేశించింది. కొంత మంది చరిత్రకారులు ఈ సాంకేతికతే అణుబాంబు కంటే విజయానికి కీలకపాత్ర పోషించేదని వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధానికి తెరవేయటానికి తొలి అణుబాంబును అభివృద్ధి చేశారు. రెండు దశాబ్దాల తర్వాత చూస్తే ప్రపంచం మొత్తాన్ని సర్వనాశనం చేయటానికి అవసర మైనన్ని బాంబులు సిద్ధమైపోయాయి. యుద్ధంలో అణుబాంబును ఉపయోగిస్తే వచ్చే నష్టాన్నిఅంచనా వేసుకుని ఏ దేశానికి ఆ దేశం దానిని ఉపయోగించటానికి వెనకడుగు వేసేలా తయా రయ్యింది పరిస్థితి. మీరు శత్రు దేశం పైన అణుబాంబు వేసి సర్వనాశనం చేస్తే, మరో నిమిషం అవతల దేశం కూడా అదే పని చేస్తుంది. అందుకే తర్వాత రోజుల్లో చిన్నవి, తక్కువ శక్తిమంతమైన బాంబులను తయారుచేయటం మొదలు పెట్టారు. అణుబాంబు రూపొందించటంలో కీలక భూమిక షోషించిన భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ హైమర్ తర్వాత రోజుల్లో తాను చేసిన పనికి పశ్చాత్తాపానికి లోనయ్యాడు. ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచంలోఏ కొత్త ఆవిష్కరణ వచ్చినా, ముందుగా మిలిటరీలోనే దానికి బీజాలు పడ్డాయనేది చారిత్రక సత్యం. – డాక్టర్ పార్థసారథి చిరువోలు సీనియర్ జర్నలిస్ట్ ‘ 99088 92065' -
Japnit Ahuja: డిజిటల్ జెండర్ గ్యాప్‌ను కోడింగ్ చేసింది!
స్త్రీలు సాంకేతికంగా కూడా సాధికారిత సాధించాలనే లక్ష్యంతో వారికి ఉచితంగా కోడింగ్ పాఠాలు నేర్పుతోంది ఢిల్లీవాసి 23 ఏళ్ల జష్నిత్ అహుజా. కోడింగ్ తెలిసిన వారికి ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తాయి. ఈ రకంగా దేశంలో ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలకు ఆశాజ్యోతిగా మారింది జప్నిత్. ఇప్పటి వరకు 2 వేల మంది అమ్మాయిలకు ఉచితంగా డిజిటల్ పాఠాలు నేర్పింది. వంద మంది వాలంటీర్ల బృందానికి నాయకత్వం వహిస్తోంది. ఢిల్లీకి చెందిన జప్నిత్ అహుజాకు కోడింగ్ అంటే చాలా ఆసక్తి. దాంతో కోడింగ్ నేర్చుకోవడం మీదనే దృష్టిపెట్టింది. అదే సమయంలో ఆమె ఒక విషయాన్ని గుర్తించింది. అదేమంటే, కోడింగ్ రంగంలో స్త్రీలు చాలా తక్కువగా ఉన్నారనీ, ఆ ఉన్న వారిలో కూడా చాలామందికి దానిపై తగినంత పరిజ్ఞానం లేదనీ. మిగిలిన వారితో పోల్చితే కోడింగ్ తెలిసిన వాళ్లకి ఉద్యోగావకాశాలు కాసింత ఎక్కువగానే దొరుకుతాయి. అయితే ఆ రంగంలో పురుషులదే పై చేయి. దాంతో సాంకేతికపరంగా ఏమైనా ఉద్యోగాలు ఉంటే కోడింగ్‌లో వారే ముందుకు దూసుకుపోవడం వల్ల ఆ ఉద్యోగాలు కూడా వారే ఎక్కువగా దక్కించుకోగలుగుతున్నారు. ఇప్పటిదాకా స్త్రీలు ఎన్నో రంగాలలో పట్టుదలతో కృషి చేసి, పై చేయి సాధించగలుగుతున్నప్పుడు కోడింగ్‌లో మాత్రం పట్టు ఎందుకు సాధించకూడదు... అని ఆలోచించింది. అంతే... ముందు తాను ఆ రంగంలో బాగా కృషి చేసింది. పట్టుదలతో కోడింగ్ నేర్చుకుంది... ఆ రకంగా అందులో చకచకా పై మెట్టుకు చేరిపోగలిగింది. తనలాగే మరికొందరు ఆడపిల్లలకు కూడా కోడింగ్ నేర్పితేనో... అనుకుంది. అలా అనుకోవడం ఆలస్యం... ఇతర ఆమ్మాయిలను కొందరిని పోగు చేసి తనకు తెలిసిన దానిని వారికి ఉచితంగా పాఠాలు నేర్పడం ఆరంభించింది. అలా తన 16వ ఏట ఆమె ‘గో గర్ల్’ అనే సంస్థను స్థాపించింది. అయితే భాష సమస్య రాకుండా వారికి వచ్చిన స్థానిక భాషలోనే ఉచితంగా కోడింగ్‌ను నేర్పడం ఆమె ప్రత్యేకత. తోటి ఆడపిల్లలను సాంకేతికంగా ఎదిగేలా చేయడం కోసం ఎంచుకున్న లక్ష్యం, అందుకు ఆమె చేసిన కృషీ వృథా పోలేదు. చాలామంది అమ్మాయిలు ఆమె దగ్గర కోడింగ్ నేర్చుకుని మంచి ఉద్యోగావకాశాలను సాధించుకోగలిగారు. అలా తనకు లభించిన ప్రోత్సాహ ఉత్సాహంతో తన వయసు ఆడపిల్లలకే కాదు, తల్లి వయసు స్త్రీలకు కూడా కోడింగ్ నేర్పడం మొదలు పెట్టింది. అలా తనకు 23 ఏళ్లు వచ్చేసరికి చిన్న, పెద్ద కలిసి దాదాపు రెండు వేల మందికి పైగా ఆమె వద్ద కోడింగ్ నేర్చుకుని సాంకేతికంగా అభివృద్ధి చెంది, తమ కాళ్ల మీద తాము నిలబడగలిగారు. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఆరవ తరగతి చదివేటప్పుడే కోడింగ్ రంగంలో సాధించిన ప్రావీణ్యం బాల మేధావిగా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే అమ్మానాన్న ఆఫీసులనుంచి ఇంటికి వచ్చేలోగా వారికోసం ఎదురు చూస్తూ రకరకాల వెబ్సైట్లకు రూపకల్పన చేసేదానిని. అప్పుడు నాన్న నాతో.. ‘ఈ పిచ్చి పిచ్చి వెబ్సైట్లు కాదు బేబీ... నువ్వు నాసా సైంటిస్ట్‌గా ఎదగాలి. తలచుకుంటే నీకదేమీ ఒక లెక్కలోనిది కాదు’ అని చెప్పిన మాట నన్ను ఎంతో ప్రభావితం చేసింది. అలా ఎయిత్ క్లాస్‌కు వచ్చేసరికి పెద్దయ్యాక నేను చేయవలసింది ఉద్యోగం కాదని... సాంకేతికంగా అభివృద్ధి చెందడం, దానిద్వారా నేను నేర్చుకున్న పాఠాలను పదిమందికీ చెప్పడంలోనే ఎంతో థ్రిల్ ఉందనీ అర్థమైంది. నా దగ్గర కోడింగ్ పాఠాలు నేర్చుకున్న వారే తమంతట తాము స్వచ్ఛందంగా ఇతరులకు నేర్పించడం మొదలు పెట్టారు. ఆ విధంగా ‘కోడింగ్ ఫర్ ఉమెన్ బై ఉమెన్’ కాన్సెప్ట్ మాకు బాగా ఉపకరించింది. అంతేకాదు, డిజిటల్ జెండర్ గ్యాప్ అనే వివక్షను పూడ్చాలన్న నా స్వప్నం సాకారం అయ్యేందుకు ఉపకరించింది. ఏమైనా పిల్లలు గ్యాడ్జెట్స్‌తో ఆడుకుంటున్నప్పుడు వాళ్లు వాటితో ఏం చేస్తున్నారో... తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. దానిని వారు మంచికే ఉపయోగిస్తున్నారు అని గుర్తించగలిగితే ఆ దిశగా వారిని ప్రోత్సహించడం మంచిది. నా తల్లిదండ్రులు కోడింగ్‌పై నాకున్న ప్యాషన్‌ను గుర్తించకుండా ఏవో పిచ్చి ఆటలు ఆడుతున్నాను అనుకుని దానికి అడ్డుకట్ట వేసి ఉంటే నేను ఈ స్థాయికి ఎదిగి ఉండేదానిని కాను’’ అని ఆమె చెప్పిన మాటలు ఆలోచించదగ్గవి. ∙కోడింగ్‌లో శిక్షణ పొందుతున్న అమ్మాయిలు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019