Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
సమంత లగ్జరీ బ్రాండ్ వాచ్.. ధర ఎంతంటే..!
టాలీవుడ్ నటి సమంత చక్కటి ఫ్యాషన్ దుస్తుల పోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది. ప్రతి డ్రెస్ అత్యంత లగ్జరియస్ బ్రాండ్‌కు చెందినవే. ఈసారి మంచి కలర్‌ఫుల్ లుక్ ఫోటోలతో అభిమానులను ఆకర్షించింది. ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ గూచీకి చెందిన తెల్లటి లక్కర్ జాకెట్, స్కర్ట్ ధరించి.. క్యూట్ లూక్‌తో చూపురులన కట్టిపడేస్తుంది. దుస్తులపై ఉన్న ఎంబ్రాయిడరీ, ప్యాడెడ్ ఫోల్డర్లు, ఫుల్ స్లీవ్ల్లు బోర్డురూంలో సమావేశానికి వెళ్లే సీఈవోల మాదిరిగా ఉంది. అందుకు తగ్గట్టు ఆమె ధరించి డైమండ్ స్టడెడ్ సెర్పెంటి స్పిగా వాచ్ ఆమె అందన్ని రెట్టింపు చేశాయి. ఆ వాచ్ డయల్ చ్టుటూ సిల్వర్ ఒపలైన్ , డైమండ్లతో పొదడబడి ఉంది. చేతికి స్పైరల్ బ్రాస్లెట్ మాదిరిగా ప్రకాశవంతంగా ఉంది. ఆ తెల్లటి దుస్తులకు సరిగ్గా సరిపోయింది కాంస్య మేకప్ సమంతాకి కొత్త లుక్‌ని ఇచ్చింది. బహుశా ఈ వాచ్ అంటే ఆమెకు చాలా ఇష్టమనుకుంటా దీన్ని మరో రెండు సందర్భల్లో కూడా ధరించింది. ఒకసారి బోల్డ్ బ్లాక్ దుస్తులను ధరించినప్పుడూ వాచ్ మరింత ప్రకాశవంతంగా కనిపించింది. అలాగే ఓ ఫ్రైమ్ వీడియో ఈవెంట్‌కు కూడా ఈ సర్పెంటీ వాచ్‌ని ధరించారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) అలాగే ఈ వజ్రాలతో కూడిన వాచ్‌కి కేవలం సమంతా మాత్రమే ఫ్యాన్ కాదు మరో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీకి కూడా తెగ ఇష్టం. అందుకే కియారా కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో ఆమె నలుపు రంగు దుస్తులు ధరించి, చేతికి వెండి సర్పెంటీ స్పిగా వాచ్‌ను ధరించింది. మంచి జీవనశైలితో జీవితాన్ని ఆశ్వాదించేవారికి ఈ బల్గారియా వాచ్‌లు స్టైయిల్ష్ లుక్‌ని ఇస్తాయట. ఇంతకీ డైమండ్లతో పొదగబడిన ఈ వాచ్ ధర వింటే షాకవ్వుతారు. ఈ బల్గారియా సర్పెంటీ వాచ్ ధర ఏకంగా రూ. 70 లక్షలట. లగ్జరీ బ్రాండ్‌కి తగ్గ రేంజ్ ధర కాబోలు..! View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) (చదవండి: అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..!) -
ప్రపంచంలోనే తొలి ఏఐ అందాల పోటీలు!
ఎన్నో రకాల అందాల పోటీలను చూసి ఉంటారు. కానీ ఇలాంటి సాంకేతికతో కూడిన అందాల పోటీలను చూసి ఉండరు. ప్రపచంలోనే తొలిసారిగా ఏఐ అందాల పోటీలు వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్(WAICA) పిలుపునిచ్చింది. ఈ పోటీలో కృత్రిమ మేధస్సుతో రూపొందించిన మోడల్స్ పాల్గొంటారు. కోటి రూపాయల విలువ చేసే ప్రైజ్‌మనీలతో భారీ ఎత్తున ఈ ఏఐ అందాల పోటీలను నిర్వహిస్తోంది WAICA. ఈ ఐఏ మోడల్స్‌ని ప్రేక్షకుల్లో వాటికున్న ఆదరణ, ఫ్లాట్‌ఫామ్‌లో ఎక్కువగా వినియోగించగలిగేది, సోషల్ మీడియా క్రేజ్ వంటి వాటిని ఆధారంగా చేసుకుని న్యాయనిర్ణేతలు విజేతను ప్రకటిస్తారు. తొలిసారిగా కంప్యూటర్ సాంకేతికత సృష్టించిన మనుషుల అందాల పోటీ అనేది ఫ్యాషన్ వైవిధ్యానికి ఓ నిదర్శనం. వరల్డ్ AI క్రియేటర్ అవార్డ్స్ వర్చువల్ మోడల్స్‌ని సబ్స్క్రిప్షన్-ఆధారిత ప్లాట్‌ఫారమ్ అయిన ఫ్యాన్వ్యూని(Fanvue) కూడా కలిగి ఉంటుంది. ఇక్కడ సదరు వర్చువల్ మోడల్ ఫ్యాన్ వ్యూ, పీఆర్ మద్దతులను కూడా బేస్ చేసుకుని విజేతను ప్రకటించడం జరుగుతుంది. అలాగే రన్నరప్, మూడో స్థానంలో ఉన్న విజేతలకు కూడా నగదు బహుమతులు అందచేయడం జరుగుతుందని వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్ పేర్కొంది. ఈ పోటీలకు ఎంట్రీలు గత ఆదివారం(ఏప్రిల్ 14) నుంచే ప్రారంభమయ్యాయి. మే 10న విజేతలను ప్రకటిస్తారు. ఇక ఈ అందాల పోటీ ఈ నెలఖారులోపు జరగనుంది. ఇక ఈ పోటీలు నలుగురు సభ్యుల ఫ్యానెల్ సమక్లంలో జరుగుతుంది. ఆ ఫ్యానెల్లో ఇద్దరు ఏఐ ఇన్ఫ్లయోన్సర్ జడ్డిలు..ఒకరేమో మూడు లక్షల ఫ్యాన్‌ఫాలోయింగ్ కలిగిన స్పెయిన్‌కు చెందిన ఐతానా లోపెజ్, మరోకరు రెండు లక్షలకు పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎమిలీ పెల్లెగ్రిని జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఇక వారిలో మిగిలిన ఇద్దరు వ్యక్తులు..పీఆర్ సలహదారు, వ్యవస్థాపకుడు ఆండ్రూ బ్లాచ్, మరొకరు అందాల పోటీ చరిత్రకారుడు, బ్యూటీ క్వీన్ స్కాండల్స్ పుస్తక రచయిత అయిన సాలీ-ఆన్ ఫాసెట్ విజేతలను ప్రకటిస్తారు. ఇది ఏఐ సృష్టికర్తలలో దాగున్న ప్రతిభ సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు జరుగుతున్న అందాల పోటీ అని ఫ్యానల్ వ్యక్తులు చెబుతున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా 100 శాతం ఏఐ జనరేటేడ్ మోడల్స్‌నే క్రియేట్ చేయాలి. అందుకోసం ఎలాంటి టూల్స్ ఉపయోగిస్తారనేందుకు ఎలాంటి పరిమితులు లేవు. ఓన్లీ ఏఐ జెనరేటర్ క్రియేషన్స్ని స్వాగతిస్తుంది. అది డీప్ ఏఐ, లేదా వ్యకగత టూల్స్ వంటివి ఏదైనా కావొచ్చు. ఈ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నవారు దాదాపు రూ. 4 లక్షలపైనే నగదు బహుమతి అందజేస్తారు నిర్వాహకులు. ( చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
సెలబ్రిటీ శారీ డ్రేపర్: ఎంత చార్జ్ చేస్తుందో తెలుసా..!
సెలబ్రిటీలకు స్టయిల్ని అద్ది.. వాళ్లను ఫ్యాషన్ స్టార్స్‌గా తీర్చిదిద్దే స్టయిలిస్ట్‌లు ఉంటారు. ముఖ్యంగా చీర కట్టు అనేది ఎప్పటికీ స్పెషల్. దీన్ని ప్రోషెషన్గా ఎంచుకుని సినీ సెలబ్రిటీలకు కట్టే స్థాయికి వెళ్లింది స్టార్ స్టయిలిస్ట్ డాలీ జైన్. ఆమె ఎలా శారీ డ్రేపర్‌గా మారిందో తెలుసుకుందామా..! ‘ఆరు గజాల ప్రతి చీరా నాకు 360 రకాల కట్టుతీరుల్ని, కుచ్చిళ్లను పరిచయం చేస్తున్నట్టనిపిస్తుంది’ అంటుందీ చీరకట్టు స్పెషలిస్ట్. దీపికా పదుకోణ్, ఆలియా భట్, ప్రియంకా చోప్రా, కరిష్మా కపూర్, సోనమ్ కపూర్, నీతా అంబానీ, ఈషా అంబానీ, శ్లోకా అంబానీ, రవీనా టండన్ వంటి సెలబ్రిటీలందరూ ఏ చిన్న ఫంక్షన్‌కి అటెండ్ కావాలన్నా డాలీ జైన్‌కి కబురు పెడతారు. ఆమె చేత చీర కట్టించుకుంటారు. అంతలా చీరకట్టును ఓ ప్రొఫెషన్ స్థాయికి తీసుకెళ్లిన డాలీ.. పెళ్లయిన కొత్తలో చీరంటే యమ చిరాకు పడేదట. బెంగళూరులో పుట్టిపెరిగిన ఆమె పెళ్లయ్యే వరకు జీన్స్.. టీ షర్ట్స్, కుర్తీలే ధరించేది. కానీ అత్తారింట్లో క్యాజువల్ వేర్ నుంచి అకేషనల్ వేర్ దాకా అన్నిటికీ చీరే మస్ట్ అని ఆమె సాసుమా ఆర్డర్ పాస్ చేశారు. తప్పక చీరకట్టుతో కుస్తీపట్టడం మొదలుపెట్టింది డాలీ. రోజూ ముప్పావు గంట పట్టేదట చీర కట్టుకునేసరికి. ఇప్పుడు రికార్డ్ రేంజ్లో 18.5 సెకన్లలో కట్టేస్తుంది.. కట్టిస్తుంది. ప్రొఫెషన్‌గా ఎలా మారింది? కారణం సినీతార శ్రీదేవే అనే ఆన్సర్ ఇస్తుంది డాలీ. చీరే కట్టుకోవాలి అని రూల్ పెట్టిన అత్తగారు.. కోడలు పడుతున్న అవస్థ చూసి జాలిపడి ‘కుర్తీలు వేసుకో’ అంటూ నియమాన్ని సడలించింది. అయితే అప్పటికే డాలీకి చీర మీద మోజు మొదలైంది. సో.. చీరనే కంటిన్యూ చేసింది. ఇంట్లో.. ఇరుగుపొరుగు.. బంధువుల్లో ఏ శుభకార్యం జరిగినా చీరకట్టడంలో అతివలకు సాయపడటమూ స్టార్ట్ చేసింది. అలాంటి ఒక సందర్భంలో ఆమె మేనమామ ఒక పార్టీ ఇచ్చాడు. అతను సినీతార శ్రీదేవి ఉండే అపార్ట్మెంట్లోనే ఉండేవాడట. అందుకని శ్రీదేవినీ ఆహ్వానించాడు. డాలీ కూడా వెళ్లింది. పార్టీలో శ్రీదేవి చీర మీద జ్యూస్ ఒలికిందట. ఆమె ఇబ్బందిపడుతుంటే డాలీ చొరవ తీసుకుని గబగబా మేనమామ భార్య చీరొకటి తెచ్చి.. శ్రీదేవికి ఇచ్చిందట. అంతేకాదు ఆమె చీరకట్టుకుంటూంటే.. కుచ్చిళ్లు పెట్టడంలో.. పల్లూ సెట్ చేయడంలో సహాయపడిందట కూడా. డాలీ చీరకట్టే నేర్పరితనానికి శ్రీదేవి అబ్బురపడుతూ ‘ఇన్నేళ్లుగా చీర కట్టుకుంటున్నాను.. ఇంతబాగా కుదిరిందిలేదెప్పుడూ! దీన్ని ఒక ప్రొఫెషన్‌గా తీసుకోవచ్చుగా?’ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చిందట. ఆలస్యం లేకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇదిగో ఇలా ఫేమస్ అయింది డాలీ. వందల్లోంచి లక్షల్లోకి... దాదాపు 20 ఏళ్లుగా శారీ డ్రేపర్ ప్రొఫెషన్లో కొనసాగుతూన్న డాలీ జైన్.. తొలి పారితోషికం రూ. 250. ఇప్పుడు 2 లక్షల రూపాయల వరకు చార్జ్ చేస్తుంది. ఆమె దగ్గర 20 మంది సభ్యులతో కూడిన టీమ్ ఉంటుంది. చీరనే కాదు.. హాఫ్ శారీ, దుపట్టా.. ఇలా అన్నిటినీ సెట్ చేస్తుంది. ఈ స్టయిలింగ్‌లో ట్రైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీలేం లేవు ఆమెకు. కేవలం చీర కట్టు మీద తనకున్న మమకారం.. సృజనతోనే ఈ స్థాయికి ఎదిగింది. తనలాంటి గృహిణులు ఎందరికో స్ఫూర్తిని పంచుతోంది. బాలీవుడ్‌లోకి ఎంట్రీ? డాలీ జైన్ టాలెంట్ ఫ్యాషన్ డిజైన్ సందీప్ ఖోస్లా దృష్టిలో పడింది. నీతా అంబానీ 50 వ పుట్టిన రోజు ఫంక్షన్లో ఆమెకు చీర కట్టేందుకు డాలీని రికమెండ్ చేశాడు అతను. ఆ వేడుకలో మరెందరో సెలబ్రిటీల దృష్టిలోపడి బాలీవుడ్ ప్రవేశాన్ని సాధించింది. ఆమె ఫస్ట్ బాలీవుడ్ సెలబ్రిటీ వేడుక.. సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ వెడ్డింగ్. అక్కణ్ణించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఎందరికో డాలీ ఫేవరేట్ శారీ డ్రేపర్ అయిపోయింది. -
Vini Tandon Keni: చీర... నా రెండో గుర్తింపు
అప్పటివరకు గృహిణిగానే కాలం వెళ్లబుచ్చింది వినీ టాండన్ కెనీ. 53 ఏళ్ల వయసులో చీరకట్టు ద్వారా బిజినెస్ ఉమెన్‌గా మారింది. నేటి తరం అమ్మాయిలకు చీరకట్టు నేర్పించడానికి గోవాలో ప్రత్యేకంగా ‘శారీ స్పీక్’ స్టూడియోను ఏర్పాటు ద్వారా చేనేతకారులను ప్రోత్సహిస్తోంది. సోషల్ మీడియా ద్వారా ‘శారీ గ్రూప్’ ఏర్పాటు చేసి ఎంతోమంది మహిళలను ప్రభావితం చేస్తోంది. ‘చీర నా రెండో గుర్తింపు’ అంటున్న వినీ గురించి ... వినీ టాండన్ కెనీ ని పలకరిస్తే చాలు చీరల పట్ల తనకున్న ప్రేమను ఎంతో ఆనందంగా వ్యక్తపరుస్తుంది. ‘శారీ స్పీక్’ స్టూడియో వ్యవస్థాపకురాలుగా ఆమె ప్రయాణం నేటితరానికి కొత్త పాఠం. భార్య.. తల్లి... కోడలు.. శారీ ఇన్ఫ్లుయెన్సర్, కామిక్ కంటెంట్ సృష్టికర్త కూడా... ఇన్ని పాత్రలను చిరునవ్వుతో పోషించవచ్చుననడానికి వినీనే ఉదాహరణ. ‘నా కుటుంబమే నాకు బలం. ఉత్సాహం. మా కుటుంబ సభ్యులే నా ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉంటారు. ఫేస్బుక్ గ్రూప్ ‘శారీ స్పీక్’ని క్రియేట్ చేసి రేపటికి ఏడేళ్లు పూర్తవుతాయి. ఈ గ్రూప్ కారణంగా చాలామంది మహిళల ఆలోచనల్లో చీర గురించిన నిర్వచనమే మారిపోయింది. ఖాళీ నుంచి మొదలైన ప్రయాణం... నేను పుట్టి పెరిగింది ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయ్‌లో. మా నాన్నగారు మెరైన్ ఇంజనీర్ అవడంతో ఆయన ఉద్యోగరీత్యా వివిధ నగరాల్లో నివసించాం. నాన్నగారికి గోవాలో పోస్టింగ్ వచ్చినప్పుడు అక్కడ ప్రసాద్ కెనీతో నా పెళ్లి జరిగింది. అలా నేను గోవాలోనే ఉండిపోయాను. ఇద్దరు అబ్బాయిల పెంపకంలో ఎప్పుడూ తీరికలేకుండా ఉండేదాన్ని. పిల్లలు పెద్దవాళ్లై కాలేజీలకు వెళుతున్నప్పుడు నాలో ఏదో వెలితి ఏర్పడింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నా ఆసక్తుల వైపు దృష్టి సారించాను. మొదట సినిమా అభిమానుల కోసం ‘మూవీ స్పీక్’ పేరుతో ఫేస్బుక్ గ్రూప్‌ను క్రియేట్ చేశాను. ఆ తర్వాత వివిధ రకాల కళలు, కవులు .. మొదలైన గ్రూప్‌లను సృష్టించాను. అదే సమయంలో ‘శారీ స్పీక్’ బృందం కూడా ఏర్పాటయింది. అలా మొదలైంది... మా అమ్మ, అత్తగారు సౌకర్యం కోసం చీర నుంచి సల్వార్ కమీజ్‌కు మారినప్పుడు నాకెందుకో మనసు చివుక్కుమంది. ఈ విధంగా ఆలోచిస్తే అందరూ చీర కట్టుకోవడం మానేస్తారని అనిపించేది. దీంతో నేను చీర కట్టుకోవడం మొదలుపెట్టాను. నన్ను చీరలో చూసి, నా చుట్టూ ఉన్న ఆడవాళ్లు కూడా చీరలవైపు మొగ్గు చూపేవారు. చీరకట్టు ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసేదాన్ని. నాకు మంచి స్పందన రావడంతో వాళ్లూ పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. చేనేత కారులే నా బ్రాండ్... మా చిన్నబ్బాయి సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయమన్నప్పుడు శారీ ఐడియా గురించి చెప్పాను. స్టూడియో ఏర్పాటుకు తనే మద్దతుగా నిలిచాడు. దీంతో 53 ఏళ్ల వయసులో శారీ స్టూడియోతో వ్యాపారవేత్తను అయ్యాను. నా సొంత బ్రాండ్ అంటూ ఏమీ లేదు. దేశవ్యాప్తంగా ఉన్న నేత కార్మికుల నుంచి చేనేత చీరలను కొనుగోలు చేసి, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాను. నా స్టూడియోలో 95 శాతం చేనేత చీరలే ఉంటాయి. ఇప్పుడు చీరలను ఇష్టపడే మహిళలు వాటిని కొనడానికి నా స్టూడియోకు రావడం మొదలుపెట్టారు. కొందరు చీర కట్టుకోవడం తమకు చేతకాదని, ఇంకొందరూ తమకు అసౌకర్యం అని చెబుతుంటారు. చీరకట్టుకోవడానికి ఐదు నిమిషాలు చాలు. ఇక అసౌకర్యం ఎందుకో నాకు అర్థం కాదు. ఈ సమస్యను పరిష్కరించడానికి నా స్టూడియోలో చీరకట్టుకు సులువైన టెక్నిక్స్ ఇస్తుంటాను. శారీ స్పీక్ స్టోరీలు... చీరకట్టు గురించి మాత్రమే కాదు వారి ఆనందం, అలాగే తమ మానసిక వేదనల నుంచి బయటపడే విధానాల గురించి చెప్పినప్పుడు వాటినీ సోషల్ మీడియా వేదికగా పంచుతుంటాను. బెంగళూరుకు చెందిన ఉషా అగర్వాల్ అనే మహిళ తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయింది. కొన్ని రోజులకు నా పోస్ట్‌లను చూసి తనూ ప్రతి రోజూ కొత్త చీర కట్టుకొని, వాటిని పోస్ట్ చేసింది. ఆ మార్పుతో తన బాధ నుంచి కొద్ది రోజుల్లోనే బయటపడగలిగింది. ఆమె శారీ స్పీక్కి కృతజ్ఞతలు తెలిపింది. వెయ్యిమందిలో... ప్యాంటు నుండి సల్వార్ డ్రెస్సుల వరకు అన్నీ ధరిస్తాను. కానీ, నాకు అపారమైన నమ్మకాన్ని ఇచ్చేది శారీనే. చీర కట్టుకోగానే నా ముఖంలో చిరునవ్వు వచ్చేస్తుంది. నాతో చీర మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. కిందటేడాది భారతీయ నేత కార్మికులకు సహాయం చేయడానికి యూకే రాయల్ ఆస్కాట్ హార్స్ రేస్‌లో సుమారు వెయ్యిమంది వరకు చీరలు ధరించారు. వారిలో నేనూ ఉన్నాను. మేం తమ దేశంలో చీర ధరించాలని నిర్ణయించుకున్నందుకు బ్రిటిషర్లు మా వేషధారణను చూసి ఎంతో ఆనందించామని చెప్పారు. అప్పుడు నాకు చాలా సంతోషమనిపించింది. లక్షా డెబ్భై వేల మంది సభ్యులు... శారీ స్పీక్ ఫేస్బుక్ అకౌంట్‌కి ప్రపంచం నలుమూలల నుండి లక్షా డెబ్భై వేల మంది సభ్యులు గా ఉన్నారు. ఈ గ్రూపులో మహిళలు మాత్రమే సభ్యులు. ఈ గ్రూప్ చీరలను మాత్రమే ప్రమోట్ చేస్తుంది. ఇన్నేళ్లుగా చీర నన్ను బిజీగా ఉంచింది. నిన్ను చూడగానే చీరలు కట్టుకోవడం మొదలు పెట్టామంటూ చాలా మంది మహిళలు నాకు మెసేజ్ చేస్తుంటారు. మీ వల్లే మాకు ప్రమోషన్ వచ్చిందని, మా అమ్మకాలు పెరిగాయని చేనేత కార్మికులు అంటున్నారు. ఇదంతా వింటే మరింత పనిచేయాలనే ధైర్యం వస్తుంది. ఈ నెల 14న మా గ్రూప్ ఎనిమిదో వార్షికోత్సవాన్ని జరపుకుంటున్నాం. ఈ సందర్భంగా మీరూ చీరలో ఆనందంగా విహరించండి’ అంటున్నారు వినీ టాండన్. -
క్లియోపాత్రా నుంచి ప్రేరణ పొందిన నెయిల్ రింగ్స్ ఇవి..
నెయిల్ ఆర్ట్ గురించి మనకు తెలిసిందే. ఎన్నో డిజైన్లు మన చూపు తిప్పుకోనివ్వవు. ఆర్టిఫిషియల్ నెయిల్స్ని అతికించి మరీ చూడచక్కని డిజైన్లతో చేసే ఆ అలంకారం వేలి కొసలలో మెరుపులుగా కనువిందు చేస్తుంది. ఇప్పుడు వాటి స్థానాన్ని నెయిల్ జువెలరీ ఆక్రమిస్తోంది. ఫింగర్ క్లారింగ్స్గా ఈ నెయిల్ జ్యువెలరీ ఆధునికమైన టచ్‌తో అందంగా రూపుకడుతుంది. ప్రాచీనకాలంలో రక్షణలో భాగంగా చేరిన ఈ ఆభరణం ఇప్పుడు సొగసైన అలంకార జాబితాలో చేరి ప్రత్యేకతను చాటుతోంది. బంగారు, వెండి, ఇతర లోహాలలోనూ ఈ నెయిల్ జ్యువెలరీ అందుబాటులో ఉంది. సంప్రదాయం, ఆధునికం ఏ వేడుకైనా కొత్తగా వెలిగిపోవాలని కోరుకునే వారికి ఈ నెయిల్ రింగ్స్ సరైన ఎంపిక అవుతాయి. లోహపు డిజైన్లలో ముత్యాలు, రత్నాలు, ఎనామిల్.. వంటివి జతచేసిన డిజైన్ల ఎంపిక మనదైన ప్రత్యేకతను చాటుతుంటుంది. లోహాన్ని బట్టి, డిజైన్‌ను బట్టి ధరలు వందల రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి. చరిత్రలో నెయిల్ జువెలరీ.. ప్రాచీన చైనా, ఈజిప్ట్ రాజులు, రాణుల ఈ నెయిల్ క్లా జ్యువెలరీ విరివిగా ధరించేవారు. పొడవాటి గోర్లు సంపదకు చిహ్నంగా భావించేవారు. వాటి వల్ల శారీర శ్రమæ చేయవలసి అవసరం లేదు. అలా శ్రమ చేయాల్సిన అవసరం లేని వారు, స్థితిమంతులుగా జాబితాలో ఉండేవారు. అంతేకాదు, నెయిల్ గార్డ్‌గా పిలిచే ఈ ఆభరణాన్ని ధరించడం ప్రాచీన చైనీస్ మహిళలు శక్తికి, అందానికి చిహ్నంగా భావించేవారు. నెయిల్ క్లా లేదా గార్డుల తయారీలో సాధారణంగా లోహాలు లేదా సముద్ర తీరాల్లో లభించే ఆల్చిప్పల పెంకులను కూడా ఉపయోగించేవారు. అయితే, ఎక్కువగా బంగారం, వెండి, కాంస్య లేదా పోత పోసిన లోహంతో తయారు చేస్తారు. ముత్యాలు, విలువైన రాళ్లను వాటిలో పొదుగుతారు. వేలిగోళ్ల గార్డు ధరించిన వారి సామాజిక స్థితిని తెలియజేసేది. 3సెం.మీ నుండి దాదాపు 15 సెంటీ మీటర్ల వరకు ఉండేలా డిజైన్ చేయించేవారు. కొన్నిసార్లు చిటికెన వేలు, ఉంగరపు వేలికి సరిపోయేలా డిజైన్ చేయించుకునేవారు. కుడిచేతి, ఎడమ చేతి డిజైన్లు భిన్నంగా ఉండేవి. తమ దేశ సంప్రదాయ ఆభరణాలలో భాగంగా ఉన్నా, రక్షణ కోసం ఉపయోగించేవిగా పేరొందాయి. వారి వారి దేశాల్లోని నాణేలు, జంతువులు, పక్షులు, మొక్కల బొమ్మలను నెయిల్ గార్డ్స్‌పైన డిజైన్ చేయించేవారు. మహారాణి కళ.. జువెలరీ డిజైన్ సృష్టి, ఎంపిక అనేవి మన భావ వ్యక్తీకరణ పట్ల నుండి పుట్టుకు వచ్చిన ఆలోచన. నా డిజైన్స్ ఎక్కువగా బంజారా సంస్కృతికి అద్దం పడతాయి. ఎన్నో ఏళ్లుగా చూసిన వివిధ జాతుల సంస్కృతి, కళలు నా డిజైన్స్‌లో కనిపిస్తాయి. క్లియోపాత్రా నుంచి ప్రేరణ పొందిన నెయిల్ రింగ్స్ అలంకరణ మహారాణి కళను తీసుకువస్తుంది. – భవ్య రమేష్, జ్యువెలరీ డిజైనర్
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019