breaking news
Advertisement
Ad - Sakshi_Home_Sticky
-
లోక్‌సభకు ‘రాముని’కి ముందు ‘కృష్ణుడు’.. చివరికి ఏమయ్యింది?
లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. రాజకీయ నేతలంతా ప్రచారాల్లో తలమునకలై ఉన్నారు. ఈ ఎన్నికల్లో పలువురు సినీ నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ కోవలోనే యూపీలోని మీరట్ నుండి బీజేపీ తరపున టీవీ సీరియల్ రామాయణంలోని రాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ ఎన్నికల బరిలోకి దిగారు. టీవీ రాముడు అరుణ్ గోవిల్‌కు ముందు టీవీ సీరియల్ మహాభారత్‌లో శ్రీ కృష్ణుని పాత్ర పోషించిన నితీష్ భరద్వాజ్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అప్పట్లో నటుడు నితీష్ భరద్వాజ్ భారతీయ జనతా పార్టీలో చురుకైన నాయకునిగా పేరు తెచ్చుకున్నారు. అయితే రాజకీయాల నుంచి కొద్ది కాలానికే తప్పుకున్నారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి, విజయం సాధించారు. అయితే 1999 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ స్థానం నుంచి పోటీ చేసి, అప్పటి ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ చేతిలో నితీష్ భరద్వాజ్ ఓటమిని చవిచూశారు. నితీష్ భరద్వాజ్ కొంతకాలం పాటు బీజేపీ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. జంషెడ్పూర్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 18 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఆరు సార్లు గెలుపొందగా, కాంగ్రెస్, జేఎంఎం నాలుగుసార్లు, సీపీఐ, బీఎల్డీ, జనతా పార్టీ, భోజోహరి మహతో ఒక్కోసారి గెలుపొందాయి. ఈ సీటుపై విజయాన్ని నమోదు చేసేందుకు బీజేపీ ఎప్పటికప్పుడు అనేక ప్రయోగాలు చేస్తూ వస్తోంది. 1996లో నితీష్ భరద్వాజ్.. జనతాదళ్ సీనియర్ నేత, అప్పటి మంత్రి ఇందర్ సింగ్ నామ్‌ధారీపై 95,650 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
"కృష్ణ కృష్ణ - ఇదేమి ఘోరం!"
కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో టీఎం కృష్ణగా పేరు తెచ్చుకున్న తోడూరు మాడభూషి కృష్ణ చుట్టూ వివాదాలు ఎగసిపడుతున్నాయి. సంగీతంలో 'నోబెల్ ప్రైజ్' స్థాయిలో అభివర్ణించే మద్రాస్ మ్యూజిక్ అకాడమీవారి 'సంగీత కళానిధి' పురస్కారం-2024 టీఎం కృష్ణకు ప్రదానం చేయబోతున్నామని ఈ నెల 18వ తేదీన అకాడమీ ప్రకటించింది. అప్పటి నుంచి సంప్రదాయ సంగీత వాదుల నుంచి నిరసనల గళం పెద్దఎత్తున వినపడుతోంది. ఇది ప్రస్తుతం సంగీత ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీఎం కృష్ణను సమర్థిస్తూ కూడా కొన్ని వర్గాలు తమ వాణిని బలంగా వినిపిస్తున్నాయి. ఆయనకు మద్దతు పలికేవారిలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వున్నారు. ముఖ్యంగా ద్రవిడ సిద్ధాంతాలను బలపరిచేవారు, సనాతన సంప్రదాయం పట్ల గౌరవంలేనివారు, నాస్తికులు అందులో వున్నారు. టీఎం కృష్ణకు సంగీత కళానిధి పురస్కార ప్రకటనను నిరసిస్తూ, గతంలో ఈ పురస్కారాన్ని తీసుకున్న కొందరు వెనక్కు ఇచ్చేస్తున్నారు. చాలామంది కళాకారులు ఇక నుంచి మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో పాడబోమని, సంగీత కచేరీలు చేయబోమని తమ నిరసనను చాటుకుంటున్నారు. ఒక ప్రఖ్యాత ఇంగ్లీష్ పత్రిక అధినేతలలో ఒకరైన ఎన్.మురళి ప్రస్తుతం మద్రాస్ మ్యూజిక్ అకాడమీకి అధ్యక్షులుగా వున్నారు. టీఎం కృష్ణను ఈ పురస్కారానికి ఎంపిక చేయడంలో మురళి పాత్ర ప్రధానంగా వున్నదని సంగీత సమాజంలో గట్టిగా వినపడుతోంది. ఈ వివాదం ఇంతటితో ముగిసేట్టు లేదు. రకరకాల రూపం తీసుకుంటోంది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ చరిత్రలో ఇంతటి వివాదం గతంలో ఎన్నడూ చెలరేగలేదు. టీఎం కృష్ణకు ఒక వర్గం మీడియా మద్దతు, సహకారం కూడా బాగా వున్నాయని అనుకుంటున్నారు. ఈయన ప్రస్థానాన్ని గమనిస్తే.. మొదటి నుంచీ వివాదాస్పద వ్యక్తిగానే ప్రచారం వుంది. వేదికలపైన పాడేటప్పుడే కాక, వివిధ సందర్భాల్లోనూ ఆయన చేసే విన్యాసాలు, హావభావాలపై చాలా విమర్శలు వచ్చాయి. అట్లే, ఆయనను మెచ్చుకొనే బృందాలు కూడా వున్నాయి. సంప్రదాయవాదులు ఎవ్వరూ ఇతని తీరును ఇష్టపడరు. ఈ క్రమంలో రేపు డిసెంబర్ లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వేదికలో జరగబోయే ప్రతిష్ఠాత్మకమైన వేడుకలకు చాలామంది దూరంగా జరుగుతారని అనిపిస్తోంది. ప్రసిద్ధ జంట కళాకారిణులు రంజని - గాయత్రి పెద్ద ప్రకటన కూడా చేశారు. హరికథా విద్వాంసులు దుష్యంతి శ్రీథర్, విశాఖ హరి వంటీఎందరో నిరసన స్వరాన్నే అందుకున్నారు. తెలుగునాట కూడా అవే ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. 1976లో తమిళనాడులో బ్రాహ్మణ కుటుంబంలో, శాస్త్రీయ సంగీత కుటుంబంలో జన్మించిన కృష్ణ మొదటి నుంచీ కొత్త గొంతును వినిపిస్తున్నారు. బ్రాహ్మణత్వంపైన, కర్ణాటక సంగీత ప్రపంచంలో బ్రాహ్మణుల పెత్తనం పెరిగిపోతోందంటూ కృష్ణ నినదిస్తున్నారు. సమాజంలో, సంగీత సమాజంలో ఎన్నో సంస్కరణలు రావాలని, సమ సమాజ స్థాపన జరగాలని మాట్లాడుతున్నారు. తాను గురుశిష్య పరంపరలోనే సంగీతం నేర్చుకున్నప్పటికీ దాని పైన తన దృక్పథం వేరని చెబుతున్నారు. చెంబై విద్యనాథ భాగవతార్ - కె జె ఏసుదాసు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు - అన్నవరపు రామస్వామి వంటివారి గురుశిష్య బంధాలు ఆయనకు ఏ విధంగా అర్ధమవుతున్నాయో? అనే ప్రశ్నలు వస్తున్నాయి. త్యాగయ్య మొదలు మహా వాగ్గేయకారులందరిపైనా ఆయన వివిధ సమయాల్లో విమర్శనాస్త్రాలు సంధించారు. ఎం.ఎస్ సుబ్బలక్ష్మి దేవదాసి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ బ్రాహ్మణత్వంతోనే ప్రవర్తించారని, అదే పద్ధతిని అనుసరించి పాడుతూ పెద్దపేరు తెచ్చుకున్నారని, ఆ కీర్తి కోసమే ఆమె ఆలా చేశారని గతంలో కృష్ణ చేసిన విమర్శలు పెద్ద దుమారం రేపాయి. బ్రాహ్మణత్వాన్ని పులుముకోకపోతే ఈ శాస్త్రీయ సంగీత రంగంలో ఇమడలేరని, రాణించలేరని, అందుకే సుబ్బలక్ష్మికి కూడా అలా ఉండక తప్పలేదని కృష్ణ బాధామయ కవి హృదయం. కులాన్ని బద్దలు కొట్టాలని, కళలు, సంగీతం అందరికీ అందాలని, అది జరగడంలేదని వాదిస్తూ, సముద్ర తీరాలలో, మత్స్యకార వాడల్లో, వివిధ సమాజాల్లో కచేరీలు, సంగీత ఉత్సవాలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. పర్యావరణ విధ్వంసంపైన, బీజేపీ ప్రభుత్వ విధానాలపైన, వివిధ ఉద్యమ వేదికల ద్వారా తన వ్యతిరేకతను చాటుకుంటూ వస్తున్నారు. కర్ణాటక సంగీతాన్ని గ్రామీణ ప్రాంతాలకు, వెనుకబడిన వర్గాల దగ్గరకు తీసుకెళ్లాలంటూ చేసిన ప్రదర్శనలు మీడియాను కూడ బాగా ఆకర్షించాయి. ఈ నేపథ్యంతో 2016లో ప్రతిష్ఠాత్మక 'రామన్ మెగసెసే అవార్డు' కూడా అందుకున్నారు. తమిళ భాషను, యాసను ప్రచారం చేసే క్రమంలో కృష్ణ తెలుగును చిన్నచూపు చూస్తూ వస్తున్నారు. త్యాగయ్య కీర్తనలు ఈనాటికి పనికిరావని, ఆ సాహిత్యం మూఢమైనదనే భావనలను కూడా ప్రచారం చేశారు. మహా వాగ్గేయకారులు రచించిన కీర్తనలను సాహిత్యానికి, భావానికి, భాషకు సంబంధం లేకుండా నడ్డివిరచి పాడుతూ మహనీయులను హేళన చేస్తున్నాడని, తెలుగు భాషను అవమానపరుస్తున్నాడనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇతను కేవలం సంగీత విద్వాంసుడుగానే కాక, ఉద్యమకారుడుగానూ ప్రచారంలోకి వచ్చాడు. ఈ.వి రామస్వామి పెరియార్ భావాలను అనుసరిస్తూ, గీతాలను సృష్టిస్తూ, గానం చేస్తూ, ప్రచారం చేస్తూ వున్నారు. ఇస్లాం, క్రిస్టియన్ పాటలు కూడా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో స్వరపరచి ఎందుకు పాడకూడదు? అన్నది అతి వాదన. బ్రాహ్మణులు, దైవం, హిందూమతం, కాంగ్రెస్, మహాత్మాగాంధీని పెరియార్ వ్యతిరేకించారు. కృష్ణ కూడా ఇంచుమించు అవే భావనలలో వున్నారు. బీజేపీ, సంఘ్ పరివార్పైన కూడా అనేకసార్లు తీవ్రమైన విమర్శలు చేశారు. ఈయన ప్రస్తుత పురస్కారం ఎంపిక విధానాన్ని, అర్హతను గమనిస్తే, ఇతని కంటే గొప్పవాళ్ళు, జ్ఞాన, వయో వృద్ధులు ఎందరో వున్నారు. వాళ్లందరినీ కాదంటూ ఈయనకు ఈ పురస్కారం ఇవ్వాల్సినంత శక్తి సామర్ధ్యాలు, అనుభవం ఆయనకు లేవన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం. సంప్రదాయ వ్యతిరేకత ముసుగులో, సంస్కరణ మాటున సాహిత్యంతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా అవమానిస్తున్నాడని సంప్రదాయవాదులంతా ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు భాషను ముక్కలు ముక్కలుగా నరికివేస్తున్నాడని తెలుగు భాషాప్రియులెందరో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ సంగీతం పట్ల, వాగ్గేయకార మహనీయుల పట్ల, తెలుగు భాష పట్ల గౌరవం లేనప్పుడు అసలు ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నాడని అనేకులు మండిపడుతున్నారు. సంగీత కళానిధి పురస్కారం సంగతి అటుంచగా, ఇంతటి విపరీత ధోరణులతో ప్రవర్తిస్తున్న వ్యక్తిని చూస్తూ ఊరుకోబోమనే మాటలు సనాతన సమాజాల నుంచి వినపడుతున్నాయి. ఈ పురస్కార ప్రకటనను మ్యూజిక్ అకాడమీ విరమించుకుంటుందని చెప్పలేం. ఈ ధోరణులతో నడుస్తున్న కృష్ణ శాస్త్రీయ రాగాలను ఎంచుకోకుండా, తాను కొత్త కొత్త రాగాలను పుట్టించుకొని అందులో పాడుకొమ్మని కొందరు సలహా ఇస్తున్నారు. ఈ సనాతన భారతంలో "కృష్ణ కృష్ణ - ఇదేమి ఘోరం " అని సంప్రదాయ ప్రేమికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే అనేకమంది అతనిపై న్యాయస్థానాలలో కేసులు కూడా పెడుతున్నారు. ఏమవుతుందో చూద్దాం. - రచయిత, మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
ట్యాపింగ్ కేసులో టెలిగ్రాఫ్ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ ఐబీ) కార్యాలయం కేంద్రంగా సాగిన అక్రమఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ (ఐటీఏ)ను కూడా జత చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నా రు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైనప్పుడు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నల అరెస్టు సమ యంలో ఈ చట్టంలోని సెక్షన్ల మేరకు ఆరోపణలు లేవు. తాజాగా ఈ చట్టాన్ని జోడించిన అధికారులు ఈ మేరకు నాంపల్లి కోర్టుకు మెమో ద్వారా సమాచారమిచ్చా రు. మరోపక్క ఈ కేసులో నిందితులపై నేరం నిరూపించ డానికి అవసరమైన చర్యలను సిట్ అధికారులు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఎస్ఐబీలో ఎలక్ట్రీషియన్‌గా పని చేసిన టీఎస్ఎస్పీ కానిస్టేబుల్‌ను సాక్షిగా చేర్చారు. ఐటీఏ ఉండాలన్న న్యాయ నిపుణులు ట్యాపింగ్‌పై ఎస్ఐబీ అదనపు ఎస్పీ డి.రమేష్ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ప్రణీత్ రావు, ఇతరులపై ఈ నెల 10న కేసు నమోదైంది. దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచార నివేదికలో (ఎఫ్ఐఆర్) పోలీసులు మూడు చట్టాల్లోని తొమ్మిది సెక్షన్ల కింద ఆరోపణలు చేశారు. ఐపీసీ, పీడీపీపీ, ఐటీ చట్టాల్లోని సెక్షన్లు చేర్చారు. కాగా ఈ నెల 13న ప్రణీత్ అరెస్టు తర్వాత కోర్టులో రిమాండ్ కేసు డైరీని సమర్పించిన అధికారులు.. ఇందులో ఓ సెక్షన్ తగ్గించి ఎనిమిదింటి కిందే ఆరోపణలు చేశారు. తొలుత చేర్చిన ఐపీసీలోని 120 బీ (కుట్ర), 34 (ఒకే ఉద్దేశంతో చేసే ఉమ్మడి చర్య) రెండు సెక్షన్లలో.. 120 బీ సెక్షన్లను తొలగించారు. అయితే నిందితులపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కింద అభియోగాలు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఐటీఏను జోడించి, అందులోని సెక్షన్లు వర్తింపజేయాలని న్యాయ నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్నల కస్టడీ పిటిషన్లతో పాటు ఈ చట్టాన్ని జోడిస్తూ మెమోను కూడా అధికారులు కోర్టులో దాఖలు చేశారు. కీలకం కానున్న హెడ్ కానిస్టేబుల్ కృష్ణ హార్డ్‌డిస్క్‌ల విధ్వంసంలో ప్రణీత్‌రావుతో కలిసి పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ కైతోజు కృష్ణను ఈ కేసులో సాక్షిగా చేర్చారు. నాటి ఎస్ఐబీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ప్రణీత్‌రావు గత ఏడాది డిసెంబర్ 4న అర్ధరాత్రి కృష్ణతో కలిసే ఎస్ఐబీ కార్యాలయంలోకి వెళ్లాడు. అక్కడ తాను ఏర్పాటు చేసుకున్న వార్ రూమ్‌తో పాటు అధికారిక ట్యాపింగ్‌లు జరిగే లాగర్ రూమ్ దగ్గర సీసీ కెమెరాలను కృష్ణ ద్వారా ఆఫ్ చేయించాడు. అతని సహాయంతో వార్ రూమ్‌లోని 17 కంప్యూటర్లలో ఉన్న వాటితో పాటు విడిగా భద్రపరిచిన 50 హార్డ్ డిస్క్ల్నీ ఎలక్ట్రిక్ కట్టర్ వినియోగించి ధ్వంసం చేశాడు. ఈ కారణంగానే సిట్ అధికారులు కృష్ణను సాక్షిగా చేర్చారు. త్వరలో ఇతడితో న్యాయస్థానంలో స్టేట్మెంట్ రికార్డు చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే సిట్ కృష్ణ వాంగ్మూలం నమోదు చేయగా.. భవిష్యత్తులో అతను సాక్ష్యం చెప్పకుండా ఎదురుతిరిగే అవకాశం లేకుండా ఈ చర్య తీసుకోనున్నారు. ఎస్ఐబీలో నడిచిన ఓఎస్డీల రాజ్యం.. ఎస్ఐబీని చాలాకాలం పాటు పదవీ విరమణ పొంది ఓఎస్డీలుగా పనిచేస్తున్న వాళ్లే నడిపినట్లు తెలిసింది. ఇలాంటి దాదాపు 15 మంది అధికారులను ఆధారంగా చేసుకుని కథ నడిపినట్లు సమాచారం. ఓ మాజీ డీఐజీ, ముగ్గురు మాజీ ఎస్పీలు, ఐదుగురు అదనపు ఎస్పీలు ఇందులో కీలకంగా పనిచేశారని తెలుస్తోంది. అయితే ప్రభుత్వం మారిన తరవాత ప్రభాకర్‌రావుతో పాటే వీళ్లు కూడా రాజీనామా చేసి వెళ్లిపోయారు. సాధారణంగా ఎస్ఐబీ లాంటి సున్నిత విభాగాల్లో మాజీ అధికారులను, ప్రైవేట్ వ్యక్తులను కీలక స్థానాల్లో ఉంచరని, అయితే ప్రభాకర్‌రావు స్వయంగా ఓఎస్డీ కావడంతో ఎస్ఐబీలో ఓఎస్డీలతో పాటు ప్రైవేట్ వ్యక్తుల రాజ్యం నడిచిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మరోపక్క ప్రణీత్‌రావుకు ట్యాపింగ్ వ్యవహారంలో ఐదుగురు ఇన్స్పెక్టర్లు సహకరించినట్లు సిట్ తేల్చింది. ఆ అధికారులకు త్వరలో నోటీసులు? అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ అధికారులు త్వరలో డీజీపీ, అదనపు డీజీపీ స్థాయి అధికారులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రధాన కార్యాలయం లక్డీకాపూల్‌లో ఉన్నప్ప టికీ... గ్రీన్‌ల్యాండ్స్‌లోని ఎస్ఐబీ కార్యాలయంలో కూడా ఆయనకు ఓ ఛాంబర్ ఉంది. గడిచిన కొన్నేళ్లుగా నిఘా విభాగాధిపతి అక్కడకు రాక పోవడంతో ప్రణీత్ రావు ఈ ఛాంబర్‌తో పాటు పక్కన ఉన్న రూమ్‌ను తన అక్రమ ట్యాపింగ్ వ్యవహారాల కోసం వార్‌రూమ్‌గా వినియోగించుకున్నట్లు తేలింది. ఆ చాంబర్ ఇతరులు విని యోగించాంటే కచ్చితంగా నిఘా విభాగాధిపతి, డీజీపీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అప్పట్లో ఏ కారణం చెప్పి ఈ అనుమతి తీసుకు న్నారు? ట్యాపింగ్ వ్యవహారాలు తెలిసే అను మతి ఇచ్చారా? లాంటి సందేహాలు నివృత్తి చేసుకోవడానికి గాను వీరికి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. -
దుబాయ్ శ్రీకృష్ణ మందిరంలో హోలీ వేడుకలు!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో గల శ్రీకృష్ణ దేవాలయంలో భక్తులు హోలీ వేడుకలను ఘనంగా చేసుకుంటున్నారు. యూఏఈలోని భారతీయులు సామరస్య పూర్వకంగా హోలీని జరుపుకుంటున్నారని ప్రముఖ వ్యాపారవేత్త చంద్రశేఖర్ భాటియా మీడియాకు తెలిపారు. భారత రాయబారి సంజయ్ సుధీర్ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రంజాన్ మాసంలో మత సామరస్యం ఉట్టిపడేలా వసంతోత్సవాలు చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. దుబాయ్‌లోని పలు దేవాలయాలలో హోలీ సందర్భంగా భజనలతో పాటు హోలికా దహనాన్ని నిర్వహించారు. దుబాయ్‌లోని భారతీయ కమ్యూనిటీకి చెందిన సభ్యులు పలువురికి స్వీట్లు పంచి, హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. #यूएई ♦दुबई के कृष्ण मंदिर में श्रद्धालुओं ने मनाई होली#Holi #Dubai #KrishnaTemple pic.twitter.com/8YojdmjkFL — Knews (@Knewsindia) March 25, 2024 -
సంగీతంలో అపశ్రుతి
సంగీతంలో సప్తస్వరాలు ఉన్నాయి. పశుపక్ష్యాదుల ధ్వనుల నుంచి ఇవి పుట్టినట్లు ప్రతీతి. శ్రుతి లయలు స్వరాల గమనానికి దిశానిర్దేశం చేసి, సంగీతాన్ని మనోరంజకం చేస్తాయి. సంగీతానికి ఆధారభూతమైన సప్తస్వరాలైనా, శ్రుతిలయాదులైనా– అన్నీ ప్రకృతి నుంచి పుట్టినవే! ప్రకృతికి కులమతాలు లేవు. ప్రకృతి నుంచి పుట్టిన సంగీతానికి కూడా కులమతాలు లేవు, సరిహద్దులు లేవు. చక్కని సంగీతానికి శ్రావ్యతే గీటురాయి. సంగీత కళను శాస్త్రబద్ధం చేసిన తొలి రోజుల్లో సంగీతానికి సంబంధించిన శాస్త్రీయ సంప్రదాయాలు కొన్ని ఏర్పడ్డాయి. తర్వాతి తరా లలో కొందరు సంగీత విద్వాంసులు పూర్వసంప్రదాయాలను, చాదస్తాలను తోసిపుచ్చి, తమదైన సృజనతో కొత్త ఒరవడికి నాంది పలికారు. తొలినాళ్లలో ఏకరీతిలో ఉన్న భారతీయ సంగీతంలో పద్నాలుగో శతాబ్దం నాటికి విభజన ఏర్పడింది. భారతీయ సంగీతంలో హిందుస్తానీ సంగీతం, కర్ణాటక సంగీతం ప్రధాన శాఖలుగా ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సంగీతంలో ఎన్ని శాఖలు ఉన్నా, అవన్నీ శైలీభేదాల వల్ల ఏర్పడి నవి మాత్రమే! కర్ణాటక సంగీతానికి పురందరదాసు పితామహుడిగా పేరుగాంచారు. ఆయన తర్వాతి కాలంలో త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి ‘కర్ణాటక సంగీత త్రిమూ ర్తులు’గా పేరుపొందారు. వీరందరూ ఎవరి స్థాయిలో వారు ప్రయోగాలు చేసిన వారే గాని, పూర్వ శాస్త్రగ్రంథాల్లోని పాఠాలకు కట్టుబడి, వాటినే తు.చ. తప్పకుండా వల్లెవేసిన వారు కాదు. వారంతా మడిగట్టుకుని పూర్వగ్రంథాల్లోని పద్ధతులకే పరిమితమై ఉన్నట్లయితే, ఈనాడు కర్ణాటక సంగీతం ఇంతటి ఉత్కృష్ట స్థాయికి చేరుకునేదే కాదు. ముత్తుస్వామి దీక్షితార్ సాహసోపేతమైన ప్రయోగాలే చేశారు. ఈస్టిండియా కంపెనీ అధికారి కర్నల్ జేమ్స్ బ్రౌన్ ప్రోత్సాహంతో ఇంగ్లిష్ సంగీత బాణీలకు సంస్కృత రచనలు చేశారు. ఈస్టిండియా కంపెనీ బ్యాండ్ ఆర్కెస్ట్రాలో ఉపయోగించే వయొలిన్‌ను చూసి ముచ్చటపడి కర్ణాటక సంగీత కచేరీల్లోకి తీసుకువచ్చారు. ముత్తుస్వామి సోదరుడు బాలుస్వామి తొలిసారిగా కర్ణాటక సంగీత కచేరీలో వయొలిన్ వాయించారు. పాశ్చాత్య శైలిలో ‘నోటు స్వరాలు’ కూర్చి సంప్రదాయ కచేరీల్లో వినిపించడం ప్రారంభించారు. ముత్తుస్వామి దీక్షితార్ చేసిన ప్రయోగాలు ఆనాటిసంప్రదాయవాదులకు మింగుడుపడనివే! చాదస్తపు విమర్శలకు భయపడి ముత్తుస్వామి తన ప్రయోగాలను విరమించుకున్నట్లయితే, ఆయన అనామకంగానే కాలగర్భంలో కలిసిపోయేవారు. ముత్తుస్వామి దీక్షితార్ తర్వాతికాలంలో కూడా కొందరు విద్వాంసులు క్లారినెట్, శాక్సాఫోన్, మాండొలిన్, గిటార్, వయోలా, పియానో వంటి పాశ్చాత్య వాద్యపరికరాలను కర్ణాటక సంగీత కచేరీలకు పరిచయం చేశారు. త్యాగరాజు కాలం నాటికి అప్పటి తంజావూరు సంస్థానంలో పాశ్చాత్య సంగీతానికి కూడా సమాదరణ ఉండేది. త్యాగరాజు రాజాశ్రయానికి దూరంగా తనసంగీత సాధన కొనసాగించినా, ఆయనపైనా పాశ్చాత్య సంగీత ప్రభావం లేకపోలేదు. త్యాగరాజు ఏటా వేసవిలో ఎక్కువగా తిరువయ్యారులో గడిపేవారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన పాశ్చాత్యసంగీతాన్ని ఆస్వాదించారు. త్యాగరాజు ఆ తర్వాతి కాలంలో శంకరాభరణ రాగంలో కూర్చిన ‘వరలీలా గానలోలా’, ‘సారస నేత్ర’, సుపోషిణి రాగంలో కూర్చిన ‘రమించు వారెవరురా’ వంటి కొద్ది కీర్తనల్లో పాశ్చాత్య సంగీత ధోరణులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ప్రయోగాలు లేకుండా ఏ కళా, ఏ శాస్త్రమూ అభివృద్ధి చెందదు. మన కాలానికి చెందిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ కూడా కర్ణాటక సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేసి శ్రోతలను మెప్పించారు. సంగీత సంప్రదాయం ప్రకారం ఆరోహణ అవరోహణలలో ఒక రాగానికి కనీసం ఐదేసి స్వరాలు ఉండాలి. ఆరోహణ అవరోహణలలో ఐదు కంటే తక్కువ స్వరాలను ఉపయో గించి ఆయన కొత్త రాగాలను సృష్టించారు. నేటితరంలో టి.ఎం.కృష్ణ తనదైన శైలిలో సంగీతంలో ప్రయోగాలను కొనసాగిస్తున్నారు. సంప్రదాయ కచేరీ నమూనాలోనే మార్పులను తీసుకొచ్చారు. వర్ణాలు, కృతులు, తిల్లానాలు వంటి వాటితోనే సాగే కర్ణాటక సంగీత కచేరీల్లో టి.ఎం.కృష్ణ క్రైస్తవ గీతాలను, ఇస్లాం గీతాలను, తమిళ కవుల గేయాలను కూడా పాడటం ద్వారా కొత్త ఒరవడికి నాంది పలికారు. కచేరీల్లో టి.ఎం. కృష్ణ ఈ మార్పులను తెచ్చినప్పటి నుంచి మతతత్త్వవాదులు ఆయనపై విమర్శలు గుప్పిస్తూ వస్తు న్నారు. టి.ఎం.కృష్ణ సంగీత రంగానికి మాత్రమే పరిమితం కాకుండా; దేశంలోని సామాజిక పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందించే తీరు, దళితవాడలకు వెళ్లి కచేరీలు చేస్తూ సంగీతాన్ని సామాన్యుల చెంతకు చేరుస్తున్న పద్ధతి కూడా వారికి కంటగింపుగా మారింది. ఇదివరకు టి.ఎం. కృష్ణకు రామన్ మెగసెసె అవార్డు వచ్చినప్పుడు రుసరుసలు వినిపించాయి. ఇటీవల ఆయనకు మ్యూజిక్ అకాడమీ ‘సంగీత కళానిధి’ అవార్డును ప్రకటించింది. దీనికి నిరసనగా గాయనీమణులు రంజని, గాయత్రి మ్యూజిక్ అకాడమీలో ఈసారి కచేరీ చేయబోమంటూ, అకాడమీ అధ్యక్షుడికి లేఖ రాశారు. మ్యూజిక్ అకాడమీ అధ్యక్షుడు ఎన్. మురళి ఆ లేఖకు ఇచ్చిన సమాధానంలో వారి తీరును తప్పుపట్టారు. టి.ఎం.కృష్ణపై అక్కసు వెళ్లగక్కుతున్న వారంతా ఆయన సంగీత సామ ర్థ్యాన్ని గురించి మాట్లాడకుండా, ఆయన సంప్రదాయాన్ని మంటగలిపేస్తున్నాడంటూ గగ్గోలు పెడుతుండటం గమనార్హం. రంజని, గాయత్రి వంటి వారి తీరు సంగీత ప్రపంచంలో ఒక అపశ్రుతి. అయితే, సంగీతం ఒక స్వరవాహిని. ఇలాంటి అపశ్రుతులను సవరించుకుంటూ తన ప్రవాహాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019