breaking news
Ad - Sakshi_Home_Sticky
-
రామోజీ.. మీ రాతల్లోనే వ్యత్యాసం
సాక్షి, అమరావతి : రామోజీ మెదడు మోకాల్లోకి వచ్చిందేమోనన్న సందేహాలను ఈనాడు ప్రచురించే కథనాలు బలపరుస్తున్నాయి. పొదుపు సంఘాల రుణాలకు కొన్ని జిల్లాల్లో ఒక విధంగా.. మరికొన్ని జిల్లాల్లో మరో విధంగా వ్యత్యాసపు వడ్డీ రేటును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని అజ్ఞానపు రాతలతో సున్నా వడ్డీ రుణాలపై శుక్రవారం ‘అన్నా...సున్నా అంటే అంత భారమా?’ శీర్షికన ఒక తెలివితక్కువ కథనాన్ని ఈనాడు ప్రచురించింది. ఈనాడు అజ్ఞానాన్ని చూసి బ్యాంకులు, పొదుపు సంఘాల మహిళలు నవ్విపోతారన్న స్పృహ అయినా రామోజీకి లేకుండా పోయింది. బాబు 2014 ఎన్నికల ముందు తాను అధికారంలోకి వస్తే బేషరతుగా పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఘోరమైన అబద్ధమాడి, అధికారంలోకి వచ్చిన తర్వాత రూపాయి కూడా మాఫీ చేయలేదు. మాఫీ చేయకపోగా తన హయాంలో సున్నా వడ్డీ పథకాన్ని ఆపేస్తే.. సీఎం జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు పెట్టిన బకాయిలన్నిటినీ బ్యాంకులకు చెల్లించి, ఆ పథకాన్ని పునరుద్ధరించారు. బాబు చేసిన మోసానికి పొదుపు సంఘాలు నీరుకారిపోయాయి. సున్నా వడ్డీ రుణాలు అందక అల్లాడిపోయాయి. బాబు చేసిన ఈ ఘోరమైన తప్పును జగన్ సరిదిద్దడంతో బ్యాంకులు ఇప్పుడు పొదుపు సంఘాలకు రుణాలు ఇవ్వడానికి పోటీ పడుతున్నాయి. ఈ నిజాలు రామోజీ మట్టిబుర్రకు తెలియక అజ్ఞానాన్ని రంగరించి, పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాల్లో నాలుగు శాతమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని, మిగిలింది కేంద్రం ఇస్తోందని తన తెలివితక్కువ పాత్రికేయ అసమర్థతను బయటపెట్టుకుంది. తెలివి తక్కువ తనాన్ని బయటపెట్టుకున్న ఈనాడు... ‘ఆరు జిల్లాలకు ఏడు శాతం కేంద్రం రాయితీ’ అంటూ తమ కథనంలో ఓ ఉపశీర్షికను పెట్టి.. జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోందని , అందులో ఏపీ పరిధిలో ఆరు ఉమ్మడి జిల్లాలు ఉన్నట్టు ‘ఈనాడు’ రాసుకుపోయింది. ఆ ఆరు జిల్లాల్లో మాత్రమే సంఘాలు రూ. 3 లక్షల వరకు తీసుకున్న రుణానికి అక్కడ బ్యాంకులు 11 శాతం వడ్డీకి రుణాలు ఇస్తూ, కేంద్రం ఏడు శాతం రాయితీ ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం నాలుగు శాతమే భరిస్తోందంటూ ఈనాడు రాసింది. వాస్తవం ఏమిటంటే..2022 జూలై 20న ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాల మేరకు ఇప్పుడు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఏడు శాతం వడ్డీకే పొదుపు సంఘాలకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఈ రుణాలపై కేంద్రం ఏడు శాతం వడ్డీ రాయితీ ఇస్తుందన్నదే శుద్ద తప్పు. ఆ ఏడు శాతం వడ్డీ మొత్తాన్ని ఇప్పటి ప్రభుత్వమే భరిస్తోంది. ఈనాడు మరో పెద్ద శుద్ధ తప్పు రాసింది. రాష్ట్రంలో ఇప్పుడు ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఒకలా, మరో ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఇంకోలా వడ్డీ రేటుకు పొదుపు సంఘాలకు రుణాలిస్తోందని రాసింది. అలాంటి వ్యత్యాసం లేనేలేదు. ఇప్పుడు.. బ్యాంకులే మహిళలను బతిమిలాడి రుణాలిచ్చే స్థితి.. అప్పట్లో చంద్రబాబు డ్వాక్రా రుణామాఫీ హామీ ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమలు చేయని కారణంగా రాష్ట్రంలో మొత్తం పొదుపు సంఘాల్లో 18.6 శాతం సంఘాలు అంటే ప్రతి ఐదులో ఒక సంఘం బాబు మాట నమ్మి తమ రుణాలు చెల్లించకపోవడంతో వాళ్లందరూ బ్యాంకుల ఎగవేతదారులుగా ముద్ర వేయించుకున్నారు. ఇప్పుడు పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 2019 ఎన్నికల నాటికి ఉన్న అప్పు మొత్తం ప్రభుత్వమే తిరిగి చెల్లించడం వంటి కారణాలతో ఇప్పుడు మహిళలు 99.83 శాతం మంది అంటే దాదాపు అందరూ ఎప్పటికప్పుడు తమ కిస్తీలను చెల్లిస్తున్నారు. ఈ చెల్లింపులతో బ్యాంకులు పొదుపు సంఘాల మహిళలపై నమ్మకాన్ని పెంచుకున్నాయి. ఇప్పుడు ఎంత కావాలంటే అంత రుణాలు బ్యాంకులు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. 2019 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు ఐదేళ్ల కాలంలో ఏకంగా 1.73 లక్షల కోట్ల మొత్తాన్ని బ్యాంకులు పొదుపు సంఘాలకు రుణాలుగా ఇచ్చాయంటే రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల వద్ద ఎంత పరపతి పెరిగిందో అర్ధమవుతుంది. బాబు ప్రభుత్వంలో కేవలం ఒక్కో సంఘానికి గరిష్ఠంగా రూ. 10 లక్షల చొప్పున మాత్రమే బ్యాంకు రుణాలు ఇవ్వగా, ఇటీవల ఆర్బీఐ పొదుపు సంఘాలకు గరిష్ఠంగా రూ. 20 లక్షల వరకు పరిమితిని పెంచడంతో చాలా సంఘాలు ఇప్పుడు రూ. 20 లక్షల చొప్పున రుణాలు పొందుతున్నాయి. చంద్రబాబు చేసిన మోసం ఈ ప్రభుత్వానికి అంటగట్టే యత్నం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పొదుపు సంఘాల రుణాలపై మొదట పావలా వడ్డీ పథకం అమలు చేయగా, తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనే సున్నా వడ్డీ అమలులోకి వచ్చింది. విభజన అనంతరం.. 2014 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఐదేళ్ల కాలంలో ఒక రూపాయినైనా మాఫీ చేయకుండా రాష్ట్రంలో పొదుపుసంఘాల మహిళలందరినీ మోసం చేసిన చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో సున్నా వడ్డీ పథకానికీ మంగళం పాడేశారు. 2016 జూలై తర్వాత రాష్ట్రంలో పొదుపు సంఘాల రుణాలపై వడ్డీలో ఒక్క రూపాయి అయినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తిరిగి మహిళలకు చెల్లించలేదు. 2019లో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తిరిగి వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు గత ఐదేళ్లుగా ఏటా ఠంచన్‌గా ఆర్థిక సంవత్సరం ముగియగానే ఆ ఏడాది వడ్డీ డబ్బును ప్రభుత్వం తిరిగి మహిళలకు చెల్లిస్తూ వస్తోంది. గత నాలుగేళ్లల్లో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా వారి రుణాలపై వడ్డీ రూ. 4969.05 కోట్లను ఇప్పటికే ఆయా మహిళలకు చెల్లించింది. 2023–24 సంవత్సర వడ్డీని ఇటీవల ముగిసిన మార్చి నెలాఖరు తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లోగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. వాస్తవం ఇది...దీనికి భిన్నంగా చంద్రబాబును వెనకేసుకొచ్చే రాతలు రాసింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 2016 నుంచి ఆపేసిన సున్నా వడ్డీని గొప్పగా చిత్రీకరిస్తూ.. అవన్నీ బకాయిలుగా పేర్కొంది. అప్పటి ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించలేదని , ఇదంతా ‘జగన్ మోహన్‌రెడ్డి నయవంచన’ అంటూ ఈనాడు వక్రీకరించింది. వరుసగా రెండన్నరేళ్ల పాటు పథకానికి నిధులు ఇవ్వకుండా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఆపేస్తే వాటిని బకాయిలు ఎలా అంటారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. -
Fact check: ఓటమి భయం ప్రస్ఫుటం
సాక్షి, అమరావతి: రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం, టీడీపీ ఓటమి ఖాయమని జాతీయ చానళ్ల సర్వే ఫలితాలు విడుదలవుతున్న కొద్దీ ...ఈనాడు రామోజీరావులో పాత్రికేయ పైశాచికత్వం పెట్రేగి పోతోంది. ‘మేమంతా సిద్ధం’ యాత్రలో సీఎం వైఎస్ జగన్ పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాదరణతో రామోజీరావుకు తత్వం మెల్లగా బోధపడుతోంది. జగన్‌కు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం తన తరం కాదన్న అక్కసుతో ఏకంగా పోలీసు వ్యవస్థనే బ్లాక్మెయిల్ చేసేందుకు బరితెగించారు. ఆ కసిలో ఈనాడు పత్రికలో ‘అదే అరాచకత్వం...అదే దౌర్జన్యం’ శీర్షికన గురువారం తాజాగా విష పూరిత కథనాన్ని ప్రచురించారు. రామోజీ రాతలకు అతీతంగా అటు ఈసీ, ఇటు పోలీసు వ్యవస్థ నిబద్ధతతో తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడం సానుకూల పరిణామం. కుట్ర బెడిసికొట్టినా ఖాకీలపై ఈనాడు కారుకూతలు... చంద్రబాబు, పురందేశ్వరిల భాగస్వామ్యంతో పోలీసు వ్యవస్థను తమకు గులాంగా చేసుకునే కుట్రలో భాగంగా ...రాష్ట్రంలో 20 మందికి పైగా ఐపీఎస్ అధికారులను మార్చేయాలని ఈనాడు లో కథనాలు రాశారు. రామోజీ పాచిక పారలేదు. డీఐజీ, ఐదుగురు ఎస్పీలను మాత్రమే ఎన్నికల కమిషన్ మార్చింది. వారి స్థానాల్లో తాము చెప్పిన వారినే నియమించాలన్నట్టుగా పచ్చ ముఠా పరోక్షంగా ఆదేశాలు జారీ చేసింది. తద్భిన్నంగా నియమావళి ప్రకారం ఎన్నికల కమిషన్ ఒక డీఐజీ, ఐదుగురు ఎస్పీలను నియమించడంతో రామోజీలో అహం దెబ్బతింది. దీంతో ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు లక్ష్యంగా దు్రష్పచార కథనాన్ని ఈనాడు ప్రచురించింది. ఈ కథనంతో చిర్రెత్తిన పోలీసు యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. ఏకంగా 19 మంది ఐపీఎస్ అధికారులు టీడీపీ, జనసేన, బీజేపీ, ఈనాడులకు వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఈనాడు తీరుపై మండిపడింది. అంతటితో బుద్ధి రాని రామోజీ కుక్కతోక వంకరన్నట్లు మరోసారి పోలీసు వ్యవస్థపై విధ్వేషం వెళ్లగక్కారు. ఈనాడులో వచి్చన ఆదేశాలనే ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పోలీసులు పాటించాలన్నట్టుగా బ్లాక్‌మెయిలింగ్‌కు దిగజారారు. టీడీపీ దౌర్జన్యాలు, దాడులను మసిపూసి మారేడు కాయ చేస్తూ వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు యతి్నంచారు. వైఎస్సార్సీపీలో ఫలానా నేతలపై ఫలానా సెక్షన్ల కింద కేసులు పెట్టండంటూ పోలీసులకు రామోజీ తన రాతల హుకుం జారీ చేశారు. పోలీసు అధికారుల బెదిరింపునకూ పన్నాగం తాజాగా ఎన్నికల విధుల్లో క్రియాశీలంగా ఉండే డీఎస్పీ, సీఐ, ఎస్సైలను బ్లాక్మెయిల్ చేయడం ద్వారా టీడీపీ అక్రమాలకు అడ్డులేకుండా చేయాలన్న పచ్చ కుట్రలో రామోజీ భాగస్వామిగా మారారు. ఇటీవల పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు దౌ ర్జన్యాలకు పాల్పడ్డ ఉదంతాలను ఈనాడు వక్రీకరిస్తూ తప్పుడు కథనం ప్రచురించింది. మాచర్ల, గన్నవరం, అద్దంకి, ఉరవకొండ, గుడివాడ తదితర నియోజకవర్గాల్లో గత వారం పదిరోజుల్లో టీడీపీ కార్యకర్తలు దౌర్జ న్యాలకు పాల్పడ్డారు. తాజాగా బుధవారం రాత్రి ఒంగోలులో ఎన్నికల ప్రచారంలో ఉన్న వైఎస్సార్సీపీ అ భ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఆయన కుటుంబ స భ్యులనే అడ్డుకున్నారు. అసలు ఎన్నికల ప్రచారం చే యడానికి వీల్లేదని గలాభా సృష్టించారు. ఈ ఘటనల పై స్థానిక పోలీసులకు ఫిర్యాదులు అందడంతో వారు కఠిన చర్యలు తీసుకున్నారు. టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడినా.. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రచా రా న్ని అడ్డుకున్నా పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి చూ స్తుండాలన్నట్టుగా ఈనాడు వితండవాదం చేస్తోంది. ఈసీనే శాసిస్తున్న రామోజీ రాతలు... ఏకంగా రాజ్యంగబద్ధ సంస్థ ఈసీకే పరోక్షంగా తన రాతలతో ఆదేశాలు జారీ చేస్తుండటం రామోజీరావు బరితెగింపునకు నిదర్శనం. ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఏకంగా ఎస్పీలను మారిస్తే సరిపోతుందా... మొత్తం డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను మార్చేయాలని ఈసీకే రాతల హుకుం జారీ చేశారు. అందర్నీ మారుస్తామన్నారు..ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈసీనే ఈనాడు నిలదీయడాన్ని ప్రజాస్వామ్యవాదులే ఛీత్కరించుకుంటున్నారు. ఈసీ కొత్తగా నియమించిన పల్నాడు ఎస్పీపైనా ఈనాడు విషం కక్కింది. అయినా రామోజీ రాతలకు అతీతంగా ఈసీ తన పని తాను పక్షపాత రహితంగా చేసుకుపోతోంది. -
Fact check: అబద్ధాలు రచించెన్
సాక్షి, అమరావతి: అబద్ధం.. కుళ్లు.. భయం.. వీటికి ప్యాంటూ చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం రామోజీ మాదిరే ఉంటాయేమో! జగన్ పరిపాలనలో అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు ప్రతి నెలా పింఛన్లు అందుకుంటూ ఆనందంగా ఉంటే రామోజీకి కంపరంగా ఉంది. ఈ వర్గాల్లో జగన్‌కు పెరుగుతున్న పరపతిని చూసి తన భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తోంది. అందుకే వాస్తవాలకు మసిపూసి ‘నవరత్నాలు – నయవంచన’ అంటూ మరో అబద్ధపు కథనాన్ని అచ్చేసేశారు. ఈ నిస్సిగ్గు పాత్రికేయాన్ని చూసి అక్షరాలు సిగ్గుతో తలదించుకోవాల్సిందేనేమో...!! పింఛనుదారుల సంఖ్య పెరిగింది జగన్ హయాంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. ఇందులో 29.51 లక్షల మంది జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొత్తగా పింఛన్లు అందుకున్నవారే. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో పింఛన్ల సంఖ్య ఏ మాత్రం పెరగలేదు. అప్పట్లో 43.11 లక్షల మంది పింఛనుదారులున్నారని లెక్కలు చెబుతున్నా 39 లక్షల మందికే చెల్లింపులు జరిపేది. నాలుగు నుంచి 5 లక్షల మందికి ఎగ్గొట్టేది. రామోజీ దగ్గర ఈ లెక్కలు లేవో.. లేక కావాలనే విస్మరించారో. ఇంటికో పింఛను విధానం బాబుదే కుటుంబానికి ఒక్కటే పింఛను విధానం జగన్ ప్రభుత్వం అమలు చేసినట్టు ఈనాడు ఓ అబద్ధాన్ని రాసింది. ఈ విధానం ప్రవేశపెట్టిందే చంద్రబాబు ప్రభుత్వం. 2014 సెప్టెంబర్ 18న ఆర్సీ నంబరు 1053 పేరిట జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఐదేళ్ల పాటు దీన్ని అమలు చేసింది. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒకే ఇంటిలో ఇద్దరు దివ్యాంగులున్నా రెండో పింఛను ఇచ్చే విధానాన్ని అమలు చేశారు. మరో వైపు.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల చొప్పున నెలనెలా పింఛన్ అందిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే కొత్తగా తీసుకొచి్చన ఈ మేలును బహుశా రామోజీ మరిచిపోయి ఉంటారు. కోతల్లేవు పింఛనుదారులలో మరణాల సంఖ్యను ఎక్కువగా చూపి పింఛన్లను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తగ్గించినట్టు ఈనాడు ఇంకో అబద్ధం ప్రచురించింది. సాధారణంగా పింఛనుదారుల్లో 0.5 శాతం మరణాలు నమోదవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇది 0.8 శాతం ఉండొచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2015 మేలో 0.8 శాతం మేర అంటే 36,406 మరణాలు నమోదు కావడంతో ఆ నెలలో పింఛన్లకు కోత పెట్టింది. అదే ఏడాది ఏప్రిల్‌లో 0.6 శాతం మేర అంటే 22,334 మంది పింఛనుదారులు మరణించినట్లు లెక్కలు వేసి వాటిని తొలగించింది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో వాస్తవ మరణాలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆ మేరకే తొలగింపులు ఉంటున్నాయి. గత ఆరు నెలల గణాంకాలు తీసుకుంటే ఏ నెలలోనూ ఈ సంఖ్య 20 వేలకు మించలేదు. పింఛను విధానంలో మరెన్నో మార్పులు ► గత పాలనలో పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు చాంతాడంత క్యూలో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.6 లక్షల గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీ పొ ద్దున్నే లబ్ధిదారుల గడప వద్దనే అందిస్తోంది. ► పింఛన్ల మంజూరులో లంచాలు, వివక్ష, జన్మభూమి కమిటీల పెత్తనాన్ని జగన్ కూకటివేళ్లతో పెకలించారు. కుల, మత వర్గ, పార్టీలకు అతీతంగా లంచాలు, వివక్ష, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తున్నారు. అర్హులై ఉండి ఒకవేళ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం ఇస్తూ ప్రతి ఏటా జూన్, డిసెంబర్లలో అందజేస్తున్నారు. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో లబి్ధదారుల జాబితాలు ప్రదర్శించి, సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకంగా లబి్ధదారులను ఎంపిక చేస్తున్నారు. ► గత ప్రభుత్వంలో దివ్యాంగులకు 5 ఏళ్లలో అందిన లబ్ధి కేవలం రూ.58,500. ఈ ప్రభుత్వంలో లబ్ధి రూ.1,91,000. అంటే రూ.1,32,500 అదనం. ► పెన్షన్లపై నెలవారీ సగటు వ్యయం రూ.400 కోట్ల నుంచి రూ.1968 కోట్లకు పెంపు. ► 2014–19 మధ్య గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్లపై సగటున వ్యయం రూ.400కోట్లు. -
‘కోతల’ రాతలు ఇంకెన్నాళ్లు
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో అనంతపురానికి మైక్రోసాఫ్ట్ వచ్చేసింది. హైపర్‌లూప్ టెక్నాలజీతో గంటలో అమరావతి నుంచి విశాఖకు వెళ్లిపోవచ్చు. దుబాయ్‌కు చెందిన బీఆర్‌షెట్టి అమరావతిలో నిర్మించిన ఆసుపత్రుల్లో ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుతోంది... ‘ఇవన్నీ గ్రాఫిక్స్ రా’ అని ప్రజలు ఎప్పుడో తేల్చేసినా ఆయన కూలీ రామోజీ మాత్రం ఆ మాయాజాలం నుంచి బయటకు రావడం లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి సర్కార్‌లో విదేశీ పెట్టుబడులు వాస్తవ రూపంలో కనిపిస్తున్నా కళ్లకు గంతలు కట్టేసుకుని రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రాలేదంటూ కొయ్ రాజా కొయ్ శీర్షికతో ఓ పుచ్చు కథనాన్ని ప్రచురించారు. కోవిడ్ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ సంస్థలు తమ వ్యాపార విస్తరణ కార్యక్రమాలను తగ్గించుకున్నప్పటికీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలోనే కాదు వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుంది. గడిచిన ఐదేళ్ల కాలంలో రూ.35,000 కోట్లకుపైగా విదేశీ పెట్టుబడులు వచ్చాయి. జపాన్‌కు చెందిన యకహోమా టైర్స్ అచ్యుపుతాపురం సెజ్‌లో సుమారు రూ.1929 కోట్లతో భారీ టైర్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించింది. జర్మనీకి చెందిన ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద రూ.4,640 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేస్తోంది. యూరప్‌కు చెందిన పెట్రేగ్యాస్ కృష్ణపట్నం వద్ద రూ.600 కోట్లతో ఏర్పాటు చేసిన భారీ ఫ్లోటింగ్ ఎల్ఎన్జీ టెర్మినల్ వారం రోజుల క్రితమే వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించింది. జపాన్‌కు చెందిన డైకిన్ రూ.2,600 కోట్లతో ఏసీ తయారీ యూనిట్‌ను తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ప్రారంభించింది. టోరే ఫార్మా అక్కడే రూ.1,000 కోట్ల పెట్టుబడులను వాస్తవరూపంలో తెచ్చింది. క్యాడ్బరీస్ చాక్లెట్స్ మాండలీజ్ రూ.1,600 కోట్లతో భారీగా విస్తరిస్తోంది. అదిదాస్ బ్రాండ్‌తో తయారయ్యే పాదరక్షల తయారీ సంస్థ హిల్‌టాప్ సెజ్ పేరుతో రూ.800 కోట్లతో ఏర్పాటు చేస్తున్న యూనిట్ ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. దావోస్‌లో పాలకూర పప్పు.. వాస్తవాలు ఇలా కళ్లకు కనబడుతుంటే.. విదేశీ పెట్టుబడుల కోసం రాష్ట్రం చాలా సమావేశాలు, డిప్లొమాటిక్ ఔట్‌రీచ్‌లు ఏర్పాటు చేసింది కానీ ఏం సాధించలేదంటూ ఈనాడు రాసేసింది. గత ప్రభుత్వంలో దావోస్ వెళ్లిన చంద్రబాబు పాలకూర పప్పు... బెండకాయ వేపుడు ప్రసంగం ఇప్పటికీ అంతర్జాతీయంగా కామెడీ పీస్‌గా ఉంది. ఈ నెలలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ భారత్ పర్యటనకు వస్తున్నారు. ఆయనను ఏపీకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇక్కడ వనరులు అవకాశాలను వివరిస్తూ వార్తలు రాయాల్సింది పోయి.. నీచ రాజకీయాల బాబు కోసం స్థానిక యువత నోట్లో మట్టి కొట్టే విధంగా విషపురాతలు రాయడం తగునా? అని యువత ప్రశ్నిస్తోంది. -
Fact Check: రుచీపచీ లేని రాతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారాయి. అత్యాధునిక వైద్యం అందుతోంది. గ్రామాలు, వార్డుల చెంతకు వైద్యం చేరింది. డాక్టర్లే ప్రజల గుమ్మం వద్దకు వచ్చి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. మందులకు కొదవ లేదు. విలేజ్, వార్డు క్లినిక్‌లు ఏర్పడ్డాయి. ఇక ప్రధానాసుపత్రుల్లో సేవలు కార్పొరేట్ స్థాయిని తలపిస్తున్నాయి. గడచిన ఐదేళ్ల సీఎం జగన్ పాలనలో నాడు–నేడు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ బలోపేతం, డైట్ చార్జీల పెంపు ఇలా అనేక సంస్కరణలతో ప్రభుత్వాస్పత్రులు అభివృద్ధి చెందాయి. ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచి్చన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో అభిమానం వెల్లువెత్తుతోంది. ఇది రుచించని ఈనాడు రామోజికి ఆసుపత్రుల్లో అందిస్తున్న రుచికరమైన భోజనం నచ్చలేదు. తన బాబు పాలనలో రుచీపచీలేకుండా వండినా, ఆ ఐదేళ్లలో రోగుల మెనూ ఛార్జీ రూ.40 మించకపోయినా, మూడుపూటలా భోజనం అందించకపోయినా ఈ ‘పచ్చ’రోగికి వెచ్చగా ఉంది. జగన్ పాలనలో మెనూ చార్జి రూ.80కి పెంచి రుచితో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నా రామోజీకి చప్పగానే ఉంది. అందుకే ‘బటన్ల బడాయి.. రోగుల బువ్వకూ బకాయి’ అంటూ రుచీపచీలేని ఓ కథనాన్ని వండేశారు. బాబు పాలనలో ఇదీ గతీ 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఒక్కో రోగికి రూ.40తో భోజనం పెట్టేది. ఇది కూడా 2011లో నిర్దేశించిన ఖర్చు. ఇంత తక్కువ ధరతో ఎలా వీలవుతుందన్న ఆలోచన కూడా అప్పట్లో బాబుకు రాలేదు. ఆ ఐదేళ్లలో ఒక్కసారి కూడా డైట్ చార్జీల పెంపుపై బాబు దృష్టి పెట్టిన పాపాన పోలేదు. రోజులో ఒక పూట మాత్రమే కోడిగుడ్డు అందించేవారు. ఇక అప్పట్లో వైద్య సేవల గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. గుంటూరు జీజీహెచ్‌లో చిన్నారిని ఎలుకలు కొరికి చంపిన దుర్ఘటనే బాబు పాలనలో కునారిల్లిన వైద్య రంగానికి పెద్ద నిదర్శనం. జగన్ పాలనలో ఇదీ పురోగతి 2019లో సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో చేరిన రోగులు త్వరగా కోలుకోవాలంటే నాణ్యమైన వైద్య సేవలతో పాటు, పౌష్టికాహారం అవసరమని గుర్తించారు. ఇందులో భాగంగా రూ.80కు డైట్ చార్జీలను పెంచారు. రోగులకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అందించేందుకు ప్రత్యేకంగా ఒక మెనూ రూపొందించారు. రూ.100 తో గర్భిణులకు నిర్దేశించిన మెనూతో పాటు, అదనంగా చిక్కీలు, రాగి జావ, టీబీ, ఎయిడ్స్, మానసిక రోగులకు హై ప్రొటీన్ డైట్‌ను అందిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటలా రోగులందరికీ కోడిగుడ్డు ఇస్తున్నారు. మెనూలో మార్పులు ఇలా టీడీపీ ప్రభుత్వంలో రోగికి రోజుకు మూడు పూటలా ఆహారం కోసం రూ.40 బ్రేక్ ఫాస్ట్: బ్రెడ్, పాలు మధ్యాహ్న భోజనం: అన్నం, సాంబారు, వెజ్ కర్రీ, గుడ్డు, అరటిపండు, మజ్జిగ రాత్రి భోజనం: అన్నం, సాంబారు, వెజ్ కర్రీ, మజ్జిగ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రోగికి రోజుకు మూడు పూటలా ఆహారం కోసం రూ.80 ఖర్చు బ్రేక్ ఫాస్ట్: ఉప్మా, కిచిడీ, ఇడ్లీ, పొంగలి, కోడిగుడ్డు, పాలు మధ్యాహ్న భోజనం: అన్నం, సాంబారు, ఆకుకూర పప్పు, అరటిపండు, మజ్జిగ, వెజ్ కర్రీ, గుడ్డు రాత్రి భోజనం: అన్నం, సాంబారు, పప్పు, అరటిపండు, మజ్జిగ, వెజ్ కర్రీ, సంగటి, చపాతీ(డయాబెటీస్ రోగులకు), గుడ్డు
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019