Sakshi News home page

Uttar Pradesh: ఆజంఖాన్‌ ‍కంచుకోటను అఖిలేష్‌ కాపాడతారా?

Published Wed, Mar 27 2024 9:41 AM

Will Akhilesh save Azam Khan Lok Sabha seat - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని పలు లోక్‌సభ స్థానాలకు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే పార్టీ నేత ఆజం ఖాన్‌కు కంచుకోటగా ఉన్న రాంపూర్‌పై పార్టీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఈసారి ఆజం స్థానంలో ఎవరిని రంగంలోకి దింపాలనే ప్రశ్న ఎస్‌పీని కలవరపెడుతోంది. ఈ సీటు నుంచి అఖిలేష్ యాదవ్‌ పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని సమాచారం.

అఖిలేష్ రామ్‌పూర్‌ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని అజం ఖాన్ స్వయంగా కోరారట. అయితే ఎస్‌పీ చీఫ్ అఖిలేష్‌ ఇందుకు సిద్ధంగా లేరట. మరోవైపు అఖిలేష్ కుటుంబం నుండి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను రాంపూర్ నుండి పోటీ చేయించాలని పార్టీ భావిస్తోందని సమాచారం.. అధికారికంగా అఖిలేష్‌ ఇంకా ప్రకటించనప్పటికీ తేజ్ ప్రతాప్ యాదవ్‌కు టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయని కొందరు అంటున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. దీంతో యూపీలో సమాజ్‌వాదీ పార్టీ 63 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌కు 17 సీట్లు మిగిలాయి. ఇటీవల యూపీలోని కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. వారణాసి నుంచి అజయ్ సింగ్‌కు, రాజ్‌గఢ్ నుంచి దిగ్విజయ్ సింగ్‌కు అవకాశం కల్పించారు.

homepage_300x250