breaking news
-
ఎన్నికల ప్రచారంలో డింపుల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
పాట్నా : అటు కేంద్రం బీజేపీని ఓడిస్తే.. ఇటు రాష్ట్రంలో కూడా ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చొబెట్టొచ్చంటూ ఉత్తర్‌ప్రదేశ్ సమాజ్‌వాదీ పార్టీ, మెయిన్‌పురి ఎంపీ అభ్యర్ధి డింపుల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెయిన్‌పురిలో డింపుల్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ..‘రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకే ఈ లోక్‌సభ ఎన్నికలు. సమాజంలోని ప్రతి వర్గం నిర్లక్ష్యానికి గురవుతోంది. బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం అబద్ధాలు, దోపిడి ప్రభుత్వమని రాష్ట్రం, దేశం మొత్తం తెలిసిపోయిందని అన్నారు. అందుకే ఈ సారి లోక్‌సభ ఎన్నికల్ని చాలా తెలివిగా ఎదుర్కోవాలని ఓటర్లకు పిలునిచ్చారు. రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న ప్రభుత్వాన్ని ఓడించారు. అందుకు ఈ ఎన్నికలే మనకు ఆయుధం. ఈ (బీజేపీ) ప్రభుత్వాన్ని కేంద్రం నుండి తొలగిస్తే, అప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తొలగించే పని కూడా జరగవచ్చు అని అన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సతీమణీయే డింపుల్ యాదవ్ -
ఎన్నికల సిత్రాలు : మండుటెండలో హేమమాలిని జోరు
ప్రముఖ నటి బీజేపీ ఎంపీ హేమమాలిని లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్, మథురలో ఎన్నికల ప్రచారంలో రైతులను కలిసిన హేమమాలిని గోధుమ పొలంలో గడ్డికోసి సందడి చేశారు. పొలాల్లో పని చేసే మహిళలతో ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. ఈ పదేళ్లుగా తాను క్రమం తప్పకుండా కలుస్తున్న రైతులతో మరోసారి మమేకమయ్యేందుకు వారిని కలిసానని, వారి మధ్యలో ఉండటం వారికి కూడా సంతోషాన్నిచ్చిందని, రైతు మహిళలతో కలిసి ఫోటోలకు పోజులివ్వాలని పట్టుబట్టారంటూ ఆమె రాసుకొచ్చింది. మథుర లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ వరుసగా మూడోసారి హేమమాలిని బరిలోకి దిగింది. 1991 నుండి 1999 వరకు, మధుర నాలుగు సార్లు బీజేపీకి కంచుకోటగా ఉంది. అయితే 2004లో మధుర కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. 2009లో ఆర్ఎల్డీకి చెందిన జయంత్ చౌదరి మధుర నుంచి ఎంపీ అయ్యారు. ఇక ఆ తరువాత 2014లో హేమమాలినిని బీజేపీ రంగంలోకి దించింది. 2019 ఎన్నికల్లో, హేమ భర్త, నటుడు ధర్మేంద్ర కూడా ఆమె కోసం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. Today I went into the farms to interact with the farmers who I have been meeting regularly these 10 years. They loved having me in their midst and insisted I pose with them which I did❤️ pic.twitter.com/iRD4y9DH4k — Hema Malini (@dreamgirlhema) April 11, 2024 తిరిగి ఇదే స్థానం బీజేపీ తరఫున 2024 ఎన్నికల్లో హేమమాలిని నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 26న మధురలో రెండో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. 80 మంది పార్లమెంటు స్థానాలున్న యూపీలో మొత్తం ఏడు దశల్లో ఓటింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 19, 26 మే 7, మే 13, మే 20, మే 23 , జూన్ 1 ఏడు దశల్లో ఓటింగ్ జరుగుతుంది. -
UP: మాఫియాపై సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలపై రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భరోసా ఇచ్చారు. ముజఫర్‌నగర్‌లో బుధవారం(ఏప్రిల్ 10) జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో యోగి మాట్లాడారు. ‘రాష్ట్రంలో ప్రస్తుతం మాఫియా దుస్థితి ఎలా ఉందో చూడొచ్చు. ఎవరి పేరు చెబితే ఒకప్పుడు కర్ఫ్యూ వాతావరణం ఏర్పడేదో వాళ్ల పరిస్థితి మీరే చూస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉన్నపుడు మాఫియా లీడర్ కాన్వాయ్కి ఏకంగా సీఎం కాన్వాయ్ దారి ఇచ్చే పరిస్థితి ఉండేది. మేం అధికారంలోకి వచ్చి చర్యలు తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత మాఫియా ప్యాంట్లు తడుస్తున్నాయి’అని యోగి అన్నారు. ఇదీ చదవండి.. రూ.200 కోట్ల హవాలా గుట్టురట్టు -
ప్రతీ రెండు నెలలకు అయోధ్య భద్రతా సిబ్బంది మార్పు!
అయోధ్యలోని రామాలయ భద్రత కోసం మోహరించిన పీఏసీ సిబ్బందిని ప్రతి రెండు నెలలకోసారి మార్చనున్నారు. రామ మందిర భద్రత బాధ్యతను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్ ప్రత్యేక భద్రతా దళం (యూపీఎస్ఎస్ఎఫ్)నిర్వహిస్తోంది. ఈ దళం ఏర్పాటైనప్పటి నుంచి ఎటువంటి నియామకాలు జరగలేదు. దీంతో పీఏసీ సిబ్బంది సాయాన్ని తీసుకుంటున్నారు. పీఏసీ సిబ్బందిని ఒకేచోట నియమిస్తే వారిలో పని సామర్థ్యం దెబ్బతింటుందని, వారిలో నైతికత పడిపోతుందని భావించిన ఉన్నతాధికారులు పీఏసీ ఫోర్స్‌ను ప్రతీ రెండు నెలలకు మార్చాలని నిర్ణయించారు. అయోధ్యలోని రామ మందిర భద్రత కోసం ఎనిమిది కంపెనీల పీఏసీని యూపీ ఎస్ఎస్ఎఫ్కు అప్పగించారు. అయోధ్యలో మోహరించిన ఈ ఎనిమిది కంపెనీలను ప్రతి రెండు నెలలకు మార్చడానికి డీజీపీ ఆమోదం తెలిపారు. ఈ సిబ్బందికి సెక్యూరిటీ బ్రాంచ్ రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. -
లోక్‌సభ ఎన్నికలకు అఖిలేష్ దూరం?
ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే వార్త వినిపిస్తోంది. దీంతో ఇంతకాలం ఆయన ఆయన కన్నౌజ్ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. ఆయన ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదని, అయితే కన్నౌజ్ సీటు నుంచి ఎవరిని నిలపాలనే దానిపై పార్టీ నేతలతో చర్చించనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఆయన కన్నౌజ్‌లోని బూత్ ఇన్‌ఛార్జ్‌లతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలో కన్నౌజ్ అభ్యర్థిపై చర్చించే అవకాశాలున్నాయంటున్నారు. కన్నౌజ్ సీటు నుంచి అతని బంధువు తేజ్ ప్రతాప్‌కు టిక్కెట్ కేటాయించవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్నౌజ్‌లో ఎన్నికల ఇన్ఛార్జ్తో జరిగే సమావేశం అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కన్నౌజ్ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే ఆమె బీజేపీకి చెందిన సుబ్రతా పాఠక్ చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత ములాయం సింగ్ మరణానంతరం మెయిన్‌పురి స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆమె గెలిచి ఎంపీ అయ్యారు. కాగా రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్‌ను అఖిలేష్ యాదవ్ పోటీకి దించవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆజం ఖాన్ అందుకు సిద్ధంగా లేరని సమాచారం. కన్నౌజ్‌లో సమాజ్‌వాదీ నేతలు అఖిలేష్ యాదవ్ ఇక్కడ నుండి పోటీ చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ సోదరుడు రాజ్వీర్ సింగ్ యాదవ్ కుమారుడు. 2014లో మెయిన్‌పురి స్థానం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అతనికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. తేజ్ ప్రతాప్‌కు ఆర్జేడీ నేత లాలూ యాదవ్‌తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. లాలూకు తేజ్ ప్రతాప్ అల్లుడు. లాలూ యాదవ్ కుమార్తె రాజలక్ష్మి యాదవ్‌ను తేజ్ ప్రతాప్ వివాహం చేసుకున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019