Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

అమెరికా : ఆ ఇద్దరు తప్పు చేశారా? చేతివాటమా?

Published Thu, Apr 18 2024 3:23 PM

Two Telugu girls arrested for shoplifting in US - Sakshi

ఎరక్కపోయి అమెరికాలో ఇరుక్కుపోయారు ఇద్దరు అమ్మాయిలు. తెలిసో తెలియకో ఓ షాపింగ్‌ మాల్‌కు వెళ్లిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.

అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన ఇద్దరు తెలుగు  అమ్మాయిలు ఇబ్బందుల్లో  పడ్డారు. న్యూజెర్సీలో చదువుకుంటున్న వీరిద్దరు హోబెకన్‌ ఏరియాలోని షాప్‌రైట్‌ అనే సూపర్‌ మార్కెట్‌కు వెళ్లారు. ఈ మాల్‌లో కొంతసేపు షాపింగ్‌ చేసిన వీరిద్దరు బిల్లింగ్‌ చేసి బయటికొచ్చారు. అయితే వీరు అన్ని వస్తువులకు కాకుండా.. ఉద్దేశపూర్వకంగా కొన్ని వస్తువులకు మాత్రమే బిల్లు చెల్లించినట్టు పోలీసులు అభియోగం మోపి కేసు పెట్టి అరెస్ట్‌ చేశారు.<

తప్పు ఎక్కడ జరిగింది?

అమెరికాలో చాలా సూపర్‌ మార్కెట్‌లలో మన వస్తువులకు మనమే బిల్లింగ్‌ చేసుకోవాలి. ఇండియా తరహాలో పేమెంట్‌ కౌంటర్లు ఉండవు. సెల్ఫ్‌ చెక్‌ ఇన్‌ పద్ధతిలో వస్తువులన్నింటినీ కస్టమర్లే QR కోడ్‌ స్కాన్‌ చేసి బిల్లింగ్‌ వేసుకోవాలి. ఈ ప్రక్రియ మొత్తాన్ని సిసి కెమెరాల ద్వారా ఎవరో ఒకరు గమనించే వాళ్లుంటారు. ఇక్కడే ఈ ఇద్దరు తెలుగు అమ్మాయిలు తొందర పడ్డట్టు పోలీసులు గుర్తించారు. హోబెకన్‌ సిటీలోని షాప్‌రైట్‌ సూపర్‌ మార్కెట్‌ చాలా పెద్దది. ఇందులో షాపింగ్‌ తర్వాత అమ్మాయిలిద్దరు కొన్ని వస్తువులను QR స్కాన్‌ చేయకుండానే ప్యాక్‌ చేసి పెట్టుకున్నట్టు CC కెమెరాల్లో సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారమందించారు.

నిజంగా తప్పు చేశారా?

హైదరాబాద్‌, గుంటూరుకు చెందిన 20, 22  ఏళ్ల వయసున్న ఈ ఇద్దరు అమ్మాయిలు నిజంగా తప్పు చేశారా అంటే.. కచ్చితంగా చెప్పలేం. సొంతంగా బిల్లింగ్‌ చేసుకోవాల్సి రావడం వల్ల హడావిడిలో కొన్ని బిల్లింగ్‌ కాకపోయి ఉండే అవకాశం ఉంది. అందుకే సెక్యూరిటీ సిబ్బంది వీరి దగ్గరకు రాగానే బిల్లింగ్‌ విషయం తెలుసుకున్న వీరిద్దరు.. తెలిసి తాము తప్పు చేయలేదని తెలిపారు. కొన్ని వస్తువులకు డబ్బులు ఇవ్వడం మరిచి పోయామని చెప్పారు. పైగా బిల్లింగ్‌లో మిస్‌ అయిన సంబంధిత వస్తువులకు రెట్టింపు డబ్బు చెల్లిస్తామనీ కూడా తెలిపారు. అదే సమయంలో సెక్యూరిటీ సిబ్బంది వీరిని... భవిష్యత్తులో షాప్‌ రైట్‌ మాల్‌కు రామని, ఇందులో షాపింగ్‌ చేయబోమని లిఖిత పూర్వక ధృవీకరణ  ఇవ్వాలని అమ్మాయిలను కోరారు. దానికి కూడా అంగీకరించిన అమ్మాయిలు .. వివరణ కూడా ఇచ్చేశారు. ఆ తర్వాత పోలీసులు వచ్చారు. జరిగింది తప్పేనని, న్యాయపరమైన చర్యల్ని ఎదుర్కోవాల్సిందే అంటూ తేల్చి చెప్పారు. దొంగతనం ఆరోపణల కింద వీరిద్దరిని అరెస్ట్‌ చేశామని, కోర్టులో హాజరు పరుస్తామని  పోలీసులు తెలిపారు.

ఇద్దరు అమ్మాయిలు స్టీవెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదివేందుకు అమెరికాలోని న్యూజెర్సీకి  వెళ్లారు. 

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250