Sakshi News home page

దొరల పాలనను అంతం చేయాలి! : ఎంపీ ధర్మపురి అర్వింద్‌

Published Sat, Nov 18 2023 1:22 AM

- - Sakshi

నిజామాబాద్‌: తెలంగాణలో కొనసాగుతున్న దొరల పాలనను అంతం చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. మండలంలోని రామడుగు గ్రామంలో రూరల్‌ బీజేపీ అభ్యర్థి కులాచారి దినేశ్‌కు మద్దతుగా శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కేసీఆర్‌ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దోచుకున్న వాళ్లను ప్రజలు ఓటుతో జవాబు చెప్పి బుద్ధి చెప్పాలని కోరారు.

ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. 75 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఒక్క బీసీ ముఖ్యమంత్రి దొరకలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్‌ అరచేతిలో వైకుంఠంలాగా ఉందని, మరోసారి బీసీలకు అన్యాయం చేయడానికి రేవంత్‌ కుట్రపన్నారని పేర్కొన్నారు. ప్రచారంలో నాయకులు గద్దె భూమన్న, రాజేశ్వర్‌, కర్క గంగారెడ్డి, రామస్వామి, గంగాదాస్‌ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: వ్యూహాలకు పదును! ప్రచారానికి మిగిలింది 11 రోజులే..