Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

Raashii Khanna: కియారా భర్తను రాశీ పెళ్లి చేసుకుంటే బాగుండేది.. హీరోయిన్‌ ఏమందంటే?

Published Fri, Mar 29 2024 12:30 PM

Raashii Khanna Reacts To Prospect Of Her Marrying Sidharth Malhotra - Sakshi

రాశీ ఖన్నా.. తన కెరీర్‌ మొదలైందే హిందీ సినిమాతో! మద్రాస్‌ కేఫ్‌ (2013) మూవీతో హీరోయిన్‌గా వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మనం మూవీలో అతిథి పాత్రలో కనిపించింది. ఊహలు గుసగుసలాడె సినిమాతో హీరోయిన్‌గా అలరించింది. ఇక్కడ వరుసగా అవకాశాలు రావడంతో టాలీవుడ్‌లోనే సెటిలైపోయింది. మధ్యలో మధ్యలో తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఈ మధ్య తెలుగులో సరైన హిట్లు లేకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి.

సిద్దార్థ్‌- రాశీ జోడీ బాగుంది
దీంతో 11 ఏళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. యోధ సినిమాలో నటించింది. సిద్దార్థ్‌ మల్హోత్రా హీరోగా నటించిన ఈ చిత్రానికి సాగర్‌ ఆంబ్రే–పుష్కర్‌ ఓజా దర్శకత్వం వహించారు. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. కానీ రాశీ- సిద్దార్థ్‌ జంటకు మాత్రం నూటికి నూరు మార్కులు పడ్డాయి. వీరి ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ చూసి ముచ్చటపడిన అభిమానులు సిద్దార్థ్‌.. కియారాకు బదులుగా రాశీని పెళ్లి చేసుకుంటే బాగుండేదని కామెంట్లు చేస్తున్నారు.

అది వారి అభిప్రాయం అంతే!
దీనిపై తాజా ఇంటర్వ్యూలో రాశీ ఖన్నా స్పందిస్తూ.. 'అది కేవలం వారి అభిప్రాయం మాత్రమే! అభిమానులు సినిమా చూసి మాగురించి ఏవేవో ఊహించుకుంటారు. నిజంగా మేము ఎలా ఉంటామనేది వారికి తెలీదు. కానీ మేము కలిసుంటే బాగుండని కలలు కంటారు. స్క్రీన్‌పై జంటగా చూడటానికి బాగున్నంత మాత్రాన నిజ జీవితంలో కూడా అలానే ఉంటారని గ్యారెంటీ ఏముంది? నిజానికి ఇంకా వరస్ట్‌గా కూడా ఉండొచ్చు కదా!' అని చెప్పుకొచ్చింది.

పిల్లాడిలా ప్రవర్తించకూడదు
ఎలాంటి వ్యక్తి భర్తగా రావాలనుకుంటున్నారు అన్న ప్రశ్నకు.. 'ఎవరైతే చిన్నపిల్లాడిలా, పరిపక్వత లేకుండా ప్రవర్తిస్తారో అలాంటివాళ్లు అస్సలు నచ్చరు. అబ్బాయిలు పిల్లవేషాలు వేస్తే చూడటానికి దరిద్రంగా ఉంటుంది. బాధ్యతగా వ్యవహరిస్తూ, మెచ్యూర్‌గా నడుచుకునే వ్యక్తి భర్తగా రావాలని కోరుకుంటున్నా' అని రాశీ తెలిపింది.

చదవండి: ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్.. 22 ఏళ్లయినా తగ్గేదేలే!

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250