Sakshi News home page

‘చిరు’ యంత్రాల ఫౌండేషన్‌!

Published Tue, Jan 23 2024 10:47 AM

Millet Portable Impact Huller more detailes inside - Sakshi

టేబుల్‌ టాప్‌ హల్లర్‌: దేశంలోనే తొలి ‘స్మాల్‌ మిల్లెట్‌ టేబుల్‌ టాప్‌ ఇంపాక్ట్‌ హల్లర్‌ వి3’ ఇది. చిన్న చిరుధాన్యాల పైపొట్టు తీసి బియ్యం తయారు చేసుకోవడానికి ఉపయోగపడే చిన్న యంత్రం ఇది. బరువు 30 కిలోలు. ముప్పావు మీటరు ఎత్తు, అర మీటరు పొడవు, అర మీటరు వెడల్పు ఉంటుంది. ఇంట్లో చిన్న టేబుల్‌ మీద పెట్టుకొని వాడుకోవచ్చు. మహిళలు, పిల్లలు సైతం ఉపయోగించడానికి అనువైనది. ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. అతి తక్కువ 0.5 హెచ్‌ పి విద్యుత్తుతో పనిచేస్తుంది. సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్తు లేదా సౌర విద్యుత్తు లేదా పెట్రోలు మోటారుతోనూ నడుస్తుంది. 90% సామర్థ్యంతో పనిచేస్తుంది. ఒకసారి మర పడితే 10% మెరికలు వస్తాయి.

రెండోసారి మళ్లీ మరపడితే వంద శాతం బియ్యం సిద్ధమవుతాయి. చిరుధాన్యం రకాన్ని బట్టి గంటకు 30 నుంచి 80 కిలోల ధాన్యాన్ని మర పట్టొచ్చు. ఏ రకం చిన్న చిరుధాన్యాన్నయినా ఈ యంత్రానికి ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేకుండానే మర పట్టుకోవచ్చు. అర కేజీ ధాన్యం ఉన్నా సరే దీన్ని ఉపయోగించవచ్చు. తక్కువ శబ్దం చేస్తుంది. 2 గంటల తర్వాత ఓ గంట విరామం ఇవ్వాలి. దీని ధర రూ. 88 వేలు (18% జిఎస్టీ అదనం). 

కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికెలు వంటి చిన్న చిరుధాన్యాల (స్మాల్‌ మిల్లెట్స్‌) ధాన్యాన్ని వండుకొని తినాలంటే పైపొట్టు తీసి బియ్యం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్వం దంపుకొని చిరుధాన్యాల బియ్యం తయారు చేసుకునే వారు. ఇది చాలా శ్రమతో కూడిన పని. 

కొన్ని సంవత్సరాలుగా మిక్సీలను ఉపయోగించి ఇంటి స్థాయిలో మిల్లెట్‌ బియ్యం తయారు చేసుకోవటం ప్రారంభమైంది. అయితే, మిక్సీకి ఉన్న పరిమితుల దృష్ట్యా వాణిజ్య దృష్టితో చిన్న చిరుధాన్యాల బియ్యం ఉత్పత్తి చేయదలచిన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాలు, మహిళా స్వయం సహాయక బృందాలు, చిన్న వ్యా΄ారులు యంత్రాలను ఆశ్రయించక తప్పట్లేదు. యంత్రాల ధర అందుబాటులో లేని పరిస్థితుల్లో చిన్న చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ పెద్ద సంస్థలు, కంపెనీలకే పరిమతం అవుతూ వచ్చింది. ఇది గ్రామాల్లో పేద రైతులు, మహిళా బృందాలు, చిన్న వ్యా΄ారులకు ఈ ప్రక్రియ పెద్ద సవాలుగా నిలిచింది.

ఈ సవాలును అధిగమించడానికి ఇంటి స్థాయిలో, గ్రామస్థాయిలో మహిళలు, పిల్లలు సైతం ఉపయోగించడానికి అనువైన అనేక చిన్న యంత్రాల రూపుకల్పనలో అనేక ఏళ్లుగా విశేష కృషి చేస్తున్న తమిళనాడుకు చెందిన స్మాల్‌ మిల్లెట్‌ ఫౌండేషన్‌ (డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ యాక్షన్‌ – ధాన్‌ – ఫౌండేషన్‌ అనుబంధ సంస్థ) విజయం సాధించింది. ఈ సంస్థ రూపొదించిన చిన్న యంత్రాల్లో ఒకటి.. దేశంలోనే తొలి ‘టేబుల్‌ టాప్‌ డీహల్లర్‌ మిషన్‌’. కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికెలు వంటి ఏ రకం చిరుధాన్యాలతోనైనా, అర కిలో అయినా సరే, ఈ యంత్రంతో బియ్యం తయారు చేసుకోవచ్చు.

ఇటువంటివే మనికొన్ని చిన్న యంత్రాలను ఈ ఫౌండేషన్‌ రూపొందించింది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా  ప్రాచుర్యంలోకి వచ్చిన మేలైన సాగు, శుద్ధి, విలువ జోడింపు పద్ధతులు, యంత్రాలపై నీతి ఆయోగ్‌ ‘మిల్లెట్‌ సంకలనం’ను న్యూఢిల్లీలో ఇటీవల విడుదల చేసింది. స్మాల్‌ మిల్లెట్‌ ఫౌండేషన్‌ ప్రజలు, శాస్త్రవేత్తలు, రైతులు అవసరాల మేరకు తయారు చేసి అందుబాటులోకి తెచ్చిన చిన్న యంత్రాలను ప్రశంసిస్తూ ఒక కథనం ప్రచురించటం విశేషం. నీతి ఆయోగ్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ నీలం పటేల్‌ తదితరులు ఈ సంకలనానికి సం΄ాదకులుగా వ్యవహరించారు. 

పోర్టబుల్‌ ఇంపాక్ట్‌ హల్లర్‌
టేబుల్‌ టాప్‌ హల్లర్‌ కన్నా కొంచెం పెద్దది స్మాల్‌ మిల్లెట్‌ పోర్టబుల్‌ ఇంపాక్ట్‌ హల్లర్‌ (ఎస్‌.ఎం.ఎఫ్‌. వి2). ఇది గంటకు 100 నుంచి 500 కిలోల చిన్న చిరుధాన్యాలను ్ర΄ాసెస్‌ చేస్తుంది. 1 హెచ్‌పి మోటారుతో త్రీఫేస్‌ విద్యుత్తుతో పనిచేస్తుంది. బరువు 98 కిలోలు. మీటరు ΄÷డవు, మీటరు ఎత్తు, ము΄్పావు మీటరు వెడల్పు ఉంటుంది. ఎక్కువ గంటల పాటు వాడొచ్చు. మహిళలు సైతం సురక్షితంగా, సులువుగా వాడటానికి అనువైనది. ఎస్‌.ఎం.ఎఫ్‌. వి2 ధర రూ. 1,68,000. (18% జిఎస్టీ అదనం). ఈ యంత్రాలపై ఆసక్తి గల వారు తమిళనాడులోని కృష్ణగిరి కేంద్రంగా పనిచేస్తున్న స్మాల్‌ మిల్లెట్‌ ఫౌండేషన్‌ (ఎస్‌.ఎం.ఎఫ్‌.) సాంకేతిక విభాగం ఇన్‌చార్జ్‌ శరవణన్‌ను 86675 66368 నంబరులో ఇంగ్లిష్‌ లేదా తమిళంలో సంప్రదించవచ్చు.                       


11న దేశీ గోవ్యాధులపై సదస్సు
ఫిబ్రవరి 11(ఆదివారం) న ఉ. 7 గం. నుంచి సా. 4 గం. వరకు గుంటూరు జిల్లా కొర్నె΄ాడులోని రైతునేస్తం ఫౌండేషన్ ఆవరణలో దేశీ గో–జాతుల వ్యాధులు, ఇతర సమస్యలపై రాష్ట్ర స్థాయి సదస్సు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్‌  చైర్మన్‌ యడ్లపల్లి వేంకటేశ్వరరావు తెలిపారు. దేశీ ఆవుల ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై గో పోషకులకు అవగాహన కల్పిస్తారు. గోవులకు ఉచిత వైద్య శిబిరంతోపాటు ఉచితంగా మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. వివరాలకు 97053 83666.

Advertisement

homepage_300x250