breaking news
-
ఒక్కరైనా డబుల్ హ్యాట్రిక్ తీయాల్సింది.. ఓటమికి కారణం అదే!
IPL 2024 GT vs DC: రెండేళ్ల క్రితం ఐపీఎల్లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ కనీవినీ ఎరుగని రీతిలో చెత్త ప్రదర్శన కనబరిచింది. ఐపీఎల్-2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కేవలం 89 పరుగులకే ఆలౌట్ అయి.. క్యాష్ రిచ్ లీగ్‌లో తమ అత్యల్ప స్కోరును నమోదు చేసింది. ఇక 90 పరుగుల నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ కేవలం 8.5 ఓవర్లలోనే పని పూర్తి చేయడంతో గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తమ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని అంగీకరించాడు. మా ఓటమికి కారణం అదే ‘‘పిచ్ బాగానే ఉంది. కానీ మా బ్యాటింగే అత్యంత సాధారణంగా ఉంది. షాట్ సెలక్షన్ లోపాల వల్లే వరుసగా వికెట్లు కోల్పోయాం. ప్రత్యర్థి జట్టు 89 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న క్రమంలో మాలో ఎవరో ఒక బౌలర్ డబుల్ హ్యాట్రిక్ తీస్తేనే గానీ ఫలితం ఉండదు. లేదంటే కచ్చితంగా ప్రత్యర్థి జట్టునే విజయం వరిస్తుంది. ఇప్పుడూ అదే జరిగింది’’ అని పరాజయానికి గల కారణాలు విశ్లేషించాడు గిల్. ఈ ఘోర పరాభవం నుంచి వీలైనంత తొందరగా కోలుకుని తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెడతామని పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘ఇప్పటి వరకు సగం మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాం. ఇంకో ఏడు మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పటికి మూడు గెలిచాం. గత రెండేళ్లుగా గెలిచినట్లే సెకండాఫ్‌లో 5-6 మ్యాచ్‌లు గెలవగలమనే అనుకుంటున్నా’’ అని శుబ్‌మన్ గిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గుజరాత్ వర్సెస్ ఢిల్లీ స్కోర్లు: ►వేదిక: అహ్మదాబాద్... గుజరాత్ ►టాస్: ఢిల్లీ- బౌలింగ్ ►గుజరాత్ స్కోరు: 89 (17.3) ►ఢిల్లీ స్కోరు: 92/4 (8.5) ►ఫలితం: గుజరాత్‌పై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రిషభ్ పంత్(రెండు క్యాచ్‌లు.. రెండు స్టంపింగ్స్.. 11 బంతుల్లో 16 రన్స్- నాటౌట్). Ensuring a quick finish, ft Rishabh Pant & Sumit Kumar 🙌 A comprehensive all-round performance from Delhi Capitals helps them register their 3️⃣rd win of the season 😎 Recap the match on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #GTvDC pic.twitter.com/c2pyHArwE7 — IndianPremierLeague (@IPL) April 17, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సచిన్ షాట్‌ను కాపీ కొట్టిన శుబ్‌మన్ గిల్.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మరోసారి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా బుధవారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72 పరుగులు చేశాడు. అయితే గిల్ తన ఇన్నింగ్స్‌లో కొట్టిన ఓ షాట్ మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచాడు. గిల్ తన షాట్‌తో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను గుర్తు చేశాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్‌లో నాలుగో బంతిని శుబ్‌మన్ అద్భుతమైన ఆన్-డ్రైవ్ షాట్ ఆడి సిక్స్‌గా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్ వాట్‌ఏ షాట్ అంటూ కామెట్లు చేస్తున్నారు. కాగా 1998లో షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ ఈ తరహా షాట్లతో అభిమానులతో అలరించాడు. అనాటి మ్యాచ్‌లో సచిన్ విధ్వంసం సృష్టించాడు. సచిన్ 131 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో ఏకంగా 143 పరుగులు చేశాడు. pic.twitter.com/a5MwVJaChL — Sitaraman (@Sitaraman112971) April 10, 2024 -
అతడు అద్భుతం.. మా గురించి అలా అనుకోవద్దు: గిల్ కౌంటర్
ఆఖరి బంతికి విజయం సాధించడం ఎల్లప్పుడూ గొప్పగానే ఉంటుందంటూ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ హర్షం వ్యక్తం చేశాడు. రషీద్ భాయ్ వల్లే తమకు రాజస్తాన్ రాయల్స్‌పై గెలుపు దక్కిందని వైస్ కెప్టెన్‌పై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్-2024లో ఆరంభం నుంచి ఓటమి ఎరుగని రాజస్తాన్ జైత్రయాత్రకు గుజరాత్ బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. జైపూర్‌లో బుధవారం ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో చివరి బంతికి టైటాన్స్ జయభేరి మోగించింది. మెరుపు ఇన్నింగ్స్(11 బంతుల్లో 24*)తో గుజరాత్ శిబిరంలో ఆశలు నింపిన రషీద్ ఖాన్.. అంచనాలు నిలబెట్టుకుంటూ ఆఖరి బంతికి ఫోర్ బాది గెలుపును ఖరారు చేశాడు. రాహుల్ తెవాటియా(11 బంతుల్లో 22) సైతం విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక కష్ట సమయంలో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్(44 బంతుల్లో 72) ఆడటం టైటాన్స్‌కు కలిసి వచ్చింది. The elegance of the Prince 🤌#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EzGEcv6Pk9 — JioCinema (@JioCinema) April 10, 2024 ఈ నేపథ్యంలో విజయానంతరం కామెంటేటర్ హర్షా భోగ్లేతో ముచ్చటిస్తున్న సమయంలో శుబ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గెలుపు నేపథ్యంలో గిల్‌ను అభినందిస్తూ.. ‘‘బాగా ఆడారు. మీకు రెండు పాయింట్లు వచ్చాయి. అయితే, నాలాంటి చాలా మంది మీరు ఆలస్యం చేస్తున్నారు కాబట్టి ఏమవుతుందోనని కంగారు పడ్డారు. కానీ మీరు బాగా ఆడారు’’ అని హర్షా భోగ్లే అన్నాడు. ఇందుకు స్పందిస్తూ.. ‘‘థాంక్యూ.. మేము ఆడుతున్నపుడు ఇంకెప్పుడూ అలా అనుకోకండి’’ అంటూ తమ జట్టు గురించి గొప్పగా చెబుతూ ఒకరకంగా హార్ష భోగ్లేకు గట్టి కౌంటరే వేశాడు శుబ్‌మన్ గిల్. ఇక తమ విజయం గురించి మాట్లాడుతూ.. ‘‘అప్పటికీ.. మూడు ఓవర్లలో 45 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒక్కో బ్యాటర్ తొమ్మిది బంతుల్లో 22 పరుగులు చేయాలనుకున్నాం. నిజంగా మ్యాచ్ ఫినిష్ చేయడం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఈరోజు నేను ఆపని చేయాలనుకున్నాను. అయితే, రాహల్- రషీద్ భాయ్ ఆ పని పూర్తి చేశారు. ఆఖరి బంతికి విజయం సాధించడం ఎప్పుడూ గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. రషీద్ ఖాన్ లాంటి వాళ్లు జట్టులో ఉండాలని ప్రతి ఒక్క కెప్టెన్ కోరుకుంటాడనడంలో సందేహం లేదు’’ అని శుబ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు. 𝘾𝙧𝙞𝙨𝙞𝙨 𝙈𝙖𝙣 delivered yet again 😎 🎥 Relive the thrilling end to a thrilling @gujarat_titans win! Recap the match on @starsportsindia & @Jiocinema 💻 📱#TATAIPL | #RRvGT pic.twitter.com/eXDDvpToZ0 — IndianPremierLeague (@IPL) April 10, 2024 IPL 2024: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ స్కోర్లు ►రాజస్తాన్: 196/3 (20) ►గుజరాత్: 199/7 (20) ►ఫలితం: మూడు వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం ► ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రషీద్ ఖాన్(ఒక వికెట్, 24 పరుగులు- నాటౌట్). చదవండి: IPL 2024: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..! #ShubmanGill: కొరకరాని కొయ్యలా సంజూ.. అంపైర్‌తో గొడవపడ్డ గిల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అప్పటికప్పుడు ఫలితం తారుమారు.. అంపైర్‌తో గొడవపడ్డ గిల్
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. థర్డ్ అంపైర్ వ్యవహరించిన తీరుపై విస్మయం వ్యక్తం చేశాడు. తమ విషయంలో ఎందుకిలా జరిగిందంటూ ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఐపీఎల్-2024లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్తాన్- గుజరాత్ జట్లు బుధవారం తలపడ్డాయి. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. రాజస్తాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్(8)లను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్(68- నాటౌట్), రియాన్ పరాగ్(76)తో కలిసి రాజస్తాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. గుజరాత్ బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. Fifty comes up for SANJU SAM5️⃣0️⃣N 💥#RRvGT #TATAIPL #IPLonJioCinema #IPLinMalayalam pic.twitter.com/Fxlr57hK6L — JioCinema (@JioCinema) April 10, 2024 నిర్ణయం మార్చుకున్న థర్డ్ అంపైర్ ఇదిలా ఉంటే.. రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ పదిహేడో ఓవర్ వేశాడు. ఐదో బంతిని అవుట్ సైడ్ ఆఫ్ దిశగా సంధించగా సంజూ షాట్ ఆడబోయి విఫలమయ్యాడు. ఈ క్రమంలో అంపైర్ ఆ బంతిని వైడ్‌గా ప్రకటించాడు. దీంతో కోపోద్రిక్తుడైన గుజరాత్ సారథి శుబ్‌మన్ గిల్ రివ్యూకు వెళ్లాడు. అయితే, తొలుత అది ఫెయిర్ డెలివరీ అని చెప్పిన థర్డ్ అంపైర్.. తర్వాత వైడ్‌గా ప్రకటించాడు. ఫలితంగా రాజస్తాన్ ఖాతాలో అదనపు పరుగు చేరింది. అప్పటికే బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడంతో ఆగ్రహంగా ఉన్న గిల్.. ఈ వైడ్ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేకపోయాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ ఫీల్డ్ అంపైర్ వినోద్ శేషన్‌తో గొడవకు దిగాడు. వైడ్ గురించి చాలా సేపు అతడితో వాదించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. Shubman Gill has grown well as leader ⭐ Loving this version 🩷pic.twitter.com/kaDnJTGX8N — Cricspace (@cricspace69) April 10, 2024 గుజరాత్‌దే పైచేయి.. రాజస్తాన్ జైత్రయాత్రకు బ్రేక్ ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్(72), ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రషీద్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్(11 బంతుల్లో 24 నాటౌట్) కారణంగా గుజరాత్.. రాజస్తాన్ విధించిన లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖరి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ బాదడంతో.. మూడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ గెలుపు నమోదు చేసింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: #Sanju: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..! RASHID KHAN PUTS A HALT ON RR'S WINNING STREAK 🔥🔥#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EdbdG9dG8o — JioCinema (@JioCinema) April 10, 2024 -
#Sanju: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..!
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్‌కు తొలిసారి ఓటమి ఎదురైంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో గెలుపొంది జోరు మీదున్న సంజూ సేనకు గుజరాత్ టైటాన్స్ అడ్డుకట్ట వేసింది. రాయల్స్‌ను వారి తమ సొంత మైదానంలోనే ఓడించి మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక తమ జైత్రయాత్రకు బ్రేక్ పడటంపై రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ విచారం వ్యక్తం చేశాడు. ఆఖరి బంతికి ఫలితం తారుమారైందంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఏదేమైనా గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకుందని పేర్కొన్నాడు. మాట్లాడలేకపోతున్నా.. అక్కడే ఓడిపోయాం ఈ మేరకు ఓటమి అనంతరం సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ చివరి బంతికి మ్యాచ్ మా చేజారింది. మ్యాచ్ ఓడిన కెప్టెన్‌గా ఇలాంటి సమయంలో మాట్లాడటం కష్టంగా ఉంది. భావోద్వేగాలు అదుపులోకి వస్తే గానీ నేను చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పలేను. ఏదేమైనా గుజరాత్ టైటాన్స్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఆఖరి నిమిషం వరకు ఇరు జట్ల మధ్య విజయం ఊగిసలాడటమనేది ఈ టోర్నీకి ఉన్న ప్రత్యేకత. ఇది మా బౌలర్ల తప్పే మేము తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాల్సిన సమయం. నిజానికి నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. 180 మంచి స్కోరే అనుకున్నా. అయితే, మేము లక్కీగా 196 పరుగులు చేశాం. కచ్చితంగా అది విన్నింగ్ స్కోరే. పిచ్‌పై తేమ లేదు కాబట్టి మా బౌలింగ్ విభాగం పనిపూర్తి చేయాల్సింది. జైపూర్‌లో 197.. తేమ లేని వికెట్‌పై డిఫెండ్ చేయడం అంత కష్టమేమీ కాదు’’ అంటూ బౌలర్ల వైఫల్యాన్ని ఎత్తిచూపాడు. రాణించిన సంజూ, రియాన్ పరాగ్ కాగా జైపూర్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన రాజస్తాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(24), జోస్ బట్లర్(8) నామమాత్రపు స్కోర్లకు పరిమితం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. Fifty comes up for SANJU SAM5️⃣0️⃣N 💥#RRvGT #TATAIPL #IPLonJioCinema #IPLinMalayalam pic.twitter.com/Fxlr57hK6L — JioCinema (@JioCinema) April 10, 2024 మొత్తంగా 38 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 68 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ రియాన్ పరాగ్ మరోసారి సుడిగాలి ఇన్నింగ్స్(48 బంతుల్లో 76)తో అదరగొట్టాడు. Caution ⚠ It's Riyan Parag demolition on display 🔥💥#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/dzKuPfTS0Q — JioCinema (@JioCinema) April 10, 2024 అంతా రషీద్ ఖాన్ వల్లే ఆఖర్లో హెట్మెయిర్ మెరుపులు(5 బంతుల్లో 13- నాటౌట్) మెరిపించగా.. రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డప్పటికీ గుజరాత్ ఆఖరి బంతి వరకు పోరాడి విజయాన్ని అందుకుంది. శుబ్‌మన్ గిల్(72) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రషీద్ ఖాన్(11 బంతుల్లో 24- నాటౌట్) రాజస్తాన్‌ను గెలుపునకు దూరం చేశాడు. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. ఏకంగా ఫోర్ బాది గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చాడు. The elegance of the Prince 🤌#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EzGEcv6Pk9 — JioCinema (@JioCinema) April 10, 2024 రాజస్తాన్ వర్సెస్ గుజరాత్ స్కోర్లు ►రాజస్తాన్: 196/3 (20) ►గుజరాత్: 199/7 (20) ►ఫలితం: మూడు వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం. 𝘾𝙧𝙞𝙨𝙞𝙨 𝙈𝙖𝙣 delivered yet again 😎 🎥 Relive the thrilling end to a thrilling @gujarat_titans win! Recap the match on @starsportsindia & @Jiocinema 💻 📱#TATAIPL | #RRvGT pic.twitter.com/eXDDvpToZ0 — IndianPremierLeague (@IPL) April 10, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: IPL 2024: కొంపముంచిన స్లో ఓవర్ రేట్.. గుజరాత్ సంచలన విజయం
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019