breaking news
-
ఉద్యోగులను తొలగించిన లిప్‌స్టిక్ కంపెనీ
పర్సనల్ కేర్, కాస్మొటిక్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయించే గుడ్ గ్లామ్ గ్రూప్ దాదాపు 150 మంది లేదా 15 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది చివర్లో ఐపీవోకి వెళ్తున్న నేపథ్యంలో ఈ యూనికార్న్ కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు తన మానవ వనరులను పునర్నిర్మించడంతో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గత 12-15 నెలల్లో వివిధ విభాగాలలో ఉద్యోగుల తొలగింపులు చేపట్టినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో లాభదాయకమైన కంపెనీగా ఉండాలనే దృఢమైన లక్ష్యానికి ఈ వ్యూహాత్మక చొరవ దోహదపడుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా గుడ్ గ్లామ్ గ్రూప్ ఇటీవల పోప్గ్జో, ప్లిగ్సో, బేబీ చక్ర, మామ్స్కో, స్కూప్ఊప్, ట్వీక్ ఇండియా కంపెనీలను కొనుగోలు చేసింది. గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా మనన్ జైన్, గ్రూప్ చీఫ్ పీపుల్ ఆఫీసర్, ఫౌండర్ ఇనిషియేటివ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కార్తీక్ రావు, బ్రాండ్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా అంకితా భరద్వాజ్‌ని నియమించింది. ఇటీవలే గ్రూప్ కొత్త గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కమల్ లత్ నియామకాన్ని కూడా ప్రకటించింది. -
ప్రముఖ టెక్ కంపెనీలో తొలగింపులు, బదిలీలు
Google LayOff: ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్ ఉద్యోగుల తొలగింపులు, బదిలీలు చేపట్టింది. ఈ విషయాన్నికంపెనీ ప్రతినిధి తెలిపారు. తొలగింపులు కంపెనీ అంతటా ఉండవని, ప్రభావితమైన ఉద్యోగులు ఇతర అంతర్గత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే ప్రభావితమైన ఉద్యోగుల సంఖ్యను వెల్లడించలేదు. ప్రభావితమైన ఉద్యోగులలో కొంత మందిని భారత్, చికాగో, అట్లాంటా, డబ్లిన్ వంటి కంపెనీ పెట్టుబడులు పెడుతున్న కేంద్రాలకు బదిలీ చేయనున్నారు. గూగుల్ తొలగింపులతో ఈ సంవత్సరం టెక్, మీడియా పరిశ్రమలో మరిన్ని తొలగింపులు కొనసాగవచ్చనే భయాలు నెలకొన్నాయి. 2023 ద్వితీయార్థం నుంచి 2024 వరకు తమ అనేక బృందాలు మరింత సమర్థవంతంగా, మెరుగ్గా పని చేయడానికి, ఉత్పత్తి ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్పులు చేసినట్లు గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం.. లేఆఫ్‌లతో గూగుల్ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాలలోని అనేక మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. ప్రభావితమైన ఫైనాన్స్ టీమ్‌లలో గూగుల్ ట్రెజరీ, వ్యాపార సేవలు, ఆదాయ నగదు కార్యకలాపాలు ఉన్నాయి. పునర్నిర్మాణంలో భాగంగా బెంగళూరు, మెక్సికో సిటీ, డబ్లిన్లకు వృద్ధిని విస్తరింపజేస్తామని గూగుల్ ఫైనాన్స్ చీఫ్, రూత్ పోరాట్ సిబ్బందికి ఈ-మెయిల్ పంపారు. -
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. వేలాది ఉద్యోగులు ఇంటికి!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టెస్లా తమ ఉద్యోగులలో 10 శాతం కంటే ఎక్కువమందిని తొలగించడానికి సన్నద్ధమైంది. గ్లోబల్ మార్కెట్లో కంపెనీ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుండటంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థగా ఎదిగిన టెస్లా కంపెనీలో 2023 డిసెంబర్ నాటికి 1,40,473 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పుడు తాజాగా సంస్థ తీసుకున్న నిర్ణయం వల్ల 14000 కంటే ఎక్కువ మందిని తొలగించే అవకాశం ఉంది. టెస్లా సిబ్బందికి పంపిన ఇమెయిల్‌లో.. ఇలాన్ మస్క్ (Elon Musk) ఇలా పేర్కొన్నారు.. కంపెనీ తదుపరి వృద్ధికి సిద్దమవుతున్న తరుణంలో ఖర్చులను తగ్గించుకోవడానికి, ఉత్పాదకను పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఎవరి మీద ద్వేషం లేదు, తప్పని పరిస్థితుల్లో చేస్తున్నామని అన్నారు. కాలిఫోర్నియా, టెక్సాస్‌లోని కొంతమంది సిబ్బందికి ఇప్పటికే తొలగించినట్లు సమాచారం. మరోవైపు గిగాఫ్యాక్టరీ షాంఘైలో టెస్లా సైబర్ ట్రక్ ఉత్పత్తి తగ్గించడం కూడా తాజాగా ఉద్యోగుల తొలగింపుకు కారణం అయి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. ఇదీ చదవండి: 13 ఏళ్ల అమ్మాయికి 'ఆనంద్ మహీంద్రా' జాబ్ ఆఫర్: ఎందుకో తెలిస్తే.. టెస్లా షేర్లు ఇటీవలి బాగా దెబ్బతిన్నాయి. గతంతో పోలిస్తే.. ఇది సుమారు 31 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నప్పటికీ.. ఆ విభాగంలో ప్రత్యర్థులు ఎక్కువవుతున్నారు. ఇది టెస్లా అమ్మకాల మీద ప్రభావం చూపిస్తోందని తెలుస్తోంది. -
జాబ్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. ఉక్కిరి బిక్కిరవుతున్న ఉద్యోగులు
ప్రపంచ జాబ్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ధోరణులు పుట్టుకు రావడం సర్వసాధారణంగా మారింది. కోవిడ్-19 సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆ తర్వాత మూన్‌లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ పేరుతో జాబ్ మార్కెట్లో కొత్త ట్రెండే నడిచింది. అవేవి చాలవన్నట్లు తాజాగా ‘డ్రై ప్రమోషన్’ అనే కొత్త పదం తెరపైకి వచ్చింది. కోవిడ్-19 తర్వాత జాబ్ మార్కెట్లు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి బడా బడా టెక్ కంపెనీల వరకు ప్రాజెక్ట్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఖర్చు విషయంలో కంపెనీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. లేఆఫ్స్, రిమోట్ వర్క్, కృత్తిమ మేధ వినియోగం పేరుతో పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. డ్రై ప్రమోషన్ పేరుతో ఇప్పుడు ఉద్యోగుల జీతాల విషయంలో డ్రై ప్రమోషన్ విధానాన్ని అవలంభిస్తున్నాయి. కంపెనీలు ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తాయి. అందుకు తగ్గట్లుగా జీతాల్ని పెంచవు. బరువు, బాధ్యతల్ని పెంచుతాయి. ఇప్పుడు దీన్ని డ్రై ప్రమోషన్ అని పిలుస్తున్నారు. 900 కంపెనీల్లో జరిపిన సర్వేలో ప్రముఖ కాంపన్సేషన్ కన్సల్టెన్సీ సంస్థ పర్ల్ మేయర్ డ్రై ప్రమోషన్‌పై ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. దాదాపు 13 శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు వేతన పెంపులేని ప్రమోషన్లు ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. 2018లో ఈ సంఖ్య 8శాతం మాత్రమే అని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. మరో కన్సల్టెన్సీ సంస్థ మెర్సెర్ అనే సంస్థ 900 కంపెనీలపై జరిపిన సర్వేలో 2023తో పోలిస్తే 2024లో ఎక్కువ శాతం కంపెనీలు ఉద్యోగులకు జీతం పెంచకుండా ప్రమోషన్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. లేఆఫ్స్ ఆపై ప్రమోషన్లు అంతకుముందు, ఉద్యోగుల కొరతను ఎదుర్కొన్న కంపెనీలు వారిని నిలుపుకునేందుకు భారీగా వేతనాలు పెంచింది. అదే సమయంలో ఉద్యోగాల్ని తొలగించింది. వారి స్థానంలో కొత్త ఉద్యోగుల్ని తీసుకోకుండా.. ఉన్న వారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రమోషన్ పేరుతో కొత్త ట్రెండ్‌కు తెరతీశాయి ఆయా సంస్థలు కంపెనీలకు వరమేనా? ఈ విధానంపై ఉద్యోగులు డైలామాలో ఉన్నారు. ఓ వర్గం ఉద్యోగులు ప్రమోషన్ తీసుకుని మరో సంస్థలో చేరితే అధిక వేతనం, ప్రమోషన్లో మరో అడుగు ముందుకు పడుతుందని భావిస్తుండగా.. రేయింబవుళ్లు ఆఫీస్‌కే పరిమితమై కష్టపడ్డ తమకు తగిన ప్రతిఫలం లేకపోవడం ఏంటని మరో వర్గం ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు. మొత్తానికి డ్రై ప్రమోషన్ విధానం కంపెనీలకు ఓ వరంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నవారు లేకపోలేదు. -
వందలాది ఉద్యోగులు ఇంటికి.. ఐటీ కంపెనీ నిర్ణయం
EXL Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో లేఆఫ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టెక్ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఎక్సెల్ సర్వీస్ (Exl Service) అనే ఐటీ సంస్థ ఏఐ డిమాండ్ పేరుతో వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐకి పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా న్యూయార్క్ ఆధారిత ఐటీ సంస్థ ఎక్సెల్ సర్వీస్ తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరిస్తోంది. ఇందులో భాగంగా 800 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. వీరు కంపెనీ మొత్తం ఉద్యోగులలో 2 శాతం కంటే తక్కువే అని తెలుస్తోంది. కంపెనీ తాజా నిర్ణయం కారణంగా భారత్, అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. వీరిలో 400 మందిని పూర్తిగా ఇంటికి పంపిస్తుండగా మిగిలిన 400 మందికి కంపెనీలోని ఇతర విభాగాల్లో అవకాశం ఇవ్వనుంది. ఉద్యోగాల కోత ప్రాథమికంగా యునైటెడ్ స్టేట్స్, భారత్‌లో డేటా అనలిటిక్స్, డిజిటల్ ఆపరేషన్స్‌లో పనిచేస్తున్న జూనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని వెల్లడైంది. ఎక్సెల్ సర్వీస్ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 55 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. గతంలో కంపెనీ సీఈవోగా ఉన్న రోహిత్ కపూర్ ప్రస్తుతం బోర్డు చైర్మన్‌గా పదోన్నతి పొందారు. అలాగే వికాస్ భల్లా, వివేక్ జెట్లీ అనే ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు డేటా, ఏఐ ఆధారిత సొల్యూషన్స్‌తో కూడిన విస్తృత బాధ్యతలను స్వీకరిస్తున్నారు. కాగా ప్రస్తుతం తొలగిస్తున్న వారి స్థానంలో ఏఐ, డేటాలో అత్యంత పరిజ్ఞానం, నైపుణ్యం ఉన్నవారిని నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తమ క్లయింట్స్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019