breaking news
-
ఉద్యోగులను తొలగించిన లిప్‌స్టిక్ కంపెనీ
పర్సనల్ కేర్, కాస్మొటిక్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయించే గుడ్ గ్లామ్ గ్రూప్ దాదాపు 150 మంది లేదా 15 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది చివర్లో ఐపీవోకి వెళ్తున్న నేపథ్యంలో ఈ యూనికార్న్ కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు తన మానవ వనరులను పునర్నిర్మించడంతో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. గత 12-15 నెలల్లో వివిధ విభాగాలలో ఉద్యోగుల తొలగింపులు చేపట్టినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో లాభదాయకమైన కంపెనీగా ఉండాలనే దృఢమైన లక్ష్యానికి ఈ వ్యూహాత్మక చొరవ దోహదపడుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా గుడ్ గ్లామ్ గ్రూప్ ఇటీవల పోప్గ్జో, ప్లిగ్సో, బేబీ చక్ర, మామ్స్కో, స్కూప్ఊప్, ట్వీక్ ఇండియా కంపెనీలను కొనుగోలు చేసింది. గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా మనన్ జైన్, గ్రూప్ చీఫ్ పీపుల్ ఆఫీసర్, ఫౌండర్ ఇనిషియేటివ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కార్తీక్ రావు, బ్రాండ్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా అంకితా భరద్వాజ్‌ని నియమించింది. ఇటీవలే గ్రూప్ కొత్త గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కమల్ లత్ నియామకాన్ని కూడా ప్రకటించింది. -
ప్రముఖ టెక్ కంపెనీలో తొలగింపులు, బదిలీలు
Google LayOff: ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గూగుల్ ఉద్యోగుల తొలగింపులు, బదిలీలు చేపట్టింది. ఈ విషయాన్నికంపెనీ ప్రతినిధి తెలిపారు. తొలగింపులు కంపెనీ అంతటా ఉండవని, ప్రభావితమైన ఉద్యోగులు ఇతర అంతర్గత ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే ప్రభావితమైన ఉద్యోగుల సంఖ్యను వెల్లడించలేదు. ప్రభావితమైన ఉద్యోగులలో కొంత మందిని భారత్, చికాగో, అట్లాంటా, డబ్లిన్ వంటి కంపెనీ పెట్టుబడులు పెడుతున్న కేంద్రాలకు బదిలీ చేయనున్నారు. గూగుల్ తొలగింపులతో ఈ సంవత్సరం టెక్, మీడియా పరిశ్రమలో మరిన్ని తొలగింపులు కొనసాగవచ్చనే భయాలు నెలకొన్నాయి. 2023 ద్వితీయార్థం నుంచి 2024 వరకు తమ అనేక బృందాలు మరింత సమర్థవంతంగా, మెరుగ్గా పని చేయడానికి, ఉత్పత్తి ప్రాధాన్యతలకు అనుగుణంగా మార్పులు చేసినట్లు గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం.. లేఆఫ్‌లతో గూగుల్ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాలలోని అనేక మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారు. ప్రభావితమైన ఫైనాన్స్ టీమ్‌లలో గూగుల్ ట్రెజరీ, వ్యాపార సేవలు, ఆదాయ నగదు కార్యకలాపాలు ఉన్నాయి. పునర్నిర్మాణంలో భాగంగా బెంగళూరు, మెక్సికో సిటీ, డబ్లిన్లకు వృద్ధిని విస్తరింపజేస్తామని గూగుల్ ఫైనాన్స్ చీఫ్, రూత్ పోరాట్ సిబ్బందికి ఈ-మెయిల్ పంపారు. -
వందలాది ఉద్యోగులు ఇంటికి.. ఐటీ కంపెనీ నిర్ణయం
EXL Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో లేఆఫ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టెక్ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఎక్సెల్ సర్వీస్ (Exl Service) అనే ఐటీ సంస్థ ఏఐ డిమాండ్ పేరుతో వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐకి పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా న్యూయార్క్ ఆధారిత ఐటీ సంస్థ ఎక్సెల్ సర్వీస్ తన కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరిస్తోంది. ఇందులో భాగంగా 800 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. వీరు కంపెనీ మొత్తం ఉద్యోగులలో 2 శాతం కంటే తక్కువే అని తెలుస్తోంది. కంపెనీ తాజా నిర్ణయం కారణంగా భారత్, అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. వీరిలో 400 మందిని పూర్తిగా ఇంటికి పంపిస్తుండగా మిగిలిన 400 మందికి కంపెనీలోని ఇతర విభాగాల్లో అవకాశం ఇవ్వనుంది. ఉద్యోగాల కోత ప్రాథమికంగా యునైటెడ్ స్టేట్స్, భారత్‌లో డేటా అనలిటిక్స్, డిజిటల్ ఆపరేషన్స్‌లో పనిచేస్తున్న జూనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని వెల్లడైంది. ఎక్సెల్ సర్వీస్ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 55 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. గతంలో కంపెనీ సీఈవోగా ఉన్న రోహిత్ కపూర్ ప్రస్తుతం బోర్డు చైర్మన్‌గా పదోన్నతి పొందారు. అలాగే వికాస్ భల్లా, వివేక్ జెట్లీ అనే ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు డేటా, ఏఐ ఆధారిత సొల్యూషన్స్‌తో కూడిన విస్తృత బాధ్యతలను స్వీకరిస్తున్నారు. కాగా ప్రస్తుతం తొలగిస్తున్న వారి స్థానంలో ఏఐ, డేటాలో అత్యంత పరిజ్ఞానం, నైపుణ్యం ఉన్నవారిని నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తమ క్లయింట్స్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను నియమించుకోవాల్సి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. -
కలల కెరియర్ కుప్పకూలుతోంది! 1400 మంది జీవితాలు..
SpiceJet layoff : ఎయిర్‌లైన్స్‌లో పనిచేయాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. ఎయిర్ క్రాఫ్ట్‌లలో పైలట్లుగా, ఇతర సిబ్బందిగా పనిచేయడం ఎంతో మందికి డ్రీమ్ కెరియర్. ఆకర్షణీయమైన వేతనాలతో పాటు దీన్నో ఉత్తమ ప్రొఫెషన్‌గా చూస్తారు. అలాంటి కలల కెరియర్ కుప్పకూలిపోతోంది.. 1400 మంది జీవితాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. 15 శాతం మంది లేఆఫ్ చౌక ధరల్లో విమాన ప్రయాణాన్ని అందించే ఎయిర్‌లైన్‌గా పేరొందిన స్పైస్‌జెట్ తీవ్రమైన నగదు కొరతతో సతమతమవుతోంది. దీంతో ఖర్చులను తగ్గించుకోవడానికి తమ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 15 శాతం మంది అంటే సుమారు 1400 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఈ చర్య ద్వారా పెట్టుబడిదారుల ఆసక్తిని నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. ఉద్యోగుల తొలగింపు విషయాన్ని స్పైస్‌జెట్ ధ్రువీకరించినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. ఆపరేషనల్ అవసరాల కోసం కంపెనీలో అన్ని రకాల ఖర్చులను సర్దుబాటు చేసుకోవడంలో భాగంగా లేఆఫ్‌లు అమలు చేస్తున్నట్లు స్పైస్‌జెట్ ప్రతినిధిని ఉటంకిస్తూ పేర్కొంది. తొలగింపులు అనివార్యం స్పైస్‌జెట్‌లో ఉద్యోగుల జీతాల బిల్లు రూ. 60 కోట్లు ఉంది. ఈ కారణంగానే ఉద్యోగుల తొలగింపులు అనివార్యమైనట్లు కంపెనీ అంతర్గత పరిణామాలు తెలిసినవారు చెబుతున్నారు. తొలగింపుల గురించి ఉద్యోగులకు కంపెనీ ఇప్పటికే సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాగా స్పెస్‌జెట్ కొన్ని నెలలుగా జీతాల చెల్లింపులో జాప్యం చేస్తోంది. చాలా మందికి జనవరి నెల జీతం ఇప్పటికీ అందలేదు. ప్రస్తుతం స్పైస్‌జెట్‌లో 9,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ సంస్థ 30 విమానాలను నడుపుతోంది. 2019లో స్పైస్‌జెట్‌లో గరిష్ట స్థాయిలో 16,000 మంది ఉద్యోగులు ఉండేవారు. 118 విమానాలను ఈ సంస్థ నడిపేది. రూ. 2,200 కోట్ల నిధులు పొందే ప్రక్రియలో ఉన్నామని, అయితే కొంత మంది ఇన్వెస్టర్లలో విశ్వాసం కొరవడిందని స్పైస్‌జెట్ చెబుతోంది. “ఫండింగ్ జాప్యాలు ఏవీ లేవు. మా ఫండ్ ఇన్ఫ్యూషన్తో బాగా పురోగమిస్తున్నాం. తదనుగుణంగా ఇప్పటికే బహిరంగ ప్రకటనలు చేశాం. తదుపరి పురోగతిని త్వరలో తెలియజేస్తాం. చాలా మంది ఇన్వెస్టర్లు మాతో చేరుతున్నారు” అని స్పైస్‌జెట్ ప్రతినిధి పేర్కొన్నారు. -
కత్తికట్టిన కంపెనీలు.. వందలాది ఉద్యోగులకు ఉద్వాసన!
టెక్ పరిశ్రమలో జోరుందుకున్న లేఆఫ్‌లు ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ వంటి ఇతర పరిశ్రమలకూ విస్తరిస్తున్నాయి. ఈ పరిశ్రమలలో పనిచేస్తున్న వందలాది మంది చిన్నపాటి ఉద్యోగులకూ ఉద్వాసన తప్పడం లేదు. కొత్త ఏడాదిలో ఇప్పటికే లేఆఫ్‌లను ప్రకటించిన అమెజాన్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాల సరసన ఈ-కామర్స్ మేజర్ ఫ్లిప్‌కార్ట్, ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా చేరాయి. వందలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమయ్యాయి. ఈ లేఆఫ్‌లు నిధుల కొరతతో సతమతమవుతున్న స్టార్టప్ రంగం కష్టాలను తెలియజేస్తున్నాయి. స్విగ్గిలో 400 మంది! ఖర్చులను తగ్గించుకుని, లాభదాయకత వైపు పయనించడానికి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ దాదాపు 350-400 మంది ఉద్యోగులను లేదా దాని వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 7 శాతం మందిని తొలగించనున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. స్విగ్గీలోని టెక్ టీమ్‌తో పాటు కస్టమర్ కేర్ విభాగంలో పనిచేసే ఉద్యోగుపైనే లేఆఫ్‌ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిసింది. లిస్టింగ్‌కు సిద్ధమవుతున్న స్విగ్గీలో ఇది రెండో రౌండ్ లేఆఫ్. గతేడాది జనవరిలో స్విగ్గీ 380 ఉద్యోగాలను తొలగించింది. ఫ్లిప్‌కార్ట్‌లో 1000 మంది ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వందలాది మంది ఉద్యోగుల కడుపు కొట్టేందుకు సిద్ధమైంది. వ్యయ నియంత్రణ వ్యూహంలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ పనితీరు ఆధారంగా 1,000 మంది ఉద్యోగులను లేదా 5 శాతం వర్క్‌ఫోర్స్‌ను వదులుకుంటున్నట్లు పలు నివేదికలు పేర్కన్నాయి.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019