breaking news
-
Japnit Ahuja: డిజిటల్ జెండర్ గ్యాప్‌ను కోడింగ్ చేసింది!
స్త్రీలు సాంకేతికంగా కూడా సాధికారిత సాధించాలనే లక్ష్యంతో వారికి ఉచితంగా కోడింగ్ పాఠాలు నేర్పుతోంది ఢిల్లీవాసి 23 ఏళ్ల జష్నిత్ అహుజా. కోడింగ్ తెలిసిన వారికి ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తాయి. ఈ రకంగా దేశంలో ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలకు ఆశాజ్యోతిగా మారింది జప్నిత్. ఇప్పటి వరకు 2 వేల మంది అమ్మాయిలకు ఉచితంగా డిజిటల్ పాఠాలు నేర్పింది. వంద మంది వాలంటీర్ల బృందానికి నాయకత్వం వహిస్తోంది. ఢిల్లీకి చెందిన జప్నిత్ అహుజాకు కోడింగ్ అంటే చాలా ఆసక్తి. దాంతో కోడింగ్ నేర్చుకోవడం మీదనే దృష్టిపెట్టింది. అదే సమయంలో ఆమె ఒక విషయాన్ని గుర్తించింది. అదేమంటే, కోడింగ్ రంగంలో స్త్రీలు చాలా తక్కువగా ఉన్నారనీ, ఆ ఉన్న వారిలో కూడా చాలామందికి దానిపై తగినంత పరిజ్ఞానం లేదనీ. మిగిలిన వారితో పోల్చితే కోడింగ్ తెలిసిన వాళ్లకి ఉద్యోగావకాశాలు కాసింత ఎక్కువగానే దొరుకుతాయి. అయితే ఆ రంగంలో పురుషులదే పై చేయి. దాంతో సాంకేతికపరంగా ఏమైనా ఉద్యోగాలు ఉంటే కోడింగ్‌లో వారే ముందుకు దూసుకుపోవడం వల్ల ఆ ఉద్యోగాలు కూడా వారే ఎక్కువగా దక్కించుకోగలుగుతున్నారు. ఇప్పటిదాకా స్త్రీలు ఎన్నో రంగాలలో పట్టుదలతో కృషి చేసి, పై చేయి సాధించగలుగుతున్నప్పుడు కోడింగ్‌లో మాత్రం పట్టు ఎందుకు సాధించకూడదు... అని ఆలోచించింది. అంతే... ముందు తాను ఆ రంగంలో బాగా కృషి చేసింది. పట్టుదలతో కోడింగ్ నేర్చుకుంది... ఆ రకంగా అందులో చకచకా పై మెట్టుకు చేరిపోగలిగింది. తనలాగే మరికొందరు ఆడపిల్లలకు కూడా కోడింగ్ నేర్పితేనో... అనుకుంది. అలా అనుకోవడం ఆలస్యం... ఇతర ఆమ్మాయిలను కొందరిని పోగు చేసి తనకు తెలిసిన దానిని వారికి ఉచితంగా పాఠాలు నేర్పడం ఆరంభించింది. అలా తన 16వ ఏట ఆమె ‘గో గర్ల్’ అనే సంస్థను స్థాపించింది. అయితే భాష సమస్య రాకుండా వారికి వచ్చిన స్థానిక భాషలోనే ఉచితంగా కోడింగ్‌ను నేర్పడం ఆమె ప్రత్యేకత. తోటి ఆడపిల్లలను సాంకేతికంగా ఎదిగేలా చేయడం కోసం ఎంచుకున్న లక్ష్యం, అందుకు ఆమె చేసిన కృషీ వృథా పోలేదు. చాలామంది అమ్మాయిలు ఆమె దగ్గర కోడింగ్ నేర్చుకుని మంచి ఉద్యోగావకాశాలను సాధించుకోగలిగారు. అలా తనకు లభించిన ప్రోత్సాహ ఉత్సాహంతో తన వయసు ఆడపిల్లలకే కాదు, తల్లి వయసు స్త్రీలకు కూడా కోడింగ్ నేర్పడం మొదలు పెట్టింది. అలా తనకు 23 ఏళ్లు వచ్చేసరికి చిన్న, పెద్ద కలిసి దాదాపు రెండు వేల మందికి పైగా ఆమె వద్ద కోడింగ్ నేర్చుకుని సాంకేతికంగా అభివృద్ధి చెంది, తమ కాళ్ల మీద తాము నిలబడగలిగారు. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఆరవ తరగతి చదివేటప్పుడే కోడింగ్ రంగంలో సాధించిన ప్రావీణ్యం బాల మేధావిగా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే అమ్మానాన్న ఆఫీసులనుంచి ఇంటికి వచ్చేలోగా వారికోసం ఎదురు చూస్తూ రకరకాల వెబ్సైట్లకు రూపకల్పన చేసేదానిని. అప్పుడు నాన్న నాతో.. ‘ఈ పిచ్చి పిచ్చి వెబ్సైట్లు కాదు బేబీ... నువ్వు నాసా సైంటిస్ట్‌గా ఎదగాలి. తలచుకుంటే నీకదేమీ ఒక లెక్కలోనిది కాదు’ అని చెప్పిన మాట నన్ను ఎంతో ప్రభావితం చేసింది. అలా ఎయిత్ క్లాస్‌కు వచ్చేసరికి పెద్దయ్యాక నేను చేయవలసింది ఉద్యోగం కాదని... సాంకేతికంగా అభివృద్ధి చెందడం, దానిద్వారా నేను నేర్చుకున్న పాఠాలను పదిమందికీ చెప్పడంలోనే ఎంతో థ్రిల్ ఉందనీ అర్థమైంది. నా దగ్గర కోడింగ్ పాఠాలు నేర్చుకున్న వారే తమంతట తాము స్వచ్ఛందంగా ఇతరులకు నేర్పించడం మొదలు పెట్టారు. ఆ విధంగా ‘కోడింగ్ ఫర్ ఉమెన్ బై ఉమెన్’ కాన్సెప్ట్ మాకు బాగా ఉపకరించింది. అంతేకాదు, డిజిటల్ జెండర్ గ్యాప్ అనే వివక్షను పూడ్చాలన్న నా స్వప్నం సాకారం అయ్యేందుకు ఉపకరించింది. ఏమైనా పిల్లలు గ్యాడ్జెట్స్‌తో ఆడుకుంటున్నప్పుడు వాళ్లు వాటితో ఏం చేస్తున్నారో... తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. దానిని వారు మంచికే ఉపయోగిస్తున్నారు అని గుర్తించగలిగితే ఆ దిశగా వారిని ప్రోత్సహించడం మంచిది. నా తల్లిదండ్రులు కోడింగ్‌పై నాకున్న ప్యాషన్‌ను గుర్తించకుండా ఏవో పిచ్చి ఆటలు ఆడుతున్నాను అనుకుని దానికి అడ్డుకట్ట వేసి ఉంటే నేను ఈ స్థాయికి ఎదిగి ఉండేదానిని కాను’’ అని ఆమె చెప్పిన మాటలు ఆలోచించదగ్గవి. ∙కోడింగ్‌లో శిక్షణ పొందుతున్న అమ్మాయిలు -
ఆధ్యాత్మిక పర్యాటకంతో ఉపాధి
ముంబై: ఆధ్యాత్మిక పర్యాటకంతో వచ్చే 4–5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని గ్లోబల్ టెక్నాలజీ, డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ కంపెనీ ఎన్ఎల్బీ సరీ్వసెస్ తెలిపింది. భారత్‌లో ఈ రంగం 2023–30 మధ్య ఏటా 16 శాతం వృద్ధి చెందుతుందని సంస్థ సీఈవో సచిన్ అలుగ్ ఒక అంచనాగా చెప్పారు. ‘దేశీయ టూరిజంలో ఆధ్యాత్మిక పర్యాట కం వాటా ఏకంగా 60 శాతముంది. 2028 నాటికి ఈ విభాగం 60 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేయగలదు. శాశ్వత, తాత్కాలిక ఉద్యోగ అవకాశాలకు కొత్త వేదికలను సృష్టిస్తుంది. కోవిడ్ మహ మ్మారి తర్వాత యాత్రలకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021–22లో ఆధ్యాత్మిక చందాలు 14 శాతం అధికం అయ్యాయి. అయోధ్యలో ఇటీవల ప్రారంభించిన రామ్ మందిర్‌తో ఆధ్యాత్మిక పర్యాటకానికి జోష్ నింపనుంది. ఒక్క రామ్ మందిర్ రాక కారణంగా వంటవారు, ఫ్రంట్ డెస్క్ మేనేజర్, హౌజ్‌కీపింగ్, టూర్ గైడ్స్ వంటి సుమారు 25,000 జాబ్స్ కొత్తగా రానున్నాయి. ఆహార సేవలు, కంజ్యూమర్ గూడ్స్, ఆతిథ్యం, రవాణా, మతపర ఉత్పత్తులు, చేతివృత్తులు, వ్రస్తాలు, సరుకు రవాణా, గిడ్డంగులు, ప్యాకింగ్ తదితర విభాగాల్లో కొత్తగా వ్యాపార అవకాశాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకులకు ప్రత్యేకంగా సేవలందించే కొత్త సంస్థల సంఖ్యలో 6–8 శాతం పెరుగుదల అంచనా వేస్తున్నాము’ అని వివరించారు. -
4 ఏళ్లలో భారీగా ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు
నోయిడా: దేశీయంగా ఎల్రక్టానిక్స్ పరికరాల వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వచ్చే 3–4 ఏళ్లలో భారత్ చెప్పుకోతగ్గ స్థాయిలో విడిభాగాల ఎగుమతిదారుగా ఎదగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొబైల్ రంగానికి ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకంతో అదనంగా 5 లక్షల ఉద్యోగావకాశాలు వచ్చాయని, రాబోయే అయిదేళ్లలో ఇది మరింతగా పెరుగుతుందని మంత్రి చెప్పారు. ‘దేశీయంగా డిజైన్ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటున్నాం. ఇది దేశానికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఎల్రక్టానిక్స్ పరికరాల తయారీ కూడా వృద్ధి చెందుతోంది. వచ్చే 3–4 ఏళ్లలో మొబైల్ ఫోన్ల తరహాలోనే మనం విడిభాగాలను కూడా గణనీయంగా ఎగుమతి చేయబోతున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. డిక్సన్ టెక్నాలజీస్‌కి చెందిన నాలుగో మొబైల్ ఫోన్స్ తయారీ యూనిట్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. డిక్సన్ అనుబంధ సంస్థ ప్యాడ్జెట్ ఎల్రక్టానిక్స్ దీన్ని రూ. 256 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంటు వార్షిక సామ ర్ధ్యం 2.5 కోట్ల యూనిట్లు కాగా, చైనా కంపెనీ షావో మికి కోసం స్మార్ట్ఫోన్లను తయారు చేస్తారు. ఎల్రక్టానిక్స్ సంస్థల సమాఖ్య ఎల్సినా అంచనల ప్రకారం 2021–22లో దేశీయంగా మొత్తం విడిభాగాల మార్కెట్ 39 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఇందులో 68 శాతం వాటా దిగుమతులదే ఉంటోంది. -
నిరుద్యోగులకు శుభవార్త.. పండుగ సీజన్లో 5 లక్షల ఉద్యోగాలు!
పండుగ సీజన్ అనగానే వ్యాపారాలు పెరుగుతాయని అందరికి తెలుసు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ-కామర్స్ కంపెనీలు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తాయి. ఇందులో భాగంగానే ‘మీషో’ (Meesho) దాదాపు 5 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఈకామ్ ఎక్స్‌ప్రెస్, డీటీడీసీ, ఎలాస్టిక్ రన్, లోడ్‌షేర్, డెలివరీ, షాడోఫ్యాక్స్, ఎక్స్‌ప్రెస్‌బీస్ వంటి మరిన్ని థర్డ్-పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడర్లతో కొలాబరేషన్ ద్వారా దాదాపు 2 లక్షల ఉద్యోగ అవకాశాలను అందించాలని మీషో భావిస్తోంది. ఇందులో దాదాపు 60 శాతం కంటే ఎక్కువ ఉద్యోగాలు టైర్ 3, 4 ప్రాంతాల్లో రానున్నట్లు సమాచారం. పండుగ సీజన్లో డిమాండ్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కస్టమర్ల అవసరాలను తీర్చడానికి కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు ఫుల్ఫిల్మెంట్ అండ్ ఎక్స్‌పీరియన్ష్ సీఎక్స్ఓ సౌరభ్ పాండే అన్నారు. ఇదీ చదవండి: గూగుల్ సీఈఓ మరీ ఇంత సింపుల్గానా.. ఫిదా అవుతున్న నెటిజన్లు! మీషో సెల్లర్స్ పండుగ సీజన్లో 3 లక్షల మందికి పైగా సీజనల్ వర్కర్స్‌ను నియమించుకుంటారు. మీషో 80 శాతం మంది విక్రేతలు కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడానికి, ఫ్యాషన్ యాక్ససరీస్, పండుగ అలంకరణ వంటి కొత్త కేటగిరీలను వెంచర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పెరిగిన డిమాండ్‌ను ఆర్గనైజ్ చేయడానికి మీషో అదనపు స్లోరేజ్ స్పేస్ అద్దెకు తీసుకోవడంపై ద్రుష్టి పెడుతున్నట్లు చెబుతున్నారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం పండుగ నియామకాలు గిగ్ జాబ్‌లలో గణనీయమైన వృద్ధిని సాధించవచ్చని అంచనా వేస్తున్నట్లు టీమ్‌లీజ్ తెలిపింది. బెంగుళూరు, ఢిల్లీ, ముంబై , హైదరాబాద్ వంటి టైర్-1 నగరాలతోపాటు టైర్ 3 నగరాల్లో కార్యకలాపాలను మరింత పెంచడానికి కంపెనీ సిద్ధమవుతోంది. ఇదీ చదవండి: భారత్‌లో ఐఫోన్ మేనియా.. ఎమ్ఆర్పీ కంటే ఎక్కువ ధరతో.. ఇప్పటికే వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల తన సప్లై చైన్‌లో 1,00,000 కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్నట్లు తెలిపింది. పండుగ సీజన్‌కు ముందు, పండుగ సీజన్లో కస్టమర్ డిమాండ్‌ను తీర్చడానికి ఫ్లిప్‌కార్ట్ తన పాన్-ఇండియా సప్లై చెయిన్‌లో మిలియన్ల కొద్దీ సీజనల్ ఉద్యోగాలను నియమించుకోవాలని చూస్తోంది. -
Rozgar Mela: వేగవంతమైన వృద్ధి బాటలో మన ఆర్థికం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి బాటలో పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. సోమవారం రోజ్‌గార్ మేళాలో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. కేంద్ర పారామిలటరీ దళాలు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఢిల్లీ పోలీసు శాఖలో ఉద్యోగాలు పొందిన 51,000 మందికిపైగా యువతకు ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు. ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్, పర్యాటకం, ఆహార శుద్ధి రంగాల్లో మరింత వృద్ధి నమోదవుతుందని, యువతీ యువకులకు భారీ సంఖ్యలో కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నట్లు మోదీ తెలిపారు. మన దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పురోగమిస్తోందని చెప్పారు. త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఖాయమని పునరుద్ఘాటించారు. అభివృద్ధి ఫలాలు సామాన్య ప్రజలకు అందుతాయని అన్నారు. అన్ని రంగాల అభివృద్ధితోనే ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేస్తుందని చెప్పారు. కోట్లాది కొత్త కొలువులు దేశంలో 2030 నాటికి టూరిజం రంగంలో కొత్తగా దాదాపు 14 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం వాటా రూ.20 లక్షల కోట్లకు చేరుతుందని ప్రధాని మోదీ వివరించారు. ఫార్మాస్యూటికల్ రంగం వాటా రూ.4 లక్షల కోట్లుగా ఉందని, 2030 నాటికి ఇది రూ.10 లక్షల కోట్లకు చేరుతుందని వెల్లడించారు. ఫార్మా రంగంలో యువత అవసరం ఎంతో ఉందన్నారు. ఆటోమొబైల్ రంగంలోనూ యువ శక్తి భాగస్వామ్యం కీలకమని చెప్పారు. ఆహార శుద్ధి రంగం విలువ ప్రస్తుతం రూ.26 లక్షల కోట్లుగా ఉందని, మరో మూడున్నరేళ్లలో ఇది ఏకంగా రూ.35 లక్షల కోట్లకు చేరుతుందని స్పష్టం చేశారు. ఆహార శుద్ధి పరిశ్రమ విస్తరిస్తున్నకొద్దీ కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతూనే ఉంటుందని ఆయన అన్నారు. ఇక ‘మేడ్ ఇన్ ఇండియా’ ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు సుపరిపాలన, చట్టబద్ధ పాలన ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు వెల్లువెత్తుతాయని, అందుకు ఉత్తరప్రదేశ్ ఒక ఉదాహరణ అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు ఉండాలన్నారు. వేగవంతమైన అభివృద్ధి కనిపించాలన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం ఉండాలన్నారు. నేరాల రేటు అధికంగా ఉన్న రాష్ట్రాలకు పెట్టుబడులు పెద్దగా రావడం లేదని, ఉద్యోగ అవకాశాలు పడిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ కృషి వల్ల మార్పు కనిపిస్తోందన్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో ఎగుమతులు జరిగాయన్నారు. వస్తూత్పత్తి ఊపందుకుందని, ఉద్యోగాల సంఖ్య పెరగడంతో కుటుంబాల ఆదాయం పెరిగినట్లు మోదీ తెలిపారు. ఎల్రక్టానిక్ పరికరాల తయారీపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. మేడ్ ఇన్ ఇండియా ల్యాప్‌టాప్‌లు, వ్యక్తిగత కంప్యూటర్లు ప్రపంచ మార్కెట్లను ముంచెత్తే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. పారా మిలటరీ దళాల్లో కొత్తగా చేరిన వారిని మోదీ ‘అమృత్ రక్షకులు’గా అభివరి్ణంచారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019