breaking news
-
ఈస్టర్ ఫెస్టివల్.. రన్ ఫర్ జీసస్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: ఈస్టర్ ఫెస్టివల్ సందర్భంగా హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ జీసస్ ర్యాలీ’ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చి నుంచి ర్యాలీని ప్రారంభించారు. కార్డినల్ పూలే ఆంథోని ప్రత్యేక అతిథిగా పాల్గొని ఈ ర్యాలీని ప్రారంభించారు. క్రైస్తవుల సోదరులు, యువతులు పెద్దఎత్తున ర్యాలీ తీశారు. ఫొటోలు.. సినీ నటుడు రాజా పర్యవేక్షణలో కొనసాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చి నుంచి అబిడ్స్ వరకు రన్ ఫర్ జీసస్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా పూల ఆంథోని మాట్లాడుతూ.. ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో ముఖ్యమని అన్నారు ఏసుప్రభు అనుగ్రహం ప్రజలపై ఎల్లవేళలా ఉంటుందన్నారు. అనంతరం పూల ఆంథోనికి జ్ఞాపకం అందజేశారు రాజా. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన యువతకు రాజా శుభాకాంక్షలు తెలిపారు. -
మానవాళి కోసం జీసస్ మహాత్యాగమే గుడ్ ఫ్రైడే: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ‘మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే.. జీసస్ జీవితమే మానవాళికి గొప్ప సందేశం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘‘ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు. ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు’’ అని సీఎం పేర్కొన్నారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవన్నీ తన జీవితం, బోధనలు ద్వారా జీసస్ లోకానికి ఇచ్చిన సందేశాలు’’ అని సీఎం జగన్ అన్నారు. -
గుడ్ ఫ్రైడే' 2024: ప్రాముఖ్యత ఏంటి.. ‘హ్యాపీ గుడ్ ఫ్రైడే' విషెస్ చెప్పకండి!
క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే పవిత్ర దినం. బైబిలు ప్రకారం గుడ్ ఫ్రైడ్ అంటే మానవాళి పాపాలకు జీసస్ శిలువపై ప్రాణాలను పణంగా పెట్టిన రోజు. అందుకే ఏసుక్రీస్తు జ్ఞాపకార్థం ఈ రోజును పవిత్ర శుక్రవారం, లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. శిలువ వేయబడిన మూడు రోజుల తరువాత యేసు పునరుత్థానాన్ని ఆదివారం రోజు ఈస్టర్ గా పాటిస్తారు. గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవున్ని తలచుకుంటారు. జీసస్ ప్రార్థనలో గడుపుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. ప్రవచనాలు, ప్రార్థనలు, ధ్యానం వంటివి జరుగుతూనే ఉంటాయి. కొంతమంది నల్లటి వస్త్రాలు ధరించి తమ బాధను వ్యక్తపరుస్తారు. గుడ్ ఫ్రైడే విషెస్ యేసు మరణానికి త్యాగానికి గుర్తుగా సంతాపాన్ని తెలియజేయడానికి దీన్ని నిర్వహించు కుంటారు. అందుకే గుడ్ ఫ్రైడే వస్తే మాత్రం ఏ ఒక్కరూ హ్యాపీ గుడ్ ఫ్రైడే అని ఒకర్ని ఒకరు విష్ చేసుకోరు. మిగిలిన వారు కూడా ఎవరూ అలాంటి మెసేజ్‌లు పంపుకోరు. చర్చిలలో ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుకలు జరగవు. ఏసు ప్రభు ప్రజల పాపాలకోసం త్యాగ చేసి మానవాళికి మంచి చేశాడని, అందుకే ఫ్రైడేకి ముందు గుడ్ అనే పదం చేరిందని నమ్ముతారు. గుడ్ ఫ్రైడేను... హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుచుకుంటారు. శిలువ వేయడం అనేది యేసు జీవితంలో చిట్టచివరి ఘట్టమనీ, క్రైస్తవ సోదరుల విశ్వాసం. అందుకే గుడ్ ఫ్రైడే రోజు ఎన్నో చర్చిలలో ఈ నాటికను ప్రదర్శిస్తారు. అలాగే గుడ్ ఫ్రైడేకి ముందు లెంట్ డేస్ మొదలవుతాయి. దాదాపు 46 రోజులు పాటు కొనసాగుతాయి. ఆ రోజుల్లో ఉపవాసాలను పాటిస్తారు. -
క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ
ఢిల్లీ: యేసుక్రీస్తు జీవిత సందేశాన్ని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. దయ, సేవాభావం ప్రస్తుత సమాజానికి అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం అందడానికి యేసుక్రీస్తు పనిచేశారని చెప్పారు. సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి ఆయన పనిచేశారని కొనియాడారు. ఈ ఆలోచనలు దేశ అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. తన నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. "యేసుక్రీస్తు జన్మదినాన్ని మనం క్రిస్మస్ గా జరుపుకుంటాం. ఆయన అందించిన జీవిత సందేశం, విలువలను గుర్తుంచుకోవడానికి ఇది ఒక సందర్భం. దయ, సేవ ఆదర్శాలతో ఆయన జీవించారు. ప్రతి ఒక్కరికి న్యాయం అందే సమ్మిళిత సమాజాన్ని రూపొందించడానికి ఆయన కృషి చేశారు. ఈ ఆదర్శాలు మన దేశ అభివృద్ధికి మార్గదర్శకంగా పనిచేస్తాయి." అని ప్రధాని మోదీ అన్నారు. ప్రసంగంలో భాగంగా పోప్‌ను కలిసిన సమయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. చిరస్మరణీయ క్షణంగా ఆయన పేర్కొన్నారు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి సామాజిక సామరస్యం, సోదరభావం, వాతావరణ మార్పు, సమ్మిళిత అభివృద్ధి వంటి అంశాలపై చర్చించామని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: Christmas: దేశమంతటా క్రిస్మస్ వెలుగులు -
జీసస్ ఎలా కనిపించేవారంటే..?! పరిశోధనలో షాకింగ్ విషయాలు
జీసస్ లేదా ఏసుక్రీస్తూ ఎలా ఉంటారో మనకు తెలిసిందే. మనం చూసిన కొన్ని ఫోటోలు, టీవీల్లోనూ పొడవాటి జుట్టుతో పై నుంచి కింద వరకు ఓ గౌను మాదిరి తెల్లటి లేదా నీలం డ్రస్ వేసుకుని, గడ్డంతోనే చూశాం. ఆయన చేతి వేళ్లు బాగా పొడుగ్గా ఉన్నట్లు చిత్రాల్లో చూపించేవారు. పాశ్చాత్య చిత్రాల్లో కూడా మనం అలానే చూశాం. అయితే నిజానికి ఆయన ఎలా ఉండేవారు? ఆయన ముఖ చిత్రం ఎలా ఉండేది అనేదానిపై చాలా మందికి పలు సందేహాలు ఉన్నాయి. ఆయను రియల్ లుక్ ఎలా ఉండేది అనే దానిపై జరిపిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు చాలా షాకింగ్ విషయాలు వెల్లడించారు. వివరాల్లోకెళ్తే..ఏసుక్రీస్తు నిజంగా మనం చూసిన చిత్రాల్లో ఉన్నట్లే ఉంటారా? లేక ఎలా ఉండేవారనేది పలు శాస్త్రవేత్తల మదిని తొలిచే చిక్కు ప్రశ్న. ఆ దిశగా జరిపిన పరిశోధనలో..కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రసిద్ధి పొందిన తొలి ఏసు క్రీస్తు చిత్రం గ్రీకు సామ్రాజ్యం నుంచి వచ్చింది. ఆ తర్వాత నాల్గో శతాబ్దం నుంచి బైజాంటైన్ యుగపు మెస్సీయ వర్ణనతో కూడిని చిత్రాలు మనస్సుల్లో బాగా నిలిచిపోయాయి. దాన్ని బట్టి క్రీస్తూ ఇలా ఉండేవారనేది ఓ ఊహ మాత్రమే కానీ వాటిల్లో కచ్చితత్వం లేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. నిజానికి ఆయన చిత్రాలు సింహాసనంపై ఒక చక్రవర్తిలా కూర్చున్న ఏసు చిత్రం ఆధారంగా వచ్చినవే. ఈ ఏసు చిత్రం రోమ్‌లో శాంటా ప్యూడెన్జైనా చర్చిలోని మొజాయిక్‌లో కనిపిస్తుంది. అందులో పొడవాటి జుట్టు, గడ్డంతో సింహాసనంపై కూర్చొన్న ఆయన జూస్ మాదిరిగా కనిపిస్తారు. జూస్ అంటే ప్రాచీన గ్రీకు మతంలో ప్రధాన దేవుడు. ఒలింపియా ఆయన దేవాలయం. అందులోని ఆయన విగ్రహం ఆధారంగానే ఏసుక్రీస్తు చిత్రాలు వచ్చాయని అన్నారు పరిశోధకులు. బైజాంటియన్ కళాకారులు ఏసుక్రీస్తును స్వర్గాన్ని పాలించే, విశ్వ పాలకుడి రూపంలో చూపించారు. వారు ఆయన్ను యువ జూస్ రూపంలో చూపించేవారు. కానీ, కాలక్రమేణా స్వర్గానికి చెందిన ఏసుక్రీస్తు చిత్రాల విజువలైజేషన్లో మార్పులు వచ్చాయి. అయినప్పటికీ ఏసు క్రీస్తూ ఎలా ఉంటారనేది అనే ప్రశ్న ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉండేది శాస్త్రవేత్తలను. ఈ నేపథ్యంలోనే ఏసు తల నుంచి పాదాల వరకు ఆయన రూపం ఎలా ఉంటుందనే దానిపై కూలకషంగా పరిశోధనలు చేయడం ప్రారంభించారు. ఈ మేరకు రిచర్డ్ నీవ్ నేతృత్వంలోని బ్రిటీష్ ఫోరెన్సిక్ ఆంత్రోపాలజిస్టుల బృందం ఇజ్రాయెల్ పురావస్తు ప్రదేశాల్లోని పుర్రెలను పరిశీలించడం, బైబిల్ గ్రంధాలు, చారిత్రక ఆధారాలను విశ్లేషించడం తదితర పనులు చేశారు. వారంతా ఏసు ఎలా కనిపించేవాడో అనే దిశగా అతని ప్రసిద్ధ ముఖ చిత్రాన్ని పునర్నిర్మించాలానే దిశగా శోధించడం ప్రారంభించారు. ప్రముఖ ప్రాంతాల్లో లభించిన కొన్ని రకాల పుర్రెల ఆధారంగా రూపొందించే దిశగా అడుగులు వేశారు. ఆ పరిశోధనల్లో..అతను ఒకటవ శతాబ్దపు యూదు మనిషిలాగా ఉండేవారని, ముదురు రంగు చర్మంతో , పొట్టి పొట్టి గిరజాల జుట్లుతో ఉండేవారని కనుగొన్నారు. నిపుణల అభిప్రాయం ప్రకారం ఆయన రూపం మనం చూసే చిత్ర రూపానికి దగ్గరగానే ఉంటుందని అన్నారు. అతని ఆ కాలంలోనే పురుషుల కంటే విభిన్నంగా కనిపించేవాడని కూడా చెప్పుకొచ్చారు. ఓ విశేషమైన వ్యక్తిత్వం కలవాడిగా సుస్పష్టంగా అనిపించేదాన్ని అందువల్లే కొందరూ ఆయన్ని దేవుని కుమారుడిగా కీర్తించి ఉండవచ్చని అన్నారు. ఆ ఫోరెన్సిక్ బృందం రూపొందించిన ముఖం చేస్తే ఏసు ముఖం ఇలా ఉండేదా..? అనిపిస్తుంది. ఇది మనం చూసే ఏసు ముఖానికి కాస్త విభిన్నంగా ఉంది. కానీ ఏసుని స్వర్గాన్ని పాలించే, విశ్వ పాలకుడి రూపంలో చూపించే చిత్రాలను రూపొందించడంతో ఆయన అలా ఉంటారనే అనుకున్నాం. ఎందుకంటే బైబిల్ని విశ్లేషిస్తే ప్రజలు మొదట్లో ఆయన్ని దేవుడిగా భావించలేదు ఓ సాధారణ మనిషిలానే భావించేవారు. అప్పుడు ఆయనకు గడ్డం గానీ పొడవాటి జుట్టు కానీ లేదు. గ్రీకు-రోమన్ కాలంలో శుభ్రంగా గడ్డం చేసుకోవడం, జుట్టు పొట్టిగా ఉండడం తప్పనిసరిగా భావించేవారు. మెడ వరకూ ఉన్న జుట్టు, గడ్డం దైవత్వాన్ని సూచిస్తుంది. అప్పటి పురుషులకు అలాంటి రూపం ఉండేది కాదు. తత్వవేత్తలు కూడా చాలా పొట్టి జుట్టుతోనే ఉండేవారు. చెదిరిన జుట్టు, గడ్డం వేదాంతులకు చిహ్నంగా భావించి ఉండవచ్చు. అందువల్ల ఏసు క్రీస్తూ చిత్రాలను ఇలా రూపొందించి ఉండొచ్చని అంటున్నారు. కానీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఆయన ఓ విశిష్టమైన వ్యక్తిలా అందర్నీ అబ్బురపరిచేలా ఉండేవారని, దీంతో మొదట్లో సాధారణ మనిషిలా చూసిన వారు ఆయన మంచి వ్యక్తిత్తత్వానికి దాసోహం అయ్యి దేవుడిలా భావించడం జరిగింది. అదీగాక స్వాభావికంగా మంచి పనుల చేసే వ్యక్తులను దేవత్వం కలిగినా లేదా దేవడిచ్చిన వ్యక్తులుగా భావించడం జరుగుతుంది. దీనివల్ల కూడా ఆయన ముఖ చిత్రాలను ఇలా రూపొందించి ఉండొచ్చని జీసస్: ది కంప్లీట్ స్టోరీ పేరుతో చేసిన పరిశోధన డాక్యుమెంటరీలో వెల్లడించింది ఫోరెన్సిక్ శాస్త్రవేత్తల బృందం. (చదవండి: పండుగ వేళ నిరసనల హోరు..వెలవెలబోయిన ఐకానిక్ క్రిస్మస్ ట్రీ)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019