breaking news
-
ఐపీఎల్ 2024లో సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తయ్యాయి.. టాప్‌లో కోహ్లి, బుమ్రా
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సగానికి పైగా మ్యాచ్‌లు (38 మ్యాచ్‌లు) పూర్తయ్యాయి. ప్లే ఆఫ్స్ బెర్తులపై పూర్తి క్లారిటీ రానప్పటికీ ఓ అంచనా అయితే వచ్చింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ (8 మ్యాచ్‌ల్లో 7 విజయాలు) పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండగా.. కేకేఆర్ (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు), సన్‌రైజర్స్ (7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు), సీఎస్కే (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు), లక్నో సూపర్ జెయింట్స్ (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం ఈ ఐదు జట్ల మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే గుజరాత్, ముంబై, ఢిల్లీల్లో ఏదో ఒక జట్టుకు లైన్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం గుజరాత్ (8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) ఆరు, ముంబై (8 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఏడు, ఢిల్లీ (8 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. 8 మ్యాచ్‌ల్లో రెండిట గెలిచిన పంజాబ్ తొమ్మిదో స్థానంలో ఉండగా.. 8 మ్యాచ్‌ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచిన ఆర్సీబీ చివరి స్థానంలో పాతుకుపోయింది. ప్రస్తుత సీజన్లో 70 మ్యాచ్‌లు (క్వాలిఫయర్స్, ఎలిమినేట్, ఫైనల్స్ కాకుండా) జరగాల్సి ఉండగా.. ఇప్పటివరకు 38 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం వ్యక్తిగత విభాగాల్లో (అత్యధిక పరుగులు, వికెట్లు) విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా టాప్‌లో కొనసాగుతున్నారు. విరాట్ ఈ సీజన్లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి 63.17 సగటున 150.40 స్ట్రయిక్‌రేట్‌తో 379 పరుగులు చేయగా.. బుమ్రా 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి చహల్, హర్షల్ పటేల్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. ఈ సీజన్లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అగ్రస్థానాల్లో ఉన్న ఆటగాళ్ల వివరాలు.. అత్యధిక పరుగులు-విరాట్ కోహ్లి (379) అత్యధిక వ్యక్తిగత స్కోర్-విరాట్ కోహ్లి (113) అత్యధిక సగటు-రవీంద్ర జడేజా (141) అత్యధిక స్ట్రయిక్‌రేట్-రొమారియో షెపర్డ్ (280.00) అత్యధిక శతకాలు-బట్లర్ (2) అత్యధిక హాఫ్ సెంచరీలు-రియాన్ పరాగ్, శాంసన్, క్లాసెన్, డికాక్ (3) అత్యధిక బౌండరీలు-ట్రవిస్ హెడ్ (39) అత్యధిక సిక్సర్లు- క్లాసెన్ (26) బౌలింగ్ విషయానికొస్తే.. అత్యధిక వికెట్లు-13 (బుమ్రా, చహల్, హర్షల్) ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక బౌలింగ్ సగటు లక్నో సంచలన పేసర్ మయాంక్ యాదవ్ (9.0) పేరిట ఉంది. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు-సందీప్ శర్మ (5/18) (బుమ్రా,యశ్ ఠాకూర్, సందీప్ శర్మ.. ఈ ముగ్గురు చెరోసారి ఐదు వికెట్ల ఘనత సాధించారు) అత్యుత్తమ సగటు-మయాంక్ యాదవ్ (6.00) -
IPL 2024: బుమ్రాను భయపెట్టిన అశుతోష్.. ఊహలకందని సిక్సర్
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడినా.. ఇద్దరు బ్యాటర్లు మాత్రం ముంబైకి ముచ్చెమటలు పట్టించారు. 184 పరుగుల లక్ష్య ఛేదనలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి గెలుపుపై ఏ మాత్రం ఆశలు లేని పంజాబ్‌ను అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), శశాంక్ సింగ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో తిరిగి మ్యాచ్‌లో నిలబెట్టారు. అయితే ఆఖర్లో ముంబై బౌలర్లు పుంజుకోవడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. - He is 25-Year old. - He's playing debut IPL. - He scored 61(28) in today's match. - 156 runs, 52 ave, 205.3 SR in this IPL. - He hits 13 Sixes & 9 Fours. ASHUTOSH SHARMA - THE FUTURE OF INDIAN CRICKET. ⭐ pic.twitter.com/JgVu4UsDab — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడినా ఆశుతోష్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం హైలైట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆశుతోష్ ఆడిన కొన్ని షాట్లు క్రికెట్ పండితులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించాయి. బుమ్రా బౌలింగ్‌లో ఆడిన ఓ షాట్ అయితే న భూతో న భవిష్యతి అన్నట్లుగా ఉంది. ప్రపంచ బ్యాటర్లనంతా గడగడలాడించే బుమ్రా బౌలింగ్‌లో అశుతోష్ ఊహలకందని స్వీప్ షాట్ సిక్సర్ కొట్టాడు. బుమ్రా బౌలింగ్‌లో ఇలాంటి షాట్ ఆడటం దాదాపుగా అసాధ్యం. ASHUTOSH SHARMA PLAYED ONE OF THE BEST SHOT IN IPL 2024. 🥶 pic.twitter.com/WhO7RgfNEF — Johns. (@CricCrazyJohns) April 18, 2024 అయితే అశుతోష్ మాత్రం ఏమాత్రం తడబడకుండా ఈ షాట్‌ను అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశాడు. అశుతోష్ ఈ షాట్ ఆడిన విధానం చూసి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నోరెళ్లబెట్టాడు. మ్యాచ్ అనంతరం ఈ సిక్సర్ గురించి మాట్లాడుతూ నమ్మశక్యంగా లేదని అన్నాడు. ఈ షాట్ చూసిన క్రికెట్ అభిమానులైతే బుమ్రా బౌలింగ్ ఇలా కూడా సిక్సర్ కొట్టొచ్చా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో అశుతోష్ ఆడిన సుడిగాలి ఇన్నింగ్స్‌లో దాదాపు ప్రతి షాట్ అణిముత్యమే అని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. టీమిండియా నయా 360 ప్లేయర్లంటున్నారు. అశుతోష్ సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. From sweeping Bumrah for six, to soaking pressure and consistantly delivering when team needs, taking Punjab almost par yesterday. The new 360 player in town, Ashutosh Sharma pic.twitter.com/SsniN2ad13 — Jahazi (@Oye_Jahazi) April 19, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. సూర్యకుమార్ యాదవ్ (53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (25 బంతుల్లో 36;2 ఫోర్లు, 3 సిక్సర్లు), తిలక్ వర్మ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. ఛేదనలో పంజాబ్.. శశాంక్ సింగ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగినప్పటికీ లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రా (4-0-21-3), గెరాల్డ్ కొయెట్జీ (4-0-32-3), అద్భుతంగా బౌలింగ్ చేసి పంజాబ్ ఓటమిని అడ్డుకున్నారు. Hardik Pandya said - "The way Ashutosh Sharma middle every ball and played unbelievable knock. I'm happy for him for future". pic.twitter.com/gOTmHmphiQ — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 -
PBKS Vs MI: బుమ్ బుమ్ బుమ్రా.. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ బాల్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సంచలన బంతితో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ రిలే రూసోను అద్బుతమైన యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన బంతికి రూసో దగ్గర సమాధానమే లేకుండా పోయింది. పంజాబ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో మూడో బంతికి సామ్ కుర్రాన్.. రూసోకు స్ట్రైక్ ఇచ్చాడు. ఈ క్రమంలో రూసోకు బుమ్రా అద్బుతమైన యార్కర్ వేశాడు. రూసో తన బ్యాట్‌తో బంతిని అడ్డుకునే లోపే స్టంప్స్‌ను గిరాటేశాడు. ఇది చూసిన రూసోకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ బాల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో బుమ్రా సంచలన ప్రదర్శన కనబరిచాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్‌పై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. Simply unplayable Bumrah 🫡🔥#PBKSvMI #TATAIPL #IPLonJioCinema #IPLinHindi | @mipaltan | @Jaspritbumrah93 pic.twitter.com/fGmNlFNIqZ — JioCinema (@JioCinema) April 18, 2024 -
ఈ బ్యూటీని గుర్తుపట్టారా? టీమిండియా స్టార్ భార్య.. అంతేకాదండోయ్! (ఫొటోలు)
-
కోహ్లి, బుమ్రా, రోహిత్ కాదు.. అతడే మా జట్టుకు ఆడాలి: బట్లర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్ రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2018 సీజన్ నుంచి బట్లర్ రాజస్తాన్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2023 సీజన్లో 863 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా నిలిచాడు. అయితే ప్రస్తుత సీజన్లో తొలి మూడు మ్యాచ్‌ల్లో ఇబ్బంది పడిన బట్లర్.. ఆర్సీబీతో మ్యాచ్‌లో సెంచరీ చేసి తన ఫామ్‌ను తిరిగి పొందాడు. శనివారం ముల్లానాపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కూడా సత్తాచాటాలని బట్లర్ ఊవ్విళ్లరుతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు బట్లర్ తన సహచర ఆటగాడు ట్రెంట్ బౌల్ట్త్ కలిసి "రాయల్స్ ర్యాపిడ్ ఫైర్" అనే ఇంటర్వ్యూలో పాల్గోనున్నాడు. ఈ క్రమంలో బట్లర్‌కు అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. ప్రస్తుత ఐపీఎల్ క్రికెటర్లలో ఏ ఆటగాడు రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడాలని మీరు కోరుకుంటున్నారు? అని బౌల్ట్ ప్రశ్నించాడు. అందుకు బట్లర్ ఏమీ ఆలోచించకుండా వెంటనే అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పేరు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా బట్లర్ టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మలను ఎంచుకోపోవడం అందరని విస్మయానికి గురిచేస్తోంది. From his favourite wicket to one player he would like at the Royals, here’s Jos and Boulty like never before 🔥😂 pic.twitter.com/F7524zWiQZ — Rajasthan Royals (@rajasthanroyals) April 12, 2024
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019