breaking news
-
క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం.. 33 ఏళ్ల వయసులోనే స్టార్ ఆల్‌రౌండర్ మృతి
క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం చోటు చేసుకుంది. పపువా న్యూ గినియా మహిళా క్రికెటర్ కయా అరువా 33 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లింది. అరువా మృతికి కారణాలు తెలియరాలేదు. అరువా అకాల మరణాన్ని దృవీకరిస్తూ ఐసీసీ ట్వీట్ చేసింది. 2010లో తొలిసారి పపువా న్యూ గినియా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అరువా.. అనతికాలంలోనే స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగింది. లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్, రైట్ హ్యాండ్ మిడిలార్డర్ బ్యాటర్ అయిన అరువా.. పపువా న్యూ గినియా తరఫున 47 అంతర్జాతీయ టీ20లు ఆడి 341 పరుగులు, 59 వికెట్లు తీసింది. బ్యాట్‌తో పెద్దగా రాణించని అరువా.. బంతితో చెలరేగింది. అరువా తన స్వల్ప కెరీర్లో 3 సార్లు నాలుగు వికెట్లు, రెండు సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించింది. Sad news out of Papua New Guinea following the passing of women's international all-rounder Kaia Arua.https://t.co/xOCFTLzIHV — ICC (@ICC) April 4, 2024 ఆమె అత్యుత్తమ గణాంకాలు (5/7) తన జట్టు తరఫున రెండో అత్యుత్తమ గణాంకాలుగా నమోదై ఉన్నాయి. అరువా కొంతకాలం పాటు తన జట్టు సారథ్య బాధ్యతలు కూడా చేపట్టింది. అరువాకు కెప్టెన్సీలో వంద శాతం సక్సెస్ రేట్ ఉంది. ఆమె తన జట్టును 29 అంతర్జాతీయ టీ20ల్లో ముందుండి నడిపించి అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సొంతం చేసుకుంది. అరువా తన దేశంలో మహిళల క్రికెట్ అభివృద్దికి ఎంతో కృషి చేసింది. తూర్పు ఆసియా పసిఫిక్ మహిళల క్రికెట్లో అరువాకు తిరుగులేని ఆల్‌రౌండర్‌గా పేరుంది. -
నితిన్ మీనన్ కొనసాగింపు
దుబాయ్: భారత అంపైర్ నితిన్ మీనన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలైట్ అంపైర్ల ప్యానెల్లో వరుసగా ఐదో ఏడాది తన స్థానం పదిలం చేసుకున్నారు. ఇండోర్‌కు చెందిన నితిన్ తొలిసారి 2020లో ఐసీసీ ఎలైట్ అంపైర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత నాలుగేళ్లుగా ఐసీసీ ఆయన సేవల్ని గుర్తించి ఎలైట్ ప్యానెల్లో కొనసాగిస్తూ వచ్చింది. తాజాగా ఈ ఏడాది కూడా మరోసారి పొడిగింపు లభించింది. ఓవరాల్‌గా అత్యున్నత అంపైర్ల ప్యానెల్‌కు ఎంపికైన మూడో భారత అంపైర్ మీనన్. గతంలో ఎస్. రవి, మాజీ స్పిన్నర్ ఎస్. వెంకటరాఘవన్‌లు ఎలైట్ క్లబ్లో ఉండేవారు. రవి 33 టెస్టు మ్యాచ్‌లకు ఫీల్డ్ అంపైర్‌గా సేవలందించగా, వెంకటరాఘవన్ ఏకంగా 73 టెస్టులకు (అన్ని ఫార్మాట్లలో 125 మ్యాచ్‌లు) అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం 12 మంది సభ్యులు గల ఈ ఎలైట్ క్లబ్లో భారత్ నుంచి 40 ఏళ్ల నితిన్ మీనన్ ఒక్కరే ఉన్నారు. కేవలం నాలుగేళ్ల కాలంలోనే ఆయన 122 అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. ఇక ఈ ఏడాది బంగ్లాదేశ్‌కు చెందిన షర్ఫుద్దౌలా షాహిద్‌కు కొత్తగా ఎలైట్ అంపైర్ల జాబితాలో చోటు దక్కింది. బంగ్లా తరఫున ఈ అర్హత సాధించిన తొలి అంపైర్‌గా ఆయన గుర్తింపు పొందారు. ఐసీసీ ఎలైట్ మ్యాచ్ రిఫరీల జాబితా నుంచి సీనియర్ రిఫరీ క్రిస్ బ్రాడ్‌ను తొలగించారు. 2003 నుంచి సుదీర్ఘకాలం కొనసాగిన ఆయన 123 టెస్టులు, 361 వన్డేలు, 135 టి20లు, 15 మహిళల టి20లకు రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించారు. పునరి్నర్మాణ ప్రక్రియలో భాగంగానే ఆయన్ని తప్పించామని, ఇతరత్రా కారణాల్లేవని ఐసీసీ తెలిపింది. -
‘టాప్’ ర్యాంక్‌లోనే సూర్యకుమార్
గత మూడు నెలలుగా ఆటకు దూరంగా ఉన్నా... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పురుషుల టి20 ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ 861 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఐర్లాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో రాణించిన రషీద్ ఖాన్ నాలుగు స్థానాలు ఎగబాకి పదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ 4వ ర్యాంక్‌లో ఉన్నాడు. -
రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకున్న గంటల వ్యవధిలోనే ఆసక్తికర పరిణామం
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న గంటల వ్యవధిలోనే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్‌తో మూడో వన్డే సందర్భంగా ఐసీసీ కోడ్ ఉల్లంఘించినందుకు గాను హసరంగపై రెండు టెస్ట్ మ్యాచ్‌ల నిషేధం పడింది. నిషేధంతో పాటు హసరంగ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. హసరంగ ఖాతాలో మూడు డీ మెరిట్ పాయింట్లు కూడా చేరాయి. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా హసరంగ ఫీల్డ్ అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఓవర్ పూర్తి చేసిన అనంతరం అంపైర్ చేతి నుంచి క్యాప్‌ను బలవంతంగా లాక్కున్నాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ఉల్లంఘన కింద దీన్ని నేరంగా పరిగణిస్తారు. ప్రస్తుత బంగ్లాదేశ్ సిరీస్‌లో హసరంగపై ఐసీసీ నిషేధం పడటం ఇది రెండోసారి. టీ20 సిరీస్ సందర్భంగా కూడా గత సిరీస్‌లో (ఆఫ్ఘనిస్తాన్) చేసిన తప్పిదాల కారణంగా అతను సస్పెండయ్యాడు. 26 ఏళ్ల హసరంగ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2021లో ఆడాడు. అతను కేవలం నాలుగు టెస్ట్‌ల్లోనే శ్రీలంకకు ప్రాతినిథ్యం వహించాడు. టెస్ట్‌ల్లో హసరంగకు మంచి ట్రాక్ రికార్డు లేదు. ఈ ఫార్మాట్లో అతను కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు కోరిక మేరకు హసరంగా తన టెస్టు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే, మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం శ్రీలంక జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో శ్రీలంక టీ20 సిరీస్ గెలువగా.. బంగ్లాదేశ్ వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. టెస్ట్ సిరీస్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. -
T20I: అఫ్గనిస్తాన్‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. అధికారిక ప్రకటన
ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్ మధ్య జరగాల్సిన టీ20 సిరీస్ నిరవధికంగా వాయిదా పడింది. ఇందుకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ ఏడాది ఆగష్టులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసీస్- అఫ్గన్ మధ్య సిరీస్ జరగాల్సి ఉంది. అఫ్గనిస్తాన్‌లో పరిస్థితుల దృష్ట్యా యూఏఈలో అఫ్గన్ ఈ సిరీస్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్దమైంది. కారణం ఇదే ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్గన్ ప్రభుత్వం మహిళలు, బాలికల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తోందన్న కారణంతో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా 2021లోనూ సీఏ ఇదే కారణంతో ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టును రద్దు చేసింది. అఫ్గనిస్తాన్‌లో రోజురోజుకూ బాలికలు, మహిళల పరిస్థితి దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా అఫ్గన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాలికలు హైస్కూల్‌కు వెళ్లకుండా, మహిళలు ఉన్నత విద్యనభ్యసించకుండా, ఉద్యోగాలు చేయకుండా కఠిన నిబంధనలు విధించిందనే వార్తల నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల సౌతాఫ్రికాలో జరిగిన అండర్-19 వుమెన్ టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్‌కు ఫుల్ మెంబర్ జట్లలో అఫ్గనిస్తాన్(మహిళలు క్రికెట్ ఆడకూడదనే నిబంధన) ఒక్కటే హాజరు కాలేదు. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించామన్న క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చివరగా అప్పుడే కాగా చివరగా వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా ముంబైలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా- అఫ్గనిస్తాన్ తలపడ్డాయి. ఇందులో గ్లెన్ మాక్స్వెల్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో మూడు వికెట్ల తేడాతో ఆసీస్ గెలిచింది. ఇదిలా ఉంటే.. అఫ్గన్ క్రికెట్ బోర్డు పరిస్థితిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి సీఈఓ గాఫ్ అలార్డిస్ స్పందిస్తూ.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేసే ఫుల్ మెంబర్‌కు తాము మద్దతుగా నిలవకతప్పదని పేర్కొన్నారు. చదవండి: Rohit Sharma: రోహిత్ క్రీజులో ఉన్నంతవరకే ముంబైకి మా మద్దతు! వీడియో An update to our Aussie men's team schedule ⬇️ CA will continue its commitment to the participation of women and girls cricket around the world and will work closely with the ICC and the Afghanistan Cricket Board to resume bilateral matches in the future. pic.twitter.com/OIO5PLjle5 — Cricket Australia (@CricketAus) March 19, 2024
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019