breaking news
-
PBKS vs GT: గెలుపు ఎవరిది?
-
అహ్మదాబాద్‌లో టైటాన్స్‌ను చిత్తు చేసిన ఢిల్లీ
-
ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్.. కెప్టెన్‌గానూ..
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌పై ఆ జట్టు అసిస్టెంట్ జేమ్స్ హోప్స్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్ అంటూ కొనియాడాడు. కెప్టెన్‌గానూ రోజురోజుకూ మరింత రాటుదేలుతున్నాడని సంతోషం వ్యక్తం చేశాడు. కారు ప్రమాదం కారణంగా గతేడాది ఐపీఎల్‌కు దూరమైన పంత్.. 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత కాంపిటేటివ్ క్రికెట్ ఆడుతున్న పంత్ ఫిట్‌నెస్‌పై ఆదిలో సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ వికెట్ కీపర్‌గా.. బ్యాటర్‌గా అద్భుత ఆటతీరుతో అలరిస్తున్నాడు పంత్. తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కెప్టెన్సీ నైపుణ్యాలతో ఆకట్టుకున్న పంత్.. ఢిల్లీకి అద్బుత విజయం అందించాడు. అహ్మదాబాద్‌లో టాస్ గెలిచిన పంత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఢిల్లీ బౌలర్లు సంచలన ప్రదర్శనతో చెలరేగారు. సమిష్టి కృషితో గుజరాత్‌ను కేవలం 89 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటారు. ఇక 90 పరుగుల లక్ష్యాన్ని 8.5 ఓవర్లలోనే ఛేదించిన ఢిల్లీ ఈ సీజన్లో ఎట్టకేలకు మూడో విజయం అందుకుంది. ఈ గెలుపులో కెప్టెన్‌గా.. వికెట్ కీపర్‌గా.. బ్యాటర్‌గా రిషభ్ పంత్ కీలక పాత్ర పోషించాడు. Ek haath hi kaafi hai 🧤 From one-handed sixes to one-handed catches, Rishabh Pant can do it all 🤩#GTvDC #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/1JZEuLiL5T — JioCinema (@JioCinema) April 17, 2024 అద్బుత రీతిలో రెండు క్యాచ్‌లు అందుకోవడంతో పాటు రెండు స్టంపింగ్‌లతో ఆకట్టుకున్నాడు. అదే విధంగా.. 11 బంతుల్లో 16 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో జేమ్స్ హోప్స్ మాట్లాడుతూ.. ‘‘పంత్ కీపింగ్ చేస్తున్నాడు. అది కూడా అద్బుతంగా! గతేడాది అతడు లేని లోటు మాకు బాగా తెలిసింది. ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్.. వరల్డ్‌క్లాస్ ప్లేయర్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయగలం. అయితే, ఇప్పుడు అతడు తిరిగి వచ్చాడు. కీపింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. కెప్టెన్సీ పరంగానూ రాటుదేలుతున్నాడు. బ్యాటర్‌గానూ మంచి ఫామ్‌లో ఉన్నాడు’’ అని పేర్కొన్నాడు. కాగా పంత్ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో కలిపి 210 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే టైటాన్స్‌పై విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి దూసుకువచ్చింది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో మూడింట గెలిచి ప్రస్తుతం ఆరు పాయింట్లతో ఉంది. తదుపరి ఏప్రిల్ 20న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఢిల్లీలో తలపడనుంది. Pant doing what he does the best 💥🚀#GTvDC #TATAIPL #IPLonJioCinema #IPLinHaryanvi pic.twitter.com/JdB3AndtPB — JioCinema (@JioCinema) April 17, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఒక్కరైనా డబుల్ హ్యాట్రిక్ తీయాల్సింది.. ఓటమికి కారణం అదే!
IPL 2024 GT vs DC: రెండేళ్ల క్రితం ఐపీఎల్లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ కనీవినీ ఎరుగని రీతిలో చెత్త ప్రదర్శన కనబరిచింది. ఐపీఎల్-2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కేవలం 89 పరుగులకే ఆలౌట్ అయి.. క్యాష్ రిచ్ లీగ్‌లో తమ అత్యల్ప స్కోరును నమోదు చేసింది. ఇక 90 పరుగుల నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ కేవలం 8.5 ఓవర్లలోనే పని పూర్తి చేయడంతో గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తమ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని అంగీకరించాడు. మా ఓటమికి కారణం అదే ‘‘పిచ్ బాగానే ఉంది. కానీ మా బ్యాటింగే అత్యంత సాధారణంగా ఉంది. షాట్ సెలక్షన్ లోపాల వల్లే వరుసగా వికెట్లు కోల్పోయాం. ప్రత్యర్థి జట్టు 89 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న క్రమంలో మాలో ఎవరో ఒక బౌలర్ డబుల్ హ్యాట్రిక్ తీస్తేనే గానీ ఫలితం ఉండదు. లేదంటే కచ్చితంగా ప్రత్యర్థి జట్టునే విజయం వరిస్తుంది. ఇప్పుడూ అదే జరిగింది’’ అని పరాజయానికి గల కారణాలు విశ్లేషించాడు గిల్. ఈ ఘోర పరాభవం నుంచి వీలైనంత తొందరగా కోలుకుని తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెడతామని పేర్కొన్నాడు. అదే విధంగా.. ‘‘ఇప్పటి వరకు సగం మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాం. ఇంకో ఏడు మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పటికి మూడు గెలిచాం. గత రెండేళ్లుగా గెలిచినట్లే సెకండాఫ్‌లో 5-6 మ్యాచ్‌లు గెలవగలమనే అనుకుంటున్నా’’ అని శుబ్‌మన్ గిల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గుజరాత్ వర్సెస్ ఢిల్లీ స్కోర్లు: ►వేదిక: అహ్మదాబాద్... గుజరాత్ ►టాస్: ఢిల్లీ- బౌలింగ్ ►గుజరాత్ స్కోరు: 89 (17.3) ►ఢిల్లీ స్కోరు: 92/4 (8.5) ►ఫలితం: గుజరాత్‌పై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రిషభ్ పంత్(రెండు క్యాచ్‌లు.. రెండు స్టంపింగ్స్.. 11 బంతుల్లో 16 రన్స్- నాటౌట్). Ensuring a quick finish, ft Rishabh Pant & Sumit Kumar 🙌 A comprehensive all-round performance from Delhi Capitals helps them register their 3️⃣rd win of the season 😎 Recap the match on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #GTvDC pic.twitter.com/c2pyHArwE7 — IndianPremierLeague (@IPL) April 17, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024 GT vs DC: ఢిల్లీ అదరహో...
వరుస మ్యాచ్‌లలో పరుగుల వరదతో ముంచెత్తుతున్న ఐపీఎల్లో ఎట్టకేలకు ఒక స్వల్ప స్కోర్ల పోరు... బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తూ బ్యాటర్ల పని పట్టిన సమయం... మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ సొంతగడ్డపై 100 పరుగులు కూడా చేయలేక కుప్పకూలిన చోట... కేవలం 53 బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో ఆనందం... రన్‌రేట్‌ను మెరుగుపర్చుకునేందుకు వేగంగా ఆడే ప్రయత్నంలో నాలుగు వికెట్లు కోల్పోయినా... చివరకు ఢిల్లీ సునాయాసంగా గెలుపు గీత దాటింది. అహ్మదాబాద్: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ విజయాన్ని అందుకొని పాయింట్ల పట్టికలో మూడు స్థానాలు ఎగబాకింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ టోర్నీలో టైటాన్స్‌కిదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. రషీద్ ఖాన్ (24 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం ఢిల్లీ 8.5 ఓవర్లలో 4 వికెట్లకు 92 పరుగులు చేసింది. జేక్ ఫ్రేజర్ (10 బంతుల్లో 20; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇచ్చిన శుభారంభంతో గెలుపునకు పునాది పడింది. చక్కటి కెపె్టన్సీతో పాటు 2 క్యాచ్‌లు, 2 స్టంపింగ్‌లు చేసిన రిషభ్ పంత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. రాణించిన ఇషాంత్... ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రషీద్ కొద్దిసేపు పోరాడటం మినహా గుజరాత్ ఇన్నింగ్స్ పేలవంగా సాగింది. ఆసాంతం పరుగులు చేయడంలో ఇబ్బంది పడిన జట్టు... వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఇషాంత్ తన తొలి ఓవర్లోనే కెపె్టన్ శుబ్‌మన్ గిల్ (8)ను వెనక్కి పంపి శుభారంభం అందించగా, ఒకే స్కోరు వద్ద సాహా (2), సాయి సుదర్శన్ (12) వెనుదిరిగారు. ఇషాంత్ బౌలింగ్‌లోనే పంత్ చక్కటి క్యాచ్‌తో డేవిడ్ మిల్లర్ (2) అవుట్ కావడంతో పవర్‌ప్లేను టైటాన్స్ 30/4 వద్ద ముగించింది. పార్ట్‌టైమ్ స్పిన్నర్ స్టబ్స్ కూడా తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీయడంతో గుజరాత్ పరిస్థితి మరింత దిగజారింది. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన రషీద్ కొన్ని పరుగులు జోడించడంలో సఫలమయ్యాడు. ఆశలు పెట్టుకున్న రాహుల్ తెవాటియా (10)ను అక్షర్ పటేల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా మిగతా బ్యాటర్ల ఆట లాంఛనమే అయింది. స్వల్ప లక్ష్య ఛేదనలో కొంత తడబడినా చివరకు ఢిల్లీ ఎలాంటి ప్రమాదం లేకుండా మ్యాచ్‌ను ముగించింది. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (బి) ముకేశ్ 2; గిల్ (సి) షా (బి) ఇషాంత్ 8; సుదర్శన్ (రనౌట్) 12; మిల్లర్ (సి) పంత్ (బి) ఇషాంత్ 2; మనోహర్ (స్టంప్డ్) పంత్ (బి) స్టబ్స్ 8; తెవాటియా (ఎల్బీ) (బి) అక్షర్ 10; షారుఖ్ (స్టంప్డ్) పంత్ (బి) స్టబ్స్ 0; రషీద్ (సి) పంత్ (బి) ముకేశ్ 31; మోహిత్ (సి) సుమీత్ (బి) ఖలీల్ 2; నూర్ (బి) ముకేశ్ 1; జాన్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (17.3 ఓవర్లలో ఆలౌట్) 89. వికెట్ల పతనం: 1–11, 2–28, 3–28, 4–30, 5–47, 6–48, 7–66, 8–78, 9–88, 10–89. బౌలింగ్: ఖలీల్ 4–1– 18–1, ఇషాంత్ 2–0–8–2, ముకేశ్ కుమార్ 2.3–0–14–3, కుల్దీప్ 4–0–16–0, స్టబ్స్ 1–0– 11–2, అక్షర్ పటేల్ 4–0–17–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) జాన్సన్ (బి) సందీప్ 7; జేక్ ఫ్రేజర్ (సి) మనోహర్ (బి) జాన్సన్ 20; పొరేల్ (బి) సందీప్ 15; హోప్ (సి) మోహిత్ (బి) రషీద్ 19; పంత్ (నాటౌట్) 16; సుమీత్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (8.5 ఓవర్లలో 4 వికెట్లకు) 92. వికెట్ల పతనం: 1–25, 2–31, 3–65, 4–67. బౌలింగ్: సందీప్ వారియర్ 3–0–40–2; స్పెన్సర్ జాన్సన్ 2–0–22–1, రషీద్ ఖాన్ 2–0–12–1, నూర్ అహ్మద్ 1.5–0–14–0. ఐపీఎల్లో నేడు పంజాబ్ X ముంబై వేదిక: ముల్లాన్‌పూర్ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019