breaking news
-
Japnit Ahuja: డిజిటల్ జెండర్ గ్యాప్‌ను కోడింగ్ చేసింది!
స్త్రీలు సాంకేతికంగా కూడా సాధికారిత సాధించాలనే లక్ష్యంతో వారికి ఉచితంగా కోడింగ్ పాఠాలు నేర్పుతోంది ఢిల్లీవాసి 23 ఏళ్ల జష్నిత్ అహుజా. కోడింగ్ తెలిసిన వారికి ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తాయి. ఈ రకంగా దేశంలో ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలకు ఆశాజ్యోతిగా మారింది జప్నిత్. ఇప్పటి వరకు 2 వేల మంది అమ్మాయిలకు ఉచితంగా డిజిటల్ పాఠాలు నేర్పింది. వంద మంది వాలంటీర్ల బృందానికి నాయకత్వం వహిస్తోంది. ఢిల్లీకి చెందిన జప్నిత్ అహుజాకు కోడింగ్ అంటే చాలా ఆసక్తి. దాంతో కోడింగ్ నేర్చుకోవడం మీదనే దృష్టిపెట్టింది. అదే సమయంలో ఆమె ఒక విషయాన్ని గుర్తించింది. అదేమంటే, కోడింగ్ రంగంలో స్త్రీలు చాలా తక్కువగా ఉన్నారనీ, ఆ ఉన్న వారిలో కూడా చాలామందికి దానిపై తగినంత పరిజ్ఞానం లేదనీ. మిగిలిన వారితో పోల్చితే కోడింగ్ తెలిసిన వాళ్లకి ఉద్యోగావకాశాలు కాసింత ఎక్కువగానే దొరుకుతాయి. అయితే ఆ రంగంలో పురుషులదే పై చేయి. దాంతో సాంకేతికపరంగా ఏమైనా ఉద్యోగాలు ఉంటే కోడింగ్‌లో వారే ముందుకు దూసుకుపోవడం వల్ల ఆ ఉద్యోగాలు కూడా వారే ఎక్కువగా దక్కించుకోగలుగుతున్నారు. ఇప్పటిదాకా స్త్రీలు ఎన్నో రంగాలలో పట్టుదలతో కృషి చేసి, పై చేయి సాధించగలుగుతున్నప్పుడు కోడింగ్‌లో మాత్రం పట్టు ఎందుకు సాధించకూడదు... అని ఆలోచించింది. అంతే... ముందు తాను ఆ రంగంలో బాగా కృషి చేసింది. పట్టుదలతో కోడింగ్ నేర్చుకుంది... ఆ రకంగా అందులో చకచకా పై మెట్టుకు చేరిపోగలిగింది. తనలాగే మరికొందరు ఆడపిల్లలకు కూడా కోడింగ్ నేర్పితేనో... అనుకుంది. అలా అనుకోవడం ఆలస్యం... ఇతర ఆమ్మాయిలను కొందరిని పోగు చేసి తనకు తెలిసిన దానిని వారికి ఉచితంగా పాఠాలు నేర్పడం ఆరంభించింది. అలా తన 16వ ఏట ఆమె ‘గో గర్ల్’ అనే సంస్థను స్థాపించింది. అయితే భాష సమస్య రాకుండా వారికి వచ్చిన స్థానిక భాషలోనే ఉచితంగా కోడింగ్‌ను నేర్పడం ఆమె ప్రత్యేకత. తోటి ఆడపిల్లలను సాంకేతికంగా ఎదిగేలా చేయడం కోసం ఎంచుకున్న లక్ష్యం, అందుకు ఆమె చేసిన కృషీ వృథా పోలేదు. చాలామంది అమ్మాయిలు ఆమె దగ్గర కోడింగ్ నేర్చుకుని మంచి ఉద్యోగావకాశాలను సాధించుకోగలిగారు. అలా తనకు లభించిన ప్రోత్సాహ ఉత్సాహంతో తన వయసు ఆడపిల్లలకే కాదు, తల్లి వయసు స్త్రీలకు కూడా కోడింగ్ నేర్పడం మొదలు పెట్టింది. అలా తనకు 23 ఏళ్లు వచ్చేసరికి చిన్న, పెద్ద కలిసి దాదాపు రెండు వేల మందికి పైగా ఆమె వద్ద కోడింగ్ నేర్చుకుని సాంకేతికంగా అభివృద్ధి చెంది, తమ కాళ్ల మీద తాము నిలబడగలిగారు. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఆరవ తరగతి చదివేటప్పుడే కోడింగ్ రంగంలో సాధించిన ప్రావీణ్యం బాల మేధావిగా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే అమ్మానాన్న ఆఫీసులనుంచి ఇంటికి వచ్చేలోగా వారికోసం ఎదురు చూస్తూ రకరకాల వెబ్సైట్లకు రూపకల్పన చేసేదానిని. అప్పుడు నాన్న నాతో.. ‘ఈ పిచ్చి పిచ్చి వెబ్సైట్లు కాదు బేబీ... నువ్వు నాసా సైంటిస్ట్‌గా ఎదగాలి. తలచుకుంటే నీకదేమీ ఒక లెక్కలోనిది కాదు’ అని చెప్పిన మాట నన్ను ఎంతో ప్రభావితం చేసింది. అలా ఎయిత్ క్లాస్‌కు వచ్చేసరికి పెద్దయ్యాక నేను చేయవలసింది ఉద్యోగం కాదని... సాంకేతికంగా అభివృద్ధి చెందడం, దానిద్వారా నేను నేర్చుకున్న పాఠాలను పదిమందికీ చెప్పడంలోనే ఎంతో థ్రిల్ ఉందనీ అర్థమైంది. నా దగ్గర కోడింగ్ పాఠాలు నేర్చుకున్న వారే తమంతట తాము స్వచ్ఛందంగా ఇతరులకు నేర్పించడం మొదలు పెట్టారు. ఆ విధంగా ‘కోడింగ్ ఫర్ ఉమెన్ బై ఉమెన్’ కాన్సెప్ట్ మాకు బాగా ఉపకరించింది. అంతేకాదు, డిజిటల్ జెండర్ గ్యాప్ అనే వివక్షను పూడ్చాలన్న నా స్వప్నం సాకారం అయ్యేందుకు ఉపకరించింది. ఏమైనా పిల్లలు గ్యాడ్జెట్స్‌తో ఆడుకుంటున్నప్పుడు వాళ్లు వాటితో ఏం చేస్తున్నారో... తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. దానిని వారు మంచికే ఉపయోగిస్తున్నారు అని గుర్తించగలిగితే ఆ దిశగా వారిని ప్రోత్సహించడం మంచిది. నా తల్లిదండ్రులు కోడింగ్‌పై నాకున్న ప్యాషన్‌ను గుర్తించకుండా ఏవో పిచ్చి ఆటలు ఆడుతున్నాను అనుకుని దానికి అడ్డుకట్ట వేసి ఉంటే నేను ఈ స్థాయికి ఎదిగి ఉండేదానిని కాను’’ అని ఆమె చెప్పిన మాటలు ఆలోచించదగ్గవి. ∙కోడింగ్‌లో శిక్షణ పొందుతున్న అమ్మాయిలు -
గో గర్ల్.. బి అలర్ట్.. బి సేఫ్
► ఆపదలో ఉన్న మహిళల కోసం యాప్ ► రూపొందించిన ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య ► పాన్-ఇండియా యాప్ క్రియేషన్ పోటీల్లో జాతీయస్థాయి గుర్తింపు సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళలను వేధించే ఆకతాయిల ఆట కట్టించేలా... అత్యవసర సమయంలో సైరన్ మోగేలా సరికొత్త యాప్... ‘గో గర్ల్’ను అందుబాటులోకి తెచ్చింది నగరంలోని ఇంజనీరింగ్ విద్యార్థిని పి.దివ్య. ఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా ఆటోమేటిక్‌గా రికార్డయ్యేలా రూపొందించిన ఈ యాప్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఇటీవల చెన్నైలో జరిగిన యాప్ క్రియేషన్ ఫైనల్స్‌లో తొలి బహుమతిని కై వసం చేసుకుంది. 17 రాష్ట్రాలకు చెందిన 700 ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు ఇందులో పోటీపడ్డారు. నారాయణ గూడ కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న దివ్య... యాప్ విశేషాలను ‘సాక్షి’కి వివరించింది. త్వరలో గూగుల్ ప్లే స్టోర్‌లో.. కిడ్నాప్‌లు, బెదిరింపులు, అత్యాచారయత్నాలు, అల్లరి, ర్యాగింగ్‌లకు పాల్పడే వారి నుంచి తమను తాము రక్షించుకొనేందుకు మహిళలకు ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో పోలీస్ సైరన్ మోగుతుంది. సాక్ష్యాధారాలు కూడా రికార్డవుతాయి. ఫలితంగా నిందితులకు న్యాయస్థానాల్లో శిక్ష పడే అవకాశం ఉంది. కాలేజీ అమ్మారుులు, రాత్రి విధులు నిర్వహించే ఐటీ, కాల్‌సెంటర్ తదితర మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న అవస్థలకు ఈ ‘గో గర్ల్.. బి అలర్ట్... బి సేఫ్’ యాప్ ద్వారా చెక్ పెట్టవచ్చు. త్వరలోనే ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి రానుంది. మహిళలు తమ వ్యక్తిగత భద్రత కోసం ఆండ్రారుుడ్ మొబైల్ ఫోనులో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేఫ్/అన్‌సేఫ్ ఇండికేషన్ యాప్‌లో ని ‘కాల్ కాంటా క్ట్’ ఆప్షన్లో ఐదు నంబర్లు యాడ్ చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో స్క్రీన్‌పై ‘హెల్ప్ మీ’ అనే బటన్ నొక్కితే చాలు.. వెంటనే ఆయా నంబర్లతో పాటు పోలీసు కంట్రోల్ రూమ్, ఉమెన్స హెల్ప్‌లైన్, ఎన్సీడబ్ల్యూ, యాంటీ స్టాకింగ్ కాల్స్, అంబులెన్స, ఆల్ ఇన్ వన్ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్లకు ఆటోమేటిక్‌గా మెస్సేజ్ వెళ్తుంది. దీంతో బాధితురాలు ఏ లొకేషన్లో ఉందనే విషయం గూగుల్ మ్యాప్ ద్వారా గుర్తించి ప్రమాదం నుంచి కాపాడే వీలుంది. ఆత్మరక్షణ కోసం పోలీసు సైరన్, కోర్టులో పక్కాగా సాక్ష్యం సమర్పించేందుకు ఆటోమేటిక్ వారుుస్ రికార్డింగ్ కూడా ఉంది. ఆపదలో ఉన్న మహిళలు ‘హెల్ప్ మీ’ ఆప్షన్ నొక్కడం ద్వారా వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకొనే ఫీచర్ (సేఫ్/అన్‌సేఫ్ ఇండికేషన్స) దీని ప్రత్యేకత. ఆపదలో ఉంటే రెడ్ సిగ్నల్, లేదంటే గ్రీన్ సిగ్నల్ గూగుల్ మ్యాప్‌లో కనబడుతుంది.
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019