breaking news
-
ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కన్నుమూత
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ఐసీసీ మాజీ రిఫరీ రామన్ సుబ్బా రో 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వయసు పైబడటం, దీర్ఘకాలిక అనారోగ్య కారణాల చేత సుబ్బా రో మృతి చెందినట్లు తెలుస్తుంది. భారత మూలాలున్న సుబ్బా రో ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున 1958-61 మధ్యలో 13 టెస్ట్‌లు ఆడి 46.85 సగటున 984 పరుగులు చేశాడు. సుబ్బా రో ఫస్ట్‌క్లాస్ కెరీర్లో సర్రే, నార్తంప్టన్ఫైర్ కౌంటీల తరఫున 260 మ్యాచ్‌లు ఆడి 14182 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలు, 73 అర్దశతకాలు ఉన్నాయి. సుబ్బా రో కెరీర్ అత్యధిక స్కోర్ 300 పరుగులుగా ఉంది. పార్ట్ టైమ్ లెగ్ స్పిన్ బౌలర్ కూడా అయిన సుబ్బా రో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 87 వికెట్లు తీశాడు. 1981 భారత్, శ్రీలంక పర్యటనల్లో సుబ్బా రో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మేనేజర్‌గా వ్యవహరించాడు. 1985-1990 మధ్యలో సుబ్బా రో ఇంగ్లండ్ టెస్ట్ మరియు కౌంటీ క్రికెట్ బోర్డును చైర్మన్‌గా వ్యవహరించాడు. రామన్ సుబ్బా రో మృతి పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, ఐసీసీ సంతాపం తెలిపాయి. ఈసీబీ, ఐసీసీలకు సుబ్బా రో చేసిన సేవలు ఎనలేనివని కొనియాడాయి. కాగా, రామన్ సుబ్బా రో తండ్రి పంగులూరి వెంకట సుబ్బారావు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన వాడు. సుబా రో తల్లి డోరిస్ మిల్డ్రెడ్ పిన్నర్ బ్రిటన్ మహిళ. పంగులూరి వెంకట సుబ్బారావు ఉన్నత చదువుల కోసం లండన్‌కు వెళ్లగా అక్కడ డోరిస్ మిల్డ్రెడ్ పిన్నర్‌తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి, పెళ్లికి దారి తీసింది. వీరిద్దరి సంతానమే రామన్ సుబ్బా రో. -
రిటైర్మెంట్తో షాకిచ్చిన స్టువర్ట్ బ్రాడ్
ఇంగ్లండ్ పేస్ బౌలర్ స్టువర్డ్ బ్రాడ్ 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఓవల్‌లో జరుగుతున్న మ్యాచే తనకు చివరి టెస్టు అని 37 ఏళ్ల బ్రాడ్ వెల్లడించాడు. యాషెస్‌లో చివరి టెస్టుకు ముందు 166 టెస్టుల్లో 27.68 సగటుతో 600 వికెట్లు తీసిన బ్రాడ్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. 2016లో చివరి వన్డే ఆడిన బ్రాడ్ అప్పటినుంచి ఒక్క టెస్టులకే పరిమితమయ్యాడు. ఈతరం టెస్టు క్రికెట్లో గొప్ప బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు స్టువర్ట్ బ్రాడ్. తన సహచర పేసర్ జేమ్స్ అండర్సన్‌తో పోటీ పడి మరీ వికెట్లు తీసే బ్రాడ్ అర్థంతరంగా రిటైర్మెంట్ ఇవ్వడం అభిమానులకు షాక్ కలిగించింది. ఇక స్టువర్ట్ బ్రాడ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది యువరాజ్ సింగ్. 2007 టి20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అతనికి నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. ఇప్పటికి బ్రాడ్ అనగానే ఆ ఆరు సిక్సర్లే కళ్లు ముందు కదలాడతాయి. అంతకముందు ఓవర్లో యువరాజ్‌తో ఆండ్రూ ఫ్లింటాఫ్ వైరం పెట్టుకున్నాడు. దీంతో యువరాజ్ కోపం ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన బ్రాడ్‌కు శాపంగా మారింది. ఓవరాల్‌గా స్టువర్ట్ బ్రాడ్ 167 టెస్టుల్లో 3656 పరుగులు.. 602 వికెట్లు, 121 వన్డేల్లో 529 పరుగులు.. 178 వికెట్లు, 56 టి20ల్లో 118 పరుగులు.. 65 వికెట్లు పడగొట్టాడు. ఇక 2014లో జరిగిన టి20 వరల్డ్‌కప్‌లో బ్రాడ్ ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. అయితే ఇంగ్లండ్‌ను సెమీస్ చేర్చడంలో బ్రాడ్ విఫలమయ్యాడు. BREAKING 🚨: Stuart Broad announces he will retire from cricket after the Ashes ends. pic.twitter.com/dNv8EZ0qnC — Sky Sports Cricket (@SkyCricket) July 29, 2023 Forever remembered for 𝘁𝗵𝗼𝘀𝗲 mesmerising spells, 𝘁𝗵𝗼𝘀𝗲 Ashes battles, 𝘁𝗵𝗼𝘀𝗲 602* wickets. Take a bow, Stuart Broad 👏#EnglandCricket | #Ashes pic.twitter.com/6WvdTW5AoA — England Cricket (@englandcricket) July 29, 2023 చదవండి: Ben Stokes: యాషెస్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా రికార్డు; రోహిత్‌ను దాటలేకపోయాడు ధోనిని దొంగచాటుగా వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్ -
Ashes Series 2023: ఇంగ్లండ్ ఓపెనర్ డబుల్ సెంచరీ.. ఆసీస్‌కు ధీటుగా..!
మహిళల యాషెస్ సిరీస్ 2023 ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ ట్యామీ బీమౌంట్ డబుల్ సెంచరీ సాధించింది. మహిళల క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాటర్‌గా, తొలి ఇంగ్లీష్ మహిళగా ట్యామీ రికార్డుల్లోకెక్కింది. 317 బంతుల్లో 26 బౌండరీ సాయంతో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న ట్యామీ.. కెరీర్లో తాను సాధించిన తొలి టెస్ట్ శతకాన్నే ద్విశతకంగా మార్చుకుంది. ఈ మ్యాచ్‌కు ముందు ట్యామీ తన 7 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో కేవలం 2 అర్ధసెంచరీలు మాత్రమే సాధించింది. అయితే ఆమెకు వన్డేల్లో, టీ20ల్లో అద్భుతమైన రికార్డు ఉంది. 103 వన్డేల్లో 9 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీల సాయంతో 3505 పరుగులు (40.8 యావరేజ్‌తో), 99 టీ20ల్లో సెంచరీ, 10 హాఫ్ సెంచరీల సాయంతో 1721 పరుగులు (108.4 స్ట్రయిక్‌రేట్‌తో) సాధించింది. WOW 🤯 Our first female double centurion in Test match cricket.#EnglandCricket #Ashes pic.twitter.com/Eju1kwmlug — England Cricket (@englandcricket) June 24, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 473 పరుగులకు ఆలౌటైంది. ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన అనాబెల్ సదర్లాండ్ (137) అజేయమైన సెంచరీతో చెలరేగగా.. ఎల్లైస్ పెర్రీ (99) ఒక్క పరుగు తేడాతో శతకం చేజార్చుకుంది. తహిల మెక్‌గ్రాత్ (61) అర్ధసెంచరీతో రాణించింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఎక్లెస్టోన్ 5 వికెట్లు పడగొట్టగా.. లారెన్ బెల్, లారెన్ ఫైలర్ తలో 2 వికెట్లు, కేట్ క్రాస్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆసీస్‌కు ధీటుగా జవాబిస్తుంది. ఆ జట్టు మూడో రోజు మూడో సెషన్ సమయానికి 7 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 25 పరుగులు వెనుకబడి ఉంది. ట్యామీ బీమౌంట్ (205), కేట్ క్రాస్ (0) క్రీజ్‌లో ఉన్నారు. హీథర్‌నైట్ (57), నాట్‌సీవర్ బ్రంట్ (78) అర్ధశతకాలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్నర్ 3, తహిల మెక్‌గ్రాత్, డార్సీ బ్రౌన్, నదర్లాండ్, పెర్రీ తలో వికెట్ పడగొట్టారు. -
గెలవలేమని తెలిసినా సెంచరీ కోసం అలా.. చివరికి పరువు పాయే..!
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో ఓ బ్యాటర్ తన వ్యక్తిగత మైలురాయి కోసం స్ట్రయిక్‌లో ఉన్న మరో బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టి పరువు పోగొట్టుకున్నాడు. నాటింగ్హమ్షైర్తో నిన్న (జూన్ 4) జరిగిన మ్యాచ్‌లో వార్విక్షైర్ బ్యాటర్ సామ్ హెయిన్.. తన సెంచరీ కోసం సహచర బ్యాటర్ జేక్ లింటాట్ను ఇబ్బంది పెట్టాడు. ఇంత చేసి అతనేమైనా సెంచరీ సాధించాడా అంటే.. అదీ లేదు. వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నాటింగ్హమ్షైర్.. జో క్లార్క్ (53 బంతుల్లో 89; 7 ఫోర్లు, 6 సిక్సర్లు), కొలిన్ మున్రో (43 బంతుల్లో 87; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో సామ్ హెయిన్ (52 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, తన జట్టును (వార్విక్షైర్) గెలిపించలేకపోయాడు. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసి లక్ష్యానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. pic.twitter.com/A171O5RKOC— Spider Rashid (@RashidSpider) June 4, 2023 సెంచరీ కోసం కింద పడిపోయిన సహచరుడిని లేపి పరిగెట్టించాడు.. అయినా..! ఆఖరి ఓవర్ చివరి 3 బంతుల్లో 19 పరుగులు చేయల్సిన పరిస్థితి ఉండింది. జేక్ బాల్ వేసిన ఈ ఓవర్ నాలుగో బంతిని లింటాట్ సిక్సర్‌గా మలచడంతో ఈక్వేషన్ 2 బంతుల్లో 13 పరుగులుగా మారింది. అప్పటికి నాన్ స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న హెయిన్ 96 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నాడు. ఏదో అద్భుతం జరిగితే తప్ప, వార్విక్షైర్ గెలిచే పరిస్థితి కూడా లేదు. ఈ దశలో ఐదో బంతిని ఎదుర్కొన్న లింటాట్ భారీ షాట్ ఆడబోయి క్రీజ్‌లోనే కింద పడిపోయాడు. అవతలి ఎండ్‌లో సెంచరీ కోసం పరితపిస్తున్న హెయిన్.. సహచరుడు కిందపడి పరుగు తీయలేని స్థితిలో ఉన్నాడని తెలిసి కూడా, సగం క్రీజ్ వరకు వచ్చి అతన్ని పరుగు తీయాల్సిందిగా కోరాడు. దీంతో లింటాట్ హెయిన్ సెంచరీ కోసం పడుతూ లేస్తూ పరుగు పూర్తి చేసేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. అయితే ఈ లోపే ఫీల్డర్ నాన్ స్ట్రయికర్ ఎండ్ వైపు బంతి విసరడం, బౌలర్ ఆ బంతితో లింటాట్ను రనౌట్ చేయడం జరిగిపోయాయి. ఇంత జరిగికా కూడా సెంచరీ కోసం ఆఖరి బంతిని ఎదుర్కొన్న హెయిన్ అది సాధించాడా అంటే.. అది లేదు. 96 పరుగుల వద్ద ఉండిన హెయిన్ ఆఖరి బంతికి ఫోర్ కొట్టి ఉంటే, తన జట్టు గెలవకపోయినా అతను సెంచరీ అయినా చేసే వాడు. అయితే అతను సింగిల్ మాత్రమే తీయడంతో 97 పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం తంతు చూసి నెటిజన్లు హెయిన్ను తిట్టిపోస్తున్నారు. స్వార్ధపరుడని, గెలవలేమని తెలిసినా సెంచరీ కోసం సహచరుడిని ఇబ్బందిపెట్టి పరువు పోగొట్టుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతుంది. -
అరివీర భయంకర ఫామ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్.. నిర్దాక్షిణ్యంగా ఊచకోత
ఇంగ్లండ్ బ్యాటర్ జేమ్స్ విన్స్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 బ్లాస్ట్-2023లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ప్రత్యర్ధి బౌలర్లను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోస్తున్నాడు. ఆడిన ప్రతి బంతిని బౌండరీ లేదా సిక్సర్‌గా మలుస్తున్నాడు. ససెక్స్‌తో నిన్న (జూన్ 3) జరిగిన మ్యాచ్‌లో 39 బంతులు ఎదుర్కొన్న విన్స్.. 8 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేసి తన జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల్లోనూ విన్స్ ఇదే తరహాలో రెచ్చిపోయాడు. ఆ బౌలర్, ఈ బౌలర్ అన్న తేడా లేకుండా ఎడాపెడా వాయించాడు. తొలుత మిడిల్సెక్స్తో జరిగిన మ్యాచ్‌లో 55 బంతుల్లో అజేయమైన 88 పరుగులు చేసిన విన్స్.. ఆతర్వాత ససెక్స్‌పై 56 బంతుల్లో 88 పరుగులు, ఎసెక్స్‌పై 48 బంతుల్లో 103 పరుగులు చేశాడు. ఎసెక్స్‌పై చేసిన మెరుపు సెంచరీలో 8 బౌండరీలు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఇంతటి భీకర ఫామ్‌లో ఉన్న ఈ హ్యాంప్‌షైర్ ఆటగాడు.. మున్ముందు మరిన్ని విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడతాడని ఇంగ్లండ్ అభిమానులు అనుకుంటున్నాడు. ఇక ససెక్స్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన హ్యాంప్‌షైర్ తొలుత బౌలింగ్ చేసింది. లియామ్ డాసన్ (4-0-18-2), స్కాట్ కర్రీ (2/25), జేమ్స్ ఫుల్లర్ (1/9), వుడ్ (1/32), మేసన్ క్రేన్ (1/32) ధాటికి ససెక్స్ 18.5 ఓవర్లలో 144 పరుగులె మాత్రమే చేసి ఆలౌటైంది. ససెక్స్ ఇన్నింగ్స్‌లో టామ్ క్లార్క్ (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హ్యాంప్‌షైర్.. కేవలం 14.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది. ఓపెనర్లు బెన్ మెక్ డెర్మాట్ (51 బంతుల్లో 69 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), జేమ్స్ విన్స్ (39 బంతుల్లో 71 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయమైన అర్ధశతకాలతో హ్యాంప్‌షైర్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ విజయయంతో హ్యాంప్‌షైర్ సౌత్ గ్రూప్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ గ్రూప్‌లో సోమర్సెట్ ,సర్రే తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019