breaking news
-
టీమిండియా వరల్డ్‌కప్ ప్రోమో రిలీజ్.. రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం
2024 టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొనే టీమిండియా కోసం స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఓ ప్రత్యేక ప్రోమో వీడియో రిలీజ్ చేసింది. రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో రోహిత్, కోహ్లి, సూర్యకుమార్, పాండ్యా, జడేజాలను చూపించిన వైనం అత్యద్భుతంగా ఉంది. INDIAN TEAM PROMO FOR THE T20I WORLD CUP. 🇮🇳 - Rohit Army is ready to create history.pic.twitter.com/2jjM9wYQQW — Johns. (@CricCrazyJohns) April 23, 2024 ఇది చూస్తే భారత క్రికెట్ అభిమానులకు గూస్ బంప్స్ రావడం ఖాయం. బ్యాక్ గ్రౌండ్లో వందేమాతర గీతం వీడియోని రక్తి కట్టించింది. ఆఖర్లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి సెల్యూట్ చేస్తున్న క్లిప్ అభిమానుల్లో జోష్ నింపుతుంది. "వరల్డ్‌కప్ కోసం టీమిండియా సిద్ధం" అని అర్దం వచ్చేలా ఈ వీడియాకి క్యాప్షన్ ఉంది. కాగా, యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా ఈ ఏడాది జూన్ 1 నుంచి టీ20 వరల్డ్‌కప్ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ దాదాపు నెల రోజులపాటు సాగుతుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి పోటీపడతాయి. గ్రూప్-ఏలో భారత్‌తో పాటు కెనడా, పాకిస్థాన్, యూఎస్ఏ, ఐర్లాండ్ ఉన్నాయి. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల సమరం (భారత్-పాక్ మ్యాచ్) జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరుగనుంది. -
అద్భుతమైన సిక్సర్లు.. తండ్రిని గుర్తు చేసిన రాకీ ఫ్లింటాఫ్
ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ చిన్న కొడుకు రాకీ ఫ్లింటాఫ్ తండ్రికి తగ్గ తనయుడనిపించుకుంటున్నాడు. రాకీ.. తండ్రి తరహాలోనే భారీ సిక్సర్లు కొడుతూ శభాష్ అనిపించుకుంటున్నాడు. లాంకాషైర్ రెండో జట్టుకు ఆడుతూ డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాకీ కొట్టిన సిక్సర్లు తండ్రి ఆండ్రూను గుర్తు చేశాయి. రాకీ కొట్టిన సిక్సర్లకు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తుంది. రాకీ సిక్సర్లు కొట్టిన విధానం తండ్రిని పోలి ఉందని నెటిజన్లు కితాబునిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో రాకీ మూడు సిక్సర్లు బాదగా.. అందులోని ఓ సిక్సర్ ఆండ్రూ ట్రేడ్ మార్క్ సిక్సర్‌కు (పుల్‌షాట్) మక్కీ టు మక్కీగా ఉందని అభిమానులు అనుకుంటున్నారు. రాకీ మెరుపు షాట్లు ఆడుతూ తండ్రి బాటలోనే నడుస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. Rocky Flintoff with 3️⃣ sixes on his way to an unbeaten half-century for the 2nd XI! 💥👏 Our 2nd XI clash with Durham ends in a draw as the rain interrupts once again. Scorecard 📋➡ https://t.co/WieghotbNI 🌹 #RedRoseTogether pic.twitter.com/Rrc2SWUB9t — Lancashire Cricket (@lancscricket) April 18, 2024 డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో తండ్రి తరహాలోనే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రాకీ రెండు బౌండరీలు, మూడు సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో వర్షం మొదలుకావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ సమయానికి లాంకాషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆండ్రూ ఫ్లింటాఫ్ పెద్ద కొడుకు కోరె ఫ్లింటాఫ్ కూడా లాంకాషైర్కే ఆడటం మరో విశేషం. ఆండ్రూ అలియాస్ ఫ్రెడ్డీ ఇద్దరు కొడుకులు క్రికెట్లో రాణిస్తుండటంతో ఇంగ్లండ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెడ్డీ 20వ శతాబ్దం చివరి నుంచి దాదాపు పదేళ్ల పాటు ఇంగ్లండ్ క్రికెట్‌కు మకుటం లేని మహారాజుగా వెలిగిన విషయం తెలిసిందే. 2005 యాషెస్ సిరీస్‌లో ఫ్రెడ్డీ ఆల్‌రౌండర్‌గా విశేషంగా రాణించాడు. 2009లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం ప్రొఫెషనల్ బాక్సర్‌గా, ఫ్యాషన్ ప్రమోటర్‌గా, కార్ రేసర్‌గా, టీవీ ప్రజెంటర్‌గా పలు రంగాల్లో కాలు మోపిన ఫ్రెడ్డీ ప్రతి రంగంపై తనదైన ముద్ర వేశాడు. 2022లో కారు ప్రమాదానికి గురైన ఫ్రెడ్డీ.. ఇటీవలే క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. 46 ఏళ్ల ఫ్రెడ్డీ ఇంగ్లండ్ వన్డే జట్టుకు జీతం లేకుండా కోచ్‌గా సేవలు అందిస్తున్నాడు. గతేడాది నవంబర్‌లో ఫ్రెడ్డీ హండ్రెడ్ లీగ్‌లోని నార్త్రన్ సూపర్ చార్జర్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గత హండ్రెడ్ ఎడిషన్‌లో ఫ్రెడ్డీ సూపర్ చార్జర్స్ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. -
క్రికెట్లో కృత్రిమ మేధ.. ఐస్ కూల్‌గా ఐపీఎల్ (ఫోటోలు)
-
IPL 2024: బుమ్రాను భయపెట్టిన అశుతోష్.. ఊహలకందని సిక్సర్
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్ 18) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడినా.. ఇద్దరు బ్యాటర్లు మాత్రం ముంబైకి ముచ్చెమటలు పట్టించారు. 184 పరుగుల లక్ష్య ఛేదనలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి గెలుపుపై ఏ మాత్రం ఆశలు లేని పంజాబ్‌ను అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), శశాంక్ సింగ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో తిరిగి మ్యాచ్‌లో నిలబెట్టారు. అయితే ఆఖర్లో ముంబై బౌలర్లు పుంజుకోవడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. - He is 25-Year old. - He's playing debut IPL. - He scored 61(28) in today's match. - 156 runs, 52 ave, 205.3 SR in this IPL. - He hits 13 Sixes & 9 Fours. ASHUTOSH SHARMA - THE FUTURE OF INDIAN CRICKET. ⭐ pic.twitter.com/JgVu4UsDab — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడినా ఆశుతోష్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం హైలైట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఆశుతోష్ ఆడిన కొన్ని షాట్లు క్రికెట్ పండితులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించాయి. బుమ్రా బౌలింగ్‌లో ఆడిన ఓ షాట్ అయితే న భూతో న భవిష్యతి అన్నట్లుగా ఉంది. ప్రపంచ బ్యాటర్లనంతా గడగడలాడించే బుమ్రా బౌలింగ్‌లో అశుతోష్ ఊహలకందని స్వీప్ షాట్ సిక్సర్ కొట్టాడు. బుమ్రా బౌలింగ్‌లో ఇలాంటి షాట్ ఆడటం దాదాపుగా అసాధ్యం. ASHUTOSH SHARMA PLAYED ONE OF THE BEST SHOT IN IPL 2024. 🥶 pic.twitter.com/WhO7RgfNEF — Johns. (@CricCrazyJohns) April 18, 2024 అయితే అశుతోష్ మాత్రం ఏమాత్రం తడబడకుండా ఈ షాట్‌ను అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశాడు. అశుతోష్ ఈ షాట్ ఆడిన విధానం చూసి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా నోరెళ్లబెట్టాడు. మ్యాచ్ అనంతరం ఈ సిక్సర్ గురించి మాట్లాడుతూ నమ్మశక్యంగా లేదని అన్నాడు. ఈ షాట్ చూసిన క్రికెట్ అభిమానులైతే బుమ్రా బౌలింగ్ ఇలా కూడా సిక్సర్ కొట్టొచ్చా అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో అశుతోష్ ఆడిన సుడిగాలి ఇన్నింగ్స్‌లో దాదాపు ప్రతి షాట్ అణిముత్యమే అని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. టీమిండియా నయా 360 ప్లేయర్లంటున్నారు. అశుతోష్ సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. From sweeping Bumrah for six, to soaking pressure and consistantly delivering when team needs, taking Punjab almost par yesterday. The new 360 player in town, Ashutosh Sharma pic.twitter.com/SsniN2ad13 — Jahazi (@Oye_Jahazi) April 19, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. సూర్యకుమార్ యాదవ్ (53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (25 బంతుల్లో 36;2 ఫోర్లు, 3 సిక్సర్లు), తిలక్ వర్మ (18 బంతుల్లో 34 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగా.. ఛేదనలో పంజాబ్.. శశాంక్ సింగ్ (25 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగినప్పటికీ లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బుమ్రా (4-0-21-3), గెరాల్డ్ కొయెట్జీ (4-0-32-3), అద్భుతంగా బౌలింగ్ చేసి పంజాబ్ ఓటమిని అడ్డుకున్నారు. Hardik Pandya said - "The way Ashutosh Sharma middle every ball and played unbelievable knock. I'm happy for him for future". pic.twitter.com/gOTmHmphiQ — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 -
ఢిల్లీ బౌలర్ల విజృంభణ.. ఐపీఎల్లో అత్యల్ప స్కోర్
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 17) జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. గుజరాత్ బ్యాటింగ్ లైనప్‌పై ఎదురుదాడికి దిగి, ఆ జట్టును కకావిలకలం చేసింది. ఇషాంత్ శర్మ (2-0-8-2), ముకేశ్ కుమార్ (2.3-0-14-3), ట్రిస్టన్ స్టబ్స్ (1-0-11-2), అక్షర్ పటేల్ (4-0-17-1), ఖలీల్ అహ్మద్ (4-1-18-1), కుల్దీప్ యాదవ్ (4-0-16-0) విజృంభించడంతో గుజరాత్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. వికెట్‌కీపర్ రిషబ్ పంత్ రెండు క్యాచ్‌లు, రెండు స్టంపౌట్లు చేసి గుజరాత్ పతనంలో కీలక భాగస్వామి అయ్యాడు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ (31) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సాయి సుదర్శన్ (12), తెవాటియా (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. గుజరాత్ చెత్త రికార్డు.. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ 100లోపు ఆలౌట్ కావడం ఇదే మొదటిసారి. 2024 సీజన్లో ఓ జట్టు 100లోపు ఆలౌట్ కావడం కూడా ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ చేసిన 89 పరుగుల స్కోర్.. ఇపీఎల్ చరిత్రలో ఆ జట్టుకు అత్యల్ప స్కోర్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనూ ఇదే అత్యల్ప టీమ్ స్కోర్ Delhi Capitals bowling unit wrapping up GT for just 89. 💥 - Captain Rishabh Pant and his army are dominating in Ahmedabad. pic.twitter.com/jS31TQyI1b — Mufaddal Vohra (@mufaddal_vohra) April 17, 2024
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019