breaking news
-
Japnit Ahuja: డిజిటల్ జెండర్ గ్యాప్‌ను కోడింగ్ చేసింది!
స్త్రీలు సాంకేతికంగా కూడా సాధికారిత సాధించాలనే లక్ష్యంతో వారికి ఉచితంగా కోడింగ్ పాఠాలు నేర్పుతోంది ఢిల్లీవాసి 23 ఏళ్ల జష్నిత్ అహుజా. కోడింగ్ తెలిసిన వారికి ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తాయి. ఈ రకంగా దేశంలో ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయిలకు ఆశాజ్యోతిగా మారింది జప్నిత్. ఇప్పటి వరకు 2 వేల మంది అమ్మాయిలకు ఉచితంగా డిజిటల్ పాఠాలు నేర్పింది. వంద మంది వాలంటీర్ల బృందానికి నాయకత్వం వహిస్తోంది. ఢిల్లీకి చెందిన జప్నిత్ అహుజాకు కోడింగ్ అంటే చాలా ఆసక్తి. దాంతో కోడింగ్ నేర్చుకోవడం మీదనే దృష్టిపెట్టింది. అదే సమయంలో ఆమె ఒక విషయాన్ని గుర్తించింది. అదేమంటే, కోడింగ్ రంగంలో స్త్రీలు చాలా తక్కువగా ఉన్నారనీ, ఆ ఉన్న వారిలో కూడా చాలామందికి దానిపై తగినంత పరిజ్ఞానం లేదనీ. మిగిలిన వారితో పోల్చితే కోడింగ్ తెలిసిన వాళ్లకి ఉద్యోగావకాశాలు కాసింత ఎక్కువగానే దొరుకుతాయి. అయితే ఆ రంగంలో పురుషులదే పై చేయి. దాంతో సాంకేతికపరంగా ఏమైనా ఉద్యోగాలు ఉంటే కోడింగ్‌లో వారే ముందుకు దూసుకుపోవడం వల్ల ఆ ఉద్యోగాలు కూడా వారే ఎక్కువగా దక్కించుకోగలుగుతున్నారు. ఇప్పటిదాకా స్త్రీలు ఎన్నో రంగాలలో పట్టుదలతో కృషి చేసి, పై చేయి సాధించగలుగుతున్నప్పుడు కోడింగ్‌లో మాత్రం పట్టు ఎందుకు సాధించకూడదు... అని ఆలోచించింది. అంతే... ముందు తాను ఆ రంగంలో బాగా కృషి చేసింది. పట్టుదలతో కోడింగ్ నేర్చుకుంది... ఆ రకంగా అందులో చకచకా పై మెట్టుకు చేరిపోగలిగింది. తనలాగే మరికొందరు ఆడపిల్లలకు కూడా కోడింగ్ నేర్పితేనో... అనుకుంది. అలా అనుకోవడం ఆలస్యం... ఇతర ఆమ్మాయిలను కొందరిని పోగు చేసి తనకు తెలిసిన దానిని వారికి ఉచితంగా పాఠాలు నేర్పడం ఆరంభించింది. అలా తన 16వ ఏట ఆమె ‘గో గర్ల్’ అనే సంస్థను స్థాపించింది. అయితే భాష సమస్య రాకుండా వారికి వచ్చిన స్థానిక భాషలోనే ఉచితంగా కోడింగ్‌ను నేర్పడం ఆమె ప్రత్యేకత. తోటి ఆడపిల్లలను సాంకేతికంగా ఎదిగేలా చేయడం కోసం ఎంచుకున్న లక్ష్యం, అందుకు ఆమె చేసిన కృషీ వృథా పోలేదు. చాలామంది అమ్మాయిలు ఆమె దగ్గర కోడింగ్ నేర్చుకుని మంచి ఉద్యోగావకాశాలను సాధించుకోగలిగారు. అలా తనకు లభించిన ప్రోత్సాహ ఉత్సాహంతో తన వయసు ఆడపిల్లలకే కాదు, తల్లి వయసు స్త్రీలకు కూడా కోడింగ్ నేర్పడం మొదలు పెట్టింది. అలా తనకు 23 ఏళ్లు వచ్చేసరికి చిన్న, పెద్ద కలిసి దాదాపు రెండు వేల మందికి పైగా ఆమె వద్ద కోడింగ్ నేర్చుకుని సాంకేతికంగా అభివృద్ధి చెంది, తమ కాళ్ల మీద తాము నిలబడగలిగారు. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఆరవ తరగతి చదివేటప్పుడే కోడింగ్ రంగంలో సాధించిన ప్రావీణ్యం బాల మేధావిగా ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే అమ్మానాన్న ఆఫీసులనుంచి ఇంటికి వచ్చేలోగా వారికోసం ఎదురు చూస్తూ రకరకాల వెబ్సైట్లకు రూపకల్పన చేసేదానిని. అప్పుడు నాన్న నాతో.. ‘ఈ పిచ్చి పిచ్చి వెబ్సైట్లు కాదు బేబీ... నువ్వు నాసా సైంటిస్ట్‌గా ఎదగాలి. తలచుకుంటే నీకదేమీ ఒక లెక్కలోనిది కాదు’ అని చెప్పిన మాట నన్ను ఎంతో ప్రభావితం చేసింది. అలా ఎయిత్ క్లాస్‌కు వచ్చేసరికి పెద్దయ్యాక నేను చేయవలసింది ఉద్యోగం కాదని... సాంకేతికంగా అభివృద్ధి చెందడం, దానిద్వారా నేను నేర్చుకున్న పాఠాలను పదిమందికీ చెప్పడంలోనే ఎంతో థ్రిల్ ఉందనీ అర్థమైంది. నా దగ్గర కోడింగ్ పాఠాలు నేర్చుకున్న వారే తమంతట తాము స్వచ్ఛందంగా ఇతరులకు నేర్పించడం మొదలు పెట్టారు. ఆ విధంగా ‘కోడింగ్ ఫర్ ఉమెన్ బై ఉమెన్’ కాన్సెప్ట్ మాకు బాగా ఉపకరించింది. అంతేకాదు, డిజిటల్ జెండర్ గ్యాప్ అనే వివక్షను పూడ్చాలన్న నా స్వప్నం సాకారం అయ్యేందుకు ఉపకరించింది. ఏమైనా పిల్లలు గ్యాడ్జెట్స్‌తో ఆడుకుంటున్నప్పుడు వాళ్లు వాటితో ఏం చేస్తున్నారో... తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. దానిని వారు మంచికే ఉపయోగిస్తున్నారు అని గుర్తించగలిగితే ఆ దిశగా వారిని ప్రోత్సహించడం మంచిది. నా తల్లిదండ్రులు కోడింగ్‌పై నాకున్న ప్యాషన్‌ను గుర్తించకుండా ఏవో పిచ్చి ఆటలు ఆడుతున్నాను అనుకుని దానికి అడ్డుకట్ట వేసి ఉంటే నేను ఈ స్థాయికి ఎదిగి ఉండేదానిని కాను’’ అని ఆమె చెప్పిన మాటలు ఆలోచించదగ్గవి. ∙కోడింగ్‌లో శిక్షణ పొందుతున్న అమ్మాయిలు -
లోకం మెచ్చిన కోడింగ్ మాంత్రికుడు : అద్రిత్ సక్సెస్ జర్నీ
‘అబ్బ...ఖాళీ సమయం దొరికింది. ఎంజాయ్ చేయాలి’ అనుకునేవారు కొందరు. ‘ఖాళీ సమయం దొరి కింది... ఏదైనా నేర్చుకోవాలి’ అనుకునేవారు మరికొందరు. అద్రిత్రావు రెండో కోవకు చెందిన కుర్రాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో దొరికిన విరామంలో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఎన్నో సాంకేతిక విషయాలను స్వయంగా నేర్చుకున్నాడు. కోడింగ్ మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నాడు... ‘కోడింగ్ మేధావి’గా పేరుగాంచిన ఇండియన్–అమెరికన్ అద్రిత్రావు యాప్ డెవలప్మెంట్ వరల్డ్, డిజిటల్ హెల్త్ ఇన్నోవేషన్‌లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాలిఫోర్నియాకు చెందిన పదహారు సంవత్సరాల అద్రిత్ ఎన్నో యాప్‌లను రూపొందించి టెక్ దిగ్గజం యాపిల్ ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో హెల్త్‌కేర్‌కు సంబంధించిన కట్టింగ్–ఎడ్జ్ రిసెర్చ్‌లో భాగం అయ్యాడు. ఎనిమిదేళ్ల వయసులో కోడింగ్‌తో ప్రయాణం ప్రారంభించాడు అద్రిత్. ‘బ్లాక్ ప్రోగ్రామింగ్’తో కంప్యూటర్ సైన్స్‌తో పరిచయం అయింది. ఆ పరిచయం ఇష్టం అయింది. ఆ ఇష్టం శోధనకు మూలం అయింది. కంప్యూటర్ సైన్స్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన అద్రిత్ ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను గురించి ఆసక్తిగా తెలుసుకోవడం ప్రారంభించి ఆ తరువాత వాటిపై పట్టు సాధించాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో అద్రిత్కు బోలెడు ఖాళీ సమయం దొరికింది. ఈ ఖాళీ సమయంలో యూట్యూబ్, ఇతర ఆన్లైన్ వనరుల ద్వారా యాప్ డెవలప్మెంట్ నేర్చుకున్నాడు. పన్నెండేళ్ల వయసులో ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ సిఫ్ట్ స్టూడెంట్ చాలెంజ్‌లో అద్రిత్రావు విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌ను కలిసే అరుదైన అవకాశం లభించింది. ‘అదొక ఉత్తేజకరమైన అనుభవం. యాప్ డెవలప్మెంట్కు సంబంధించి నా ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రేరణ ఇచ్చింది’ కుక్‌తో జరిగిన మీటింగ్ గురించి చెబుతాడు అద్రిత్. సినిమాలు, టీవీ షోలను చూడడానికి ప్రేక్షకులకు సహాయపడే యాప్‌ల నుంచి ఆరోగ్య సంరక్షణలో ఉపయోగపడే యాప్‌ల వరకు...అద్రిత్ ఖాతాలో వినూత్న యాప్‌లు ఎన్నో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది బధిరులు ఉన్నారు, కమ్యూనికేషన్ విషయంలో ఇతరులతో వారికి ఎదురవుతున్న సమస్యల గురించి అధ్యయనం చేసిన అద్రిత్కు వారి హావభావాలను ఐఫోన్ కెమెరా ద్వారా స్పీచ్‌గా మార్చాలనే ఆలోచన వచ్చింది. ఆ తరువాత ‘సిగ్నర్’ అనే యాప్ ద్వారా తన ఆలోచనను నిజం చేసుకున్నాడు. పదమూడు సంవత్సరాల వయసులో చదివిన ఒక వ్యాసం ద్వారా అద్రిత్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఆసక్తి పెరిగింది. ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉయోగించాలనే ప్రయత్నంలో స్టాన్‌ఫోర్ట్ యూనివర్శిటీలో రిసెర్చ్ ఇంటెర్న్షిప్ ప్రారంభించాడు అద్రిత్. వ్యాధులను గుర్తించే, స్టాండ్ఔట్ ఇన్నోవేషన్‌గా చెప్పబడుతున్న ‘ఆటోఏబీఐ’లాంటి ఐఫోన్ యాప్‌లు క్లినికల్ ట్రయల్స్, పేటెంట్ప్రాసెస్లో ఉన్నాయి. పది సైంటిఫిక్ రిసెర్చ్ పేపర్లను ప్రచురించిన అద్రిత్ డిజిటల్ హెల్త్ సోల్యూషన్స్కు సంబంధించి క్రియాశీల పాత్ర పోషిస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్‌లపై పని చేయడానికి సిలికాన్ వ్యాలీలో ఎక్కువ సమయం గడిపినప్పటికీ ‘సాంకేతిక సహాయంతో ఆరోగ్య సంరక్షణ’ అంశంపై ఎక్కువ దృష్టి పెట్టాడు అద్రిత్. ‘వైద్యుల స్థానాన్ని ఏఐ భర్తీ చేయాలని నేను అనుకోవడం లేదు. అయితే అది వైద్యులకు సహాయపడుతుంది’ అంటున్నాడు. ఈ కోడింగ్ మాంత్రికుడిలోని మరో కోణం...లాభాపేక్ష లేకుండా యంగ్ ఇన్నోవేటర్స్ కోసం ΄ాఠాలు బోధిస్తున్నాడు. ఎంతోమందికి విలువైన సలహాలు ఇస్తున్నాడు.వయసు అడ్డంకి కాదు... కొత్త ఆవిష్కరణలకు వయసు అనేది అడ్డు కాదు. అభిరుచి అనేది ఆవిష్కరణకు ప్రమాణం. మనం ఇష్ట పడుతున్న సబ్జెక్ట్‌పై ఎంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే అంత విజయం సాధించగలం. కాలం అనేది విలువైనది. విలువైన కాలాన్ని వృథా చేయకుండా విలువైన విషయాలపై దృష్టి పెడితే అద్భుతాలు సాధించగలం. మార్పును తీసుకురాగలం. – అద్రిత్ -
కోడింగ్ అవసరమే లేదు!.. ఎన్విడియా సీఈఓ కీలక వ్యాఖ్యలు
ప్రారంభం నంజుంచి ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ సామర్థ్యానికి ప్రజలు మంత్ర ముగ్దులయ్యారు. నేడు ఈ టెక్నాలజీ ఉన్నత శిఖరాలను చేరుకుంటోంది. దిగ్గజ సంస్థలు సైతం ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఓపెన్ఏఐ మాత్రమే కాకుండా గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు కూడా సొంత చాట్బాట్లు, జెమిని, బింగ్ వంటి వాటిని ఆవిష్కరించుకున్నాయి. ఇటీవల దేశీయ దిగ్గజం రిలయన్స్ కంపెనీ కూడా హనూమాన్ (Hanooman) అనే ఏఐ ఆవిష్కరించింది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తు 'ఏఐ'దే అంటున్నారు. ఏఐ కారణంగా చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోతుంటే.. ఈ టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు మాత్రం డిమాండ్ పెరిగిపోతోంది. ఉద్యోగం కావాలంటే తప్పకుండా టెక్నాలజీలో నైపుణ్యం కలిగి ఉండాలని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ఎన్విడియా (Nvidia) సీఈఓ 'జెన్సన్ హువాంగ్' కూడా ఏఐ ప్రభావం ఉద్యోగాల మీద చాలా ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి ప్రపంచంలో పిల్లలు కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదని కూడా వ్యాఖ్యానించారు. గతంలో ప్రతి ఒక్కరూ కోడింగ్ నేర్చుకోవాలని సూచించారు, కానీ నేడు దాని అవసరం లేకుండా పోయిందని ఆయన స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఛాట్‌జీపీటీకి పోటీగా మన ‘హనూమాన్’! ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మానవీయంగా ఉండేలా టెక్నాలజీని క్రియేట్ చేయడం తమ బాధ్యతని సీఈఓ జెన్సన్ హువాంగ్ పేర్కొన్నారు. కాబట్టి ఇక మీద సీ++, జావా వంటి కోడింగ్ లాంగ్వేజస్ అవసరం లేదని, రాబోయే రోజుల్లో ఏఐ మరింత వృద్ధి చెందుతుందని ఆయన చెప్పుకొచ్చారు. -
ఆర్ధిక మాంద్యంలో ఐటీ జాబ్ కొట్టడమే మీ లక్ష్యమా..మైక్రోసాఫ్ట్ అదిరిపోయే ఆఫర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. ఒక లక్షకుపైచిలుకు భారతీయ సాఫ్ట్వేర్ డెవలపర్లకు నెలరోజుల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఫ్యూచర్ రెడీ చాంపియన్స్ ఆఫ్ కోడ్ కార్యక్రమం కింద నెలరోజుల శిక్షణతోపాటు అభ్యర్థులను ధ్రువీకరించనుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న డెవలపర్ కమ్యూనిటీలతో ఆవిష్కరణల కేంద్రంగా భారత్ మారిందని మైక్రోసాఫ్ట్ ఇండియా కస్టమర్ సక్సెస్ ఈడీ అపర్ణ గుప్త అన్నారు. దేశ వృద్ధిని నడిపించే సాంకేతికత అభివృద్ధిలో డెవలపర్ల సృజనాత్మకత, ఆవిష్కరణ, అభిరుచిని మైక్రోసాఫ్ట్ గుర్తిస్తుందని చెప్పారు. -
గాడితప్పిన ‘కోడింగ్ స్కూల్’!
కోడింగ్ స్కూల్ ఉద్దేశం ఆరో తరగతి నుంచే విద్యార్థికి సాధారణ పాఠ్యాంశంతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం, ప్రోగ్రామింగ్‌పై అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇవ్వడం లక్ష్యం కాలేజీ స్థాయికి వచ్చేసరికి కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో అత్యుత్తమ నిపుణులుగా విద్యార్థులను తయారు చేయడం ఎన్ని స్కూళ్లు టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ పరిధిలో మూడు కేటగిరీల్లో ఈ స్కూళ్లున్నాయి. బాలురు–1, బాలికలు–1, డిగ్రీ విద్యార్థులకు–1 ఏటా చేస్తున్న ఖర్చు సాధారణ పాఠశాల నిర్వహణ ఖర్చులకు అదనంగా ఏటా రూ. 6 కోట్లు. ప్రస్తుత పరిస్థితి కోడింగ్ బోధన అయోమయం.. సాధారణ పాఠశాలల మాదిరిగా క్లాసులు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కోడింగ్ పాఠశాలల నిర్వహణ గాడి తప్పింది. సాంకేతిక నిపుణులు, ఉన్నత ప్రమాణాలతో కూడిన శిక్షకులతో కంప్యూటర్ పరిజ్ఞానాన్ని విద్యార్థులకు చిన్నతనం నుంచే కల్పించి ఉత్తమ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తయారు చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ పాఠశాల ఇప్పుడు సాధారణ గురుకులం మాదిరిగా తయారైంది. కోడింగ్ స్కూల్లో సాంకేతిక నిపుణులను పూర్తిస్థాయిలో నియమించకపోవడం... ఇన్ఫర్మెషన్ టెక్నాలజీలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పించే సదస్సులకు విద్యార్థులను తీసుకెళ్లకపోవడం, పారిశ్రామిక విజ్ఞాన యాత్రలను అటకెక్కించడం... కోడింగ్ తరగతులను సైతం నిర్దేశించిన సమయాల్లో నిర్వహించకపోవడంతో కోడింగ్ స్కూల్ స్ఫూర్తి దెబ్బతింటోంది. ఉన్నత లక్ష్యం... సాంకేతిక విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎస్సీ గురుకులాల నుంచి ఎంపిక చేసి వారికి కోడింగ్ స్కూల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా చిలుకూరు సమీపంలో టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కోడింగ్ పాఠశాలను నిర్వహిస్తోంది. ఈ క్యాంపస్‌లో బాలురు, బాలికలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ ఇక్కడే వసతి కల్పిస్తున్నారు. డిగ్రీ స్థాయి పిల్లలకు బాలానగర్ సమీపంలో కోడింగ్ కాలేజీని నిర్వహిస్తున్నారు. కోడింగ్ పాఠశాలలో సాధారణ గురుకుల పాఠశాల/కళాశాలకు సంబంధించిన తరగతులను సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగగా... కోడింగ్‌కు సంబంధించిన తరగతులు, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకు టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ ఒక ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ప్రైవేటు సంస్థను టెండర్ల ద్వారా ఎంపిక చేసింది. టెండరు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ కోడింగ్ పాఠశాలలో సాంతికేతిక నిపుణులను, ట్రైనర్లను నియమించుకుని విద్యార్థులకు రోజుకు 4 గంటలపాటు తరగతులు నిర్వహించి శిక్షణ ఇవ్వాలి. అంతర్జాతీయ, జాతీయ ఐటీ సదస్సులకు విద్యార్థులను తీసుకెళ్లి అవగాహన కల్పించాలి. ఇండస్ట్రియల్ టూర్లలో భాగంగా సాఫ్ట్వేర్ సంస్థలను ప్రత్యక్షంగా చూపించి కోడింగ్, ప్రోగ్రామింగ్, యానిమేషన్ తదితర కంప్యూటర్ ఇంజనీరింగ్‌పై అవగాహన పెంచాలి. ఇందుకు ఏటా కోడింగ్ అంశం కోసమే టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ రూ. 6 కోట్లు ఖర్చు చేస్తోంది. మూడేళ్ల కాలానికి రూ. 18 కోట్ల బడ్జెట్ కేటాయించింది. తూట్లు పొడుస్తున్న కాంట్రాక్టు సంస్థ 2020 నుంచి మూడేళ్ల కాలానికి టెండర్లు దక్కించుకున్న ప్రైవేటు సంస్థ క్రమంగా కోడింగ్ లక్ష్యానికి తూట్లు పొడుస్తోంది. తగినంత మంది సాంకేతిక నిపుణులు, శిక్షకులను నియమించకుండా అరకొర తరగతులతో చేతులు దులుపుకుంటోంది. గత రెండేళ్లుగా ఇండస్ట్రియల్ టూర్లకు మంగళం పాడిన ఆ సంస్థ... అవగాహన సదస్సులను సైతం అటకెక్కించింది. కేవలం సాధారణ స్కూల్ కార్యకలాపాలతోపాటు రోజులో అరకొరగా థియరీ తరగతులతో కాలం వెళ్లదీస్తోంది. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ సొసైటీకి పూర్తిస్థాయి కార్యదర్శి లేకపోవడం... ఇతర ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టు సంస్థ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తినా సొసైటీ అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సొసైటీలోని ఓ ఉన్నతాధికారి ప్రమేయం ఉండటంతో ప్రైవేటు సంస్థ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019