breaking news
-
కొత్త రుణాలు కావాలా.. పాత అప్పు కట్టండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు వారి ముక్కుపిండి మరీ తిరిగి వసూలు చేస్తున్నాయి. లీగల్ నోటీసులు, మౌఖిక ఆదేశాలు, ఒత్తిళ్లతో వడ్డీతో సహా రాబట్టుకుంటున్నా యి. కొన్ని బ్యాంకులు వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద ఎంతోకొంత తగ్గించి వసూలు చేస్తున్నాయి. కొత్త రుణాలు కావాలంటే పాత అప్పు చెల్లించాల్సిందేనంటూ మెడపై కత్తి పెట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు రైతుల ఖాతాల్లోని రైతుబంధు సొమ్మును లాగేసుకుంటున్నాయి. దీంతో కొందరు రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చి మరీ బ్యాంకులకు చెల్లిస్తున్నారు. రుణమాఫీ జరుగుతుందనే ఆశతో అప్పులు తిరిగి చెల్లించలేదని, రుణమాఫీ జరగకపోగా వడ్డీ తడిచిమోపెడు అవుతోందని గగ్గోలు పెడుతున్నారు. రుణమాఫీ జరిగేవరకు వేచిచూడాలని వేడుకుంటున్నా బ్యాంకులు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బ్యాంకులు నోటీసులు..మరోవైపు వ్యవసాయశాఖ చేతులెత్తేయడం, రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందో తెలియక, కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేక రైతులు నలిగిపోతున్నారు. ముందుకు సాగని రూ.2 లక్షల రుణమాఫీ తమ పార్టీని గెలిపిస్తే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఇప్పుడదే పార్టీ అధికారంలోకి వచి్చంది. కానీ నాలుగు నెలలైనా ఇప్పటివరకు రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ మొదలు కాలేదు. కనీసం మార్గదర్శకాలు కూడా ఖరారు చేయలేదు. కానీ రూ.2 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేయాలంటే రూ.30 వేల కోట్లు అవసరమవుతాయని మాత్రం ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు.. ఎలా చేయాలి? ఏ తేదీ వరకు రుణమాఫీ చేయాలి అన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పట్లో సాధ్యం కాదా? ఎన్నికల కోడ్‌తో ఇప్పటికిప్పుడు రుణమాఫీకి మార్గదర్శకాలు ఖరారు చేయడం, ఇతరత్రా ప్రక్రియ మొ దలు పెట్టడం కానీ సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. దీంతో జూన్ మొదటి వారం వరకు రుణ మాఫీపై అడుగు ముందుకు పడే అవకాశం లేదు. మరోవైపు వానాకాలం సీజన్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు మే నుంచే రైతులు సిద్ధం అవుతుంటారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడం, త్వరగా వర్షాలు కురిస్తే దుక్కులు దున్నడానికి సన్నాహాలు చేసుకుంటుంటారు. ఇంకోవైపు ఏప్రిల్ నుంచే వానాకాలం సీజన్ పంట రుణాల ప్రక్రియను బ్యాంకులు ప్రారంభిస్తాయి. కానీ రుణమాఫీ జరగకుంటే కొత్త రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో అప్పులు తిరిగి చెల్లించాలని, రె న్యువల్ చేసుకోవాలని బ్యాంకులు నోటీసులు జారీ చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ‘‘బ్యాంకుల్లో రైతు రుణాలు ఉన్నవాళ్లు ఎవ్వరూ కట్టకండి.. మేం అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం’’అప్పట్లో పలు ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ముందు చెల్లించండి.. తర్వాత సర్దుబాటు చేస్తాం రాష్ట్రంలో ప్రతి ఏటా సగటున 42 లక్షల మంది వరకు రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటారు. రుణం తీసుకున్న రైతులు మూ డు సీజన్లలోగా బకాయిలు చెల్లిస్తేనే తదుపరి రుణం తీసుకోవడానికి అర్హులవుతారు. అయితే ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులు తమ బకాయిలను చెల్లించలేదు. మరోవైపు దీర్ఘకాలంగా బకాయిలు పేరుకుపోయిన వారు కూడా అవి చెల్లించలేదు. ఈ నేపథ్యంలో బ్యాంకులు చెప్పిన ప్రకారం పాత అప్పులు చెల్లించాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ నిధులు విడుదల చేశాక సర్దుబాటు చేస్తామని చెబుతున్నారు. రుణాలు రెన్యువల్ చేసుకోకపోతే రైతులు డిఫాల్టర్లుగా మారిపోతారు. అయితే కొన్ని బ్యాంకులు రైతుబంధు సొమ్మును జమ చేసుకోవడం ద్వారా రెన్యువల్ చేయడం గమనార్హం. కాగా తాము రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవడం సాధ్యం కాదని ఒక బ్యాంకు అధికారి ‘సాక్షి’కి చెప్పారు. బకాయిలు పేరుకుపోతే ఎవరినైనా డిఫాల్టర్లుగా ప్రకటిస్తామని అన్నారు. లక్షలాది మంది రైతుల రుణ బకాయిలు పేరుకుపోయి ఉన్నాయని, అందుకే నోటీసులు ఇస్తున్నామని స్పష్టం చేశారు. పాత రుణాన్ని అలాగే ఉంచి కొత్త రుణం ఇవ్వడం సాధ్యం కాదని వివరించారు. -
పసిడి, వెండి దిగుమతికి అనుమతులు పొందిన బ్యాంకులివే
వచ్చే ఆర్థిక సంవత్సరంలో బంగారం, వెండి దిగుమతి చేసుకోవడానికి అనుమతించిన బ్యాంకుల జాబితాను కేంద్రం ప్రకటించింది. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, యెస్ బ్యాంక్‌లు మనదేశంలోకి పసిడి, వెండి దిగుమతి చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు ఈ అనుమతులు వర్తిస్తాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌లు బాంగారాన్ని మాత్రం దిగుమతి చేసుకోవచ్చు. ఇదీ చదవండి..అలర్ట్.. రెండు రోజుల్లో ముగియనున్న గడువు -
రుణమాఫీపై సర్కారు కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే బ్యాంకులతో దీనిపై చర్చించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతంలో లక్ష రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన బీఆర్ఎస్ రుణమాఫీ చేసేందుకు రకరకాల కొర్రీలు పెట్టిందని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పదేపదే ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 40.66 లక్షల మంది రైతులకు రూ. 25,916 కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా.. కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే వర్తిస్తుందని కొర్రీ పెట్టి లబ్ధిదారుల సంఖ్యను కుదించిందని ధ్వజమెత్తింది. మరోవైపు అయిదేళ్ల పాటు వంతుల వారీగా రుణమాఫీ నిధులు విడుదల చేసిన అప్పటి ప్రభుత్వం.. చివరకు కేవలం 23 లక్షల మంది రైతులకే రుణ మాఫీ చేసినట్టుగా అధికారులు లెక్కలు తేల్చినట్టు సమాచారం. దాదాపు 14 లక్షల మంది రైతులకు రుణమాఫీ సొమ్ము ఎగవేసినట్టుగా లెక్కగట్టారు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన తప్పులు జరగకుండా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేసే ప్రతిపాదనలపై మొదటి వంద రోజుల్లోనే కసరత్తు మొదలు పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. -
నగదు లావాదేవీల సమాచారమివ్వండి: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ..అక్రమ డబ్బు రవాణాను అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఖాతాదారులు ఎవరైనా రూ.లక్ష కంటే ఎక్కువ డిపాజిట్, విత్ డ్రా చేస్తే జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వాలని సూచించింది. ఏదైనా బ్యాంకు ఖాతా నుంచి రూ.10 లక్షలకు పైగా నగదును ఖాతాదారుడు తీసుకున్నా జిల్లా ఎన్నికల అధికారికి, ఆదాయపు పన్ను శాఖ నోడల్ అధికారికి తెలపాలని ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చు కోసం తన పేరుతో లేదా ఏజెంట్ పేరుతో కలిపి బ్యాంకు, పోస్టాఫీసుల్లో ప్రత్యేకంగా అకౌంట్ లేదా ఉమ్మడి అకౌంట్ తెరవవచ్చని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు తెరవాలని అన్ని బ్యాంకులకు ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. -
ఆ లావాదేవీల జాబితా ఇవ్వండి..
సాక్షి, అమరావతి: త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బ్యాంకు ఖాతాల ద్వారా రాష్ట్రంలో అనుమానాస్పద, అధిక మొత్తంలో జరిగే లావాదేవీల వివరాలు ఎప్పటికప్పుడు ఆదాయపు పన్ను శాఖకు, ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) ముకేశ్‌కుమార్ మీనా బ్యాంకర్లను ఆదేశించారు. గత ఏడాది అక్టోబరు 1 నుండి రోజుకి రూ.10 లక్షలకు మించి.. గత 30 రోజుల కాలవ్యవధిలో రూ.50 లక్షలకు మించి లావాదేవీలు జరిగిన బ్యాంకు ఖాతాల వివరాలను సమర్పించాలని అన్ని బ్యాంకుల నోడల్ అధికారులను ఆయన కోరారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, ఎలక్ట్రానిక్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈసీఎంసీ) అమలు అంశాలను సమీక్షించేందుకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఎస్ఈసీ అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల్లో పోటీచేసే ప్రతీ లోక్‌సభ అభ్యర్థి రూ.95 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థి రూ.40 లక్షల మేర వ్యయం చేసేందుకు అనుమతి ఉందన్నారు. అయితే, అంతకుమించి జరిగే వ్యయంపై పటిష్టమైన నిఘా ఉంటుందని, ఈ విషయంలో బ్యాంకర్లు కీలకపాత్ర పోషించి గుర్తించాలన్నారు. రాజకీయ పార్టీలు, వారి అభ్యర్థుల బ్యాంకు ఖాతాల నుండి జరిగే లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు ఐటి శాఖతోపాటు ఎన్నికల సంఘానికి అందజేయాలని ఆయన చెప్పారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత అభ్యర్థులు, వారి సంబంధీకులు లేదా రాజకీయ పార్టీల బ్యాంకు అకౌంట్ల నుంచి రూ.లక్షకు మించి జరిపే లావాదేవీల వివరాలను కూడా అందజేయాలని ఎస్ఈసీ కోరారు. ప్రలోభాలపై నిఘా.. ఇక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో అధిక మొత్తంలో నగదు, లిక్కరు, ఓటర్లను ప్రలోభపరిచే సామాగ్రి అక్రమ తరలింపుపై కూడా పూర్తిస్థాయిలో నిఘా ఉంటుందని ముకేశ్‌కుమార్ చెప్పారు. అలా తరలించే సమయంలో సీజ్ చేయబడిన వివరాలను రియల్ టైమ్ బేసిస్‌లో నివేదించేందుకు ఈసీఎంసీ విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అమల్లోకి తెచ్చిందన్నారు. ఈ అంశానికి సంబంధించి ఐటి, జీఎస్టీ, పోలీస్, ఎౖMð్సజ్ తదితర 22 ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలు నిరంతరం పనిచేస్తున్నాయని, వీరు సీజ్‌చేసే నగదు, వస్తువుల వివరాలను ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తామన్నారు. అన్ని బ్యాంకుల ప్రతినిధులు ఈ యాప్‌ను పటిష్టంగా వినియోగించుకునేందుకు వీలుగా అందులోకి లాగిన్ కావాలని ఆయన సూచించారు. మరోవైపు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు బ్యాంకులు తరలించే సొమ్మును అకారణంగా జప్తు చేయకుండా ఉండేందుకు ఈఎస్ఎంఎస్ యాప్‌ను వినియోగించుకోవచ్చన్నారు. ఈ యాప్ ద్వారా నగదు తరలింపునకు బ్యాంకులు అనుమతులు, రశీదు పొందవచ్చని, క్యూఆర్ కోడ్ ద్వారా అధికారులు ధ్రువీకరణ చేసుకునే వీలుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ రవీంద్రబాబు, అన్ని బ్యాంకుల ప్రతినిధులు మరియు డిప్యూటీ సీఈఓ కె. విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పెయిడ్ ఆర్టికల్స్‌పై కన్ను.. ఆయా మాధ్యమాల్లో ప్రచురితం, ప్రసారమయ్యే పెయిడ్ ఆర్టికల్స్‌పై గట్టి నిఘా ఉంటుందని, ఈ విషయంలో వాటి ప్రతినిధులు అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా కోరారు. ఎన్నికల సమయంలో ప్రసార మాధ్యమాలు అనుసరించాల్సిన విధి విధానాలపై కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన తాజా మార్గదర్శకాలు, చట్టాలు.. సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలకు అనుగుణంగా మీడియా యూనిట్లు ప్రవర్తించాలన్నారు. ఈ విషయమై మీనా అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన మీడియా వర్క్‌షాపులో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించే విషయంలో మీడియా పాత్ర ఎంతో కీలకమన్నారు. అందుకు అన్ని మాధ్యమాల ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుండి పెయిడ్ న్యూస్ అంశాన్ని జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉండే మీడియా సర్టిఫికేషన్, మీడియా మానిటరింగ్ (ఎంసీ అండ్ ఎంసీ) కమిటీలు ఎంతో అప్రమత్తంగా పర్యవేక్షిస్తుంటాయన్నారు. నిర్దేశించిన రేట్ కార్డు ప్రకారం పెయిడ్ న్యూస్‌ను గణించి, ఆ వ్యయాన్ని సంబంధిత అభ్యర్థి ఖాతాలో వేస్తామన్నారు. ఇక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు సంబంధించి కూడా అనుమతి పొందాల్సి ఉంటుందని, ఆ ఆర్డరు కాపీ నెంబరును ప్రకటనపై ముద్రించాల్సి ఉంటుందన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019