breaking news
-
సెలబ్రెటీలను సైతం పక్కకునెట్టి అంబాసిడర్ అయిన యువతి!
సాధారణంగా అంబాసిడర్‌గా సిని సెలబ్రెటీలు లేదా స్పోర్ట్స్ స్టార్లు, ప్రముఖులు ఉంటారు. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు కూడా వాళ్లనే పెట్టుకోవడం జరుగుతుంది. అలాంటి ఓ సాధారణ యువతి వాళ్లందర్నీ పక్కకు నెట్టి మరీ అంబాసిడర్ అయ్యింది. స్వయంగా మన భారత ప్రభుత్వమే ఆ యువతిని నియమించింది. ఎందుకని ఆమెనే అంబాసిడర్‌గా నియమించింది? ఆమె ప్రత్యేకత ఏంటీ అంటే.. అమ్మమ్మ స్పూర్తితోనే.. ఆ యువతి పేరు లహరీబాయి మధ్యప్రదేశ్‌లోని బైగా (వైద్యుడు) గిరిజన సంఘానికి చెందిన యువతి. ప్రత్యేకించి బలహీనమైన గిరిజన సమూహం. ఈ తెగకు చెందిన ప్రజలు తమ పర్యావరణం, దాని జీవవైవిధ్యంపై పూర్తి అవగాహన కలిగి ఉంటారు. వారు తమకుండే మౌఖిక సంప్రదాయాల ద్వారా తమ నైపుణ్యాలను ఒక తరం నుంచి మరొక తరానికి కొనసాగేలా ప్రొత్సహిస్తారు. ఇక లహరీ మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలోని సిల్పాడి అనే మారుమూల గ్రామానికి చెందింది. ఆమె తన బామ్మ మాటలతో స్ఫూర్తిపొందింది. కనుమరుగవుతున్న మిల్లెట్ ధాన్యంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి లహరీబాయి తన అమ్మమ్మ నుంచి పాఠాలు నేర్చుకుంది. తర్వాత దాని విత్తనాలను సంరక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేసింది. లమరీ 18 ఏళ్ల వయస్సు నుంచే విత్తనాలు సేకరించడం ప్రారంభించింది. ఆమె ఇప్పుడు కూడా సమీపంలోని గ్రామాలలో తిరుగుతూ అడవులు, పొలాల నుంచి విత్తనాలను సేకరిస్తూనే ఉండటం విశేషం. స్కూల్ ముఖమే చూడకపోయినా.. ఇక లహరీబాయి ఇల్లు మిల్లెట్స్‌తో అలంకరించినట్లుగా ఇంటిపైకప్పుడు వేలాడుతుంటాయి. అస్సలు పాఠశాల ముఖమే చూడని గిరిజన మహిళ ఈ విత్తనాల గొప్పతనం గురిచి తెలసుకుని వాటిని సంరక్షించాలని భావించడం నిజంగా స్ఫూర్తి దాయకం. ఇక ఈ మిల్లెట్‌ల్లో మాంసకృత్తులు, ఫైబర్, విటమిన్లు కలిగి ఉంటాయి. అవి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మధుమేహం, అధిక బరువు, వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడటంలో తోడ్పడుతుంది. ఏకంగా 150 రకాలకు పైనే.. ఇక లహరీబాయి ప్రస్తుత వయసు 27 ఏళ్లు. ఆమె 1ఆ ఏళ్ల నుంచి ఈ మిల్లెట్స్ సేకరణ ప్రారంభించింది. అలా ఇప్పటి వరకు దాదాపు 150 రకాలకుపైనే మిల్లెట్స్ సేకరించింది. కోడో, కుట్కి, సికియా, సల్హార్, సావా మరియు చేనాతో సహా 150కిపైగా ఎక్కువ రకాల అరుదైన మిల్లెట్స్ లహరీబాయి వద్ద ఉండటం విశేషం. ఐతే చాలా రకాల మిల్లెట్స్ అంతరించిపోతున్నాయని, వాటిని సంరక్షించుకోవాలని చెబుతుంది లహరీబాయి. విత్తనాల సేకరణ కోసం.. ఇక ఎవరైనా మిల్లెట్స్ సాగు చేస్తే.. లహరీ బాయి వారికి కిలో విత్తనాలు ఉచితంగా ఇస్తుందట. తిరిగి పంట చేతికి వచ్చిన తర్వాత ఆ రైతుల నుంచి కిలోన్నర తీసుకుంటుంది. మరి కొందరు మాత్రం ఆమెకు కొంతభాగం బహుమతిగా కూడా ఇస్తారు. డబ్బు సంపాదించడం కోసం ఇలా చేయడం లేదని, ఎక్కువ విత్తనాలు సేకరించడం కోసమేనని చెబుతున్న లహరీబాయిని చూస్తే నిజంగా వాటి ప్రాముఖ్యతను అందురు గుర్తించేలా, బావితరాలకు అందిచాలనే లక్ష్యం కనిపిస్తుంది ఆ ఆసక్తి ఆమెను అంబాసిడర్‌గా.. లహరీబాయి మిల్లెట్స్ సేకరణ, సంరక్షణ పట్ల ఆమె కనబరుస్తున్న ఆసక్తిన, కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను మిల్లెట్స్ అంబాసిడర్ గా నియమించింది. భారత ప్రభుత్వం దేశాన్నిమిల్లెట్‌సాగు, పరిశోధనలకు ప్రపంచ హబ్‌గా మార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది . ఇలాంటి వాళ్లను ప్రోత్సహిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల ఉన్న ఈ మిల్లెట్స్ అంతరించిపోకుండా సంరక్షింపబడతాయన్న ఉద్దేశ్యంతో సెలబ్రెటీలను కూడా కాదని, ఆ గిరిజ యువతిని అంబాసిడర్‌గా నియమించింది. పెద్ద పెద్ద చదువులతోనే కాదు, చేస్తున్న పట్ల సరైన అవగాహన నిబద్ధతతో కృషి చేస్తే దేశమే గుర్తించి మెచ్చుకునే మనిషిగా పేరుతెచ్చుకోవచ్చని ఈ గిరిజన యువతి ప్రూవ్ చేసింది కదూ..! (చదవండి: అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా పైలట్!) -
కమెడియన్ శ్రద్ధా జైన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు
శ్రద్ధగా నవ్విస్తుంది! శ్రద్ధా జైన్.‘శ్రద్ధా జైన్ తెలుసా?’ అని అడిగితే – ‘తెలుసు’ అని చెప్పేవారి సంఖ్య తక్కువ కావచ్చుగానీ– ‘అయ్యో శ్రద్ధా తెలుసా’ అంటే ‘అయ్యో... తెలియకపోవడం ఏమిటి!’ అనే వాళ్ల సంఖ్య ఎక్కువే. బెంగళూరుకు చెందిన శ్రద్ధా జైన్ అలియాస్ ‘అయ్యో శ్రద్ధా’ ‘ఇంటర్నెట్ సెన్సేషన్’గా పేరు తెచ్చుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇటీవల ‘నేషనల్ క్రియేటర్స్’ అవార్డ్ అందుకుంది హాయిగా నవ్వించే వీడియోలతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది శ్రద్ధా జైన్. తులు, కన్నడ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషలలో ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. 2016లో కర్నాటకాలో జరిగిన ఒక ఫెస్టివల్‌కు సంబంధించి ఫేస్బుక్ వీడియోను పోస్ట్ చేసింది. వైరల్ అయిన ఈ వీడియో శ్రద్ధాకు వీర లెవెల్లో పేరు తెచ్చింది. ఒక డ్యాన్స్ రియాల్టీ షోకు హోస్ట్‌గా, కొన్ని టీవీ కార్యక్రమాలకు క్రియేటివ్ డైరెక్టర్‌గా అవకాశాలు తెచ్చింది. ఇక కామేడీ షోల సంగతి సరే సరి. కామెడీ డ్రామా సిరీస్ ‘పుష్పవల్లి’తో శ్రద్ధ పేరు హాస్యాభిమానుల అభిమాన పేరు అయింది. పెద్ద బ్రాండ్స్‌తో కలిసి పనిచేసిన శ్రద్ధ ఇలా అంటుంది... ‘కంటెంట్‌లో వెరైటీ ఉండేలా ప్రయత్నించేదాన్ని. ప్రేక్షకుల సంగతి ఏమిటోగానీ కంటెంట్‌లో వెరైటీ లేకపోతే ముందు నాకే బోర్ కొడుతుంది. అది ఎంత పెద్ద హిట్ అయినా సరే ఒకే అంశాన్ని పదేపదే చేయలేను. రియల్ ఎస్టేట్ రంగంలోకి ఉన్న వారికి ఎలాంటి ఇన్‌ఫ్లూయెన్సర్‌ను ఎంపిక చేసుకోవాలో తెలియదు. నేను సృష్టించిన రీనా దలాల్ క్యారెక్టర్‌ను చూసిన తరువాత... రీనా క్యారెక్టర్ పర్ఫెక్ట్ అనుకున్నారు. మొదట్లో రియల్ ఎస్టేట్ కోసం కంటెంట్ క్రియేట్ చేసిన అతి కొద్దిమందిలో నేను ఒకరిని’ అంటుంది శ్రద్ధ. ఏ బ్రాండ్ వారు వచ్చినా తమది ఏ బ్రాండ్ అనేది మాత్రమే చెబుతారు. వారికి ‘ఐడియా’ గురించి బొత్తిగా ఐడియా ఉండదు. ఈ నేపథ్యంలో ఐడియా జెనరేట్ చేయడం నుంచి స్క్రీన్‌ప్లే వరకు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఎన్నో చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అన్ని విద్యల్లో ఆరితేరింది శ్రద్ధ.పని పట్టాలెక్కడానికి అట్టే టైమ్ పట్టదు. కాన్సెప్ట్ డిస్కషన్ మీటింగ్ తరువాత పని పరుగులు తీస్తుంది. సాధారణంగా పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్లు ఒక ఫిక్స్డ్ స్టైల్‌కే పరిమితం అవుతారు. అది దాటి బయటికి రావడాన్ని రిస్క్ అనుకుంటారు. అయితే ఎప్పటికప్పుడూ కొత్తగా ఆలోచిస్తూ ‘ఫిక్స్డ్ స్టైల్’ అనేది లేకుండా జాగ్రత్త పడింది శ్రద్ధ. రేడియా జాకీ, డ్యాన్స్ షో హోస్ట్, కమెడియన్, రైటర్, అయిదు లక్షల ఫాలోవర్లు ఉన్న ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్... ఇలా శ్రద్ధా జైన్ సృజనాత్మక రూ΄ాలు ఎన్నో ఉన్నాయి. ‘డాక్టర్ జీ’ సినిమాతో బాలీవుడ్‌లోకి కూడా అడుగు పెట్టింది. ‘నా నటన, రచనలకు సోషల్ మీడియాలో మంచి గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు ద్వారా ఏదైనా సౌత్ ఫిల్మ్‌లో నటించే అవకాశం వస్తుంది అనుకున్నాను. అయితే ఏకంగా బాలీవుడ్ నుంచే పిలుపు రావడం ఆనందంగా అనిపించింది’ అంటున్న శ్రద్ధ పోస్ట్–గ్రాడ్యుయేట్ స్టూడెంట్‌గా నటించింది. ‘పెర్ఫర్మర్, కంటెంట్ క్రియేటర్లకు ఇది మంచి టైమ్. ఏమాత్రం టాలెంట్ ఉన్నా మన స్థాయి ఎక్కడికో వెళ్లిపోతుంది’ అంటుంది -
Poonam Pandey కాంట్రోవర్సీ క్వీన్ పూనమ్ పాండేకు మరో భారీ షాక్
ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండేకు మరో ఎదురు దెబ్బ తగిలింది. గర్భాశయ ముఖద్వార కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు పూనం పాండేను ప్రచార కర్తగా నియమించనుందన్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. సర్వైకల్ కేన్సర్‌పై అవగాహనకు గాను ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా పరిగణించే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. పాండే సర్వైకల్ కేన్సర్‌పై అవగాహనకు సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యే అవకాశం ఉందని, ఈమేరకు చర్చలు జరుగుతున్నాయన్న ఆమె, ఆమె టీం చేస్తున్న ప్రచారం నేపథ్యంలో మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నాయని వర్గాలు స్పష్టత నిచ్చాయి. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి కేన్సర్ రోగులు, వారి బంధువులతో పాటు ఇతరులను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేసిందంటూ కోల్‌కతాకు చెందిన అమిత్ రాయ్ పూనమ్ పాండేకు లీగల్ నోటీసులు పంపారు. చనిపోయానని ప్రకటించడం ఎంతో తీవ్రమైన అంశం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సర్వైకల్ కేన్సర్‌తో బాధపడుతూ నటి పూనం పాండే చనిపోయిందంటూ ఆమె అధికారిక ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు, పలువురిని దిగ్బ్రాంతికి గురి చేసింది. అయితే ఆ మరునాడే తాను బతికే ఉన్నానని, సర్వైకల్ కేన్సర్ ప్రమాదకరంగా మారుతున్న నేపత్యంలో కేవలం దీనిపై అవగాహన కల్పించేందుకే ఈ ప్రకటన అంటూ ఒక వీడియో రిలీజ్ చేయండం వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. -
కచోరీ, జిలేబీ సూపర్: జపాన్ రాయబారి!
భారతదేశంలోని జపాన్ రాయబారి హిరోషి సుజుకి తాజాగా వారణాసిలో స్ట్రీట్‌ఫుడ్ టేస్ట్ చేశారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. కూరగాయలతో చేసిన కచోరీతోపాటు జిలేబీలను ఆయన ఆరగించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో దీనికి సంబంధించిన రెండు క్లిప్‌లను షేర్ చేశారు. వీడియోను పోస్ట్ చేసిన ఆయన.. ‘వారణాసిలో స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదిస్తున్నాను’అని రాశారు. కచోరీ చాలా బాగుందని, జలేబీ మరింత బ్రహ్మాండంగా ఉందంటూ కొనియాడారు. జపాన్ రాయబారికి చెందిన ఈ వీడియో వైరల్ అయ్యింది. జపాన్ రాయబారి వారణాసిని సందర్శించడం ఇదేమీ తొలిసారి కాదు. గత మే నెలలోనూ ఈ నగరాన్ని సందర్శించారు. అప్పుడు గోల్ గప్పా, బాటి చోఖా,బనారసి థాలీ లాంటి పలు వంటకాలను రుచి చూశారు. Enjoying street food in Varanasi! pic.twitter.com/xVmNvcOJuw — Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) December 30, 2023 -
భారతీయ వంటకాలకు జపాన్ అంబాసిడర్ ఫిదా!
భారత వంటకాలను ఇష్టపడే విదేశీయలు ఎందరో ఉన్నారు. ఇప్పుడూ ఆ లిస్ట్‌లోకి జపాన్ వచ్చింది. సాక్షాత్తు జపాన్ అంబాసిడర్ మన భారతీయ వంటకాలను రుచి చుడటమే గాక వాటిని వండిని చెఫ్‌ని కూడా ప్రశంసలతో ముంచెత్తాడు. కచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో మీరు వంటకాలను ప్రదర్శించగలరని కితాబు కూడా ఇచ్చేశాడు. ఇంతకీ ఆయన రుచిన చూసిన వంటకం ఏంటీ? ఆ అదృష్టాన్ని దక్కించుకున్న చెఫ్ ఎవరంటే..? భారత్‌లోని జపాన్ రాయబారి హిరోషి సుజుకి తన సతీమణితో కలిసి ఢిల్లీలోని ప్రముఖ సరోజినీ నగర్ మార్కెట్‌ని సందర్శించారు. అక్కడ ఆలు టిక్కాను ఆస్వాదించినప్పుడూ ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. దీని రుచి జపాన్ రాయబారి హిరోషికి ఎంతగానో నచ్చింది. దీంతో దాన్ని తయారు చేసిన నాగాలాండ్ చెఫ్ జోయెల్ బసుమతారిని పొగడ్తలతో ముంచెత్తాడు. అంతేగాదు అతడి చేతితో తయారు చేసిన భోజనాన్ని కూడా ఆస్వాదించాడు. చాలా రుచికరంగా ఉందని మెచ్చుకోవడమే గాక భవిష్యత్తులో మంచి పాక నిపుణుడిగా పేరొస్తుందని ప్రశంసించారు. అందుకు సంబంధించిన విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. పైగా ఆ చెఫ్‌ని కూడా తన వంటకాల గురించి మాట్లాడమని కూడా చెప్పారు. ఆ చెఫ్ తాను భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈశాన్య వంటకాలను ఎలా ప్రచారం చేయాలనుకుంటున్నారో వివరించారు. మీరు చేసిన ఈశాన్య వంటకాలు చాలా రుచిగా ఉన్నాయి. కచ్చితం మీరు ఈ విషయంలో సక్సెస్ అవుతారని మెచ్చుకున్నారు జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకి . అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది చూడండి. Enjoyed wonderful dinner prepared by Nagaland’s star chef Mr. Joel Basumatari. Chef Joel promotes North Eastern cuisine around the world. Wish him great success in the future !! pic.twitter.com/FLNHWvcoex — Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) December 7, 2023 (చదవండి: 'సైంటిస్ట్‌గా ఓ భార్యగా గెలిచింది'!..భర్త ప్రాణాలను కాపాడిన నవయుగ సావిత్రి ఆమె!)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019