breaking news
Ad - Sakshi_Home_Sticky
-
మహీంద్రా ఫైనాన్స్‌లో రూ. 150 కోట్ల మోసం
న్యూఢిల్లీ: ఆర్థిక సేవల సంస్థ మహీంద్రా ఫైనాన్స్ రుణాల పోర్ట్‌ఫోలియోలో దాదాపు రూ. 150 కోట్ల మోసం బైటపడింది. ఈశాన్య రాష్ట్రాల్లోని ఒక శాఖలో ఇది చోటుచేసుకున్నట్లుగా గుర్తించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో నాలుగో త్రైమాసికం, పూర్తి సంవత్సర ఆర్థిక ఫలితాల వెల్లడిని మే 30కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. బోర్డు సమావేశాన్ని కూడా అదే రోజునకు రీ–షెడ్యూల్ చేసినట్లు వివరించింది. రిటైల్ వాహన రుణాల మంజూరులో కేవైసీ డాక్యుమెంట్లను ఫోర్జరీ చేయడం ద్వారా నిధులను పక్కదారి పట్టించారని గుర్తించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. దీనిపై ప్రస్తుతం విచారణ తుది దశలో ఉన్నట్లు వివరించింది. అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నామని, కొందరు వ్యక్తులను అరెస్టు చేయడం సహా చర్యల అమలు వివిధ దశల్లో ఉందని మహీంద్రా ఫైనాన్స్ పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్ఈలో మంగళవారం 5 శాతం పైగా క్షీణించి రూ. 263.60 వద్ద క్లోజయ్యింది. -
భారీగా తగ్గిన పసిడి ధర
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడం, భారీగా పెరిగిన ధర వద్ద లాభాల స్వీకరణ పసిడి ధరపై తాజాగా ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా దేశంలో బంగారం ధరలు మంగళవారం భారీగా తగ్గాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాములు పూర్తి స్వచ్చత ధర రూ.1,450 తగ్గి రూ.72,200కు దిగివచ్చింది. కేజీ వెండి ధర రూ.2,300 తగ్గి, రూ.83,500కు చేరింది. కాగా ఆర్థిక రాజధాని ముంబైలో 99.9, 99.5 స్వచ్చత ధరలు వరుసగా రూ.1,277, రూ.1,272 తగ్గి రూ.71,598, 71,311కు దిగివచ్చాయి. వెండి కేజీ రూ.1,547 మైనస్‌తో రూ.80,007కు తగ్గింది.కాగా పసిడి ఫ్యూచర్ మార్కెట్లలో సైతం క్రితం ముగింపుతో పోలిస్తే నష్టాల్లో ట్రేడవుతోంది. -
ఇక ‘నిఫ్టీ నెక్ట్స్ 50’ ఫ్యూచర్స్
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సేచంజీ నేటి(బుధవారం) నుంచి ‘నిఫ్టీ నెక్ట్స్ 50’ సూచీ డెరివేటివ్ కాంట్రాక్టులు ప్రవేశపెడుతోంది. మూడు నెలల ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టులను ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంచుతుంది. ప్రతినెలా చివరి శుక్రవారం ఈ కాంట్రాక్టుల గడువు ముగుస్తుంది. నిఫ్టీ 100లోని నిఫ్టీ 50 కంపెనీలు మినహా మిగితా కంపెనీలన్నీ ఈ సూచీలో ఉంటాయి. ఈ ఏడాది మార్చి 29 నాటికి ఈ సూచీలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.70 లక్షల కోట్లుగా ఉంది. ఎన్ఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువలో ఇది సుమారు 18%గా ఉంది. ఈ కాంట్రాక్టు్టలపై అక్టోబర్ 31 వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జీలు ఉండవని ఎన్ఎస్ఈ పేర్కొంది. మూడో రోజూ సూచీలు ముందుకే... స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్ 90 పాయింట్లు పెరిగి 73,738 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 32 పాయింట్లు బలపడి 22,368 వద్ద నిలిచింది. సూచీలకిది ఇది మూడో రోజూ లాభాల ముగింపు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 411 పాయింట్లు ఎగసి 74,060 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు దూసుకెళ్లి 22,448 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. అయితే అధిక వెయి టేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరులో లాభా ల స్వీకరణ, క్రూడాయిల్ ధరల రికవరీ, విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలతో సూచీల లాభాలు పరిమితమయ్యాయి. టెలికం, రియల్టీ, యుటిలిటీ, కన్జూమర్, కమోడిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించాయి. మెటల్, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫాలోఆన్ఆఫర్(ఎఫ్‌పీఓ) ద్వారా రూ.18వేల కోట్లు సమీకరించడంతో వొడాఫోన్ ఐడియా షేరు 12% పెరిగి రూ.14.39 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 14% ఎగసి రూ.14.42 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
అమ్మకాల్లో షావోమీ ఎలక్ట్రిక్ కార్ సరికొత్త రికార్డ్‌లు
చైనా టెక్ దిగ్గజం షావోమీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కార్లు ఊహించని విధంగా అమ్ముడు పోతున్నట్లు తెలుస్తోంది. షావోమీ గతేడాది ఎస్‌యూ7 (ఎస్‌యూ అంటే స్పీడ్ ఆల్ట్రా) ను ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కారును గత నెల చివరి వారంలో విడుదల చేసింది. టెస్లా, బీవైడీ కార్లను తట్టుకుని నిలబడేందుకు ధర 2,15,900 యువాన్లు (సుమారు రూ.24,90లక్షలు)గా నిర్ణయించింది. ఇప్పుడు ఈ మోడల్ కార్లను విడుదల చేసిన మొదటి నెలలో సుమారు 70వేల ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ లీ జున్ మాట్లాడుతూ.. ఎస్‌యూ 7ను ఈ ఏడాది మొత్తం లక్ష యూనిట్లను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. కాగా షావోమీ ఎస్‌యూ7 సెడాన్ మూడు వేరియంట్ ధరల్లో లభ్యమవుతుంది. స్టాండర్డ్ ధర 215,900 యువాన్లు, హై ఎండ్ ఎస్‌యూ7 ప్రో 245,900 యువాన్లు, ఎస్‌యూ 7 మ్యాక్స్ 299,900 యువాన్లుగా ఉంది. -
దేశంలోనే అత్యుత్తమ కంపెనీ ఇదే.. లింక్డ్ఇన్ నివేదిక
దేశంలో 25 అత్యుత్తమ సంస్థల జాబితాను ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ఇన్ సంస్థ విడుదల చేసింది. అందులో ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ముందువరుసలో నిలిచింది. గత కొద్దికాలంగా టాప్‌లో నిలుస్తున్న టీసీఎస్ సంస్థ ఈసారీ తన సత్తా చాటుకుంది. దాంతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. పనిచేయడానికి ఉద్యోగులకు అత్యంత అనువైన కంపెనీగా లింక్డ్ఇన్ టీసీఎస్‌కు ఈస్థానం కల్పించింది. విదేశీ ఐటీ కంపెనీలైన యాక్సెంచర్, కాగ్నిజెంట్ వరుస స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో టెక్ కంపెనీలే ఉండడంతో వాటి హవా స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారంటే.. ఈ జాబితాను తయారుచేసేందుకు సంస్థ కింది అంశాలను పరిగణలోకి తీసుకుంటోంది. కెరియర్ గ్రోత్ నైపుణ్యాభివృద్ధి సంస్థ స్థిరత్వం అవకాశాలు ఉద్యోగుల సంతృప్తి వైవిధ్యం ఉద్యోగుల విద్యార్హతలు దేశవ్యాప్తంగా కంపెనీ కార్యకలాపాలు టాప్-15 మధ్యశ్రేణి కంపెనీల జాబితానూ లింక్డ్ఇన్ విడుదల చేసింది. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్) సేవలందిస్తున్న లెంత్రా.ఏఐ సంస్థ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. మేక్మైట్రిప్, నైకా, డ్రీమ్11 సంస్థలూ ఈ లిస్టులో ఉన్నాయి. ఇదీ చదవండి: యాపిల్‌కు ఆదాయం సమకూర్చడంలో భారత్ టాప్ లింక్డ్ఇన్ జాబితాలోని టాప్-25 సంస్థలు టీసీఎస్ యాక్సెంచర్ కాగ్నిజెంట్ మాక్వెరీ గ్రూప్ మోర్గాన్ స్టాన్లీ డెలాయిట్ ఎండ్రెస్ప్లస్ హోసర్ గ్రూప్ బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్ జేపీమోర్గాన్ చేజ్అండ్కో పెప్సీకో డీపీ వరల్డ్ హెచ్‌సీఎల్ టెక్ ఈవై ష్నైడర్ ఎలక్ట్రిక్ అమెజాన్ కాంటినెంటల్ మాస్టర్‌కార్డ్ ఇంటెల్ కార్పొరేషన్ ఐసీఐసీఐ బ్యాంక్ మిషెలిన్ ఫోర్టివ్ వెల్స్ ఫార్గో గోల్డ్‌మన్ సాక్స్ నోవో నోర్డిస్క్ వియాట్రిస్
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019