Sakshi News home page

యువకుడికి అరుదైన డీప్‌ బ్రెయిన్‌ శస్త్రచికిత్స

Published Tue, Apr 23 2024 8:35 AM

-

సాక్షి, చైన్నె: ప్రొగ్రసివ్‌ మయోక్లోనస్‌ ఎపిలెప్సీతో బాధ పడుతున్న 23 ఏళ్ల యువకుడికి అరుదైన డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ శస్త్ర చికిత్సను గ్లెనెగల్స్‌ హెల్త్‌ సిటీ వైద్యులు విజయవంతం చేశారు. రెండు చిన్న రంధ్రాల ద్వారా మెదడులో ఎలక్ట్రోడ్‌లను అమర్చా రు. ఈ శస్త్ర చికిత్స గురించి సోమవారం గ్లెనెగల్స్‌ న్యూరాలజీ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ ఎంటర్‌ ఫర్‌ ఎపిలెప్సీ డైరెక్టర్‌ డాక్టర్‌ దినేష్‌నాయక్‌ వివరించారు. పది సంవత్సరాల వయస్సు నుంచి నాగ్‌పూర్‌కు చెందిన యువకుడు(23) అరుదైన మూర్చ వ్యాధి లక్షణాలతో బాధ పడుతూ వచ్చాడని పేర్కొన్నారు. హఠాత్తుగా కింద పడి పోవడం, మాట రాక పోవడం, స్పృహ తప్పడం వంటి లక్షణాలు ఇతడిలో క్రమంగా పెరిగాయన్నారు. కొంతకాలం స్వస్థలంలోనే చికిత్స పొందినా, ఆకస్మాత్తుగా పరిస్థితి దయనీ యంగా మారడంతో హెల్త్‌ సిటీలో చేర్చినట్టు తెలిపారు. అన్ని రకాల పరిశోధనలతో అరుదైన డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ (డీబీఎస్‌) శస్త్ర చికిత్స నిర్వహణకు చర్యలు తీసుకున్నామని వివరించారు. న్యూ రో సర్జన్‌ హెడ్‌ డాక్టర్‌ నిగెల్‌ సిమ్స్‌, అనస్తీషియా డాక్టర్‌ రమణన్‌ తదితర వైద్య బృందం సహకారంతో 8 గంటలు శ్రమించి రెండు దశల్లో శస్త్రచికిత్సను విజయవంతం చేశామన్నారు. మెదడులోని నిర్ధిష్ట కేంద్రంలోకి ఎలక్ట్రోడ్‌లను అమర్చినట్టు వివరించా రు. ప్రస్తుతం యువకుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు, తన రోజు వారి పనులన్నీ తానే చేసుకుంటున్నట్టు చెప్పారు. సమావేశంలో హెల్త్‌ సిటీ సీఈఓ డాక్టర్‌ నగేష్‌ కే రావు పాల్గొన్నారు.

Advertisement

adsolute_video_ad

homepage_300x250