Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

సరదాగా కాసేపు..

Published Thu, Apr 18 2024 10:35 AM

మెదక్‌ పట్టణంలోని స్విమ్మింగ్‌ ఫూల్‌లో ఈత కొడుతున్న పిల్లలు - Sakshi

● స్విమ్మింగ్‌పై పెరుగుతున్న ఆసక్తి ● ఉత్సాహం చూపుతున్న విద్యార్థులు

మెదక్‌జోన్‌: స్విమ్మింగ్‌ నేర్చుకోవడంపై యువతతోపాటు బాల, బాలికలు ఆసక్తి చూపుతున్నారు. ఈత శరీరానికి మంచి ఎక్సర్‌ సైజ్‌తోపాటు ప్రమాదవశాత్తు నీటిలో మునిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయట పడటానికి ఉపయోగ పడుతుంది. ప్రస్తుతం ఎండలు ఎక్కు వగా కొడుతుండటంతో చిన్నా, పెద్దా తేడాలేకుండా ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. పట్టణంలోని గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్‌ ఫూల్‌లో బాల, బాలికలు ఈత నేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఒక్కో వ్యక్తికి నెలకు రూ.3 వేల ఫీజు చెల్లిస్తే తమ కోచ్‌ ఈత నేర్పిస్తాడని నిర్వాహకుడు చెబుతున్నాడు.

అందరూ నేర్చుకోవాలి

బాల, బాలికలందరికీ తల్లిదండ్రులు ఈత నేర్పించాలి. నాకు ఇద్దరు పిల్లలు వారికి ఈత నేర్పించేందుకు స్విమ్మింగ్‌ ఫూల్‌కు తీసుకొస్తున్నాను. ఈత వచ్చిందంటే నీటి ప్రమాదం నుంచి సునాయాసనంగా తప్పించుకోవచ్చు. – మహీందర్‌,

డిప్యూటీ తహసీల్దార్‌, చిన్నశంకరంపేట

స్విమ్మింగ్‌ ఎంతో ఇష్టం..

నాకు స్విమ్మింగ్‌ అంటే ఎంతో ఇష్టం. ఈత నేర్చుకుంటే భవిష్యత్‌లో ఎంతో ఉపయోగ పడుతుందని మమ్మీ, డాడీలు తరుచూ చెబుతుంటారు. దీని వల్ల శరీరానికి మంచి ఎక్సర్‌ సైజ్‌ సైతం లభిస్తోంది.

– నిఖిల్‌, విద్యార్థి

1/2

2/2

Advertisement

Copy Button

 

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250