Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

డోర్‌ నంబర్లూ డొల్లే !

Published Thu, Apr 18 2024 10:55 AM

షాద్‌నగర్‌: శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌  - Sakshi

ఒకే కుటుంబం.. కేంద్రాలు అనేకం!

సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లున్న చిత్రాలు తెలుసు. ఇది ఎలా సాధ్యం ? అంటే ఇష్టానుసారం డోర్‌ నంబర్లతో ఓటరు జాబితాలో పేరు చేరిపోవడం ఒక కారణం. ఒక ప్రాంతంలోని వారందరూ ఓటరుగా నమోదయ్యేటప్పుడు తమ సమీపంలోని వారు ఇచ్చిన డోర్‌ నంబర్‌తోనే తమ పేర్లు కూడా నమోదు చేసుకున్న వారున్నారు. ఒక పెద్ద భవనంలోని అద్దెదారులందరూ కూడా ఒకే డోర్‌నంబర్‌తో ఓటర్లుగా నమోదైన వారున్నారు. అంతే కాదు ఇంకొందరైతే జీహెచ్‌ఎంసీ కేటాయించిన ఇంటినెంబరు కాకుండా తమ ఇష్టానుసారం డోర్‌ నంబర్లను వేసిన వారున్నారు. ఒక ఇంటినంబరుకే అదనంగా చివరన ఎ,బి,సిలు చేర్చడమో లేక బై నంబర్లు వేయడమో చేసి ఆ ఇంటి నంబరుతోనే ఓటరుగా నమోదయ్యారు. సంబంధిత అధికార యంత్రాంగం సైతం ఆన్‌లైన్‌లోనమోదు చేసుకున్నప్పటికీ, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం కూడా ఇందుకు కారణమనే ఆరోపణలున్నాయి. ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు సిద్ధమైన యంత్రాంగం గత రెండేళ్లుగా 2022 మార్చి నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు 1,81,405 మంది ఓటర్లు ఇలాంటి ఇంటినంబర్లతో ఓటర్లుగా ఉన్నట్లు గుర్తించారు.వారిని స్టాండర్డ్‌ ఇంటినంబర్లలో లేనివారుగా పేర్కొంటున్నారు. అలాంటి వారిని గుర్తించి సరిచేసినట్లు పేర్కొన్నారు.

సాక్షి, సిటీబ్యూరో: ముషీరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన ఓ కుటుంబంలో భార్యాభర్తలతో పాటు వారిద్దరి పిల్లలకు ఓటు హక్కు ఉంది. అందరి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటేసేందుకు అందరూ కలిసి వెళ్లవచ్చులే అనుకున్నారు.అందరూ ఒకేసారి వెళ్లి, రావచ్చుననుకున్నారు. అందుకు ఒక ఆటోలో వెళ్తే సరిపోతుంది అనుకుంది ఆ మధ్య తరగతి కుటుంబం. ఇంటింటికి వచ్చి ఇచ్చిన పోల్‌ స్లిప్‌ చూస్తే కుటుంబంలోని భర్తకు ఒక పోలింగ్‌ కేంద్రం, భార్యకు మరో పోలింగ్‌ కేంద్రంలో ఓటు ఉన్నట్లు గుర్తించారు. పిల్లలిద్దరికీ ఒకే లొకేషన్‌ రావడం కొంతలో కొంత నయం. లొకేషన్‌ ఒకటే అయినా వారి పోలింగ్‌ కేంద్రాలు కూడా వేరే. దీంతో పిల్లలిద్దరు మాత్రం పోలింగ్‌ బూత్‌దాకా వెళ్లి ఓటేసినా.. భార్యాభర్తలకు చెరో చోట రావడంతో వారు వెళ్లలేదు.ఒక్కొక్కరు ఒక్కో వాహనం సమకూర్చుకోలేకపోవడంతోపాటు కలిసి వెళ్లలేక పోతున్నామనే తలంపుతోనూ వారు ఓటేసేందుకు ఉత్సాహం చూపలేదు. ఇది ఒక్క నియోజకవర్గంలోని ఒక్క కుటుంబం పరిస్థితి మాత్రమే కాదు. ఇలా ఒకే కుటుంబంలోని సభ్యులకు వేర్వేరు ప్రాంతాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు ఉంటోంది. నగరంలో పోలింగ్‌ శాతం తగ్గడానికి ఇదీ ఓ కారణం. ఇలా ఎందుకవుతుందో అంతుపట్టలేదు. పోలింగ్‌ శాతం తగ్గేందుకు ఇదీ ఓ కారణంగా గుర్తించిన జిల్లా ఎన్నికల యంత్రాంగం ఈ పరిస్థితిని చక్కదిద్దే చర్యలకు ఉపక్రమించింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 మే నుంచి నవంబర్‌ మధ్య ఇలా ఒకే కుటుంబానికి చెందినప్పటికీ వేర్వేరు పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న 3,60,849 మంది ఓటర్లను కుటుంబమంతటికీ ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఓట్లుండే చర్యలు చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైతం ఈ ప్రక్రియను కొనసాగించింది. 2024 మార్చి నెలాఖరు వరకు అలా 17,864 మంది ఒకే కుటుంబ ఓటర్లకు ఒకే పోలింగ్‌ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంది. వెరసి మొత్తం 3,78,713 మంది ఓటర్లకు ఒక కుటుంబంలోని వారు ఒకే చోట ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు.

నగర ఓటరు జాబితాలో వింతలెన్నో

రెండేళ్లుగా సరిదిద్దుతున్న యంత్రాంగం

నగరంలో వింత పరిస్థితి

పోలింగ్‌ శాతం తగ్గుదలకు ఇదీ ఓ కారణం

1/2

2/2

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250