Sakshi News home page

ఇసుక తరలిస్తున్న వాహనాలు సీజ్‌

Published Tue, May 7 2024 11:45 AM

ఇసుక

బరంపురం: యథేచ్ఛగా ఇసుక, కంకర అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాలపై పోలీసులు దాడులు జరిపి 10 వాహనాలను సీజ్‌ చేయడంతో పాటు 11 మందిని అరెస్టు చేసినట్లు టౌన్‌ ఎస్డీపీవో జయంత్‌ కుమార్‌ మహాపాత్రో గురువారం తెలిపారు. సదర్‌ పోలీసుస్టేషన్‌ పరిధి కుకుడాఖండి బ్లాక్‌లోని శంకర్‌ ఐ ఆస్పత్రి జంక్షన్‌ దగ్గర వాహనాలను సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా అక్రమంగా రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

మజ్జిగ పంపిణీ

రాయగడ: అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్‌ రాయగడ శాఖ ఆధ్వర్యంలో స్థానిక రింగ్‌రోడ్డు వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆ కౌన్సిల్‌కు చెందిన లీనా సేనాపతి ఆధ్వర్యంలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో బాటసారులు మజ్జిగ సేవించి కాస్తంత ఉపశమనం పొందారు. ఇటువంటి తరహా కార్యక్రమాలను ఇకపై తరచూ నిర్వహిస్తామని సేనాపతి పేర్కొన్నారు.

చోరీ కేసు నిందితుడు అరెస్టు

రాయగడ: చోరీ కేసు నిందితుడిని జిల్లాలోని అంబొదల పోలీసులు గురువారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అరైస్టెన వ్యక్తి బిసంకటక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి బారిగుడ గ్రామానికి చెందిన రితిక్‌ టకిరిగా గుర్తించారు. అతని వద్ద నుంచి రూ.25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బారిగుడ గ్రామంలో నివాసముంటున్న భీమా బాగ్‌ అనే వ్యక్తి ఇంట్లో ఏప్రిల్‌ 28వ తేదీన చోరీ జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి రూ.30,500 నగదును తన బంధువు అయిన, రితిక్‌ టకిరి అనే వ్యక్తి దొంగిలించుకుపోయాడని బాధితుడు అంబొదల పోలీస్‌స్టేషన్‌లో 30వ తేదీన ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు చేసి, నిందితుడిని పట్టుకున్నారు.

భారీగా గంజాయి సీజ్‌

బరంపురం: నగరానికి అక్రమంగా రవాణా చేస్తున్న రూ.85 లక్షలు విలువ చేసే గంజాయిని బరంపురం ఎకై ్సజ్‌ అధికారులు పట్టుకున్న ఘటన జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎకై ్సజ్‌ అధికారి తపన్‌ కుమార్‌ నాయక్‌ తెలిపిన వివరాల మేరకు.. కొందమాల్‌ జిల్లా దరింగబడి నుంచి బరంపురం నగరానికి కారు, ట్రక్కు, రెండు ద్విచక్ర వాహనాల్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీనిలో భాగంగా రూ.85 లక్షలు స్వాధీనం చేసుకొని, ముగ్గురిని అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు.

బీజేడీ అభ్యర్థుల తుది జాబితా విడుదల

భువనేశ్వర్‌: రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను బిజూ జనతా దళ్‌ (బీజేడీ) గురువారం విడుదల చేసింది. ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌ మూడు ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో ఖండపడ, నీలగిరి, కొరేయ్‌ శాసన సభ స్థానాలు ఉన్నాయి. ఈ సందర్భంగా దేవ్‌గడ్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రకటించిన అభ్యర్థిని మార్చినట్లు పేర్కొన్నారు. ఖండపడ అసెంబ్లీ స్థానానికి సాబిత్రి ప్రధాన్‌ ఖరారు చేయగా నీలగిరి స్థానంలో సుకాంత నాయక్‌, కొరెయిలో బీజేడీ అభ్యర్థిగా సంధ్యారాణి దాస్‌ పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సంధ్యారాణి దాస్‌ బీజేడీ సంస్థాగత కార్యదర్శి, సంబల్‌పూర్‌ లోక్‌సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రణబ్‌ ప్రకాష్‌ దాస్‌ తల్లి కావడం విశేషం. దేవ్‌గడ్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి బీజేడీ అభ్యర్థిగా అరుంధతీ దేవి స్థానంలో రోమాంచ్‌ రంజన్‌ బిస్వాల్‌ను బరిలోకి దింపుతున్నట్లు తుది జాబితాలో స్పష్టం చేశారు.

ఇసుక తరలిస్తున్న వాహనాలు సీజ్‌
1/3

ఇసుక తరలిస్తున్న వాహనాలు సీజ్‌

ఇసుక తరలిస్తున్న వాహనాలు సీజ్‌
2/3

ఇసుక తరలిస్తున్న వాహనాలు సీజ్‌

ఇసుక తరలిస్తున్న వాహనాలు సీజ్‌
3/3

ఇసుక తరలిస్తున్న వాహనాలు సీజ్‌

Advertisement

homepage_300x250