Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

నందన్‌కానన్‌ జూలో తెల్లపులి మృతి

Published Sat, Apr 20 2024 1:15 AM

స్వాధీనం చేసుకున్న డంప్‌లోని సామగ్రితో బీఎస్‌ఎఫ్‌ అధికారులు - Sakshi

భువనేశ్వర్‌: నగర శివారులోని బారంగ్‌ నందన్‌కానన్‌ జూలాజికల్‌ పార్క్‌లో 14 ఏళ్ల తెల్లపులి ‘స్నేహ’ శుక్రవారం జూలో చికిత్స పొందుతూ మరణించింది. గురువారం అస్వస్థతకు గురవ్వడంతో సత్వర చికిత్స ప్రారంభించారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న తరుణంలో తీవ్రమైన వడగాలుల కారణంగా ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. స్నేహ 2010 మార్చి 1న జన్మించింది. 14 ఏళ్ల జీవిత కాలంలో 3 ఈతల్లో 9 పిల్లల తల్లిగా జూలో పులుల సంతతి వృద్ధికి తోడ్పడింది. వీటిలో 3 తెలుపు, 4 సాధారణ, 2 మెలనిస్టిక్‌ వన్నెల పులులు ఉండడం విశేషం. 2022 అక్టోబర్‌లో 11 ఏళ్ల తెల్లపులి బిజయ మృతి చెందింది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు గురై ఇది మరణించింది. అంతకుముందు 2019 అక్టోబర్‌లో కాలేయ సంబంధిత అనారోగ్యంతో సుభ్రాంశు అనే ఐదేళ్ల తెల్ల మగ పులి కూడా మరణించింది. నందన్‌కానన్‌ అధికారిక వనరుల సమాచారం ప్రకారం ప్రస్తుతం జూలో 27 పులులు ఉన్నాయి. వీటిలో సాధారణ పులులతో 7 తెలుపు మరియు 3 మెలనిస్టిక్‌ పులులు ఉన్నాయి.

మావో డంప్‌ స్వాధీనం

మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి బోడిగేట్ట అడవిలో కూంబింగ్‌ నిర్వహించిన కోబ్రా, బీఎస్‌ఎఫ్‌ జవాన్లు మావోలు అమర్చిన భారీ డంప్‌ను వెలికితీశారు. వివరాల్లోకి వెళ్తే.. బేజాంగ్‌వాడ అడవిలో మావోల డంప్‌లు ఉన్నట్లు ఇంటలిజెన్స్‌ వర్గాల ద్వారా జిల్లా ఎస్పీ నితీష్‌ వాద్వానికి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో కోబ్రా, బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ముమ్మరంగా గురువారం సాయంత్రం నుంచి కూంబింగ్‌ నిర్వహించారు. దీనిలో భాగంగా ఎలక్కనూర్‌ గ్రామం వద్ద డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. డంప్‌లో ఒక ఐఈడీ టిఫిన్‌ బాక్స్‌ బాంబ్‌, ఆరు గన్‌లు, 36 హైడ్‌ గ్రానేట్స్‌, రెండు సోలార్‌ ఎల్‌క్ట్రికల్‌ ప్యానెల్స్‌, ఒక గ్యాస్‌ సిలిండర్‌, 20 మీటర్ల కరెంట్‌ వైరు ఉన్నట్లు వెల్లడించారు. డంప్‌ స్వాధీనం చేసుకున్న జవాన్లను అధికారులు అభినందించారు.

నలుగురు దోపిడీ దొంగలు అరెస్టు

బరంపురం: నగర శివారులోని శ్రీక్షేత్ర విహార్‌ పక్కన పడియాలో దోపిడీకి సిద్ధమవుతున్న ముఠాని పోలీసులు అరెస్టు చేశారు. ఐఐసీ అధికారి గోపినాథ్‌ ప్రధాన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం అర్థరాత్రి పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో నిమ్మఖండి పోలీసుస్టేషన్‌ పరిధిలో అర్థరాత్రి దోపిడీకి సిద్ధమవుతున్న ముఠా పోలీసుల కంటపడింది. దీంతో పోలీసులు వీరిని వెంబడించి చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేశారు. అరైస్టెనవారిలో గంజాం జిల్లాలోని గంగపూర్‌ గ్రామానికి చెందిన తపన్‌ సాహు, పద్మపూర్‌ గ్రామానికి చెందిన నిమోయ్‌ చరణ్‌ నాయక్‌, తెంతులిఖండి గ్రామానికి చెందిన దేబనంద గౌడ, అస్కాకి చెందిన కె.సుర్యారావులు ఉన్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి 2 బైక్‌లు, తుపాకీ, 5 గుండ్లు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశారు.

బీజేడీలోకి చేరికలు

పర్లాకిమిడి: గుమ్మా సమితి సభ్యులు బర్నింగ్‌ గొమాంగో, గుసాని సమితిలో ఎం.ఎస్‌.పూర్‌ పోలాకి విష్ణుప్రసాద్‌లు శుక్రవారం బీజేడీలో చేరారు. స్థానిక బీజేడీ పార్టీ కార్యాలయంలో మిశ్రణ్‌ పర్వ్‌ శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కెంగం సూర్యారావు కాంగ్రెస్‌ నుంచి బీజేడీలో చేరిన బర్నింగ్‌ గొమాంగో, విష్ణుప్రసాద్‌లను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బీజేడీ పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళ్లినవారు పార్టీ ఽద్రోహులని బీజేడీ ఛత్ర విభాగం అధ్యక్షుడు సుర్జిత్‌ త్రిపాఠి అన్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు
1/2

పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు

పార్టీలో చేరినవారిని ఆహ్వానిస్తున్న సూర్యారావు
2/2

పార్టీలో చేరినవారిని ఆహ్వానిస్తున్న సూర్యారావు

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250