Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ఎన్నికల ‘కురుక్షేత్రం’.. మూటలు మోసిన కుబేరుడు!

Published Thu, Apr 18 2024 2:38 PM

Naveen Jindal richest man loading wheat bags video - Sakshi

Naveen Jindal: ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్‌డీఏ, ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులను ఆకట్టుకోవడానికి రకరకాల ఫీట్లు చేస్తున్నారు. 

హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అపర కుబేరుడు, జిందాల్ స్టీల్స్ ఛైర్మన్ నవీన్ జిందాల్ పోటీ చేస్తున్నారు. మొన్నటి వరకు ఆయన కాంగ్రెస్‌లో కొనసాగారారు. 2004, 2009 ఎన్నికల్లో కురుక్షేత్ర నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు.

కొద్దిరోజుల కిందటే కాషాయ కండువా కప్పుకొన్న నవీన్‌ జిందాల్‌ అదే కురుక్షేత్ర నుంచి బీజేపీ టికెట్‌తో రంగంలో దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నవీన్ జిందాల్.. స్థానిక మార్కెట్ యార్డులో మూటలు మోయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 50 కేజీల గోధుమ మూటను ఎత్తుకుని లారీలోకి లోడ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే స్వయంగా తన ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతాలో షేర్‌ చేశారు.

హర్యానాలోని మొత్తం 10 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు కూడా ఆరో విడతలో అంటే మే 25వ తేదీన పోలింగ్ జరగనుంది. 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయడానికి అటు ఎన్‌డీఏ, ఇటు ప్రతిపక్ష కూటమి పట్టుదలతో ఉన్నాయి. దీనికి అనుగుణంగా ప్రచార వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి.

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250