Sakshi News home page

Lok sabha elections 2024: సార్వత్రిక ఎన్నికలు.. తొలిరోజు ప్రముఖుల నామినేషన్లు

Published Thu, Apr 18 2024 7:36 AM

Lok sabha elections 2024: Nominations For 4th Phase Updates - Sakshi

Upadates

  • తెలంగాణలో మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి భాజపా తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నామినేషన్‌ వేశారు.
  • నల్గొండ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.
  • భువనగిరి స్థానానికి ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను ఆర్వోకు అందజేశారు. 

సంగారెడ్డి

  • జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ మొదటి సెట్ నామినేషన్
  • సురేష్ షెట్కార్ తరపున నామినేషన్ వేసిన కాంగ్రెస్ నాయకులు
  • ఈ నెల 24న సురేష్ షెట్కార్ నామినేషన్ కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ:
డీకే అరుణ నామినేషన్‌ దాఖలు

  • భారతీయ జనతా పార్టీ తరఫున నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన డీకే అరుణ
  • కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి

మహారాష్ట్ర
నామినేషన్ సమర్పించిన సుప్రియా సూలే

  • ఎన్సీపీ (శరద​ చంద్ర పవార్‌) పార్టీ సిట్టింగ్‌ ఎంపీ సుప్రియా సూలే నామినేషన్‌ దాఖలు చేశారు
  • బారామతి స్థానంలో పోటీలో ఉన్నారు

తెలంగాణ
నల్లగొండ లోక్ సభ స్థానంలో తొలి నామినేషన్ దాఖలు

  • ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసిన మాజీ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్
  • బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తరపున తొలి సెట్టు నామినేషన్ సమర్పించిన పార్టీ నేతలు

తెలంగాణ
కాసేపట్లో ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ

  • నేడు తెలంగాణ బీజేపీ అభ్యర్థులు ఈటల రాజేందర్‌, డీకే అరుణ, రఘునందన్‌ రావు  నామినేషన్‌ వేయనున్నారు

నాలుగో విడత లోక్ సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల

  • ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ
  • ఏపీ, తెలంగాణ సహ పది రాష్ట్రాలలో  96 ఎంపీ సీట్లకు నాలుగో విడతలో ఎన్నికలు
  • ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ 
  • ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ 
  • ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన 
  • ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం 
  • మే 13న పోలింగ్
  • నాలుగో విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశి్చమబెంగాల్, బిహార్,  జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి
  • తెలంగాణలోని 17, ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి.

సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విడత ఎన్నికల ప్రక్రియకు రంగం సిద్ధం అయ్యింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలోని 10 రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్‌ జరుగనుంది. గురువారం ఉదయం నాలుగో విడత ఎన్నికల ప్రక్రియకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయిన తర్వాత ఈ విడతకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ 96 లోక్‌సభ స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యే అభ్యర్థులకు ఏప్రిల్‌ 25 వరకు నామినేషన్లు దాఖలు చేసుకొనేందుకు అవకాశం కలి్పంచారు.

10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ఏప్రిల్‌ 26 న జరుగనుంది. అనంతరం ఏప్రిల్‌ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. కాగా నాలుగో విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్,  జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలోని 17, ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, ఒడిషాలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగో విడతలో పోలింగ్‌ జరుగనుంది.

homepage_300x250