Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

రేపే ఎన్నికలు.. సిద్ధంగా హెలికాప్టర్లు! ఎందుకంటే..

Published Thu, Apr 18 2024 1:49 PM

Helicopters arranged for Lok Sabha polls in Uttarakhand - Sakshi

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ఏప్రిల్ 19న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు రాష్ట్ర అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ విజయ్ కుమార్ జోగ్దండే ఎన్నికలకు సన్నద్ధత గురించిన సమాచారాన్ని అందించారు.

ఉత్తరాఖండ్‌లోని మొత్తం ఐదు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. అత్యవసర సేవ కోసం రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేశామని, ఈసారి ఓటింగ్ ప్రమాద రహితంగా ఉంటుందని, ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తదని ఉత్తరాఖండ్ అదనపు ఎన్నికల అధికారి జోగ్దండే తెలిపారు.  

"అన్ని పోలింగ్ బృందాలు బయలుదేరుతున్నాయి. వారి అత్యవసర సేవ కోసం రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేశాం. ఒక హెలికాప్టర్ గర్వాల్‌లో, మరొకటి కుమావోన్‌లో మోహరిస్తాం. వీటిని అత్యవసర అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తాం.  బూత్ స్థాయిలో సహాయ నిర్వహణలో భాగంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు,  అంబులెన్స్‌ల నంబర్‌లను అందుబాటులో ఉంచాం" అని ఆయన పేర్కొన్నారు. 

కొండ ప్రాంతంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 11వేలకు పైగా పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా 2014, 2019 సార్వత్రిక ఎన్నికలలో వరుసగా రెండుసార్లు మొత్తం ఐదు స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు మరోసారి క్లీన్‌స్వీప్‌ చేసి హ్యాట్రిక్‌ కొట్టాలని ఉత్సాహంగా ఉంది.

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250