Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

ఫిష్‌ మాసాలాలో పురుగుమందులు? సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ సీరియస్‌ 

Published Fri, Apr 19 2024 12:16 PM

Singapore Recalls Everest Fish Curry Masala Alleges Presence Of Pesticide - Sakshi

ఎవరెస్ట్ బ్రాండ్ పేరుతో  అనేక రకాల మసాలాలు, సుగంధ ద్రవ్యాలు మిశ్రమాలను విక్రయించే ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న కంపెనీ ఫిష్ కర్రీ మసాలాలో పరిమితికి మించి పురుగుమందులు  ఉన్నట్లు గుర్తించింది సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ. దీంతో షిష్‌ మసాలా ప్యాకెట్లను  రీకాల్ చేయాలని ఆదేశించింది. ఈమేరకు నిన్న (ఏప్రిల్ 18న) ఒక ప్రకటన విడుదల చేసింది.

హాంకాంగ్‌లోని సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ రీకాల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మానవ వినియోగానికి పనికిరాని స్థాయిలో పురుగుమందు ఇథిలీన్ ఆక్సైడ్ అవశేషాలను ఉన్నట్లు గుర్తించినట్టు ఏజెన్సీ పేర్కొంది. “ఇంప్లికేట్ చేయబడిన ఉత్పత్తులు సింగపూర్‌లోకి దిగుమతి అయినందున, సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ (SFA) ఉత్పత్తులను రీకాల్ చేయమని దిగుమతిదారు, ముత్తయ్య & సన్స్‌ని ఆదేశించింది.

విషాదం: స్కాట్లాండ్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం)

వ్యవసాయ ఉత్పత్తులో ఇథిలీన్ ఆక్సైడ్ వినియోగం, ఆహారంలో పురుగుమందు అనుమతి లేదని ఫుడ్ ఏజెన్సీ తెలిపింది. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించింది. ఇది వినియోగదారుల ఆరోగ్యానికి ప్రమాదమని ఎస్‌ఎఫ్‌ఏ పేర్కొంది.

ఈ మసాలా ఉత్పత్తులను వినియోగించి, తమ ఆరోగ్యంపై ఆందోళనలున్నవారు వైద్య సలహాను పొందాలనీ,  ఇతర సమాచారం నిమిత్తం వారి కొనుగోలు కేంద్రాలను సంప్రదించాలని కూడా సూచించింది. ఈ ఉదంతంపై ఎవరెస్ట్ కంపెనీ ఇంకా ఎలాంటి  ప్రకటన విడుదల చేయ లేదు. (యూట్యూబర్‌ ఓవర్‌ యాక్షన్‌.. దిమ్మతిరిగే షాక్‌!)

Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250