Sakshi News home page

ఆగస్టులో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ముగింపు వేడుకలు 

Published Sun, Jul 23 2023 6:19 AM

Closing ceremony of Azadi Ka Amrit Mahotsav in August - Sakshi

 సాక్షి, అమరావతి :  ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ముగింపు వేడుకల్లో భాగంగా ఆగస్టు 9–15 తేదీల మధ్య ‘మేరీ మిట్టి మేరా దేశ్‌’ నినాదంతో దేశవ్యాప్తంగా 2.50 లక్షల గ్రామ పంచాయతీలు, 7,500 బ్లాకులు, 90 వేల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. అదే నెల 29, 30 తేదీల్లో ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ముగింపు వేడుకల గ్రాండ్‌ ఫినాలే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. వీటి నిర్వహణ, ఏర్పాట్లపై శనివారం ఆయన రాష్ట్రాల సీఎస్‌లతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలకులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఏపీ తరఫున జవహర్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

కీలక అంశాలపై కార్యక్రమాలు.. 

  • ఆయా గ్రామాలు, పట్టణాల నుంచి దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమరయోధులు, రక్షణ దళాల విశ్రాంత సిబ్బంది, కేంద్ర ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసు, రాష్ట్ర పోలీసు దళాలకు చెందిన వారికి  సంఘీభావాన్ని తెలియజేయాలి. 
  • వివిధ తాగునీటి వనరుల వద్ద శిలాఫలకాలను ఏర్పాటుచేయాలి. జాతీయ జెండా  ఆవిష్కరణ, జాతీయ గీతాలాపన చేయాలి. 
  • ప్రతి పంచాయతీలో వసుధ వందన్‌ కింద కనీసం 75 మొక్కలను నాటాలి.  
  • అలాగే, వీరన్‌ కా వందన్‌ కింద స్వాతంత్య్ర సమరయోధులు, అమర వీర సైనిక కుటుంబాలకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించాలి.  

Advertisement

homepage_300x250