breaking news
-
యోగాసనాలతో మెస్మరైజ్ చేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ను చూశారా?
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ యోగాతో అదరగొడుతోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ , యోగా వర్కౌట్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. సండే యోగా అంటూ క్లిష్టమైన కరీనా డైనమిక్ యోగా చక్రాసనం ఫోటోను ఇస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అంతకుముందు ఫిట్నెస్ ట్రైనర్ నమ్రతా పురోహిత్ కరీనా ఆసనాల ఫోటోలు సోషల్‌మీడియాలోపోస్ట్ చేసింది.దీన్ని విరాభద్రసనా II అని కూడా పిలుస్తారంటూ ఆమె ఫోటోను షేర్ చేసింది. దీంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ను పెళ్లాడింది. ప్రస్తుతం ఇద్దరు బిడ్డల తల్లి అయిన కరీనా కపూర్ ఖాన్ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా లాక్‌డైన్ సమయంలో నుంచి నిత్యం యోగా సాధన చేస్తూ వర్కౌట్స్ వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తోన్న సంగతి తెలిసిందే View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) -
గడ్డకట్టే చలిలో యూఎన్ అత్యున్నత దౌత్యవేత్త సాహసం..! ఐతే..
చైనాలోని యూఎన్ అత్యున్నత దౌత్యవేత్త సిద్ధార్థ్ ఛటర్జీ చేసిన యోగా నెట్టింట సంచలనం రేపుతుంది. మైనస్ సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలో 'ఓం' కార పఠనంతో బ్రీతింగ్ వ్యాయామాలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకు సంబంధించిన నాలుగు నిమిషాల నిడివి గల వీడియోని ఛటర్జీ "బ్రీతింగ్ ఫర్ గుడ్ హెల్త్" అనే పేరుతో పోస్ట్ చేశారు. ఆయన ఆ వీడియోలో బీజింగ్‌లోని గడ్డకట్టుకుపోయిన సరస్సుపై కూర్చొని శ్వాసకు సంబంధించిన వ్యాయమాలు చేశారు. ఇది శారీరక, మానసికి ఆరోగ్యాన్ని కాపాడే బెస్ట్ వ్యాయామాలని వీడియో ప్రారంభంలోనే చెప్పారు. పొట్టను లోపలకి, బయటకు వదిలేలా లోతైన శ్వాస వ్యాయామాలు 'ఓం' కార పఠనంతో మొదలవ్వుతుందని అన్నారు. మనం ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టేటప్పుడు మొదట పని శ్వాస పీల్చుకోవడం. ఇక ఆఖరి పని దాన్ని విడిచిపెట్టయడమే అని చెప్పారు. ఇర ఆయన ఆ ఎముకలు కొరికే చలిలో పొట్టకు సంబంధించిన బ్రీతింగ్ ఎక్సర్సైజుల తోపాటు శీర్షాసనం వంటివి యోగాసనాలు వేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అంతేగాకుండా ఈ వ్యాయామాల వల్ల కరోనా వంటి మహమ్మారిల నుంచి తట్టుకునేలా రోగనిరోధక శక్తిని అందిస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా, ఆయన 2020లొ చైనాలో యూఎన్ అత్యున్నత దౌత్యవేత్తగా నియమితులైన టైంలో అధిక కొలస్ట్రాల్, బీపీ, అధిక హృదయ స్పందన రేటు, ప్రీ డయాబెటిక్, ఒబెసిటీ వంటి సమస్యలతో బాధపడుతుండేవారు. ఆ తర్వాత ఈ యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజులు, సరైన జీవన శైలితో అనూహ్యంగా 25 కిలోల బరువు తగ్గడం జరిగింది. ఇక భారత్‌కి చెందిన ఛటర్జీ చైనాలోని యూఎన్ కార్యాలయానకి అధిపతిగా నియమించడం అప్పట్లో ఓ సంచలనంగా నిలిచింది. ఎందుకంటే తూర్పు లడఖ్ ప్రతిసష్టంభన, భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతల నడుమ ఆయన నియామకం జరగడమే అందుకు కారణం. కాగా, ఛటర్జీ కుటుంబం బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు వలస వచ్చిన కుటుంబం. చిన్నప్పుడు బాల్యంలో ఆయన పోలియో బాధితుడు. సరైన చికత్స తీసుకుని పోలియో నుంచి పూర్తిగా రికవరయ్యాడు. ఆ తర్వాత 1981లో రెండో ప్రయత్నంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. అక్కడ నుంచి ఆయన ప్లేయర్‌గా, బాక్సర్‌గా మారి ఎన్నో టైటిల్స్ అందుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎలైట్ పారా రెజిమెంటల్‌లో చేరారు. ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లి అక్కడ ఐవీ లీగ్ ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో చేరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత యూఎన్ మిషన్కి నాయకత్వం వహించారు. ఆయన భార్య బాన్ హ్యూన్ హీ భారత్‌లోని యూనిసెఫ్ సామాజిక విధానానికి చీఫ్‌గా ఉన్నారు. ఆయన దౌత్యవేత్తగా తన 24 ఏళ్ల కెరీర్లో కెన్యా, స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఇరాక్, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్ (డార్ఫర్), ఇండోనేషియా, బోస్నియా అండ్ హెర్జెగోవినా చైనా పొరుగు దేశం ఇరాకీ కుర్దిస్తాన్ వంటి దేశాలలో పనిచేశారు. ఛటర్జీ యూఎన్ శాంతి పరిరక్షణ, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP), UNICEF, UN పాపులేషన్ ఫండ్ (UNFPA), రెడ్ క్రాస్ ఉద్యమం, UNOPS,UN భద్రతలలో కూడా పనిచేశారు. తన దౌత్యపరమైన పనుల తోపాటు అనారోగ్యం బారిన పడకుండా ఉండేలా ప్రజలను చైతన్యపరిచేలా..ముఖ్యంగా ఒత్తిడిని తట్టుకుని యాక్టివ్‌గా ఉండేలా చేసే శ్వాస వ్యాయమాలను సాధన చేస్తున్న వీడియోని నెటిజన్లతో పంచుకున్నారు సిద్ధార్థ్ ఛటర్జీ. VIDEO | Siddharth Chatterjee, the head of the #UN in China, is making waves on Chinese social media where he showcased his tough yoga and fitness exploits, including breathing exercises in sub-zero temperatures, which he says helped him to maintain physical and mental… pic.twitter.com/4q5nifvJHC — Press Trust of India (@PTI_News) April 16, 2024 (చదవండి: మొలకలు వచ్చిన ఆలు, కలర్ మారిన ఆకుకూరలు వండేస్తున్నారా..?) -
మెడ పట్టేసిందా?ఈ చిట్కాలు పాలో అవ్వండి!
మెడ ఎందుకు పట్టేస్తుందో, భరించలేని నొప్పి ఎందుకు వస్తుందో ఒక్కోసారి సరిగ్గా గుర్తించలేం. రోజంతా టీవీ చూడటం, ల్యాప్‌టాప్, కంప్యూటర్లు వాడకం, గంటల తరబడి స్మార్ట్ ఫోన్‌ను చూస్తూ ఉండటంవల్లగానీ, వ్యాయామం చేస్తున్నప్పుడు గానీ, రాత్రిపూట నిద్ర పోయేటపుడు భంగిమలో తేడా తదితర కారణాలతో మెడ నొప్పి బాధిస్తుంది. ♦ నిద్ర లేచిన తర్వాత మీకు మెడ నొప్పిగా అనిపిస్తే.. నొప్పి ప్రభావిత ప్రాంతాల్లో ఐస్ ప్యాక్ లేదే చల్లని నీటిలో నింపిన క్లాత్ ను వేసి అద్దాలి. అలా చేయడం వల్ల మెడ కండరాల వాపు తగ్గుతుంది. దీంతోపాటు హీట్ ప్యాక్ ను ఉపయోగించవచ్చు. ఇది కూడా మెడ కండరాల నొప్పిని తగ్గిస్తుంది. ♦ మెడ నొప్పిగా ఉన్న వాళ్లు చేతులతో మెడను నెమ్మదిగా మసాజ్ చేయాలి. అలా చేయడం వల్ల కండరాలు సర్దుకొని నొప్పి తగ్గే అవకాశం ఉంది. ♦ మసాజ్ చేసే సమయంలో కొబ్బరి లేదా నువ్వుల నూనె ఉపయోగిస్తే మేలు జరుగుతోంది. మెడ నొప్పిని నివారించేందుకు మీరు రాత్రిళ్లు బోర్లా పడుకోకుండా ఉంటే చాలు. ♦ కొన్ని రకాల యోగా ద్వారా కూడా మెడనొప్పిని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా క్లాక్ వైజ్,యాంటి క్లాక్‌వైజ్ దిశలో మెడను మెల్లిగా సున్నాలాగా చుడుతూ చేసే వ్యాయామం మంచి ఫలితాలనిస్తుంది. ♦ మొబైల్ ఫోన్ల వల్ల వచ్చే నొప్పిని టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అంటారు. దీనికి ఆక్యుపంక్చర్ థెరపీ ద్వారా ఉపశమనం పొందవచ్చు. చాలా సందర్భాలలో, నొప్పికి కారణం తెలియదు. దానికదే మెల్లిగా నెమ్మదిస్తుంది. కొన్నిసార్లు ఇది వారం లేదా రెండు వారాల్లో తగ్గుతుంది. చిట్కాలతో కూడా మెడనొప్పి తగ్గకుండా వేధిస్తూ ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించాలి. సరైన చికిత్స తీసుకోవాలి. మూడు నెలల కంటే ఎక్కువ కాలంపాటు వేధించే మెడ నొప్పికి అంతర్లీనంగా మరికొన్ని కారణాలు కూడా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
కుండలినీ యోగాతో అల్జీమర్స్‌కు చెక్: తాజా పరిశోధన
యోగాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. ఇది కేవలం శారీరకదృఢత్వానికి మాత్రమే కాదు, మేధాశక్తి, ఆత్మశక్తి పెంపులో కూడా సహాయపడుతుంది. యోగా ప్రయోజనాలపై ఒక ఆసక్తికరమైన అధ్యయనం తాజాగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా కుండలిని యోగాతో మెదడుకు చాలా మంచిదని ఇది వెల్లడించింది. అల్జీమర్స్‌లాంటి భయంకరమైన వ్యాధికి చెక్ చెప్పవచ్చని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ అధ్యయనం ప్రాథమికంగా కనుగొంది. ఆ వివరాలు.. మెనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు, దీర్ఘకాలిక ఆయుర్దాయం, జీన్స్ తదితర కారణాలతో పురుషులతో పోలిస్తే మహిళలకు అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువ. అందుకే అల్జీమర్స్ ముప్పున్న 50 అంతకంటే ఎక్కువ వయస్సున్న 79 మహిళలపై కుండలిని యోగా, జ్ఞాపకశక్తికి సంబంధించి అధ్యయనం చేశారు. వీరంతా జ్ఞాపకశక్తి క్షీణత (మునుపటి సంవత్సరం పనితీరుతో పోలిస్తే), గుండెపోటు చరిత్ర, చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటుకు, గుండెలోని రక్తనాళాల సమస్య, అధిక కొలెస్ట్రాల్ కోసం ప్రస్తుత మందులు తీసుకుంటున్నవారే. 12 వారాల పాటు యోగా శిక్షణ, మెమరీ ట్రైనింగ్ రెండు గ్రూపులుగా వీరిపై పరిశోధన సాగింది. వీరిలో 40 మందికి యోగా, 39 మందికి మెమరీ ట్రైనింగ్ ఇచ్చారు. యోగా టీంలో వారానికి 60 నిమిషాలు చొప్పున 12 వారాలు కుండలిని యోగాను నిష్ణాతుడి ద్వారా వ్యక్తిగతంగా శిక్షణ ఇప్పించారు. 39 మందికి మెమరీ శిక్షణ నిచ్చారు. మెమరీ ట్రైనింగ్‌లో కొన్నిపేర్లను, ముఖాలను గుర్తించుకోవడం, తలుపులు తాళం వేయడం లాంటి రోజవారీ కార్యక్రమాలను గుర్తుంచుకొనే పద్దతులపై శిక్షణనిచ్చారు. తరువాత మరో 24 వారాలు వీరి మెమరీ బేస్‌లైన్ కూడా పరీక్షించారు. అలాగే వారి రక్తంలోని సైటోకిన్లనూ విశ్లేషించారు. రోగ నిరోధక వ్యవస్తలోని కీలకమైన, ప్రోటీన్లు , జన్యు వ్యక్తీకరణలో మార్పులను గమనించారు. అయితే కుండలిని యోగా టీంలో మాత్రమే ఆత్మాశ్రయ జ్ఞాపకశక్తిలో మెరుగుదల ఉందని పరిశోధకులు కనుగొన్నారు. జ్ఞాపకశక్తి శిక్షణతో పోలిస్తే, యోగాద్వారా హిప్పోకాంపస్ వాల్యూమ్‌లో పెరుగుదల గమనించామనీ, ఫంక్షనల్ కనెక్టివిటీ, స్వల్పకాలిక జ్ఞాపకాలను గుర్తుపెట్టుకొని వాటిని మెదడులోని దీర్ఘకాలిక నిల్వకు బదిలీ అనేది బాగా మెరుగుపడిందని గుర్తించారు. ఇంకా కుండలిని యోగా ద్వారా మెరుగైన జ్ఞాపకశక్తి, యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్‌లతో సహా మెదడుకు సంబంధించి అనేక ప్రయోజనాలను గమనించారు. ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో సహాయపడుతుందని తెలిపింది. "ఒత్తిడిని తగ్గించడానికి, మెదడు ఆరోగ్యం, ఆత్మాశ్రయ జ్ఞాపకశక్తి పనితీరును మెరుగు పర్చేందుకు, ఇన్ఫ్లమేషను, న్యూరోప్లాస్టిసిటీని మెరుగుపరచడానికి" యోగా చాలా మంచిదని దీని రచయిత హెలెన్ లావ్రెట్స్కీ చెప్పారు. మెమరీ ట్రైనింగ్‌లో దీర్థకాలిక జ్ఞాపకశక్తిలోనూ మెరుగుదల కనిపించిందట. అయితే కుండలిని యోగాతో అల్జీమర్స్ వ్యాధిని నివారణ, వాయిదా వేయడం లేదా దీర్ఘకాలిక మెరుగుదల కనిపిస్తుందో లేదో నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని వ్యాఖ్యానించారు. కుండలిని యోగ కుండలిని అనేది మానవ శరీరంలో వెన్నుపాములో ఉంటుంది. దీంట్లో దాగివున్న శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకి సహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగ అంటారు. కుండలినీ యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడని యోగ నిపుణులు, గురువులు చెబుతారు. ఇతర యోగాలా కాకుండా,ఇదొక శక్తివంతమైన అభ్యాసం. మనలో నిద్రాణమైన శక్తిని మేల్కొల్పడం, దాని పరివర్తన శక్తిని ఉపయోగించడంపై దృష్టి పెడుతుంది. ఇతర రకాల యోగాల మాదిరిగా కాకుండా, కుండలిని యోగా అనేది శరీరంలోని శక్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని, కుండలిని శక్తి ప్రవాహాన్ని ప్రేరేపించే నిర్దిష్ట భంగిమలను కుండలిని యోగా భంగిమలు అని పిలుస్తారు శ్వాసమీద, ఉచ్ఛరణ, గానం, శారీరక భంగిమలపై దృష్టి పెడుతుంది. -
శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి వయసు 50కి దగ్గర పడ్డ వన్నెతగ్గని సోయగంతో పేరుకు తగ్గట్టు శిల్పంలా ఉంటుంది. అంతేగాక ఆమె మంచి ఫిట్నెస్ ఔత్సాహికురాలు కూడా. ఇక ఫిట్నెస్కి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడూ నెటిజన్లతో షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాల్లో చురుగ్గా ఉంటారు. అలానే ఈసారి కూడా ఫిట్నెస్కి సంబంధించిన ఓ సరికొత్త విషయాన్ని షేర్ చేశారు శిల్పా. ఆమె పలు యోగాసనాలు వేస్తుంటారన్న విషయం తెలిసిందే. ఈ సారి ఆమె సరికొత్త వ్యాయామ భంగిమ, దాని ప్రయోజనాల గురించి చాలా ఆసక్తికర విషయాలను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. రాజస్తాన్ పర్యటనలో ఉన్న ఆమె 'చక్కి చలసానా' భంగిమ విశేషాల గురించి చెప్పుకొచ్చారు. ఏంటీ 'చక్కీ చలసానా' అనుకుంటున్నారా..? అదేనండి తిరగలి తిప్పుతున్నట్లు చేసే ఆసనం. అంతేకాదండోయ్ మన పూర్వకాలం బామ్మలు తిరగలితో బియ్యం, గోధుమలు పిండిగా విసిరేవారు. అలా చేయడం వల్ల వాళ్ల నడుములు, పిక్కలకు మంచి వ్యాయామం చేకూరి ఆరోగ్యంగా ఉండేవారిని నిపుణులు గుర్తించారు. ఆ విషయాన్ని శిల్పాశెట్టి కూడా చెబుతున్నారు. ఆ భంగిమ ప్రయోజనాలు వివరిస్తూ తిరగలి విసిరి మరీ చూపించారు. ఇలా చేస్తే నడుము, తొడలు, పిక్కల వద్ద ఉండే కొవ్వు కరిగి ఎలా ఫిట్‌గా ఉంటారో వెల్లడించారు నటి శిల్పా. ఈ భంగిమని యోగా ఆననాల్లో గ్రైండింగ్ పోజ్ అని పిలుస్తారని అన్నారు. ఈ ఆసనం వేయడం వల్ల శరీరానికి, మనస్సుకి మంచి ప్రయోజనాలను అందిస్తుందని తెలిపారు. ఈ ఆసనాన్ని రెగ్యూలర్‌గా వేస్తే చేకూరే ప్రయోజనాలేంటో సవివరంగా వెల్లడించారు కూడా. అవేంటంటే. బలాన్ని వృద్ధి చేస్తుంది: ఈ చక్కి చలసానా(తిరగిలి తిప్పే ఆసనం) ఉదరకండరాలను బలోపేతం చేయడంలో సహయపడుతుంది. వదులుగా బాన పొట్టలా కానివ్వకుండా కాపాడుతుంది. ఇందులో వృత్తాకార కదలికలో కేవలం మొండెం మాత్రమే కదలడంతో ఉదరం చుట్టూ ఉండే కండరాలు సక్రియం అవుతాయి. దీంతో శరీరాన్ని సరైన విధంగా బ్యాలెన్స్ చేయగలిగే శక్తి ఆటోమెటిక్‌గా వస్తుంది. ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది ఈ యోగా భంగిమలో ఎగువ శరీరం మాత్రమే వృత్తాకార కదలికలో పాల్గొంటుంది కాబట్టి వెన్నెముక, భుజాలు తుంటిల ఆరోగ్యాన్ని బలోపేతం చేసేందుకు మంచి ఉపయుక్తమైన ఆసనం. ఈ ఆసనం క్రమం తప్పకుండా వేయడం వల్ల ఆయా భాగాలు త్వరితగతిన గాయాల బారిన పడకుండా దృఢంగా ఉండేలా చేస్తుంది. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఈ చక్కి చలాసానాలో వృత్తాకార కదలిక కారణంగా ఉదర అవయవాల్లో ముఖ్యంగా జీర్ణ అవయవాలకు మంచి అవసరమైన వ్యాయామం అనే చెప్పాలి. దీంతో ఇది జీర్ణక్రియను ప్రేరేపించి అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. మనసు ఆహ్లదంగా ఉండేలా చేస్తుంది చక్కి చలసానాలో ఏకాగ్రతతో చేసే ఆసనం కాబట్టి మనస్సుపై ప్రభావం ఏర్పడి ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ భంగిమ ధ్యానానికి సంబంధించిన నియంత్రిత శ్వాసపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది. అందువల్ల ఈ ఆసనం వేయడం అనేది మనస్సుకు ప్రశాంతనిచ్చే ధ్యానం చేసినట్లుగా మంచి సత్ఫలితాలనిస్తుంది. ఈ వ్యాయమాన్ని క్రమం తప్పకుండా చేసి మంచి ప్రయోజనాలను పొందడమే కాకుండా ఆరోగ్యంగా ఉండడని చెబుతోంది నటి శిల్పాశెట్టి. ఇంకెందుకు ఆలస్యం ఇన్ని ప్రయోజనాలు ఉన్నా ఆసనాన్ని వెంటనే మొదలు పెట్టేయండి మరీ. (చదవండి: 'గోబీ మంచూరియా'ని ఆ నగరం పూర్తిగా బ్యాన్ చేసిందట! ఎందుకో తెలుసా?)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019