breaking news
-
ప్రపంచంలో తొలి 20 అత్యుత్తమ విమానాశ్రయాలు ఇవే..(ఫొటోలు)
-
పేలిన అగ్ని పర్వతం.. సునామీ ముప్పు?
ఇండోనేషియాలో ఒక అగ్నిపర్వతం పేలడంతో స్థానికుల్లో భయాందోళనలు చెలరేగుతున్నాయి. ఈ పేలుడు దరిమిలా సునామీ ముప్పు పొంచివుంది. పేలుడు కారణంగా అగ్నిపర్వతంలోని కొంత భాగం సముద్రంలో పడిపోనున్నదని, ఫలితంగా 1871లో సంభవించిన మాదిరిగా భారీ సునామీ వచ్చే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఇండోనేషియాలోని రుయాంగ్ అగ్నిపర్వతం గత కొన్ని రోజులుగా యాక్టివ్‌గా ఉంది. బూడిద, పొగను వెదజల్లుతోంది. అగ్నిపర్వతంలోని కొంత భాగం బలహీనంగా మారిందని, అది ఎప్పుడైనా సముద్రంలో పడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది జరిగితే, ఇది భారీ సునామీ సంభవిస్తుందని, ఇది సమీపంలోని తీర ప్రాంతాలలో భారీ విధ్వంసం కలిగించవచ్చని స్థానిక అధికారులు అంటున్నారు. ALERT: Indonesia volcano eruption sparks tsunami fears, alert level raised to highest — Officials worry that part of the volcano could collapse into the sea and cause a tsunami, as happened in 1871. pic.twitter.com/idTYAjuImo — Insider Paper (@TheInsiderPaper) April 17, 2024 సునామీ ముప్పు నేపధ్యంలో తీర ప్రాంతాల్లోని వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. అలాగే బీచ్‌లను సందర్శించడం, సముద్రంలోకి వెళ్లడం లాంటి పనులు చేయకూడదని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థలు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాయి. -
ప్రపంచంలోనే తొలి ఏఐ అందాల పోటీలు!
ఎన్నో రకాల అందాల పోటీలను చూసి ఉంటారు. కానీ ఇలాంటి సాంకేతికతో కూడిన అందాల పోటీలను చూసి ఉండరు. ప్రపచంలోనే తొలిసారిగా ఏఐ అందాల పోటీలు వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్(WAICA) పిలుపునిచ్చింది. ఈ పోటీలో కృత్రిమ మేధస్సుతో రూపొందించిన మోడల్స్ పాల్గొంటారు. కోటి రూపాయల విలువ చేసే ప్రైజ్‌మనీలతో భారీ ఎత్తున ఈ ఏఐ అందాల పోటీలను నిర్వహిస్తోంది WAICA. ఈ ఐఏ మోడల్స్‌ని ప్రేక్షకుల్లో వాటికున్న ఆదరణ, ఫ్లాట్‌ఫామ్‌లో ఎక్కువగా వినియోగించగలిగేది, సోషల్ మీడియా క్రేజ్ వంటి వాటిని ఆధారంగా చేసుకుని న్యాయనిర్ణేతలు విజేతను ప్రకటిస్తారు. తొలిసారిగా కంప్యూటర్ సాంకేతికత సృష్టించిన మనుషుల అందాల పోటీ అనేది ఫ్యాషన్ వైవిధ్యానికి ఓ నిదర్శనం. వరల్డ్ AI క్రియేటర్ అవార్డ్స్ వర్చువల్ మోడల్స్‌ని సబ్స్క్రిప్షన్-ఆధారిత ప్లాట్‌ఫారమ్ అయిన ఫ్యాన్వ్యూని(Fanvue) కూడా కలిగి ఉంటుంది. ఇక్కడ సదరు వర్చువల్ మోడల్ ఫ్యాన్ వ్యూ, పీఆర్ మద్దతులను కూడా బేస్ చేసుకుని విజేతను ప్రకటించడం జరుగుతుంది. అలాగే రన్నరప్, మూడో స్థానంలో ఉన్న విజేతలకు కూడా నగదు బహుమతులు అందచేయడం జరుగుతుందని వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్ పేర్కొంది. ఈ పోటీలకు ఎంట్రీలు గత ఆదివారం(ఏప్రిల్ 14) నుంచే ప్రారంభమయ్యాయి. మే 10న విజేతలను ప్రకటిస్తారు. ఇక ఈ అందాల పోటీ ఈ నెలఖారులోపు జరగనుంది. ఇక ఈ పోటీలు నలుగురు సభ్యుల ఫ్యానెల్ సమక్లంలో జరుగుతుంది. ఆ ఫ్యానెల్లో ఇద్దరు ఏఐ ఇన్ఫ్లయోన్సర్ జడ్డిలు..ఒకరేమో మూడు లక్షల ఫ్యాన్‌ఫాలోయింగ్ కలిగిన స్పెయిన్‌కు చెందిన ఐతానా లోపెజ్, మరోకరు రెండు లక్షలకు పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎమిలీ పెల్లెగ్రిని జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఇక వారిలో మిగిలిన ఇద్దరు వ్యక్తులు..పీఆర్ సలహదారు, వ్యవస్థాపకుడు ఆండ్రూ బ్లాచ్, మరొకరు అందాల పోటీ చరిత్రకారుడు, బ్యూటీ క్వీన్ స్కాండల్స్ పుస్తక రచయిత అయిన సాలీ-ఆన్ ఫాసెట్ విజేతలను ప్రకటిస్తారు. ఇది ఏఐ సృష్టికర్తలలో దాగున్న ప్రతిభ సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు జరుగుతున్న అందాల పోటీ అని ఫ్యానల్ వ్యక్తులు చెబుతున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా 100 శాతం ఏఐ జనరేటేడ్ మోడల్స్‌నే క్రియేట్ చేయాలి. అందుకోసం ఎలాంటి టూల్స్ ఉపయోగిస్తారనేందుకు ఎలాంటి పరిమితులు లేవు. ఓన్లీ ఏఐ జెనరేటర్ క్రియేషన్స్ని స్వాగతిస్తుంది. అది డీప్ ఏఐ, లేదా వ్యకగత టూల్స్ వంటివి ఏదైనా కావొచ్చు. ఈ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నవారు దాదాపు రూ. 4 లక్షలపైనే నగదు బహుమతి అందజేస్తారు నిర్వాహకులు. ( చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన 'కర్రీ' ఏంటో తెలుసా!
పురాతన తవ్వకాల్లో శాస్త్రవేత్తలు వెలికి తీసిన పనిముట్లు, ఆయుధాలు, విలువైన వస్తువుల గురించి కథలు కథలుగా విన్నాం. అలాగే వేటితో వంటలు చేసుకునేవారు, వారు ఉపయోగించిన వంట సామాగ్రి గురించి విన్నాం. కానీ పురాతన కాలంలో ఎలాంటి కూరలు వండుకునేవారు, ఏం తినేవారు తెలియదు. వాటి గురించి చరిత్రకారులు రాసిన దాఖాలాలు కూడా లేవు. అయితే తాజాగా ఫర్మానాలో జరిపిన తవ్వకాల్లో నాలుగువేల ఏళ్ల నాటి పురాతన వంటకం వెలుగులోకి వచ్చింది. మన పూర్వీకులు అప్పట్లోనే అలా వండుకుని తినేవారా అని కంగుతిన్నారు శాస్త్రవేత్తలు. ఇంతకీ అదేం కర్రీ?.. ఏ దేశపు వంటకం అంటే.. మన పూర్వీకుల తరుచుగా ఏం వంటకాలు వండుకుని తినేవారు అనే దిశగా సాగిన తవ్వకాల్లో కొంత వరకు పురొగతి సాధించారు శాస్త్రవేత్తలు. ప్రతి వంటకం తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి వచ్చిన వంటకాలే. అయితే ఆ కాలంలో కుండలు, దంతాల అవశేషాల సామాగ్రితో చేసుకునేవారు. ఇక్కడ శాస్త్రవేతలు హరప్పా నగరమైన రాఖీగర్హికి ఆగ్నేయంగా ఉన్న ఫర్మానాలో పూర్వీకుల వంటకాలు గురించి చేసిన అన్వేషణలో నాలుగు వేల ఏళ్ల నాటి పురాతన వంటకాన్ని గుర్తించారు వారు తవ్వకాల్లో ఒక కుండలో పసుపు, అల్లం, వెల్లుల్లి, వంకాయలతో చేసి అవశేషాలను గుర్తించారు. ఈ మిశ్రమం ఆధునికులకు బాగా తెలిసిన రెసిపీనే. ముఖ్యంగా ఇది భారతదేశ వంటకం. దీంతో ఈ కూర ప్రస్తుతం ఇప్పటి వరకు నమోదయ్యిన పురాతన కూరల్లో ఒకటిగా నిలిచింది. మన పూర్వీకులు, అరటి పండ్లు, మామిడి వంటివి తినేవారని, పొట్లకాయ, ఖర్జురాలు ఎక్కువగా ఉపయోగించినట్లు తవ్వకాల్లో గుర్తించారు గానీ కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే తాజాగా గుర్తించిన పురాతన కూరలో వాడిన అల్లం పసుపు హరప్పా నాగరికతకు సంబంధించిన తవ్వకాల్లోనే గుర్తించడం జరిగింది. అంతేగాదు ఈ సుగంధ ద్రవ్యాలే 2023లో వియత్నాంలో 2 వేల ఏళ్ల నాటి ఇసుకరాయి స్లాబ్‌పై కనిపించి కూర అవశేషాల్లో కూడా గుర్తించారు శాస్త్రవేత్తలు. అక్కడ పరిశోధకులు మైక్రోస్కోపిక్ ద్వారా స్టార్చ్ ధాన్యాలను పరిశీలించారు. విశ్లేషణలో పసుపు, అల్లం, వంటి విభిన్న సుగంధద్రవ్యాల మూలాలను గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే ఆసియా వంటకాల మూలాలు చరిత్రలో స్థిరంగా ఉన్నాయని తెలుస్తోందన్నారు శాస్తవేత్తలు. ఇక పురాతన వంటకాన్ని ఎలా చేస్తారో చూద్దామా..! మన భారతీయలు ఈజీగా చేసుకునే వంకాయ వేపుడే!.. నాటి పుర్వీకులు చేసుకునేవారు. ఈ ఆధారాలను బట్టి చూస్తే.. వంకాయ వేపుడు పురాతన వంటకంగా తెలుస్తోంది. ఈ రెసిపీని నాటి పూర్వీకులు ఎలా చేసుకున్నారనే దాని గురించి ప్రముఖ చెఫ్ కునాల్ ఇన్స్టాగ్రామ్ వేదికగా సవివరంగా వెల్లడించారు. కావాల్సిన పదార్థాలు. . రెండు పెద్ద సైజు వంకాయలు నాలుగు టేబుల్ స్పూన్ల నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పసుపు ఉప్పు తగినంత తయారీ విధానం: ఓ కడాయిలో నూనె వేసుకుని పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కరివేపాకు వేయించి ఆ తర్వాత తరిగి పెట్టుకున్నవంకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసుకుని మగ్గనివ్వాలి. ఓ ఐదు నిమిషాలు అలాగే స్టవ్ మీద ఉంచి తర్వాత దించేయాలి. అంతే వంకాయ వేపుడు రెడీ..! View this post on Instagram A post shared by Kunal Kapur (@chefkunal) (చదవండి: 'మోదీ మామిడి': ఈ పండు ప్రత్యేకత ఏంటో తెలుసా..!) -
అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం ఏది?
కొద్ది రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో పలువురు పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్లాన్ చేసుకుంటున్నారు. అందమైన పర్యాటక ప్రదేశాలకు వెళ్లి, అక్కడి ప్రకృతిని చూడాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ప్రపంచంలో అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం కూడా ఉంది. అయితే అది ఎక్కడ ఉంది? ఎందుకు ఆ ప్రాంతం ప్రమాదకరంగా ఉంది? అంటార్కిటికా ఖండం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పర్యాటక ప్రాంతంగా పేరొందింది. దక్షిణ ధ్రువం వద్ద ఉన్న ఈ ఖండంలో బలమైన మంచు గాలులు వీస్తాయి. అంటార్కిటికాలో దాదాపు రెండు కిలోమీటర్ల మందపాటి మంచు పలక విస్తరించి ఉంది. రక్తాన్ని గడ్డకట్టే చలి వాతావరణం ఉన్నప్పటికీ, ఈ ఖండంలో సందర్శించదగిన అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి ఉండే ఏకైక ప్రదేశం అంటార్కిటికా. ఇక్కడ శీతాకాలం, వేసవికాలం అనే రెండు సీజన్లు మాత్రమే ఉంటాయి. అంటార్కిటికా ఖండంలో వేసవి కాలంలో ఆరు నెలల పాటు పగటి వెలుతురు ఉంటుంది. అయితే చలికాలంలో ఆరు నెలల పాటు ఎక్కడ చూసినా చీకటే కనిపిస్తుంది. అంటార్కిటికా ఖండంలోని ఎత్తైన శిఖరం పేరు విన్సన్ రేంజ్. దాదాపు 4,892 మీటర్ల ఎత్తు ఉన్న ఈ శిఖరాన్ని విన్సన్ మాసిఫ్ అని కూడా పిలుస్తారు. పద్మశ్రీ డాక్టర్ అరుణిమ సిన్హా ఈ పర్వత శిఖరంపై భారత జెండాను ఎగురవేశారు. ఈ శిఖరం పర్వతారోహకులను అమితంగా ఆకర్షిస్తుంది. అంటార్కిటికాలో సౌత్ షెట్లాండ్ ద్వీపం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. సౌత్ షెట్లాండ్ దీవుల్లోని పరిశోధనా కేంద్రాలకు వివిధ దేశాల నుంచి పరిశోధకులు వస్తుంటారు. ఈ ఖండంలో డ్రేక్ పాసేజ్, ఫాక్లాండ్ దీవులు, దక్షిణ జార్జియా వంటి అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రయాణించడాన్ని పర్యాటకులు సాహసంగా పరిగణిస్తారు. అంటార్కిటికా ఖండాన్ని సందర్శించడానికి వేసవి కాలం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019