breaking news
-
రద్దీ బస్సులో బికినీలో అమ్మడు : ఒక్కసారిగా షాకైన జనం
ఢిల్లీలో రద్దీగా ఉండే బస్సులో ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అభ్యంతర కర తరహాలో బికినీ ధరించి రద్దీగా ఉన్న బస్సు ఎక్కింది. దీంతో తోటి ప్రయాణీకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ దృశ్యాలు కూడా వీడియోలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోపై నెటిజన్లలో విభిన్న స్పందనలు కనిపించాయి. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’లో బుధవారం ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఓ మహిళ టూపీస్ బికినీలో బస్సెక్కడం కనిపించింది. అప్పటికే అక్కడ నిలబడి ఉన్న ఓ వృద్ధురాలు పక్కకు వెళ్లిపోగా సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడు సైతం లేచి వెళ్లిపోవడం గమనార్హం. దీపికా నారాయణ భరద్వాజ్ అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియోకి దాదాపు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. (ఫుడ్ ఫోటోగ్రాఫర్ అవార్డుల పోటీ : ఈ అద్భుతమైన ఫోటోలు చూశారా?) బికినీలో ఆమెను చూసి షాక్ అయ్యామని కొందరు వ్యాఖ్యానించారు. ఆమె తీరును అభ్యతరకరంగా ఉందననారు. మరికొందరు మాత్రం ఆమె బట్టలు ఆమె ఇష్టం అంటూ వ్యాఖ్యానించారు. ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఎంచుకునే స్వేచ్ఛను గట్టిగా సమర్థించారు. కాగా ఢిల్లీ మెట్రో రైల్లోనూ ఓ మహిళ బ్రా, మినీ స్కర్ట్ తో ప్రయాణించి కలకలం రేపింది.అలాగే హోలీ సందర్భంగా ఇద్దరు అమ్మాయిలు చేసిన రీల్స్ కూడా వివాదాన్నా రేపిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఉదంతంపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ స్పందించింది. తాజా ఘటనపై అధికారులు ఇంకా స్పందించలేదు. (కొంచెం శ్రద్ధ ఉంటే చాలు..టెర్రస్ మీదే బోలెడన్ని మొక్కలు) What's really happening 😵💫😵💫pic.twitter.com/rfjavOsWMp — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) April 17, 2024 -
ఆస్ట్రియన్ పర్యాటకురాలికి కేరళ పోలీసుల సమన్లు
కేరళలోని ఫోర్ట్ కొచ్చిలో వివాదాస్పద ఉదంతం చోటుచేసుకుంది. పాలస్తీనా అనుకూల పోస్టర్‌ను చింపివేసూ ఒక ఆస్ట్రియన్ యూదు పర్యాటకురాలు కేరళలో స్థానికులతో వాదిస్తూ కెమెరాకు చిక్కింది. ఈ వారం ప్రారంభంలో ఎర్నాకులం జిల్లా ఫోర్ట్ కొచ్చిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో పోస్టర్‌ను చింపివేస్తున్న ఆమెను వారించేందుకు స్థానిక యువకులు ప్రయత్నించగా, ఆమె వారితో వాగ్వాదానికి దిగడం కనిపిస్తుంది. ఆ పోస్టర్ చినిగిన ముక్కలను తీయమని అక్కడున్న యువకులు ఆమెకు చెప్పడాన్ని వీడియోలో చూడవచ్చు. ఆ గోడపత్రికతో సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలని వారు ఆమెకు సూచించడాన్ని కూడా ఆ వీడియోలో గమనించవచ్చు. An Austrian tourist tears down pro-palestinian posters in Kochi, India. What an entitled Zionist woman. Kerala Police filed a FIR against her. pic.twitter.com/X4CM7tIJCM — Mahesh Kusumagiri (@maheshkusumagir) April 17, 2024 ఈ వీడియో వైరల్‌గా మారిన నేపధ్యంలో కేరళ పోలీసులు విచారణ కోసం ఆ మహిళను పోలీస్ స్టేషన్‌కు రావాలని కోరారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఓ)కొచ్చి ఏరియా సెక్రటరీ మహమ్మద్ అజీమ్ కెఎస్ ఆ మహిళపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. ఎస్ఐవో అతికించిన పోస్టర్లను ఆ ఆస్ట్రియన్ యువతి చించివేసింది. కాగా గత జనవరిలో కోజికోడ్ బీచ్ సమీపంలోని స్టార్‌బక్స్ స్టోర్‌పై పాలస్తీనా అనుకూల పోస్టర్లు అతికించిన ఆరుగురు విద్యార్థులను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. నాడు నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం స్టార్‌బక్స్ స్టోర్ గ్లాస్ డోర్‌పై ఆ విద్యార్థులు ‘ఫ్రీ పాలస్తీనా’ అని రాసిన పోస్టర్లను అతికించారు. గాజాలో జరిగిన యుద్ధ నేపధ్యంలో స్టార్‌బక్స్ ఇజ్రాయెల్‌కు అనుకూల వైఖరిని ప్రదర్శించినదుకు విమర్శలకు గురైంది. -
కార్పొరేట్ జాబ్ వదిలేసి మరీ..సివిల్స్ ర్యాంక్ కొట్టిన యువతి స్టోరీ
సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచి పెట్టేసింది. పట్టుదలతో చదివి ఊహించని ఫలితాన్ని సాధించింది. తాజా యూపీఎస్సీ ఫలితాల్లో టాప్-20లో ర్యాంకు సాధించింది. ఢిల్లీకి చెందిన 24 ఏళ్ల యువతి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం రండి..! ప్రతిష్టాత్మక పరీక్ష సివిల్స్ పరీక్షలో విజయం సాధించాలంటే అంత ఈజీకాదు. దీనికి ఎంతో పట్టుదల కృషి కావాలి. అలా దీక్షగా చదివి తన ప్రత్యేకతను చాటుకుంది నోయిడా సెక్టార్ 82 లోని వివేక్ విహార్‌లో నివసించే వార్దా ఖాన్. మంగళవారం ప్రకటించిన తాజా యూపీఎస్సీ ఫలితాల్లో 18 వ ర్యాంక్ సాధించింది. తన తొలి ప్రిఫరెన్స్‌గా ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అని తెలిపింది. ప్రపంచంలోనే భారత దేశాన్ని మరింత ఉన్నత స్థానంలో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్దా ఖాన్ తెలిపింది. సివిల్స్‌లో మంచి తన టార్గెట్. కానీ టాప్ 20లో ఉంటానని అస్సలు ఊహించలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది వార్దా ఖాన్. దీంతో తన ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. వాస్తవానికి సివిల్స్‌కోసం 2021 నుండి సిద్ధమవుతున్నాననీ, రెండో ప్రయత్నంలో విజయం సాధించానని వెల్లడించింది. ఈ సందర్బంగా కుటుంబం, స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. #WATCH | Uttar Pradesh | Noida resident Wardah Khan secures 18th rank in UPSC 2023. She says, "I had never thought that I would make it to Top 20. I just wanted to make it to the list (of qualifiers). This is a huge moment for my family and me. This was my second attempt. I have… pic.twitter.com/2KoPdlDPmV — ANI (@ANI) April 16, 2024 నోయిడా సెక్టార్ 82లోని వివేక్ విహార్‌లో ఉండే వార్ధా ఖాన్ ఆమె తల్లిదండ్రులకు ఏకైక సంతానం. తండ్రి తొమ్మిదేళ్ల క్రితం చనిపోగా ప్రస్తుతం తల్లితో కలసి ఉంటోంది. ఢిల్లీలోని ఖల్సా కాలేజీ నుంచి బీకామ్ హానర్స్ పూర్తి చేసింది. చదువు తరువాత ఎనిమిది నెలల పాటు కార్పొరేట్ కంపెనీలో పనిచేసింది. అది సంతృప్తి నివ్వలేదు. పైగా సమాజానికి సేవ చేయాలనే ఆశయం. దీంతో కష్టపడి చదవి తమ కలను సాకారం చేసుకుంది. హిస్టరీ, జియోపాలిటిక్స్ సబ్జెక్టులు అంటే ఇష్టమని పేర్కొంది. అలాగే కాలేజీ రోజుల్లో ఎక్కువగా డిబేట్లలో, MUN లలో (మాక్ యునైటెడ్ నేషన్స్) పాల్గొనేదాన్ని ఆ సమయంలో సివిల్స్ సాధించాలనే ఆలోచన తనలో కలిగిందని చెప్పుకొచ్చింది. -
ఆ రాష్ట్రంలో.. 1952 తర్వాత 1998లోనే మహిళా ఎంపీ!
ఉత్తరాఖండ్‌లో ఇంతవరకూ జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఎంపీల ప్రాతినిధ్యం నామమాత్రంగానే ఉంది. ప్రకృతి సౌందర్యానికి, ఆధ్యాత్మిక ప్రదేశాలకు ఉత్తరాఖండ్ పేరుగాంచింది. అయితే రాజకీయాల్లో ఇక్కడ నేటికీ లింగవివక్ష కనిపిస్తూనే ఉంది. 1952లో రాష్ట్రంలోని తెహ్రీ నుంచి ఎన్నికైన కమలేందు మతి షా ఉత్తరాఖండ్ నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎంపీ. 1998లో నైనిటాల్ నుంచి ఎన్నికైన రెండో మహిళా ఎంపీ ఇలా పంత్. ఈ విధంగా చూస్తే రాష్ట్రం నుంచి లోక్‌సభకు మహిళా ఎంపీ చేరేందుకు 46 ఏళ్లు పట్టింది. 2012లో మాలా రాజ్య లక్ష్మి షా అనే మరో మహిళ ఎంపీ స్థాయికి చేరుకోగలిగారు. ఏడు దశాబ్దాల ఎన్నికల చరిత్రలో ముగ్గురు మహిళలకు మాత్రమే లోక్‌సభలో ప్రాతినిధ్యం దక్కింది. 2014, 2019లలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెహ్రీ నుంచి మాలా రాజ్యలక్ష్మి షా ఎంపీ అయ్యారు. 1952 ఎన్నికల్లో తెహ్రీ గర్వాల్ సీటు నుంచి రాజమాత కమలేందు మతి షా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. నాటి రోజుల్లో కాంగ్రెస్‌కు భారీ మద్దతు ఉన్నప్పటికీ, ఇక్కడి ఎన్నికల్లో కమలేందు మతి షా విజయం సాధించారు. నాటి రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, కాంగ్రెస్ అభ్యర్థి ఠాకూర్ కృష్ణ సింగ్ ఓటమి చవిచూశారు. -
అందుకే మంగళగిరిలో చేనేత మహిళకు టికెట్.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: మంగళగిరిలో చేనేతలు ఎక్కువ.. అందుకే ఆర్కేతో మాట్లాడి చేనేత కుటుంబానికి చెందిన నా చెల్లెమ్మ మురుగుడు లావణ్యకి టికెట్ ఇచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘మరో వైపు చంద్రబాబు ఆయన కొడుకు ఏం చేస్తున్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వాళ్లే నిలబడి కోట్లకి కోట్లు డబ్బు ఖర్చు చేస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘కుప్పంలోనూ బీసీలు ఎక్కువగా ఉన్నా అక్కడ కూడా ఇదే పరిస్థితి. తేడా గమనించమని కోరుతున్నాను’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర మంగళగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ చేనేత కార్మికులతో ముఖాముఖి అయ్యారు. ‘‘చేనేత కార్మికులను కూడా చంద్రబాబు మోసం చేశాడు. 2014లో కూటమిగా వచ్చి చంద్రబాబు ఏం చేప్పారో గుర్తు చేసుకోండి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతాం. గతంలో 98 శాతం హామీలను ఎగ్గొట్టారు. 2 శాతం హామీలను మాత్రమే నెరవేర్చారు. గత పాలనకు, మన పాలనకు తేడాను మీరే గమనించారు. చంద్రబాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు. సూపర్ సిక్స్, సెవెన్ అంటూ వస్తున్నారు. గతంలో కూడా ముగ్గురు కలిసే వచ్చారు. ఒక్కరికైనా సెంట్ స్థలం ఇచ్చారా?. మనం స్థలం ఇస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. ఒక్క ఇళ్లైనా ఇచ్చారా?. చేనేత కార్మికులకు ఇల్లు, మగ్గం అని చంద్రబాబు మోసం చేశారు. నేతన్న నేస్తం పథకం కింద రూ.970కోట్లు చేనేత కార్మికులకు అందించాం. మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రభుత్వం మనది. కుల, మత, రాజకీయాలకు అతీతంగా లబ్ధి జరిగింది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకం అములు చేసిన సందర్భం ఉందా?. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3706 కోట్లు ఖర్చు చేశాం. 1.06లక్షల మందికి లబ్ధి జరిగింది’’ అని సీఎం జగన్ వివరించారు. మంగళగిరిలో చేనేతలు ఎక్కువ. అందుకే ఆర్కేతో మాట్లాడి చేనేత కుటుంబానికి చెందిన నా చెల్లెమ్మ మురుగుడు లావణ్యకి టికెట్ ఇచ్చాం. మరోవైపు చంద్రబాబు ఆయన కొడుకు ఏం చేస్తున్నారు? బీసీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వాళ్లే నిలబడి కోట్లకి కోట్లు డబ్బు ఖర్చు చేస్తున్నారు. కుప్పంలోనూ బీసీలు… pic.twitter.com/kB1XDL6mOQ — YS Jagan Mohan Reddy (@ysjagan) April 13, 2024
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019