breaking news
Ad - Sakshi_Home_Sticky
-
WhatsApp Chat Filters: వాట్సాప్‌లో కొత్త ఫీచర్..
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందిస్తూ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది వాట్సాప్. దీనికి పోటీగా చాలా యాప్స్ వచ్చినప్పటికీ అవేవి మార్కెట్లో వాట్సప్‌కి గట్టి పోటీ ఇవ్వలేకపోయాయి. తాజాగా వాట్సాప్ నుంచి మరో కొత్త అప్డేట్ వచ్చింది. చాట్ ఫిల్టర్ ఫీచర్ ని వాట్సాప్ కొత్తగా లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా మనకు కావాల్సిన చాట్ కోసం స్క్రోల్ చేసే అవసరం లేకుండా సర్చ్ చేసి మెసేజ్ లు చూసుకోవచ్చు. చాట్ ఫిల్టర్ ఫీచర్ 2020లో జీమెయిల్ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇదే ఫీచర్‌ను ఇప్పుడు వాట్సాప్ లో కూడా అందుబాటులోకి తెచ్చింది మెటా సంస్థ. మొదట ఆండ్రాయిడ్ వర్షన్ 2.22. 16.14లో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్, ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ వర్షన్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతే కాకుండా వాట్సాప్‌లో యాక్టివ్‌గా లేని యూజర్లను గుర్తించే మరో ఫీచర్ ని కూడా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 2.78 బిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. -
ఒకేనెలలో 76 లక్షల ఖాతాలు తొలగించిన వాట్సప్.. కారణం..
మెటా ఆధ్వర్యంలో ఉన్న ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ వాట్సప్ తన వినియోగదారులకు చెందిన కొన్ని ఖాతాలను తొలగించినట్లు ప్రకటించింది. ఐటీ నియమాలు 2021 ఉల్లంఘన, వాట్సప్ దుర్వినియోగం చేస్తున్న కారణంగా ఏకంగా 76 లక్షల ఖాతాలను రద్దు చేసినట్లు చెప్పింది. నెలవారీ నివేదికలో భాగంగా ఫిబ్రవరిలో పెద్దఎత్తున భారతీయ ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సప్ తెలిపింది. ఫిబ్రవరి 1-29 మధ్య 76,28,000 ఖాతాలను నిషేధించినట్లు వెల్లడించింది. వీటిలో 14,24,000 ఖాతాలపై ఎలాంటి ఫిర్యాదులూ అందకపోయినప్పటికీ, ఐటీ నిబంధనలను అతిక్రమించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. దేశంలో వాట్సప్ యూజర్లు 50 కోట్లకు పైగా ఉన్నారు. ప్రతినెల వాట్సప్‌కు కొన్ని ఖాతాలకు సంబంధించిన ఫిర్యాదులు అందుతుంటాయి. అయితే ఫిబ్రవరిలో మాత్ర రికార్డు స్థాయిలో 16,618 వినతులు వచ్చాయి. వాటిలో 22 ఖాతాలపై మాత్రమే వాట్సప్ యాక్షన్ తీసుకుంది. మిగతా అకౌంట్లను మాత్రం సమాచార నిబంధనలు ఉల్లఘించిన కారణంగా తొలగించినట్లు చెప్పింది. ఇదిలాఉండగా.. వాట్సప్ జనవరి నెలలో 67,28,000 ఖాతాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. వీటిలో కూడా 13,58,000 ఖాతాలకు యూజర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులూ అందకపోవడం గమనార్హం. ఇదీ చదవండి: హోమ్ రోబోటిక్స్ విభాగంలోకి ప్రపంచ నం.1 కంపెనీ..? -
‘కేజ్రీవాల్‌కు సంఘీభావం తెలపండి’.. ఇదే హెల్ప్‌లైన్ నంబర్
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్ అభియోగాలపై అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్‌కు గురువారం కోర్టు మరో నాలుగు రోజుల ఈడీ కస్టడీ విధించింది. అయితే.. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్(8297324624)ను ప్రారంభించారు. లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌కు తమ సందేశం తెలియజేయాలనుకునే కార్యకర్తలు, అభిమానుల కోసం ఈ హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని శుక్రవారం తెలిపారు. ఇప్పటికే సీఎం కేజ్రీవాల్ త్వరగా విడుదల కావాలని ప్రార్థనలు చేస్తున్నారని చెప్పారు. అదే విధంగా వందల సంఖ్యలో అభిమానాలు కేజ్రీవాల్ కోసం సందేశాలు పంపుతున్నారని అన్నారు. ‘సీఎం కేజ్రీవాల్‌ను ఎంత ప్రేమిస్తున్నారో మాకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ సంఘీభావ సందేశం సీఎం కేజ్రీవాల్ వరకు చేరుతుంది. ఆయన వాటన్నింటిని ప్రేమతో చదువుతారు. మీరు ఆప్ పార్టీకి చెందినవారే కానవసరం లేదు. మీరంతా ఆయన త్వరగా బయటకు రావాలని ఆశీర్వదించండి’ అని సునీతా కేజ్రీవాల్ ఓ వీడియోను విడుదల చేశారు. గురువారం వరకు సీఎం కేజ్రీవాల్ ఆరురోజుల కస్టడీ ముగియగా.. రౌస్ అవెన్యూ కోర్టు మరో నాలుగు రోజులు పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ సమయంలో కోర్టు ప్రాంగణంలో అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. తనను రాజకీయ కుట్రలో భాగంగా అరెస్ట్ చేశారన్నారు. వారికి ఢిల్లీ ప్రజలే సమాధానం చెబుతారని చెప్పారు. కోర్టు కస్టడీ పొడగించిన అనంతరం.. ‘సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరోగ్యం సరిగా ఉండటం లేదు. మీ సీఎం అక్కడ వేధింపులకు గురవుతున్నారు. ఢిల్లీ ప్రజలు తగిన సమాధానం ఇవ్వాలి’అని సునీతా కేజ్రీవాల్ తెలిపారు. ఇక.. మర్చి 21న అరెస్టైన సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ.. ఏప్రిల్ 1 వరకు కొనసాగనుంది. -
వాట్సాప్‌లో త్వరలో ఏఐ ఇమేజ్ ఎడిటర్!
వాషింగ్టన్: కృత్రిమ మేధ (ఏఐ) అందుబాటులోకి వచ్చాక దానిని విరివిగా వాడేందుకు జనం ఎంతో ఉత్సాహం చూపిస్తు న్నారు. తాము వాడే యాప్‌లలో ఏఐ ఉంటే దాని సాయంతో సరదా సరదా ప్రయోగాలు చేస్తుంటారు. దీంతో ఫొటోలు, ఇమేజ్‌లను ఎడిట్ చేసే ఏఐ ఆధారిత ఫీచర్ త్వరలో ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్‌లో అందుబుటులోకి వచ్చే అవకాశ ముంది. బీటా వెర్షన్ వినియోగదారులకు మొదట దీనిని వాడే అవకాశం ఇవ్వొచ్చని ‘వెబ్బేటాఇన్ఫో’ తన కథనంలో పేర్కొంది. ఆ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. యాప్‌లోని ఆప్షన్లను తమ అభిరుచికి అనుగుణంగా వాడుకుంటున్న యూజర్లు.. ఈ కొత్త ఫీచర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇది అంబుబాటులోకి వస్తే ఇమేజ్ను తమకు నచ్చినట్లుగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇమేజ్ సైజు, బ్యాక్గ్రౌండ్లను మార్చుకోవచ్చు. ఆండ్రాయిడ్ 2.24.7.13 వెర్షన్‌ను అప్డేట్ చేసుకున్న వాళ్లకు ఏఐ ఇమేజ్ ఎడిటర్ ఫీచర్ ప్రాథమిక కోడ్‌ను అందుబాటులోకి తేవచ్చు. బేటా ప్రోగ్రామ్‌లో భాగస్వాములైన టెస్టర్లనే తొలుత దీనిని వాడేందుకు అనుమతిస్తారు. సెర్చ్ బార్లో టైప్‌చేసి నేరుగా ఏఐ సర్వీస్‌తోనే చాటింగ్ చేసి కావాల్సిన ఫలితాలు పొందే ఫీచర్‌పైనా వాట్సాప్ కసరత్తు చేస్తోంది. వాయిస్ నోట్ వచ్చే సందేశాలనూ ఓపెన్ చేయకుండానే టెక్ట్స్ రూపంలో చదవగలిగేలా మరో ఫీచర్‌ను యూజర్లకు అందివ్వాలని వాట్సాప్ భావిస్తోంది. -
వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్లు.. ఫీదా అవ్వాల్సిందే
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్లకు శుభవార్త చెప్పింది. యూజర్లను ఎప్పటికప్పుడు ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వాట్సప్.. తాజాగా ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నట్లు వాట్సప్ సమాచారం అందించే ‘వీ బీటా ఇన్ఫో’ తెలిపింది. యూజర్లు ఈ ఏఐ ఫీచర్లను ఉపయోగించి వాట్సప్‌లో ఇమేజెస్‌ను ఎడిట్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ మార్చడం,రీస్టైల్ చేయడం, ఎక్స్పాండ్ లాంటి పనులన్నీ వాట్సప్ ఇంటర్ ఫేస్ నుంచి చేయొచ్చు. వాట్సప్ పనిచేస్తున్న రెండో ఏఐ టూల్స్ సాయంతో వాట్సప్ సెర్చ్ బార్లో ఏదైనా సమాచారం గురించి తెలుసుకోవచ్చు. ఆ సమాచారం అంతా ‘మెటా ఏఐ’ అందిస్తుంది. చాట్‌జీపీటీకి పోటీగా మెసేజింగ్ యాప్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి రాకముందే వాటి గురించి ఫీచర్ ట్రాకర్ వీ బీటా ఇన్ఫో అందిస్తుంది. తాజా వాట్సప్ బీటా అప్డేట్ ఏఐ- పవర్డ్ ఇమేజ్ ఫీచర్‌తో పాటు ఓపెన్ ఏఐకి చెందిన చాట్జీటీపీకి పోటీగా వాట్సప్‌లో మెటా ఏఐని రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ రెండు టెస్టింగ్ దశలో ఉండగా.. త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019