breaking news
-
రామ్‌నవమి వేడుకలపై ‘తృణమూల్’ కుట్ర: ప్రధాని
కలకత్తా:శ్రీరామనవమి వేడుకలను అడ్డుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కుట్ర పన్నిందని ప్రధాని మోదీ ఆరోపించారు. మంగళవారం(ఏప్రిల్ 16) పశ్చిమబెంగాల్లోని బలూర్‌ఘాట్‌లో జరిగిన ఎన్నికల సభలో మోదీ ప్రసంగించారు. ‘అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్టాపన జరిగిన తర్వాత జరుగుతున్న మొదటి రామనవమి వేడుక ఇది, రామ్‌నవమి వేడుకలను ఆపేందుకు టీఎంసీ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది. ఎన్నో కుట్రలు చేస్తుంది. కానీ చివరికి నిజమే గెలుస్తుంది. ఈసారి రామ్‌నవమి వేడుకలు జరుపుకునేందుకు కోర్టు అనుమతిచ్చింది. రామ్‌నవమి ఊరేగింపు అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగి తీరుతుంది. ఇందుకుగాను బెంగాల్ సోదరులు, సోదరీమణులకు నేను అభినందనలు తెలుపుతున్నాను’అని మోదీ అన్నారు. ఇదీ చదవండి.. ఈడీ, సీబీఐల దర్యాప్తు.. శ్వేతపత్రం విడుదల చేయండి: దీదీ -
‘దీదీ’ ఫైర్.. ‘‘చాయ్‌కు బదులు అది తాగమంటారేమో..!’’
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ సమీపించిన వేళ పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత బీజేపీపై మాటల దాడి పెంచారు. కూచ్‌బెహార్‌లో సోమవారం(ఏప్రిల్15) జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమత మాట్లాడారు. ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ నవరాత్రుల్లో చేపలు తినడంపై విమర్శిస్తున్న బీజేపీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. బీజేపీని అధికారంలో నుంచి దించకపోతే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. ‘మనం ఏం తినాలో, ఎలా పడుకోవాలో బీజేపీ వాళ్లే నిర్ణయిస్తారు. వాళ్లను ఇలాగే వదిలేస్తే రోజూ ఉదయం చాయ్‌కు బదులు గో మూత్రం తాగమంటారు. భోజనానికి బదులు ఆవు పేడ తినమంటారు. ఒకవేళ బీజేపీ మళ్లీ పవర్లోకి వస్తే భవిష్యత్తులో ఎన్నికలే ఉండవు. వాళ్లకు వన్ లీడర్, వన్ నేషన్, వన్ భోజన్, వన్ భాషన్ కావాలి’అని మమత విరుచుకుపడ్డారు. పశ్చిమబెంగాల్లో తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఇదీ చదవండి.. కుటుంబ రాజకీయాలకు స్వస్తి చెప్పండి -
‘సందేశ్‌ఖాలీ’ కేసు.. ఎన్నికల వేళ ‘తృణమూల్’కు షాక్
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ఇటీవలి కాలంలో రాజకీయ దుమారం రేపిన సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, భూ కబ్జాల కేసు దర్యాప్తును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. కేసు దర్యాప్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపింది. సందేశ్‌ఖాలీలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన నేతలు అక్కడి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడడమే కాకుండా వారి భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అక్కడి మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. తాజాగా సందేశ్‌ఖాలీ అకృత్యాలపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సందేశ్‌ఖాలీ అకృత్యాల కేసు చాలా సంక్లిష్టమైనది. ఇందులో నిష్పాక్షిక విచారణ జరగాలి. ఈ కేసును ఎవరు విచారించినా రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని మా అభిప్రాయం. కేసు దర్యాప్తులో భాగంగా సామాన్యుల, ప్రభుత్వ అధికారులు, ఎన్జీవోలు ఎవరినైనా విచారించే అధికారం సీబీఐకి ఉంది. కేసు విచారించి సమగ్ర దర్యాప్తు నివేదిక మాకు అందించాలి’అని హై కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది. సందేశ్‌ఖాలీలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నతృణమూల్ నేత షేక్షాజహాన్ను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. ఇదే కేసులో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేయడానికి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారులపై దాడి కేసులో సీబీఐ ఆయను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. ఈడీ అధికారులపై దాడి కేసును సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. కాగా, సందేశ్‌ఖాలీ ఆందోళనలకు నేతృత్వం వహించిన రేఖాపత్రా అనే మహిళకు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇచ్చి బరిలోకి దింపింది. సందేశ్‌ఖాలీ అంశం ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ ఓట్ల శాతానికి భారీగా గండి కొట్టి బీజేపీకి మేలు చేసే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఇదీ చదవండి.. ప్రచారంలో యువతికి ముద్దు -
ప్రచార హోరు.. ‘తృణమూల్’పై ప్రధాని మోదీ ఫైర్
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. తూర్పు మిడ్నపూర్‌లో ఎన్ఐఏ అధికారులపై టీఎంసీ కార్యకర్తల దాడిని ప్రధాని ఖండించారు. ఆదివారం జల్పాయ్గురిలో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు.‘వారి పార్టీ అవినీతి నేతలను స్వేచ్ఛగా వదిలేయాలని తృణమూల్ భావిస్తోంది. దర్యాప్తు సంస్థలు వస్తే వారిపైనే దాడి చేస్తారు. శాంతిభద్రతలను నాశనం చేయడానికి టీఎంసీ కంకణం కట్టుకుంది. వారికి రాజ్యాంగంతో పని లేదు’ అని విమర్శలు గుప్పించారు. తూర్పు మిడ్నపూర్‌లో ఎన్ఐఏ అధికారులపై దాడులు జరిగిన మరునాడే ప్రధాని స్పందించడం చర్చనీయంశమైంది.కాగా, ఇది ఎన్ఐఏ అధికారులపై జరిగిన దాడి కాదని వాళ్లు తూర్పు మిడ్నపూర్లోని భూపతినగర్ గ్రామ వాసులపై చేసిన దాడి అని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. ఇదీ చదవండి.. మరో పదేళ్లు హేమమాలినీనే ఎంపీ -
kolkata: ‘ఎన్ఐఏ’ బృందంపై దాడి.. ‘దీదీ’ కీలక వ్యాఖ్యలు
కలకత్తా: పశ్చిమబెంగాల్ మేదినీపూర్‌లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) పోలీసులపై శుక్రవారం(ఏప్రిల్ 5) అర్ధరాత్రి స్థానికులు ఇటుకలు, రాళ్లతో దాడి చేసిన ఘటనపై సీఎం మమతాబెనర్జీ స్పందించారు. ‘అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పాపెట్టకుండా వస్తే ఏం చేయాలో మేదినిపూర్ భూపతినగర్ వాసులు కూడా అదే చేశారు. అసలు అర్ధరాత్రి అక్కడికి వెళ్లేందుకు ఎన్ఐకు అనుమతి ఉందా. ఎన్ఐఏకు ఏం అధికారం ఉందని ఇలాంటివి చేస్తున్నారు. బీజేపీకి మేలు చేసేందుకే ఇదంతా చేస్తున్నారు. బీజేపీ నీచ రాజకీయాలపై అందరూ కలిసి పోరాడాలి’ అని మమత పిలుపునిచ్చారు. కాగా,2022 బాంబు పేలుడు కేసు దర్యాప్తు నిమిత్తం భూపతినగర్ వెళ్లిన ఎన్ఐఏ పోలీసులపై స్థానికులు మూకుమ్మడిగా దాడికి దిగారు. బాంబు పేలుడు కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కలకత్తా వెళుతుండగా ఈ దాడి జరిగిందని ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చిన తర్వాతే తాము అక్కడికి వెళ్లామని చెప్పారు. ఎన్ఐఏ పోలీసులపై దాడి అత్యంత దారుణ ఘటన అని బెంగాల్ బీజేపీ ఖండించింది. ఇది తృణమూల్ కాంగ్రెస్ గూండాల పనేనని బీజేపీ నేతలు ఆరోపించారు. బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తును తృణమూల్ అడ్డుకోవాలని చూస్తోందన్నారు. ఇదీ చదవండి.. తృణమూల్ కాంగ్రెస్ ఆ పార్టీకి కాపీ
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019