breaking news
-
తెలంగాణలో మూడురోజులు వడగాలులు.. వాతావరణశాఖ హెచ్చరిక
కాస్తా తగ్గుముఖం పట్టాయనుకున్న ఉష్ణోగ్రతలు.. ఒక్కసారిగా మండిపోతున్నాయి. చల్లబడిందనుకున్న వాతావరణం మళ్లీ.. నిప్పులు వర్షం గుమ్మరిస్తుంది. వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరించినట్లు భానుడు భగభగ మండుతున్నాడు. అయితే రానున్న రోజుల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అవకాశముందని, 50 డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో వచ్చే మూడురోజులు వడగాలులు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని పేర్కొంది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీస్తాయని చెప్పింది. అలాగే రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అవకాశం ఉందని వివరించింది. -
చల్లబడిన వాతావరణం.. నాలుగు రోజులు వర్షాలు
-
హైదరాబాద్‌లో చల్లబడిన వాతావరణం.. నాలుగు రోజులు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్ని రోజులుగా మండుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోగా.. తాజాగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఆకాశం మేఘావృతమై ఉండగా.. చల్లటి గాలులు వీస్తుండడంతో నగరవాసులకు ఊరట కలిగించినట్లయ్యింది. త్వరలోనే తెలంగాణలో వానలు పలుకరించనున్నాయి. రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది.ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. గురువారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 36-26 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఉపరితల గాలులు ఆగ్నేయ దిశ నుంచి వీచే అవకాశం ఉందని తెలిపింది. -
చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ..
-
ఏపీలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం.. పలు చోట్ల జల్లులకు ఛాన్స్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గాయి. బుధ, గురువారాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అంతేకాదు కోస్తా రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో.. రేపు ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఓ మోస్తరు నుంచి ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని చోట్ల పిడుగులు పడతాయని అంచనా వేస్తోంది. గడిచిన రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో దాదాపు నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తక్కువగా నమోదు అయ్యింది. అయితే.. రాయలసీమ జిల్లాల్లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. అనంతలో అత్యధికంగా 40.3.. నంద్యాలలో 40 డిగ్రీలు విశాఖలో అత్యల్పంగా 35.4°డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మరోవైపు మంగళవారం ఏపీలోని 9 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 53 మండలాల్లో వడగాలులు వీచాయి. బుధవారం 11 మండలాల్లో తీవ్ర వడగాలులు, 134 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019