breaking news
-
నీరమ్మా... నీరు
ముసిల్దానికి అర్ధరాత్రి దప్పికేసింది. ‘నీల్లు... నీల్లు’... ప్రాణం తుదకొచ్చి అంగలార్చింది. పదేళ్ల మనవరాలు పోలికి దిక్కు తెలియలేదు. బంగారమో, వెండో అయితే ఎవరింటి నుంచైనా దేబిరించి తేవచ్చు. నీళ్లెక్కడవి? అందునా రాళ్లమిట్ట అనే ఈ ఊళ్లో. వానలకు ముఖం వాచిన రాయలసీమ వాకిట్లో! ‘నీల్లే’... ముసల్ది ఆర్తనాదం చేసింది. మనవరాలికి ఉన్నది ఒక్కతే అవ్వ. అవ్వకు మిగిలింది ఒక్కతే మనవరాలు. మనవరాలు అవ్వ దగ్గరికి వచ్చి నిలబడింది. ముసల్దాని కట్టె బిగుసుకుపోతూ ఉంది. ‘తెస్తానుండవ్వా’ సత్తు చెంబు తీసుకొని పరిగెత్తింది. ఎక్కడికి? పక్కింటికా? దాపున ఉన్న బావికా? ఎక్కడా నీళ్లు లేవు. ఊరవతల కోనేటికి వెళ్లాలి. ఈ రాత్రి... నిర్మానుష్యదారుల్లో. దాహానికి పిడచగట్టిన బాట వెంట. పోలి పరిగెత్తింది. భయంతో పరిగెత్తింది. దడతో పరిగెత్తింది. దప్పికతో పరిగెత్తింది. కోనేరు వచ్చింది. చీకటి పరదాలు కప్పుకుని ఉన్న నీరు. రాత్రయితే దెయ్యాలు తిరుగుతాయని చెప్పుకునే తావు. నుదుటి మీద చెమటతో పోలి కోనేటి మెట్ల మీద నిలుచుంది. వెళ్లిపోదామా? అవ్వ దప్పికతో ఉందే! ధైర్యం చేసి దిగింది. చెంబు ముంచింది. ఎవరో చేయి పట్టి లాగిన భ్రాంతి. ‘ఓలమ్మో’. పోలి నీళ్లలో పడింది. జీవితాన మరలా దప్పికే వేయనంత నీరు తాగుతూ మింగుతూ ఆ చిన్నారి పోలి, పసిపిల్ల పోలి అలా అడుక్కు వెళ్లిపోయింది. రాయలసీమ రచయిత దాదా హయత్ రాసిన ‘గుక్కెడు నీళ్లు’ కథ ఇది. నీళ్లెప్పుడో తెల్లారి మూడుగంటలకు వస్తాయి. నిద్ర చెడిపోతుంది. పోనీ వచ్చేవి నిండుగా వస్తాయా? రెండు బిందెలు దొరికితే పెన్నిధి. అంత తెల్లవారుజామున మొగుడు లేస్తాడా? పెళ్లామే లేవాలి! దక్కిన నీళ్లను ఇంట్లో మొగుడు సర్దుబాటు చేస్తాడా? పెళ్లామే చేయాలి. అన్నం దగ్గర అందరూ కూచున్నప్పుడు చేయి కడుక్కునే ఉప్పునీళ్ల చెంబు ఒకవైపు, తాగే నీళ్ల చెంబు ఒకవైపు. భూమి బద్దలైపోయినా చెంబులు మారడానికి లేదు. ఆ రోజు ఇంటి పిల్లాడు తాగే నీళ్లతో చేయి కడిగేశాడు పొరపాటున. అంతే! తల్లి భద్రకాళి అయ్యింది. పిల్లాడి వీపు చిట్లగొట్టేసింది. ఆనక వాణ్ణే పట్టుకుని బోరుమని ఏడ్చింది. ఆ కళ్లల్లో వచ్చేన్ని నీళ్లు కుళాయిలో వస్తే ఎంత బాగుండు! బండి నారాయణ స్వామి రాసిన ‘నీళ్లు’ కథ ఇది. తల్లి ‘ఒక బిందె నీళ్లు తేమ్మా’ అంటే బిందె పట్టుకుని వెళ్లిన కూతురు సాయంత్రమైనా పత్తా లేదు. వయసొచ్చిన కూతురు. షాదీ చేయాల్సిన కూతురు. అందాక రోజూ నీరు మోసి తేవాల్సిన కూతురు. ‘ఈ నీళ్ల బాధ పడలేనమ్మా. నన్ను నీళ్ల కోసం బయటకు పంపని గోషా పెట్టే ఇంట్లో పెళ్లి చెయ్యి’ అనడిగిందా కూతురు. నీళ్లున్న చోట గోషా కానీ నీళ్లు లేని చోట ఏం గోషా! కూతురైనా, కోడలైనా నీళ్లకు పోవాల్సిందే. ‘నీళ్లు ముందు... మతం తర్వాత తల్లీ!’ అందా తల్లి కూతురితో. పాపం ఏమనుకుందో ఆ కూతురు! నీళ్ల బిందె పట్టుకెళ్లి ఆ తర్వాత ఎవరితోనో వెళ్లిపోయింది. ఎవరు తీసుకెళ్లాడో వాడు ఆమె చేత నీళ్లు మోయించకుండా ఉంటాడా? ఏమో! వేంపల్లి షరీఫ్ రాసిన ‘పానీ’ కథ ఇది. కాళీపట్నం రామారావు ‘జీవధార’ కథ ప్రఖ్యాతమైనది. అందులో బస్తీ ఆడవాళ్లు సంపన్నుల బంగ్లా ముందు నీళ్ల కోసం నిలువుకాళ్ల కొలువు చేస్తుంటారు. ‘వెళ్తారా కుక్కల్ని వదలమంటారా?’ అంటుంటారా బంగ్లావాళ్లు. ‘మీరు కుక్కల్ని వదిలితే మేము అంతకన్నా పెద్దగా మొరిగి తరిమికొడతాం’ అంటారు బస్తీ ఆడవాళ్లు. పాలకుల పుణ్యాన నీళ్లు లేక వారిది కుక్కబతుకైంది మరి. పేదలు తెగబడితే నిలువరించే ఇనుపగేట్లు ఇంకా ఎవరూ కనిపెట్టలేదు. సంపన్నులు తల ఒంచి నీళ్లు ఇవ్వడానికి గేట్లు తెరుస్తారు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘నీళ్లు’ కథ కూడా విఖ్యాతమైనదే. అందులో రాయలసీమ నుంచి విజయవాడకు ఉద్యోగం కోసం వచ్చిన యువకుడు ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు ముంచుకోదగ్గ కూజాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నానం చేయదగ్గ కృష్ణ ప్రవాహాన్ని చూసి తబ్బిబ్బవుతాడు. ఎన్ని బకెట్లు కావాలంటే అన్ని బకెట్లు పోసుకోదగ్గ బావి గట్టును అతడు వదలడే! ‘మా ఊళ్లో ఇన్ని నీళ్లుంటే ఎంత బాగుండు’ అని నీళ్లకు దీనులయ్యే తల్లినీ, చెల్లినీ అతడు తలుచుకు ఏడ్వని రోజు ఉందా? ఇదంతా ఒక బాధైతే దళితులది మరో బాధ. అవును. నీటికి కూడా కులం ఉంటుంది. వారు తాగేందుకు వేరే గ్లాసుంటుంది. ఈ బాధ పడలేక ఇంట్లోనే బావి తవ్వించుకోవాలనుకుంటాడో దళిత లెక్చరరు అనంతపురంలో. కాని బండ పడుతుంది. బతుకులో వర్ణాశ్రమబండ... బావిలో రాతి బండ. కాని ఆగకూడదు. ఆగితే ప్రాణం, ఆత్మాభిమానం మిగలదు. ధైర్యం చేసి బండను తూటాలతో పేలుస్తాడు లెక్చరరు. బండ ముక్కలవుతుంది. గంగ పైకి ఎగజిమ్ముతుంది. నేలమ్మకు అంటరానితనం లేదు. అది ప్రతి బిడ్డకు నీళ్లు కుడుపుతుంది. కొలకలూరి ఇనాక్ ‘అస్పృశ్య గంగ’ కథ ఇది. నీరు నాగరికత. నీరు సంస్కృతి. నీరు శుభ్రత. నీరు సిరి. నీరు శాంతి. నీరు గాదె. నీరు బోదె. నేల మీదున్న, నింగి మీదున్న నీటిని ఏ జనవాహినైతే కాపాడుకోగలదో దానిదే భవిష్యత్తు. మండు వేసవిలో నిండు కుండను ఇంట ఉంచగలిగేలా చూసేదే మంచి ప్రభుత. ప్రకృతి ఎన్నో సంకేతాలిస్తోంది. సూచనలు చేస్తోంది. నీళ్లింకిన నగరాలను ఆనవాలు పట్టిస్తోంది. నీళ్లు లేకపోతే ఏమవుతుందో సాహిత్యం కన్నీటి తడితో రాసి చూపింది. మేల్కొనడం మన వంతు! -
నీళ్లు లేవు.. సార్లు రారు
మంథని: ‘మా బడిలో తాగేందుకు మంచినీళ్లు రావు.. మరుగుదొడ్లులేవు.. సార్లయితే స్కూల్‌కే రావడం లేదు.. అదే మని అడిగితే బెదిరిస్తున్నారు. మూడేళ్లు గా ఇదే దుస్థితి.. అధి కారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు.. ఓపిక నశించి తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కినం’అని పెద్దపల్లి జిల్లా మంథని మండలం వెంకటాపూర్‌లోని మహాత్మాజ్యోతిబా పూలే బాలుర గురుకుల వసతి గృహం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులం నుంచి సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరంలోని మంథని – కాటారం ప్రధాన రహదారిపై వెంకటాపూర్ క్రాస్ రోడ్డు వరకు కాలినడకన చేరుకున్నారు. సోమవారం ఉదయం ఆరు గంటలకు హాస్టల్ నుంచి బయలు దేరిన సుమారు వంద మంది విద్యార్థులు.. వెంకటాపూర్ క్రాస్‌రోడ్డుపై బైఠాయించి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. నాసిరకం భోజనం పెడుతున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయులు పాఠాలు సరిగా బోధించడం లేదని వాపోయారు. కలుషితనీటితో అలర్జీ వస్తోందని, చాలామంది అనారోగ్యం బారినపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి తీసుకెళ్లాలని సార్లకు చెబితే పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సై వచ్చి నచ్చజెప్పి.. గంటల కొద్దీ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు స్తంభించాయి. సమాచారం అందుకున్న ఎస్సై వెంకటకృష్ణ అధికారులతో మాట్లాడుతానని విద్యార్థులకు నచ్చజెప్పారు. వారిని వసతి గృహానికి తీసుకెళ్లి అవగాహన కల్పించారు. విషయం ఉన్నతాధికారులకు చేరడంతో ఆర్సీవో గౌతమ్, జిల్లా కనీ్వనర్ సుస్మిత హాస్ట ల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ, విద్యార్థుల సమస్యలపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వాన.. బోధన్/రుద్రూర్: నిజామాబాద్ జిల్లా లోని బోధన్, సాలూర, రుద్రూర్, పోతంగల్ మండలాల్లోని గ్రామాల్లో సోమవారం రాత్రి వడగళ్ల వాన కురిసింది. రోడ్లపై పోసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయని, కోత దశకు వచ్చిన వరి పంట దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దుతిరుగుడు, మొక్క జొన్న పంటల కోతలు 50 శాతం వరకు పూర్తయ్యాయి. కాగా, మిగిలిన పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. -
చేతి కర్రతోనే పొలం బాట
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ / కరీంనగర్ రూరల్ / సిరిసిల్ల: సాగునీటి కొరత వల్ల ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎండిన పంటలకు ప్రభుత్వం ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వకపోతే మేడిగడ్డ వద్ద రైతులతో ధర్నాకు దిగుతానని చెప్పారు. పొలంబాటలో భాగంగా శుక్రవారం ఆయన కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించారు. తుంటి ఎముకకు ఆపరేషన్ అయిన నేపథ్యంలో ఆయన చేతికర్ర సాయంతోనే పంట పొలాల్లో నడిచారు. ఉదయం ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి భారీ కాన్వాయ్‌తో రోడ్డు మార్గాన బయల్దేరిన ఆయనకు బెజ్జంకి వద్ద గులాబీ నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీగా అనుచరులు వెంటరాగా కరీంనగర్ రూరల్ మండలం ముగ్దూంపూర్‌లో రైతు కొలగాని తిరుపతి పొలంలో ఎండిన వరి పంటను పరిశీలించారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయాయని రైతులు ఈ సందర్భంగా ఆయనకు విన్నవించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో భోజనానంతరం.. సిరిసిల్లకు వెళ్లే మార్గంలో వెదిర వద్ద రైతులను పలకరించారు. ఆ తరువాత సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో రైతు గంగు రమేశ్ పొలంలో ఎండిన పంటను, ఎండిన మిడ్ మానేరు జలాశయాన్ని పరిశీలించారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, మాజీ ఎంపీ వినోద్, సీనియర్ నేతలు తుల ఉమ, నారదాసు లక్ష్మణరావు, రవీందర్‌సింగ్, మేయర్ సునీల్‌రావు తదితరులు ఉన్నారు. -
మళ్లీ పాత తెలంగాణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘అమలు సాధ్యం కాని హామీలతో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పరిపాలించే సామర్థ్యం, శక్తి లేవు. అందుకే రాష్ట్రంలో వనరులున్నా నీటికి, కరెంటుకు కొరత ఏర్పడుతోంది. కాంగ్రెస్ ఇందిరమ్మ పాలనలో పాత తెలంగాణ పునరావృతమైంది. రాష్ట్రంలో మంచినీళ్ల గోసలు, బిందెల కొట్లాటలు, కాలిపోయిన మోటార్లు.. అవే దృశ్యాలు తిరిగి కనిపిస్తున్నాయి. లత్కోర్, అసమర్థుల రాజ్యంలో ఉన్నాం కాబట్టే, కరెంట్, మిషన్ భగీరథ నడిపే తెలివిలేదు కాబట్టే ఈ పరిస్థితి వచ్చింది. అడ్డగోలు హామీలతో గద్దెనెక్కి ఒక్కటీ నెరవేర్చలేదు. రైతుబంధు, దళితబంధు, కల్యాణలక్ష్మి, తులం బంగారం, వృద్ధాప్య పింఛన్, ఓవర్సీస్ స్కాలర్షిప్, చేనేతల బకాయిలు, బ్రాహ్మణ పరిషత్, గొర్రెల పంపిణీ వంటి పథకాలకు నిధులు కేటాయించడం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన ఈ హామీల అమలు కోసం వెంటపడతాం. ఆయా పథకాల లబ్ధిదారులు కూడా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి కర్చు కాల్చి వాతపెట్టాలి. రైతుబంధుకు నిధులు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా తమ తాబేదార్లకు బిల్లులు విడుదల చేసి రైతుల నోట్లో మట్టి కొట్టారు. కాళేశ్వరం గురించి ఈ ప్రభుత్వానికి అసలేమీ తెలియదు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇంతకాలం కొత్త ప్రభుత్వం మీద విమర్శలు చేయకూడదని ఆగాం. కానీ ఇక ఆగేది లేదు..’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎండిన పంటలను పరిశీలించేందుకు ‘పొలం బాట’ చేపట్టిన కేసీఆర్.. శుక్రవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పంటలు, ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాధారణం కంటే అధిక వర్షం కురిసినా.. ‘మానేరు వాగు, వరద కాలువ, ఎల్లంపల్లి, గోదావరి నదులు.. నాలుగు సజీవ జలధారలను జిల్లా ప్రజలు అనుభవించారు. కరీంనగర్ లక్షల టన్నుల ధాన్యం పండించింది. అలాంటిదాన్ని నాలుగు నెలల్లోనే ఎడారిగా మార్చారు. కరీంనగర్, సిద్దిపేట ప్రజల దాహార్తి తీర్చిన ఎల్ఎండీలో నీటి కటకట. ఎడారిని తలపిస్తూ స్మశానంలా మారింది. రోజూ తాగునీరు వచ్చే కరీంనగర్లో ఇపుడు రోజు విడిచి రోజు నీళ్లు వస్తున్నాయి. గోదావరి బేసిన్లో ఉన్న కరీంనగర్, ఇతర జిల్లాలకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్రవ్యాప్తంగా 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. తెలంగాణలో ఇపుడు పంట ఎండని, మోటార్లు కాలని జిల్లాలు లేవు. ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలి వాస్తవానికి ఈసారి తెలంగాణలో సాధారణం కంటే అధిక వర్షపాతం కురిసింది. నీటిని నిల్వ చేసుకునే, వాడుకునే తెలివిలేక, నాణ్యమైన కరెంటు సరఫరా చేయక పోవడం వల్ల పంటలు ఎండినయ్. ఎండిన పంటకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. మరోవైపు రైతుబంధు ఇప్పటికీ పూర్తిగా వేయలేదు. వంద రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారంటే సీఎం లిస్టు ఇమ్మన్నాడు. మేం 209 మంది వివరాలు సీఎస్‌కు పంపాం. కానీ ఇప్పటికీ ఉలుకు పలుకూ లేదు. వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి, పరామర్శించే దాకా వదలం..’ అని కేసీఆర్ అన్నారు. నేను వస్తున్నా అనగానే నీళ్లిస్తున్నారు.. ‘తెలంగాణలో వ్యవసాయ సంక్షోభానికి ప్రభుత్వ తీరే కారణం. నేను నల్లగొండకు వెళ్తున్నా అనగానే.. సాగర్ నుంచి, కరీంనగర్‌కి వస్తున్నా అనగానే.. కాళేశ్వరం నుంచి నీళ్లు ఇస్తున్నారు. అదేంటి అంటే కేసీఆర్ మాకు చెప్పలేదు అంటున్నారు.. సీఎం నువ్వా? నేనా? సీఎంగా నువ్వు, నీ యంత్రాంగం ఏం చేస్తున్నాయి? ఒక 25 రోజుల ముందు నీళ్లు ఇచ్చి ఉంటే.. నల్లగొండ, కరీంనగర్లో పంటలు ఎండేవి కావు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతులను పరుగులు పెట్టించి ఎందుకు రుణమాఫీ చేయడం లేదు? బ్యాంకర్ల నుంచి రైతులకు నోటీసులు వస్తుంటే ఉలుకూ పలుకూ లేదెందుకు?..’ అని మాజీ సీఎం నిలదీశారు. సీఎంకు తులం బంగారం దొరకడం లేదా? ‘కేవలం నాలుగు నెలల్లో పథకాలను ఆగమాగం చేశారు. గొర్రెల పంపిణీ బంద్ అయింది. 1.30 లక్షల మందికి దళితబందు రెండో విడత నిలిపివేశారు. రూ.12 లక్షలిస్తామని చెప్పి ఇవ్వలే. కళ్యాణలక్ష్మీ పథకంలో తులం బంగారం ఇస్తామన్నారు.. తులం బంగారం సీఎంకు దొరకడం లేదా? ఇంట్లో ఇద్దరికీ వద్ధాప్య పింఛన్ ఇస్తామని చెప్పి 30 లక్షల మంది కుటుంబాలకు ప్రతి పింఛన్ మీద రూ.24,000 చొప్పున బకాయి పడ్డారు. కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని మోసం చేశారు, మహాలక్ష్మీ లేదు మన్నూ లేదు. ప్రతి మహిళకు రూ.2 వేలిస్తామని శఠగోపం పెట్టారు..’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేతలు పులులై తరిమి కొడతరు ‘ఒకప్పుడు సిరిసిల్లలో చేనేత కారి్మకుల ఆత్మహత్యలు చూసి చలించిన నేను భిక్షాటన చేసి వారి కుటుంబాలను ఆదుకున్నా. తెలంగాణ వచ్చాక చేనేతలకు చేతినిండా పని కలి్పంచాం. రంజాన్, బతుకమ్మ, స్కూలు యూనిఫామ్‌లు అంటూ పని ఇచ్చాం. వారు కష్టం చేసి ప్రభుత్వానికే పంపారు. వీటికి సంబంధించిన బకాయిలు రూ.300 కోట్లు ఇస్తలేరు. ఈ విçషయంపై కోర్టుకు పోతాం. సిరిసిల్లలో ధర్నా చేస్తాం. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టాలని ఓ మంత్రి అంటాడా? చేనేత కారి్మకులు నిరో«ద్లు అమ్ముకోవాలని అంటారా? చేనేతలు పులులై తరిమి కొడతరు..’ అని బీఆర్ఎస్ అధినేత హెచ్చరించారు. మేం వ్యవసాయానికి ఊపిరిలూదాం ‘మేం అస్తవ్యస్తమైన తెలంగాణ రైతు ఆర్థిక స్థితిని తిరిగి గాడిన పెట్టాం. రైతుబంధు పథకం ప్రవేశపెట్టి వలస వెళ్లిన రైతులను తిరిగి గ్రామాలకు వచ్చేలా చేసి వ్యవసాయానికి ఊపిరిలూదాం. మీరు తాబేదార్లకు బిల్లులు చెల్లించి రైతుల నోట్ల మట్టి కొట్టారు. ఇపుడు చాలామంది రైతుల అప్పుల పాలై వడ్డీలు కడుతున్నారు. మేము తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని 7,600 మెగావాట్ల నుంచి 18,600 మెగావాట్లకు తీసుకుపోయినా ఎందుకు కొరత వస్తోంది? దీనికి కూడా కేసీఆర్ చెప్పలేదు అంటారా?..’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. 50 వేలమంది రైతులతో మేడిగడ్డకు పోతా.. ‘కాళేశ్వరం గురించి ఈ ప్రభుత్వానికి తోకా తొండం తెల్వదు. మేడిగడ్డ బ్యారేజీ మీద మూడు పిల్లర్లు కుంగిపోయినయి. కాంగ్రెస్ హయాంలోనూ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయ్. 25 సెం.మీల వానకు ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి కంపెనీ కట్టిన ఎంఎండీ కొట్టుకుపోయింది. మేము కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలేదు. నిండ నింపి గంగమ్మ లెక్క చేసినం.. అందుకే ఎండాకాలంలోనూ చెరువులు మత్తళ్లు దుంకినయ్. జూన్‌లో 25 వేల క్యూసెక్కుల వరద వస్తుంది. ఈసారి నీటిని ఎత్తిపోయకుంటే నేను 50 వేలమంది రైతులతో మేడిగడ్డ వద్దకు పోయి పండవెట్టి తొక్కుతా. కేవలం కేసీఆర్‌ను బద్నాం చేయాలనే కుట్రతో చిన్న ఇంజినీరింగ్ లోపాన్ని పెద్దది చేసి చూపే విఫలయత్నం చేశారు..’ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. రాజధానిలో ట్యాంకర్లా? ‘హైదరాబాద్‌లోని ప్రతి పేదవారి ఇంట్లో నల్లా ఉండాలన్న లక్ష్యంతో, రూ.1కే నల్లా కింద అందరికీ నల్లాలు ఇచ్చినం. బిందెలు కనబడకుండా చేసినం. కానీ ఇపుడు బిందెలు, ట్యాంకర్లుæ కనిపిస్తున్నయ్. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలి. కేసీఆర్ బయల్దేరిండు. ఇక ఆగడు..గద్ద లెక్క వాలుతా.. మీ భరతం పడతాం.. మెడలు వంచుతాం..’ అని మాజీ సీఎం స్పష్టం చేశారు. ఫసల్ బీమా యోజన గుజరాత్‌లోనే లేదని, అసలు బీజేపీకి ఓ విధానం లేదని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రెండు, మూడురోజుల్లో ఖచ్చితంగా స్పష్టమైన జవాబు ఇస్తానని తెలిపారు. -
గొంతెండిపోతోంది
ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం గుడమామిడి పరిధి మాన్కుగూడ. ఇక్కడ మిషన్‌భగీరథ నీరు సరిగా రాకపోవడంతో బావి నీటిపైనే గ్రామస్తులు ఆధారపడుతున్నారు. వేసవిలో బావి నీరు అడుగంటడంతో ఇబ్బందులు పడుతున్నారు. పటా్నపూర్లోనూ ఇదే సమస్య ఉంది. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తాగునీటికి గోస తప్పడం లేదు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో నీటి కటకట నెలకొంది. బావులు, చేతి పంపులు ఎండిపోవడంతో సుదూర ప్రాంతాల్లోని వ్యవసాయ బావులనుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. పలు ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీటి సరఫరా జరగాల్సి ఉన్నా.. అంతర్గత పైపులైన్లు, పంపింగ్ మోటార్ల నిర్వహణ లోపంతో పాటు లీకేజీల కారణంగా పల్లెలు అలాగే పట్టణాల్లోనూ తీవ్ర మంచినీటి సమస్య నెలకొంది. చేతి పంపులు, బావుల నుంచి ఎడ్ల బండ్లపై నీళ్లు తెచ్చుకుంటున్నామనిఈ ప్రాంతాల ప్రజలుచెబుతున్నారు. అనేకచోట్ల అడుగంటిన బావుల నుంచి పూడిక తీస్తున్న దృశ్యాలు కన్పిస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రానికి ‘భగీరథ’నీరు సక్రమంగా రాకపోవడంతో ఉన్న ఒకేఒక చేతిపంపు వద్ద స్థానికులు నీళ్లు పట్టుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కొలాంగూడ, చిత్తగూడ, గట్టెపల్లి, సాలెగూడకు తాగునీటి సమస్య ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రాంతాలకు భగీరథ నీరు సక్రమంగా రాకపోవడంతో ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు. ఇక గిరిజన ప్రాంతాలు, మారుమూల అటవీ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. నీటి కోసం పని మానేస్తున్నాం గట్టేపల్లి, చిత్తగూడ గ్రామాలకు నీళ్లు రావడం లేదు. ఉన్న ఒక్క చేతిపంపు,బావి నుంచి ఎడ్ల బండ్లతో నీళ్లు తెచ్చుకుంటున్నాం. అన్ని పనులు మానేసి నీటి కోసమే సమయం వెచ్చిస్తున్నాం. –కొడప కర్ణు, గట్టేపల్లి, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్ జిల్లా బోరు నీళ్లే తాగుతున్నాం భగీరథ నీళ్లు అన్ని ఇళ్లకు రావడం లేదు. బోరింగ్ పంపు నీళ్లే తాగుతున్నాం. అయితే ఊరిలో ఒకే చేతిపంపు ఉండడంతో నీటి కోసం ఎంతో ఇబ్బంది అవుతోంది. –రాథోడ్ సరితా బాయి, లింగాపూర్, ఆసిఫాబాద్ జిల్లా
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019